పేదలకు శ్రీరామరక్ష జగనన్న సురక్ష
రాష్ట్రంలోని ప్రజలందరికీ వంద శాతం సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా సీఎం జగన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మక జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒక్క మాట లో చెప్పాలంటే సంక్షేమ పథకాలకు అర్హులై ఉన్న ఏఒక్కరూ లబ్ధి అందకుండా మిగిలి పోకూడదన్న తపనతో..వారికి ఏచిన్న సమస్య ఉన్నా దానిని పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో ప్రారం భించిన జగనన్న సురక్ష పథకానికి విశేష స్పందన లభించింది.గత నెలాఖరువరకు ఇంటిం టికీ నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో కొన్ని లక్షల మంది రోగులకు లబ్ది చేకూరింది.ఎంతో బృహత్తర రమైన జగనన్న సురక్ష పథకంపై ప్రత్యేక కథనం..!
అర్హులకు పథకాల లబ్ది చేకూర్చడమే లక్ష్యంగా జులై 1వ తేదీ నుంచి సమస్యల పరిష్కా రానికి క్యాంపుల ప్రారంభం. ఇందులో భాగంగా 11రకాల ధ్రువ పత్రాల సేవలు ఉచితంగా అందించనున్నారు.ఇప్పటికే తొలిదశలో ప్రజల సమస్యలు సిబ్బంది నమోదు చేశారు. ఈ కార్య క్రమం తొలిదశలో గ్రామ, వార్డు సచివాల యాల పరిధిలోని సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వాలం టీర్లు, గృహసారథులు ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న సురక్ష గురించి వివరించడం జరిగింది. ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి అక్కడ ఇంకా ఎవరికైనా అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలు అందడం లేదా? ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? వివిధరకాల సర్టిఫికెట్లను పొందడంలో ఏమైనా ఇబ్బందులున్నాయా? అనే అంశాలను నిశితంగా పరిశీలించి..ఆ వివరాలను నమోదు చేసుకున్నారు.
ప్రతి ఇంటిని కవర్ చేసేలా కార్యక్రమం
‘‘ఈ కార్యక్రమంపై సిఎం జగన్‌మోహన్ రెడ్డి వైద్యఆరోగ్యశాఖాధికారులకు దిశ నిర్ధేశాలు ఆదేశించారు.ప్రతి ఇంట్లో ఆరోగ్య సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కారించే గొప్ప బాధ్యతను మనం తీసుకుంటున్నాం.మనం చేసే ఈ కార్యక్ర మం ద్వారా గ్రామంలో ఒక పర్టిక్యులర్ రోజు నాడు హెల్త్ క్యాంపు నిర్వహిస్తాం. అందులో ప్రజలకు అవసరమైన పరీక్షలు చేయడం పాటు, మందులు,కళ్లద్దాలు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుం టున్నాం.హెల్త్ క్యాంపు నిర్వహించిన గ్రామాన్ని మ్యాపింగ్ చేసి, ఏ సమస్యలున్నాయన్నది తెలుసు కుని ఫ్యామిలీ డాక్టర్ విలేజ్ క్లినిక్ ద్వారా వాటిని పరిష్కరిస్తారు.ఆ తర్వాత గ్రామంలో ప్రతి ఇంట్లో ఎవరికి ఎలాంటి ట్రీట్‌మెంట్ జరగాలి, ఎలాంటి మందులు కావాలో తెలుస్తుంది. ఇంట్లో ఫెరా లసిస్, మరేదైనా సమస్య ఉంటే వారికి రెగ్యులర్‌గా మెడిసిన్ ఇవ్వడంతో పాటు వైద్యుడు వారిని పరీక్షించి…వారికి అవసరమైన మందులతో పాటు చికిత్స కూడా అందించే కార్యక్రమం చేపడుతున్నాం.ఒకవైపు తనిఖీలు చేస్తూనే మందు లు కూడా ఇవ్వబోతున్నాం. ఇది చాలా పెద్ద మార్పు.దీనికి సంబంధించిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవడం అభినందనీయమని సీఎం జగన్ అభినందించారు. సీఎం ఆదేశాలు మేరకు రాష్ట్రంలోని ఆయా గ్రామంలో ప్రతి ఇల్లు తిరిగారు. క్రానిక్ పేషెంట్లు ఉన్న ఇళ్లపై ప్రత్యేక శ్రద్ధచూపారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతల తోపాటు రక్తహీనత ఉన్నవాళ్లను గుర్తించారు. అదేరకంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతు న్నవారు,నియోనేటల్ కేసులతో పాటు బీపీ, షుగర్ వంటి వాటితో బాధపడుతున్న వారికి కూడా చికిత్స అందించారు.ఆయా వ్యాధులు రాకుండా నివారణ చర్యలపై కూడా గ్రామాల్లో అవగాహన కలిగించారు.ప్రతి గ్రామాన్ని మేపింగ్ చేసి,45 రోజుల పీరియడ్‌తో ఈ కార్యక్రమాన్ని సర్ధవం తంగా నిర్వర్తించారు. సీఎం ఆదేశించిన మేరకు ప్రతి మండలంలో నెలకు 4 గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని ఆయా జిల్లా కలెక్టర్ల కిందస్థాయి సిబ్బందికిచ్చిన ఆదేశాలు మేరకు పరీక్షలు నిర్వహించారు. దీనివల్ల ప్రతి 6 నెలలకొకసారి ఆమండలంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ హెల్త్ క్యాంపు నిర్వహించినట్లవు తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
నాలుగు దశల్లో ఆరోగ్య సురక్ష కార్యక్రమం
తొలిదశలో వలంటీర్లు, గృహసారధులు, ప్రజా ప్రతినిధులు ఈ ముగ్గురూ కలిసి ప్రతి ఇంటినీ సందర్శించారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేయ బోయే రోజు, తేదీతోపాటు ఏయే కార్యక్రమాలు చేపడతామో వివరించారు. ఆరోగ్యశ్రీ పథకంలో ఉన్న ఆసుపత్రుల వివరాలు,పథకాన్ని ఎలా విని యోగించుకోవాలన్న అంశాలపై అవగాహన కల్పించారు. తర్వాత దశలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, ఆ ఏరియా వాలంటీర్లతో కలిసి వెళ్లి 7 రకాల టెస్టులకు సంబంధించిన వివరాలను ప్రజ లకు తెలిపారు. రెండో టీం ఆశావర్కర్, ఏఎన్‌ఎం తో సీహెచ్‌ఓ వచ్చారు. ఇక్కడితో రెండో దశ పూర్తవుతుంది.7రకాల టెస్టులు చేసే విధంగా.. బీపీ,షుగర్, హిమోగ్లోబిన్, యూరిన్ టెస్టుతో పాటు (ఉమ్మి)స్పూటమ్ టెస్ట్,మలేరియా, డెంగ్యూ పరీక్షలు కూడా నిర్వహిస్తారు.ప్రతి ఇంటికి వెళ్లి ఈ పరీక్ష లు నిర్వహిస్తారు.మొబైల్ యాప్‌లో ఇలా సేకరిం చిన డేటాను అప్‌డేట్ చేస్తారు. ప్రతి ఇంటికి, పేషెంట్‌కి ఒక కేస్ షీట్ కూడా జనరేట్ అవు తుంది. ఫేజ్-3లో మరోసారి ఓరియెంటేషన్ కార్యక్రమం ఉంటుంది.హెల్త్ క్యాంప్ జరగబో యే 3 రోజుల ముందు మరోసారి వాలంటీర్, ఏఎన్‌ఎం,ప్రజా ప్రతినిధులు ప్రజలు ఆ గ్రామం లో మరోసారి గుర్తు చేస్తారు. ఫేజ్ 4లో హెల్త్ క్యాంపు నిర్వహిస్తారు. ప్రతి మండలంలో ఒక రోజు హెల్త్ క్యాంపు ఉంటుంది.45రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో..రూరల్,అర్బన్ ఏరియా లోనూ ఈ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తారు.
ఖాళీలుంటే వెంటనే భర్తీ చేయాలి
వైద్యారోగ్యశాఖలో నాలుగేళ్లలో 53,126 పోస్టు లు భర్తీ చేశామని సీఎం జగన్ అన్నారు. అన్ని ఆసుపత్రులను జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేశామన్నారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌స ీలు, టీచింగ్ ఆసుపత్రుల వరకు నాడు-నేడుతో అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు.2356 సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. ప్రతి పేషెంట్ ఈ సేవలను ఉచితంగా అందుకోవాల న్నదే లక్ష్యమన్నారు. ప్రతి పేషెంట్ డబ్బులు ఖర్చు లేకుండా..అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా చికిత్స అందుకోవాలన్నదే మన తాపత్రయం అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఎక్కడైనా ఖాళీలుంటే మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు వాటిని తక్షణమే భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదో మంచి నిర్ణయం
జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద 30 రోజుల పాటు ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహించను న్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు.వచ్చే నెలాఖరు నాటికి రాష్ట్రంలో శిబిరాల నిర్వహణ పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మండలానికి ఒక గ్రామం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజూ వైద్య శిబి రాలు జరుగుతాయని..శిబిరంలో 105 రకాల మందులు అందుబాటులో ఉంచుతాం. రోగులకు భోజన సదుపాయం కల్పిస్తామని.. ఇద్దరు స్పెష లిస్టు డాక్టర్లు, ఇద్దరు పీహెచ్‌సీ వైద్యులు పాల్గొం టారన్నారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల నుంచి కూడా ఒక స్పెషలిస్టు వైద్యుడు హాజరవుతారని తెలిపారు.
రాష్ట్రంలోని పేదలందరికీ ఆరోగ్య భరోసా కల్పిం చాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు మంత్రి విడదల రజిని.వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఆరోగ్యశ్రీ సేవల వివరాలు, అనుబంధ ఆసుపత్రుల జాబితాతో కూడిన కిట్‌లు అందజేస్తారని మంత్రి చెప్పారు. ఇంటిలో ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించి,స్థానికఏఎన్‌ఎంలకు తెలియజేస్తారన్నారు.మరుసటి రోజు నుంచి ఏఎన్‌ఎంలు, సీహెచ్‌వోలు ఇంటింటికీ వెళ్లి అవస రమైన వారికి షుగర్, బీపీ, రక్త పరీక్షలు చేస్తార న్నారు. శిబిరాల నిర్వహణ సమయానికి వారి హెల్త్ రిపోర్ట్ సిద్ధం చేస్తారని పేర్కోన్నారు.
ప్రజల ఆరోగ్య సమస్యలకు స్థానికం గానే స్పెషలిస్ట్ డాక్టర్లద్వారా చికిత్స అందిం చడమే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమ ధ్యేయ మని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో భాగంగా ఈనెల 15 నుంచి గ్రామ, వార్డు వలం టీర్లు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పిస్తారన్నారు. ఆరోగ్యశ్రీ కరపత్రాన్ని పంపిణీ చేసి.. సేవలను వివరిస్తారన్నారు. ఈనెల 16 నుంచి వైఎస్సార్ విలేజ్ క్లీనిక్, వైఎస్సార్ అర్బన్ క్లీనిక్‌ల పరిధిలోని గృహాలను ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు(సీహెచ్‌వోలు) సందర్శి స్తారన్నారు.ప్రజలకు ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి.. ఆరోగ్య సమస్యలను గుర్తిస్తారు. ఆ ఫలితా లను డాక్టర్లకు అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య సమస్యలున్న వారు వైద్య శిబిరాలకు హాజరయ్యేందుకు వీలుగా ఏఎన్‌ఎంలు, కమ్యూ నిటీ హెల్త్ ఆఫీసర్లు టోకెన్ నంబర్లు ఇస్తారు. ఈనెల 30నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ శిబిరాలను వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేయనుంది. ప్రతిరోజూ.. ప్రతి మండ లంలోనూ ఏదో ఒక వైఎస్సార్ విలేజ్ క్లీనిక్‌తో పాటు ప్రతి పట్టణంలోనూ ఏదో ఒక వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈ వైద్య శిబి రాన్ని నిర్వహిస్తారు. నెల రోజుల పాటు ఈ శిబిరాల నిర్వహణ కొనసాగుతుంది. ఈ వైద్య శిబిరాల్లో మొత్తం 342 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు సేవలందిస్తారు. అలాగే ఆయా మండలాల్లోని ఇద్దరు పీహెచ్‌సీ వైద్యులతో పాటు ఫ్యామిలీ డాక్టర్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొంటారు. 162 రకాల మందులతో పాటు 18 రకాల శస్త్రచి కిత్సల వస్తువులు, 14రకాల ఎమర్జెన్సీ కిట్లు తదిత రాలను అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య సమస్యలున్న వారిని వైద్యులు పరీక్షిస్తారు. అవసర మైన వారికి ఈసీజీ వంటి వైద్య పరీక్షలు కూడా చేసి.. ఉచితంగా మందులిస్తారు. ఎవరికైనా పెద్ద చికిత్సలు అవసరమైతే డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రిఫర్ చేస్తారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం అమలులో ఆయా శాఖల మధ్య సమన్వ యం అవసరమని సీఎస్ జవహర్‌రెడ్డి అన్నారు. వివిధ శాఖల అధికా రులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఇంటింటి సర్వే నిర్వహణ సమయంలో సాధారణ వాటితోపాటు దీర్ఘకాలిక వ్యాధులు, గర్భిణులు, బాలింతలు, తగిన బరువు లేని పిల్లలు,క్షయ, కుష్ఠు వ్యాధులు కలిగిన వారు ఉంటే.. ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ‘‘జగనన్న ఆరోగ్య సురక్ష’’.
ప్రజల ఆరోగ్య అవసరాలు గుర్తించేందుకు, పరీక్షలు నిర్వహించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా నిర్వహించిన ‘‘జగనన్న ఆరోగ్య సురక్ష’’ కార్యక్రమ సమావేశంలో పేర్కొ న్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి.ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చి దిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహించనున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు,జాయింట్ కలెక్టర్లు ,మున్సి పల్ కమిషనర్లు,వైద్య,విద్యాశాఖ అధికా రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వ హించి,ఈ కార్యక్రమ నిర్వహ ణకుశాఖల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను సమీక్షించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నెలరోజుల పాటు చేపట్టిన జగనన్న సురక్ష పథకం ప్రజల్లో మంచి గుర్తింపు లభించింది.– జి.ఎన్.వి.సతీష్