పెసా చట్టం అమలు చేయాలి

గిరిజనుల హక్కులకు రక్షణ కల్పించే పీసా చట్టాన్ని అమలు చేయాల్సిన అవశ్యకత ఉంది. షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో నివసించే గిరిజను గ్రామసభల ద్వారా స్వయంపాలన చేసుకోగలరు. గ్రామసభలు విద్య,ఆరోగ్యం,వ్యవసాయం,ప్రజా ఆస్తులు, గ్రామ రక్షణ,మౌలిక సదు పాయాలు మొదలైన వాటికోసం సొంతంగా కమిటీలు వేసుకొనే హక్కునిస్తోంది.అటవీ భూమి,చిన్న నీటి వనరులు,మైనర్‌ ఖనిజాలు,సహజ వనరుల వినియోగానికి సంబంధించిన హక్కులు కూడా పెసాచట్టం కింద నిర్వచించబడ్డాయి.దీనర్థంగ్రామసభలు నేల,వనరులు వంటి మొదలైన చిన్నఖనిజాల కోసం ప్రణాళికలు రూపొందించి,వాటిని ఉపయోగించు కోవచ్చు.ఏదైనా ఖనిజ తవ్వకాలకు గ్రామసభల అనుమతి తప్పనిసరి,అంటే మైనింగ్‌లీజు లేదా మైనర్‌ ఖనిజాలకోసం ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ అనుమతి దానితో ముందస్తు సంప్రదింపులు లేకుండాజారీ చేయబడదు.చెరువుల వంటి సహజ నీటి వనరులలో చేపలు పట్టడానికి మరియు నక్కల వంటి వనరులను సేకరించేందుకు నివాసితులందరికీ సమాన హక్కులు ఉంటాయి.
రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌లోని ప్రాంతాల సంప్రదాయ ఆచారాలు,పద్ధతులకు హానికలిగించే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలను కూడా సభలు తిరస్కరించవచ్చు. ఏ గిరిజన భూమి అయినా గ్రామసభ అనుమతి ఇచ్చిన తర్వాతే సేకరించవచ్చు. పెసా చట్టం లక్ష్యాలను ప్రతి గిరిజనుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనాఉంది.గిరిజన జనాభాలో ఎక్కువ మందికి స్వయం పాలన అందించడం.భాగస్వామ్య ప్రజాస్వామ్యంతో గ్రామ పాలనను కలిగి ఉండటం మరియు గ్రామసభను అన్ని కార్యకలాపాలకు కేంద్రకం చేయడం.సాంప్రదాయ పద్ధతులకు అనుగుణంగా తగిన పరిపాలనా ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడం.గిరిజన వర్గాల సంప్రదాయాలు మరియు ఆచారా లను పరిరక్షించడం మరియు సంరక్షించడం.ఈ చట్టం కింద గ్రామసభలకు విస్తృత అధికారాలు అప్పగించబడ్డాయి.షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో భూమి అన్యాక్రాంతాన్ని నిరోధించడం,షెడ్యూల్డ్‌ తెగకు చెందిన ఏదైనా చట్టవిరుద్ధంగా అన్యాక్రాంతమైన భూమిని పునరుద్ధరిం చడానికి తగిన చర్యలు తీసుకోవడం,గ్రామ మార్కెట్‌లను ఏ పేరుతో పిలిచినా నిర్వహించండి,షెడ్యూల్డ్‌ తెగలకు రుణాలిచ్చే డబ్బుపై నియంత్రణను పాటించండి,అన్ని సామాజిక రంగాలలోని సంస్థలు,కార్యకర్తలపై నియం త్రణను అమలు చేయాలి.గిరిజన ఉపప్రణాళికలతో సహా అటువంటి ప్రణాళికల కోసం స్థానిక ప్రణాళికలు,వనరులపై నియంత్రణ ఉంటోంది.అదేవిధంగా పౌర సమాజంలో గిరిజనులు ఎదుర్కొం టున్న వాస్తవ సమస్యల పరిష్కారానికి పెసాను మరింత మెరుగ్గా అమలు చేయాలని పెసా చట్టం చెబుతోంది. గిరిజనుల ప్రాంతంలో మంచి పని చేస్తున్న,స్వచ్ఛంద సంస్థలు పాల్గొనవలసిన అవసరం ఉంది.
అయితే పెసా చట్టం అమలుపై పలువురు మేథావులు,ఐఏఎస్‌ విశ్రాంతి అధికారులు ప్రభుత్వాలకు ఎన్నొ లేఖలు రాస్తునే ఉన్నారు. ఇటీవల విశాఖకు చెందిన ఫోరం ఫర్‌ బెటర్‌ విశాఖ వ్యవస్థాపకులు కేంద్రప్రభుత్వ విశ్రాంతి ఐఏఎస్‌ అధికారి ఇ.ఎ.ఎస్‌.శర్మ రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో,పీసా చట్టం అమలు కావడం లేదు.అటవీ ప్రాం తాల్లో భూములను తరతరాలుగా సాగుచేస్తున్న ఆదివాసీలకు,అటవీహక్కుల చట్టం క్రింద వ్యక్తిగత,ఉమ్మడి పట్టాలు లభించడం లేదు. ఇందుకు కారణం,ప్రభుత్వ సంస్థలలో ఆదివాసీలపట్ల ఉన్న నిర్లక్ష్యం,ఉదాసీనత.ఈ విషయంలో పభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆలేఖలో పేర్కొన్నారు.
ఇప్పటికైనాపెసా చట్టాన్ని సమర్ధవంతంగా గిరిజనప్రాంతాల్లో అమలు పర్చాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. రాజ్యాంగంకల్పించిన వారి హక్కులు నిర్వీర్యం చేయకుండా గిరిజన చట్టాలను అమలు చేసేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.!- రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్