పొటెత్తిన జనసంద్రం
అందాల మన్యసీమను జల సమాధి చేసి పెట్టుబడి దారీ వ్యవస్థకు‘‘జలాభిషేకం’’ చేసే పోలవరం ప్రాజెక్టు ముంపుకుగురయ్యే గిరిజన గ్రామాలను సందర్శించిన సాహితీవేత్తల పర్యట నలో భాగస్వామి అయిన రచయిత జీవన్. అక్కడ చూసిన గిరిజనుల దీనావస్థకు అక్షర రూపమే ఈకథ. సహజంగా రచయితకు గిరిజన జీవన విధానాలు, పోరాటాలు, గిరిజనయోధుల వీరగాధలు, తదితర విషయాలపట్ల ప్రత్యక్షంగా అనుభవం వుంది. రచనా కాలం ఫిబ్రవరి 2006, ‘‘జీవన్మరణం’’ సంకలనం కోసం వ్రాయబడిరది.
నిత్యం సతతహరిత వనాల్లో జీవించే వన జీవులను సమస్యలు కూడా సదా వెంటాడు తూనే ఉంటాయి. ఒకసమస్య నుంచి బయటపడగానే మరోకొత్త సమస్య ఎదురురావడం ప్రతి మని షికి సర్వసాధారణం. సమస్యలను ఎదిరించి నిలిచి వాటినుంచి బయటపడటం తెలివైన మాన వులు లక్షణం. కానీఅడవులలో నివసించే గిరిజనులలోని మాయ,మోసంచేయడం, తెలియని ‘‘అమా యకపు గుణం’’తో ఆధునికులకు వారు తెలివిలేని దద్దమ్మలు చేతగానివాళ్ళు,చేతగాని వాళ్ళు. అయితే సాధు జంతువు అయిన పిల్లిని సైతం బంధించి స్థాయికి మించిన ఇబ్బంది పెడితే అది పులిలా క్రూరత్వంతో ఎలా ప్రతిఘటిస్తుందో తేటతెల్లం చేసే కథ’’పోటెత్తిన జన సంద్రం’’ జీవన్గా తెలుగు సాహితీలోకానికి సుపరిచితులు అయిన‘‘శేష భట్టార్ నరసింహాచార్యులు’’రాసిన కథల్లో ఇది ఒకటి. దీని రచనా కాలం ఫిబ్రవరి 2006,‘‘జీవన్మరణం’’ సంకలనం కోసం వ్రాయబడిరది.
నేపథ్యం అందాల మన్యసీమను జల సమాధి చేసి పెట్టుబడిదారీ వ్యవస్థకు‘‘జలాభిషేకం’’ చేసే పోలవరం ప్రాజెక్టు ముంపుకుగురయ్యే గిరిజన గ్రామాలను సందర్శించిన సాహితీవేత్తల పర్యట నలో భాగస్వామి అయిన రచయిత జీవన్ తానుఅక్కడ చూసిన గిరిజనుల దీనావస్థకు అక్షర రూపమే ఈకథ.సహజంగా రచయితకు గిరిజన జీవన విధా నాలు,పోరాటాలు,గిరిజనయోధుల వీరగాధలు, తదితర విషయాలపట్ల ప్రత్యక్షంగా అనుభవం వుంది.నివాస రీత్యా ఖమ్మంనగరం అయినా అధ్య యన రీత్యా,కథాశిల్పం పండిరచడంలోనూ,చేయితిరిగిన రచయిత కావడంవల్ల ఈ కథలోని ప్రతి ఘట్టం కళ్లకు కట్టినట్టు చూపిస్తూ రాయడంలో శతశాతం సఫలీకృతులయ్యారు జీవన్.
ఇక కథ విషయానికొస్తే శబరి గోదావరి సంగమ ప్రదేశం అయిన కూనవరం కేంద్రంగా సమీప అడవుల్లోని గిరిజనులు పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేసిన పోరాట సమాయత్తం ఈ కథలోని వస్తువు, ఇతివృత్తం కూడా.కథలో ప్రధాన పాత్ర సోయం వెంకయ్య తన తలపుల ఆలోచనల ద్వారా కథ ఆసాంతం నడిపించి, చైతన్య నిండిన స్ఫూర్తివంతమైన ముగింపుతో కథను సుఖాంతం చేయడమే కాక తెలిసిన విషయాన్ని కూడా ఆసక్తిగా చదివించే శైలితో నడిపించడంలో రచయిత పరిణితి అడుగడుగునా కనిపిస్తుంది. కొత్త కథకులకు ఈ కథన శైలి మార్గదర్శిగా నిలుస్తుంది.చుట్టుపక్కల పది పన్నెండు గిరిజన గ్రామాల్లో అందరూ ‘‘ముసలోడు’’గా పిలవబడే సోయం వెంకయ్య,అతని భార్య రాజవ్వ. వెంకయ్య మంచి వేటగాడు తాతముత్తాతల నుంచి ఆస్తిగా వస్తున్నవేటను తన తండ్రి నుంచి తాను నేర్చుకున్నాడు.తండ్రి అతనికి వేట నేర్పిన గురువు. వెంకయ్య తండ్రి సాక్షాత్తు పెద్దపులినే తన బాణంతో మట్టుపెట్టిన ధైర్యశాలి. అంతటి ధీరుడి కన్న కొడుకు వెంకయ్యలో వేట నైపుణ్యంతో పాటు మానవత్వం,ప్రేమ,ప్రకృతిలోని పారవశ్యం,అనే మంచి గుణాలు అదనంగా వచ్చి చేరాయి. తాత ముత్తాతల నుంచి నివాసముంటున్న ఆ అడవి అన్నఅందాల గోదావరి అన్న ఇంకా ఎక్కువ అంతులేని ప్రేమ వయసు ఇచ్చారు కొంచెం వేగిన దృఢమైన దేహం శరీరంలో సత్తువ చావలేదు వేటకు వెళితే పరిగెత్తే జంతువు సైతం ఒకేఒక్క బాణంతో కొట్టగలడు. వాసనను బట్టి ఏజంతువు ఎక్కడ ఉందో చెప్పగలడు. కూతను బట్టి ఏపిట్ట ఈచెట్టు కొమ్మ మీద ఉందో కూడా చెప్పగలడు. పక్షుల కూతలను అనుకరించి వాటిని బురిడీకొట్టించే సత్తా,సోయంవెంకయ్య సొత్తు. ఇంతటి ధైర్యవంతుడు తెల్లదొరల ఇబ్బందులు నైజాం సర్కారు అనిపైశాచికత్వాన్ని అనుభవించిన దీనుడు వెంకయ్య ఇప్పుడు సొంత రాష్ట్రంలో సొంత పాలకులవల్ల రాబోతున్న‘‘విపత్తును’’తలుచుకున్నప్పుడల్లా భయం గోదావరి వరదల పొంగుకొస్తుంది..తల పగిలిపోతుంది..ఆలోచనలతో కళ్ళుబైర్లు కమ్ముతున్నాయి.కాళ్ళు తడబడుతున్నాయి….’’అంటూ రచయిత జీవన్ ముఖ్యపాత్ర వెంకయ్య మానసిక స్థితిద్వారా కథ ప్రారంభంలోనే విషయ వివరణలతో పాఠకులను కథ ప్రవేశం చేయించారు. వెంకయ్య మనోభావాలు నుంచి రచయిత సొంత భావాలకుకూడా కథను కాస్త మళ్ళించి గిరిజన గ్రామాల్లో మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనేతరులు అక్కడి సారవం తమైన భూముల్లో పొగాకు,పత్తి,మిరప,వంటి వాణిజ్య పంటలు పండిస్తూ ఎలా కాసుల వర్షం కురిపిస్తున్నారో చెబుతూ మొదటి నుంచి వాస్తు మార్పిడి విధానానికి అలవాటు పడ్డ అడవిబిడ్డలకు ఈ కాసులు అనబడే డబ్బుల కరెన్సీ కంపంరంపుట్టి స్తుందని,వారిలో వ్యామోహం పెరిగి స్వార్థం నీనడు తుందని దానికి కారకులు గిరిజనేతరులు అంటూ రచయిత పరోక్షంగా ఎద్దేవాతో కూడిన హెచ్చరిక చేశారు.గోదావరి దాపున జీవనం సాగించే గిరిజ నులకు వానా కాలంలో సహజంగా వచ్చే గోదావరి వరదలు కొత్తేమీకాదు,వరదల నాలుగు రోజులు పిల్లాపాపలతో,గొడ్డు గోదా,తీసుకుని ఎత్తు గుట్టల మీద తలదాచుకుని గోదావరి శాంతించినాక, తిరిగి తమ తమ గుడేలకు చేరుకుంటారు ఆనం దంగా…గోదావరి వరద తమ గుండెలను ముం చింది అన్న బాధకన్నా పంట భూముల్లో సారవంత మైన ఒండ్రు మట్టి పంచిదన్న సంతోషమే వారికి ఎక్కువ.కానీ ఇప్పుడు రాబోతున్న వరద ముంపు అలాంటిది కాదు. వారి జీవితాలను వారి ఆవాసా లను శాశ్వతంగా జల సమాధి చేసే ఘోరమైన విపత్తు’’పోలవరం’’ వద్ద గోదావరి నదిపై కట్టబోయే బహుళార్ధక ఆనకట్ట ద్వారా మటుమాయమయ్యే 300 గిరిజన గ్రామాలతో పాటు వేలాది అడవి జంతువులు,పక్షులు,కనువిందుచేసే అందాలు అడవి చెట్లు,ఔషధమొక్కలు,కలప వృక్షాలు అన్ని శాశ్వ తంగా మానవతప్పిదం ద్వారా, అనాలోచిత చర్యల వల్ల,స్వార్థబుద్ధికి,బలైకనుమరుగు కాబోతున్నవిషాద సంఘటన,దేశ చరిత్రలో ఇదే పెద్ద మానవ తప్పిద చర్యగా నమోదు కాబోతున్న సంఘటన ఇది.ఆ విషయం తమ ప్రాంతానికి చెందిన చదువుకున్న పెద్ద దిక్కు పాయం కనకయ్య అనే గిరిజన యువ కుడు ద్వారా తెలుసుకున్న వెంకయ్య మనసు మనసు లో లేదు.తమ ప్రాంతానికి తమ జాతికి రాబోతున్న విపత్తును ఎలా ఎదుర్కోవాలన్న ఆలోచనలే తప్ప మరో ఆలోచన రావడం లేదు ఆఅమాయకపు బుద్ధి బుర్రకు, పాయం కనకయ్య తాను చదువుకున్న చదువుతో పాటు వచ్చిన విజ్ఞానం, స్నేహితుల బలగపు బలంతో కలిసి,తనకు జన్మనిచ్చిన గ్రామా లను సందర్శించి రాబోయే ప్రమాదం నుంచి ఎలా ఎదుర్కోవాలో తనవాళ్లకు చెప్పిన మాటలు తాలూ కు ధైర్యం వెంకయ్యలో తెలియని శక్తి నింపి ముం దుకు నడిపిస్తున్నాయి. అంతేకాదు ఆపాడు పోలవరం ప్రాజెక్టు కట్టి ఏడు సముద్రాల ఆవల నుంచి ఇక్కడకు వచ్చి,ఫ్యాక్టరీలు కట్టేవారికి నీళ్లు,కరెంటు,ఇచ్చి వారిసుఖం,లాభం, కోసం ఎప్పటి నుంచో ఈభూమిని నమ్ముకొని ఇక్కడే జీవించే వారిని అనాధలు చేసి నిలువ నీడ లేకుండా చేయ బోయే ఇక్కడి పాలకులపై, అధికారులపై, ఎలా తిరుగుబాటు చేయాలో కూడా కనకయ్య మాటల ద్వారా విన్న వెంకయ్యలో స్పూర్తి కలిగింది. నాటి అల్లూరి,గంటందొర,కొమరంభీమ్,సోయం గంగు లు,వంటి వీరులు వెన్ను చూపని ధైర్యంతో కొదమ సింహాలై గర్జించిన పోరాట చైతన్యం కూడా అతని కళ్ళముందు కదలాడిరది. అంతా అనుకున్న విధం గానే వ్యూహ రచన సాగింది. పోలవరం ముంపు ప్రాంతాలన్నీ ఏకమయ్యాయి, తూర్పుకొండలు ఎర్ర బారాయ్,’’కోయిద’’గ్రామంలో కొమ్ము బూర మో గింది,అది విన్న పక్క గ్రామంలోనూ మోగించారు. అలాఅలా ఒకరికొకరు కొమ్ము బూర మోగిం చడంతో,తంత్రీ నాధంలా ఆమోత అన్ని గ్రామాలకు సైరన్ మోతల, సమర శంఖల వ్యాపించింది. ముందే అనుకున్న విధంగా కోయ దొరలు, కొండరెడ్లు,కొండలు దిగారు చీమల బారుల కదిలారు. కొమ్ము బూర శబ్దాలు, డోల్లమోతలు మోగుతుండగా,అన్నిరకాల అడవి బిడ్డలు ఇంటిల్లపాది నేల ఈనినట్టుగా బారులుతీరారు,వాళ్ళందరికీ సంఫీు భావంగా బస్తీలో చదు వుకుంటున్న యువతీ వకులు,మేధావులు,రచయితలు,కూడా కదిలి వచ్చారు. చూస్తుండగానే శబరి గోదావరి సంగమ ప్రదేశం అయిన ‘‘కూనవరం’’ జన ప్రవాహంతో నిండిపోయింది. కొమ్ము బూరలు,డోలి,వాయి ద్యాల హోరు ఒకవైపు,అడవిబిడ్డలకు అనుకూలంగా నినాదాల జోరు మరోవైపు, ఆ ప్రదేశం మొత్తం ప్రతిధ్వనించింది. అక్కడ చేరిన వారి పాటలు,నృత్యాలతో అక్కడో ‘‘ఆదివాసి ఐక్యత జన సముద్రం’’ ఏర్పడిరది. అది మోసపూరిత పోల వరం ప్రాజెక్టును నామరూపాలు లేకుండా చేయ బోతుందా!? అన్నట్టు అగుపించింది. ‘‘పోటెత్తిన జన ప్రవాహాన్ని చూసి హడలెత్తి పోయారు అధికా రులు,మంత్రులు, వెంట వచ్చిన తుపాకులు, రైఫిల్లు, మూగబోయాయి’’ అన్న వాక్యాలతో ముగిసిన ఈకథ నిండా గిరిజనజీవన విధానం అడవుల్లోని అందాలు,గోదావరి గొప్ప తనం,దర్శనీయ మవుతాయి. సమకాలీన సామాజిక విషయాన్ని వస్తువుగా తీసుకున్న ఈ కథా రచయిత జీవన్కథను ఆసాంతం తనదైన శిల్పం సాయంగా పాఠకులకు ఎక్కడా విసుపు కలగకుండా ఆసక్తికరంగా కడదాకా కథను నడిపించారు. రచయిత కథ మొత్తం ఆదివాసి జీవన ఆచార పద్ధతులు సందర్భోచితంగా చెప్పడంలో చక్కని శ్రద్ధ కనబర్చారు. కథకు నామౌచిత్యం కూడా కలిసింది. ఒకమంచి కథను చూస్తూ చదివిన అను భూతి కలగడంతో పాటు మంచి స్ఫూర్తి నిండిన ముగింపుతో కథకు మరింత సంపూర్ణ చేకూరింది. (వచ్చే మాసం డా:చింతకింది శ్రీనివాసరావు, కథ ‘‘వేలం బస’’ విశ్లేషణ మీ కోసం)- డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు,ఫోను: 77298 83223