ప్రకృతి వైఫరిత్యాలు`పెరుగుతున్న మార్పులు
భూకంపం,తుఫాను,వరదలు,సునామీ మొదలైన ప్రకృతి వైపరీత్యాలు మానవ నియంత్రణా పరిధికి ఆవల ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు,అనేక ప్రకృతి వైపరీత్యాలతో విధ్వంసానికి గురౌతున్నాయి. తీవ్రమైణ ఆస్తి,ప్రాణనష్టాలు జరు గుతున్నాయి. కొన్ని రకాల వైపరీత్యాలను ఎదుర్కొన డానికి,ముందుగా సిద్ధం కావటానికి మానవ చైత న్యం అవసరం.పునరావాస పనులు,ప్రథమ చికిత్స, ఆహారం,బట్ట్లు,మందులు,రక్షణ చర్యలు, ఆశ్రయం, మొదలైన అంశాల గురించి ప్రజలు తగినంత అవగాహన కలిగివుండాలి.
ప్రకృతి వైపరిత్యాలను మనం ఆపలేం. అయితే వరదలు, తుఫానులు, అగ్నిప్రమాదాలు, భూకంపాలవంటి ప్రకృతివైపరీత్యాలు సంభ వించ డంవల్ల పర్యావరణం కలుషితమవుతుంది. అనేక రకాల రోగాలు ప్రబలుతాయి. మనుషులతో సహా జంతువులన్నీ కూడా రోగాలబారిన పడ తాయి. కాబట్టి ఇలాంటి సందర్భాలలో మనం అప్ర మత్తంగా ఉండడంతోపాటు ఇతరులకు సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉండాలి. బట్టలు,ఆహారపదార్థాలు సేకరించి పంపడం, సేవాక్యాంపులలో పాల్గొనడం చేయాలి. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినపుడు తీసుకో వలసిన జాగ్రత్తలపట్ల అవగాహన కలిగించడానికి ప్రయ త్నం చేయాలి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి నప్పుడు 12 నుండి 15 సంవత్సరాల వయస్సుగల పిల్లలు చేపట్టగల సహాయ కార్యక్రమాలకు ప్రాధా న్యత ఇవ్వాలి. ఓవైపు కరోనా వైరస్ కల్లోలం..
మరోవైపు భారీగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొం టున్నారు. ఇక వర్షాలు, వరదలతో సీజనల్ వ్యాధు లు కూడా విరజంభించే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో ఏపీప్రభుతం చర్యలు చేపట్టింది. తాజాగా ఏపీరాష్ట్రవిపత్తుల నిర్వహణశాఖ ప్రభుత్వ కోవిడ్-19 నియమాలు పాటిస్తూ సహాయక చర్యల్లోని అధికారులకు సహకరించండని సూచిస్తూ ప్రజలకు ఓ లేఖను రిలీజ్ చేసింది. అంతేకాదు.. ప్రజలు వరదల సమయంలో ఏమి చేయాలి.. వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఏ విధమైన చర్యలు తీసుకోవాలి..ఒకవేళ వరదలు లోతట్టు ప్రాంతాలకు వస్తే.. అక్కడ ప్రజలు ఏ విధమైన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి అనే అంశాలను వివరిస్తూ రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్న బాబు ఓలేఖను రిలీజ్ చేశారు
వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ా వరదనీటిలోకి ప్రవేశించవద్దు.
ా మురుగునీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండండి.
ా విద్యుదాఘాతానికి గురికాకుండా విద్యుత్ స్తంభాలతో పాటు, పడిపోయిన విద్యుత్ లైన్ల కు దూరంగా ఉండండి.
ా ఓపెన్ డ్రెయిన్స్ లేదా మ్యాన్‌హూల్స్‌ను గుర్తించి ఆప్రదేశంలో కనిపించే విదంగా చిహ్నాలు,ఎర్ర జెండాలు లేదా బారికేడ్లు ఉంచండి.
ా వరదనీటిలో నడవకండి లేదా డ్రైవ్ చేయవద్దు
ా రెండు అడుగుల మేర ప్రవహించే వరద నీరు పెద్ద కార్లను కూడా తోసుకుపోగలవు
ా తాజాగా వండిన లేదా పొడి ఆహారాన్ని తినండి.
ా తినే ఆహార పదార్ధాలపై ఎల్లపుడూ మూతలు వేసి ఉంచండి
ా వేడిచేసిన లేదా క్లోరినేటెడ్ నీరు త్రాగాలి.
ా మీ పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి పెద్ద కార్లను కూడా తోసుకుపోగలవు
వరదల వచ్చిన తర్వాత చేయాల్సిన / చేయకూడని పనులు
్చ మీ పిల్లలను వరద నీటిలో ఆడనివ్వకండి
్చ రిపేర్‌కు వచ్చిన విద్యుత్ వస్తువులను ఉపయోగించవద్దు
్చ అధికారులు సూచించిన వెంటనే కరెంట్‌కు సంబందించిన ప్రధాన స్విచ్లులను,ఎలక్ట్రిక్ ఉపకరణాలను వాడడం మానెయ్యాలి
్చ తడిగా ఉంటే విద్యుత్ పరికరాలను తాకవద్దు.
్చ విరిగిన విద్యుత్ స్తంభాలు,తీగలు,పదునైన వస్తువులను పరిశీలించండి
్చ వరద నీటిలో కలిసిన ఆహారం తినవద్దు.
్చ మలేరియావంటి వ్యాధులను నివారించడానికి దోమతెరలను వాడండి.
్చ వరద సమయంలో పాము కాటు సాధారణం కాబట్టి పాముల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
్చ నీటి మార్గాలు/మురుగునీటిపైపులు దెబ్బతి న్నట్లయితే టాయిలెట్ లేదా కుళాయి నీటిని వాడకండి.
్చ నీరు త్రాగడానికి సురక్షితమని ఆరోగ్య శాఖ సలహా ఇచ్చే వరకు పంపు నీరు తాగవద్దు.
్చ మీ ప్రాంతంలో వరదలు సంభవించి ఖాళీ చేయవలసివస్తే మంచం,టేబుళ్లపై మీ ఫర్నిచర్ ఇతర ఉపకరణాలను పెట్టండి.
్చ టాయిలెట్ గిన్నెపై ఇసుక సంచులను ఉంచండి మరియు మురుగునీటి తిరిగిరాకుండా నివారించడానికి అన్ని కాలువ రంధ్రాలను మూసివేయండి
్చ మీ కరెంట్,గ్యాస్ కనెక్షన్ ను ఆపివేయండి
్చ ఎత్తైన భూ ప్రదేశం లేదా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి.
్చ మీ వద్ద ఉన్నఅత్యవసర వస్తు సామగ్రి, ప్రథమ చికిత్స పెట్టె,విలువైన వస్తువులు,ముఖ్యమైన పత్రాలను తీసుకొని వెళ్ళండి.
్చ నీటి లోతును తెలుసుకొనుటకు కర్రను ఉపయోగించండి.
్చ తడిసిన ప్రతిదాన్ని శుభ్రపరచండి మరియు క్రిమిసంహారకం చేయండి.
భూమి వేడెక్కితే ఏం జరుగుతుంది?
గ్లోబల్ వార్మింగ్ ప్రపంచానికి పెను విపత్తుగా మారబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరి స్తున్నారు. మనుషుల చర్యల వల్ల వాతవరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు భారీగా పెరిగాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు కూడా మండుతున్నాయి. ధ్రువాల్లో మంచు కరుగుతోంది.ప్రతికూల వాతా వరణ పరిస్థితులు పెరుగుతున్నాయి. భూమి సగటు ఉష్ణోగ్రత15డిగ్రీసెంటీగ్రేడ్లు.గతంలో ఇది ఇంత కన్నా ఎక్కువగా,తక్కువగా కూడా ఉంది.ఈ ఉష్ణోగ్రతలో మార్పులు సహజమే. అయితే, మునుపటి కన్నా చాలా వేగంతో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగు తున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్ దీనికి కారణమని వారు చెబుతున్నారు.
గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్ అంటే సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత భూమిపైనే నిలిచిపోవడం. భూమిపై నుంచి పరావర్తనం చెంది అంతరిక్షంలోకి వెళ్లాల్సిన సౌరశక్తిని గ్రీన్‌హౌజ్‌వాయువులు గ్రహిం చుకుని తిరిగి భూమిపైకి చేరేలా చేస్తున్నాయి. ఫలి తంగా వాతావరణం,భూ ఉపరితంల వేడెక్కు తున్నాయి. ఈఎఫెక్ట్ లేకపోతే భూమి ఇంకో 30డిగ్రీ సెంటీగ్రేడ్స్ చల్లగా ఉండేది. జీవం మనుగడ కష్టమ య్యేది.అయితే ఈ గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్‌కు పరిశ్రమలు, వ్యవసాయంవల్ల వెలువడే వాయువులుతోడై మరిం త శక్తిని గ్రహించి, ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీన్నే గ్లోబల్ వార్మింగ్ (భూమి వేడెక్కడం),వాతావరణ మార్పులు అంటారు.
గ్రీన్ హౌజ్ వాయువులు ఇవే…
గ్రీన్‌హౌజ్ వాయువుల్లో అత్యంత ప్రభా వవంతమైంది నీటిఆవిరి.కానీ,అది వాతా వర ణంలో కొన్ని రోజులపాటే ఉంటుంది. కార్బన్ డై ఆక్సైడ్ చాలా కాలం ఉంటుంది. అది పారిశ్రా మికీకరణ కన్నా ముందుఉన్న స్థాయిలకు వెళ్లాలంటే కొన్ని వందల ఏళ్లు పడుతుంది. సముద్రాల్లాంటి సహజ జలవనరులు దాన్ని పీల్చుకోగలవు. శిలాజ ఇంధనాలను మండిరచడంవల్లే అత్యధికంగా కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతోంది. కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకునే అడవులను నరికి,కాల్చేయడంవల్ల కూడా కార్బన్ వెలువడుతోంది.గ్లోబల్‌వార్మింగ్ ఎక్కువవు తోంది.1750లో పారిశ్రామిక విప్లవం మొదలై నప్పటితో పోలిస్తే కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలు 30శాతం పెరిగాయి.అయితే,కార్బన్‌డైఆక్సైడ్ అం తటి స్థాయిలో అవి లేవు.
గ్లోబల్ వార్మింగ్‌కు ఆధారాలు ఉన్నాయా?
పారిశ్రామిక విప్లవం కన్నా ముందు నాళ్లతో పోల్చితే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఇప్పుడు ఒక సెంటీగ్రేడ్ పెరిగినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) చెబుతోంది.అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదైన 20ఏళ్లు.. గత 22 ఏళ్లలోనే ఉన్నాయి. 2005-2015 మధ్య సగటు సముద్ర మట్టం 3.6 మిల్లీమీటర్లు పెరిగింది. ఉష్ణోగ్రత పెరగడం వల్ల నీరు వ్యాకోచించి ఇది ఎక్కువగా జరిగింది. కరుగుతున్న మంచు కూడా సముద్ర మట్టాలు పెరగడానికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉష్ణోగ్రత పెరుగుతున్న ప్రాంతాల్లో హిమనీనదాలు కరుగుతున్నాయి. ఆర్కిటిక్ సముద్ర మంచు 1979కి ఇప్పటికీ చాలా తగ్గిపోయిందని ఉపగ్రహాలు తీసిన ఫొటోలు సూచిస్తున్నాయి. మొక్కల్లో పూలుపూసే, పండ్లు కాసే సమయాలు ముందుకు జరుగుతున్నాయి. ఉష్ణోగ్రత పెరుగుదలను1.5డిగ్రీ సెంటీగ్రేడ్లకు కట్టడి చేసు కోగలిగితే క్షేమంగానే ఉండొచ్చని ఇటీవలికాలంలో శాస్త్రవేత్తలు,నాయకులు అంటున్నారు. గ్రీన్ హౌజ్ ఉద్గారాల కట్టడి విషయంలో రాజకీయంగా జరుగు తున్న కృషికి ఐరాసనేతృత్వం వహిస్తోంది. ఇప్పటి కిప్పుడు గ్రీన్ హౌజ్ వాయువుల ఉద్గారాలు గణనీ యంగా తగ్గించుకున్నా, వాతావరణంపై ప్రభావం తప్పదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ప్రభావం ఎలా ఉంటుంది?
వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుదన్నదానిపై స్పష్టత లేదు.ప్రతికూల వాతా వరణ పరిస్థితులు పెరుగతాయి. దీంతో మంచినీటి కొరత ఏర్పడొచ్చు. ఆహారఉత్పత్తిపైనా తీవ్ర ప్రభా వం పడొచ్చు. వరదలు, తుఫానులు, వడగాలుల వల్ల మరణాల సంఖ్య పెరగొచ్చు. భూతాపం పెరగడంవల్ల ఎక్కువ నీరు ఆవిరవుతుంది. సముద్ర మట్టాలు పెరుగు తాయి కాబట్టి వరదలు కూడా పెరగొచ్చు. ఈ మార్పులను తట్టుకునే సామ ర్థ్యం లేని పేద దేశాలపై ప్రభావం విపరీతంగా ఉండొచ్చు. పరిస్థితులకు అంత త్వరగా అలవాటు పడలేవు కాబట్టి కొన్ని రకాల మొక్కలు, జంతువులు అంతరించిపోవచ్చు. మలేరియా లాంటి వ్యాధులు, పోషకాహార లోపాల బారిన కోట్ల మంది పడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)అంచనా వేసింది. వాతావరణంలో పెరిగిన కార్బన్ డై ఆక్సైడ్‌ను సముద్రాలు ఎక్కువగా పీల్చుకోవడంవల్ల వాటి ఆమ్లత్వం ఇంకా పెరగొచ్చు. కోరల్ రీవ్స్‌కు ముప్పు ఏర్పడొచ్చు. వాతావరణ మార్పులపై స్పందించడమే ఈశతాబ్దంలో మానవాళికి అతి పెద్ద సవాలు కాబోతోంది.
`వ్యాసకర్త : వాతావరణ మార్పుల పరిశోధకుడు,సెంట్రల్ యూనివర్శిటీ,హైదరాబాద్
–మల్లేష్ నాయక్