పెసా చట్టంపై అవగాహన సదస్సు

షెడ్యూల్డ్‌ ప్రాంతంలో గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందా లంటే పెసా చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. సమత,గిరిమిత్ర సంస్థల ఆధ్వర్యంలో అక్టోబర్‌ 8వతేదీన నర్సీపట్నం ఎన్‌జీజీఎస్‌ భవనంలో పెసా చట్టం-1996పై సమీక్ష,అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏపి ఆదివాసీ హక్కుల సంఘం అధ్యక్షులు ఎన్‌. కళ్యాణ్‌ మాట్లాడుతూ గిరిజనలకు రాజ్యాంగం కల్పించిన రక్షణ చట్టాలు గ్రామసభల అమలపై పెసా చట్టాలను నేటి గిరిజన యువత అవగా హన చేసుకొని,స్థానిక వనరులు దోపిడికి గురి కాకుండా పరిరక్షించుకోవాలన్నారు.పెసా కమిటీ సభ్యులు బత్తుల కృష్ణ మాట్లాడుతూ గిరిజన వనరులు పరిరక్షణ,గిరిజన పల్లెల ప్రగతి చెందాలంటే పెసా చట్టం ద్వారా గ్రామ సభలు సంపూర్ణంగా అవగాహన చేసుకోవా లన్నారు.అనకాపల్లి జిల్లా గిరిజన సంఘం అధ్యక్షులు ఎస్‌.జనార్దన్‌ ప్రతి యువత గ్రామసభల నిర్వహణ,బాధ్యతలు తెలుసుకుని గిరిజన గ్రామభివృద్ధికి తోడ్పాడాలని పిలుపు నిచ్చారు.సమత సభ్యులు పెద్దమల్లాపురం)లోతా సుబ్బారావు మాట్లాడుతూ సమత చేస్తున్న రాజ్యాంగ పోరాటాల ఫలితమే నేడు గిరిజన వనరుల పరిరక్షణ అన్నారు.గిరిమిత్ర కార్యదర్శి బి.గంగరాజు అధ్యక్షతన జరిగిన అవగాహన సమావేశంలో అనకాపల్లి జిల్లా బిఎస్పి పార్టీ అధ్యక్షులు బి.నాగరాజు,వికాసవాణి కార్యదర్శి జగ్గారావు,ప్రగతి శిలా కార్యదర్శి శ్రీను మాట్లాడుతూ పెసా చట్టం అమల్లోకి వచ్చి సుమారు 32 సంవత్సరాలు అవుతున్నా నేటికీ షెడ్యూల్డ్‌ ఏరియాలో సంపూర్ణంగా అమలు కావడం లేదని అన్నారు.దీనివల్ల ఎన్నో గిరిజన కుటుంబాలు భూములు అన్యాక్రాంతమవుతూ దోపిడీదారుల గుప్పెట్లో నలిగిపోతున్నారని పేర్కొన్నారు.బి.బాలరాజు,వినియోగదారుల మండల్‌ చింతపల్లి మండల అధ్యక్షులు పి.చిట్టిబాబు,సమత డైరెక్టర్‌ సుశాంత్‌ ప్రాణాగ్రహీ,కో-ఆర్డినేటర్లు కే.సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ గ్రామసభ ప్రతిష్టతను,దాని ఫలితాలను వివరించారు.జీ.సైమన్‌ మాట్లాడుతూ పెసాచట్టం, గ్రామసభ ప్రాధాన్యత పై తమ తమ అభిప్రాయాలను వెల్లడిరచారు.పెసా చట్టంలో పొందు పరిచిన కమిటీలు నిర్వహణ,బాధ్యతలు,అన్యా క్రాంత మవుతున్న భూములు పరిరక్షణ, సంతల కోసం గ్రామసభల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవా లనే అంశాలను వివరించారు.ఈ సమావేశం లో సమత పరిశోధన విద్యార్థులు,గిరిజన యువకులు పాల్గొన్నారు. అనంతరం ‘పల్లె ప్రగతికి పట్టాభిషేకం పెసా చట్టం-996’అనే పుస్తకానీ ఆవిష్కరించారు. – (బి.గంగరాజు)