పెరుగుతున్న వాతావరణ ఉష్ణోగ్రతలు
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సంభవిస్తున్న వాతావరణ ఉష్ణోగ్రతల్లో పెనుమార్పులు సంభవిస్తూ మానవ మనుగడకు విఘాతం కలుగుతోంది.ముఖ్యంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎండలు పెరిగి సూర్యప్రతాపానికి జనాలు అల్లాడుపోయారు.దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు భారత వాతావరణశాఖ ప్రకటించింది.చాలా ప్రాంతాల్లో 45డిగ్రీల కంటే ఎక్కువఉష్ణోగ్రత నమోదయిందని ఐదు రాష్ట్రాలకు వాతావరణశాఖ వెల్లడిరచిది. ఏప్రిల్, మే,జూన్ నెలల్లో వడదెబ్బ తగిలి అనేకమంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలను విన్నాం.ఢల్లీిలో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదుయ్యాయి.ముంగేష్‌పుర్‌లో అత్యధికంగా52.9డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై వడదెబ్బ కేసులు పెరిగాయి.వడదెబ్బతో ఐదుగురు మృతిచెందారు.
కేవలం భారత్‌లోనే కాకుండా..ప్రపంచదేశాల్లో గతజూన్‌లో దాదాపు 5బిలియన్ల మంది ప్రజలు తీవ్రమైన వేడినిభరించారు.భారతదేశంలో 619 మిలియన్ల మంది ప్రభావితమయ్యారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.యుఎస్‌లోని ఓస్వతంత్ర శాస్త్రవేత్తల బృందం చేసిన కొత్తవిశ్లేషణ ప్రకారం,జూన్‌లో తొమ్మిదిరోజులపాటు భారతదేశంనుండి 619మిలియన్ల మందితో సహా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఐదు బిలియన్ల మంది ప్రజలు వాతావరణ మార్పు-ఆధారిత విపరీతమైన వేడిని అనుభవించారని పేర్కొంది.క్లైమేట్ సెంట్రల్ నివేదిక ప్రకారం జూన్‌లో పొక్కులు వచ్చే వేడి భారతదేశంలో 619 మిలియన్లు, చైనాలో 579 మిలియన్లు, ఇండోనేషియాలో 231 మిలియన్లు, నైజీరియాలో 206మిలియన్లు, బ్రెజిల్‌లో 176మిలియన్లు,బంగ్లాదేశ్‌లో 171 మిలియన్లు, యుఎస్‌లో 165మిలియన్లు, ఐరోపాలో 152మిలియన్లు, మెక్సికోలో 123మిలియన్లు, ఇథియోపియాలో 121 మిలియన్లు మరియు ఈజిప్టులో103మిలియన్లు.ఈవిధంగా ప్రపంచ జనాభాలో 60శాతానికి పైగా ప్రజలు తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నారు. ఇదిజూన్16-24 మధ్య వాతావరణ మార్పులవల్ల కనీసం మూడు రెట్లు ఎక్కువ అవకాశం ఉందని క్లైమేట్ సెంట్రల్‌లోని చీఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆండ్రూ పెర్షింగ్ వెల్లడిరచారు.ఒకశతాబ్దానికి పైగా బొగ్గు,చమురు,సహజ వాయువులను కాల్చడంవల్ల మనకు పెరుగుతున్న ప్రమాదకరమైన ప్రపంచాన్ని అందించిందని అభిప్రాయపడ్డారు.
అయితే ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో సంభవించ వచ్చని సమత గతమూడు దశాబ్దాల నుంచి గుర్తిచేస్తూనే ఉంది.వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు, పర్యావరణ పరిరక్షణపై తీసుకోవాల్సిన చర్యలపై అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగింది.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సమత ఉహించినట్లుగానే వాతావరణంలో సంభవిస్తున్న పెనుసవాల్‌ను నేడుప్రపంచదేశాల ప్రజలు ఎదు ర్కొంటున్నారు.ఈవేసవిలో ప్రపంచవ్యాప్తంగా వేడితరంగాలు అసహజ విపత్తులు ఉద్భవించాయి.
దేశంలోని దాదాపు 40శాతం ఏప్రిల్ నుండి జూన్ మధ్యకాలంలో సాధారణం కంటే రెట్టింపు హీట్‌వేవ్ రోజులను నమోదు అయ్యాంది. దేశంలోని కొన్ని నగరాలు 50 డిగ్రీల సెల్సియస్‌ను అధిగమించాయి.పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల నియంత్రణపై ప్రపంచదేశాలు తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత ప్రభుత్వయంత్రాంగంపై ఉంది.ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సైతం భాగస్వాములు కావాలి.బహుళజాతి కంపెనీల నియంత్రణపై చర్యలు చేపట్టాలి.దీనికి సమాఖ్యతభావంతో పోరాడినప్పుడే వాతావరణ మార్పులుపై సమూలమైన మార్పులు తీసుకురాగలం. -రెబ్బాప్రగడ రవి,ఎడిటర్