పౌర సేవల్లో వాట్సాప్ విప్లవం

దేశంలో తొలిసారిగా..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు , పజల నుంచి వినతల స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సప్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టింది.అందులో భాగంగా ప్రభుత్వం అధికారిక వాట్సప్ నంబర్‌ను 9552300009 ప్రకటించింది. ఆ ఎకైంట్‌కు వెరిఫైడ్ ట్యాగ్(టిక్ మార్క్) ఉంటుంది. ఈనంబర్ వన్‌స్టాప్ సెంటర్‌లా పనిచేస్తుంది. తొలిదశలో ఇందులో 153 రకాల సేవలు అందించనున్నారు. భవిష్యత్తులో వీటిని మరింత విస్త్రతం చేయనున్నారు.ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో భాగంగా ఆర్‌టీజీఎస్ సీఈఓ దినేష్ కుమార్ ఈ సేవలపై ప్రజంటేషన్ సమర్పించారు.ప్రస్తుతం అమల్లోకి వచ్చాయి.
ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ మరో గుడ్ న్యూస్‌చెప్పింది.9552300009వాట్సాప్‌తో జనన, మరణ ధృవీక రణ పత్రాలు అందించేందుకు సన్నా హాలు చేస్తోంది.‘మనమిత్ర’ ప్రజల చేతిలోనే ప్రభు త్వం,ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం అని విద్య,ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొ న్నారు. ప్రజలు ధృవపత్రాలు, ఇతర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా పౌర సేవ లను వేగవంతంగా అందజేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్ కు కూటమి ప్రభుత్వం నాంది పలికింది.దేశంలో తొలిసారిగా ‘మన మిత్ర’ పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ లాంఛనంగా జనవిర 30న ప్రారం భించారు.దీనికోసం అధికారిక వాట్సప్ నెంబర్ 9552300009ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిం చింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లా డుతూ..యువగళం పేరుతో 3,132 కి.మీల పాదయాత్ర చేశాను.ఈఆలోచన యువగళం పాద యాత్ర నుంచి మొదలైంది. నాప్రసంగాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక బటన్ నొక్కితే సినిమాచూస్తున్నాం,భోజనంవస్తోంది,క్యాబ్ వస్తుం ది.ఒక బటన్ నొక్కితే ప్రభుత్వం ఎందుకు ప్రజల వద్దకు రాదనే ప్రశ్న ఉత్పన్నమైంది.ఆఛాలెంజ్‌ను నేను స్వీకరిస్తున్నాని ఆనాడు చెప్పా.అందుకే ‘మన మిత్ర’ ప్రజల చేతిలోని ప్రభుత్వం,ప్రజల చేతిలో పాలన,మాది ప్రజాప్రభుత్వం నినాదంతో వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రారంభించడం జరుగుతోంది.
మొదటి విడతలో అందుబాటులోకి 161 రకాల పౌర సేవలు : వాట్సప్ గవర్నెన్స్‌కు 36శాఖలను అను సంధానించాల్సి ఉంటుంది. ఇది చాలా క్లిష్టతరమైన పని. మొదటి విడతలో161పౌర సేవలు అందు బాటులోకి తీసుకువస్తున్నాం. రెండో విడతలో 360 పౌర సేవలు ప్రారంభిస్తాం. ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్ గవర్నెన్స్. రియల్‌టైంలో ధృవపత్రా లు అందించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసు కుం టుంది. సర్టిఫికెట్లు అందజేసినప్పుడు వాటిపై ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆక్యూర్ కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్ సైట్ కు ఆలింక్ వెళ్తుంది. దీంతో నకిలీ సర్టిఫికెట్లకు ఆస్కారం ఉండదు. బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా త్వరలోనే తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నెంబర్ సెలెక్షన్‌ద్వారా రెవెన్యూ, మున్సిపల్, ఎండో మెంట్ సర్వీసులతోపాటు అనేక సర్వీసులు తీసుకు వచ్చాం. రెండో దశలో ఏఐ బాట్, వాయిస్ ద్వారా కూడా అమలుచేస్తాం.ప్రపంచంలోనే వాట్సప్ గవర్నె న్స్ అమలు చేస్తున్న తొలిరాష్ట్రం మనది.దీనికి మరింత మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉంది. ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి.లోటు పాట్లు సరిచేసుకునిమరింత మెరుగ్గా దీనిని తీర్చిది ద్దుతాం.రియల్ టైంగవర్నెన్స్‌లో కూడా అన్ని శాఖల నుంచి సమాచారాన్ని తీసుకుని క్రోడీకరిస్తు న్నాం. డేటా లేక్ క్రియేట్ చేసి సీమ్ లెస్ సర్వీసెస్ అంది స్తాం.గత మూడు నెలలుగా మా టీం అహర్ని శలు కష్టపడ్డారు. గత15రోజులుగా టెస్టింగ్ చేస్తు న్నాం. ఇంకా మెరుగులు దిద్దాలని నాకు అర్థమైంది. ఇదొక ప్రయాణం.ఆరు నెలల్లో ఐడియల్ ప్రొడక్ట్ గా తీర్చిది ద్దుతాం.అన్నిసేవలుఅందుబాటులోకితీసుకు వస్తాం. పాదయాత్ర హామీని నిలబెట్టుకున్నా.ఆరు నెలల్లో ఎంతమార్పు వస్తుందో ప్రజలే చూస్తారు. మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్, హెడ్ సంధ్య దేవనాథన్ మాట్లాడుతూ..ఈ రోజు మీ మధ్య ఉండటం చాలా ఆనందంగా ఉంది.మనమిత్ర వాట్సప్ సేవలు ప్రారంభించడం జరుగుతోంది. ప్రతి ఒక్కరి జీవితం లో వాట్సప్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. మన మిత్ర ద్వారా 161పౌర సేవలను ప్రతి ఒక్కరికి అంది స్తాం. ప్రజలు సులభంగా విని యోగించేలావాట్సప్ గవర్నెన్స్‌నురూపొందించాం.వాట్సప్‌గవర్నెన్స్ సేవ లకోసం చాలా కృషిచేశామ న్నారు.ఏపీ ప్రభుత్వం తో కలిసి మన మిత్రను మరింత మెరుగ్గా తీర్చి దిద్దుతామని చెప్పారు.వాట్సప్ డైరెక్టర్,ఇండియా హెడ్ రవిగార్గ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నాం. అయితే సింగిల్ ప్లాట్ ఫామ్‌పై అన్ని రకాల సేవలు అందిం చడం ఎక్కడా లేదు. మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ ను మరింత అభివృద్ధి చేసి మరిన్ని సేవలు అందు బాటులోకి తీసుకువస్తాం. హాయ్ అని టైప్ చేయడం ద్వారా ప్రజలు సుల భంగా పౌరసేవలను పొంద వచ్చని అన్నారు. మొద టి దశలో వాణిజ్యరంగంలో సమర్థ వంతమైన ప్రభు త్వ సర్వీస్ డెలివరీ కోసం రీ ఇంజ నీరింగ్ విధా నాలను అమలుచేస్తారు. రెండోదశలో ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా సులభతరంగా పౌరసేవలు అందిస్తారు. ఈప్రక్రియ లో,ఈక్రింది విధంగా వివిధరకాల సేవలను అందిం చడానికి ప్రాథమికంగా నిర్ణయించారు.-(కందారపు మురళి)