పుడమి తల్లిని కాపాడుకుందాం!

ఓవైపు కాలుష్యం పెరుగుతుంటే, మరో వైపు తరుగుతున్న వనరులు మానవాళికి ఆవాసంగా నిలిచిన పుడమితల్లికి కడుపు కోత మిగుల్చు తున్నా యి. అభివృద్ధి పేరుతో జరిగే మితిమీరిన చేష్టలు భూమాతను నిలువునా దహించి వేస్తున్నాయి. తాగే నీరు..పీల్చేగాలి..నివసించే నేల…ఇలా పంచ భూ తాలు కాలుష్యంలో చిక్కుకున్నాయి. పచ్చద నంతో పరిఢవిల్లాల్సిన భూతల్లి ఎదపై ప్రకృతి అందాలను కోల్పోయి మూగ రోదనతో కన్నీరు కార్చుతోంది. ఈదుస్థితి నుంచి భూమాతను కాపాడి..మానవ మనుగడకు తోడ్పాటునందించే సమయం ఆసన్న మైంది.మనిషి స్వార్థపరుడు..చెట్లను నరికేసి పక్షు లకు గూళ్లు లేకుండా చేశాడు.అడవుల్ని మాయం చేసి జంతువులకు నిలువనీడ లేకుండా చేస్తు న్నాడు. ప్రగతి పేరుతో పరిశ్రమలు స్థాపించి అడ్డూ అదుపూ లేకుండా ప్రకృతి వనరుల్ని దోచేశాడు. నేల,నదులు,సముద్రాలు ఒకటేమిటి ఆఖరికి ఆకా శాన్ని సైతం తన అదుపులోనే ఉంచుకోవాలన్న అత్యాశతో మొత్తంగా భూమండలాన్ని కలుషితం చేశాడు.అలా తాను సృష్టించుకున్న కాలుష్యానికి తానే బలవుతున్న వేళ…వచ్చింది ఓ మహమ్మారి. నీ సత్తా ఏమిటో చూపమని సవాలు విసిరింది. ఊహించని ఈ ఉత్పాతం మనిషిని వణికించింది. ఇంటి నాలుగుగోడల మధ్య బందీని చేసింది. పెరిగిపోతున్న భూతాపం, వాతావరణ కాలుష్యం తో అల్లాడుతున్న భూమాతను కాపాడుకునే దారేది? పర్యావరణ పరిరణక్ష విషయమై ప్రజల్లో అవగా హన పెంచే అవకాశమే లేదా? అంతరించి పోతున్న జీవజాతులను కాపాడుకోలేమా?ఈ ప్రశ్నలకు సమా ధానమే ‘ప్రపంచ ధరిత్రి దినోత్సవం’ దీనికి 1970 లో బీజం పడిరది.1969 జనవరి 28న శాంటా బార్బరా సముద్రతీరం చమురు తెట్టులతో నిండి పోయి తీరమే ఆలంబనగా బతకుతున్న వందలాది జీవజాతులు మృత్యువాతపడ్డాయి.సుమారు నాలుగు వేల పక్షులు ఆ తెట్టులో చిక్కుకొని ఎగిరే దారిలేక ప్రాణాలొదిలాయి. జీవ వైవిధ్యం కొడిగట్టిన ఆనాటి సంఘటన ప్రపంచ ధరిత్రి దినోత్సవానికి పునాదిగా మారింది.అమెరికన్ సెనేటర్ గెలార్డ్ నెల్సన్ పర్యా వరణ పరిరక్షణకు పిలుపునివ్వగా దాదాపు 20 లక్షల మంది ఏప్రిల్ 22న ధరిత్రి దినోత్సవంలో పాల్గొన్నారు. నేల అంటే మట్టి అన్న అర్థం మాత్రం కాదు,భూమంటే 84 లక్షల జీవరాశుల సముదా యం. మొదటిసారిగా ధరిత్రి దినోత్సవం 1970 ఏప్రిల్ 22న పాటించారు.
మానవ మనుగడకు పంచభూతాలే ఆధారం
మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా దీనికి ఆధారం భూమి.గాలి,నీరు,నింగి,నిప్పు,నేల అనే పంచభూతాల వల్లే మానవ మనుగడ సాధ్యమవు తుంది.వీటిలో ఏఒక్కటి లోపించినా జీవనం అస్త వ్యస్తమవుతుంది.భూమిపై అన్ని వనరులూ సక్ర మంగా ఉంటేనే మానవ అభివృద్ధి నిజమవుతుంది. కానీ,అంతులేని ఆధిపత్య దాహంవల్ల భూమం డలం కాలుష్యకాసారంగా మారిపోయింది.ఉపరి తలంపై ఉన్న వనరులే కాదు,భూగర్భ జలాలు, ఖనిజ వనరులను పలుదేశాలు విచక్షణారహితం గా వాడుకోవడంవల్ల భూతాపం పెరిగి రాబోయే కొన్నిదశాబ్దాలలో ముడిచమురు నిల్వలు అంతరించి పోయే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరి స్తున్నారు.రోజురోజుకూ భూగోళంపై హరితదనం తగ్గిపోవడం,కొన్ని రకాల జీవరాశులు నశించిపో వడంవల్ల భూతాపం పెరుగుతూ వస్తోంది. నానా టికీ పెరుగుతున్న భూతాపంతో ప్రకృతి సమతౌల్యత దెబ్బతిని జీవరాశి మనుగడకు ముప్పు ఏర్పడు తోంది.
పరిశ్రమలు,వాహనాలు తదితరాల నుంచి వెలువడుతోన్న క్లోరోఫోరో కార్బన్‌లు భూగ్ర హాన్ని మరింత వేడెక్కిస్తూ పలుకాలుష్యాలకు కారణ మవుతున్నాయి.భూతాపం పెరగడంవల్ల పర్యావర ణంలో పెనుమార్పులు చోటుచేసుకుని జీవరాశుల మనుగడకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరో వైపు వాతావరణంలో మార్పుల కారణంగా జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. వృక్షాలను విచక్షణారహి తంగా నరికివేస్తున్నందున అడవులు అంతరించి పోతున్నాయి. సరైన వర్షాలు లేక కరువుకాటకాలు సంభవిస్తున్నాయి. దీంతో జల వనరులు నానాటికీ తీసుకట్టుగా మారుతున్నాయి. తత్ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అకాల వర్షాలు, విపరీతమైన వేడిమి కారణంగా గ్లోబల్ వార్మింగ్‌తో ఓజోన్ పొర దెబ్బతింటోంది
భూమాతను శాంతింపజేసే చర్యలు
మొత్తం193దేశాలు ‘ఎర్త్’ డేలో భాగా మవుతున్నాయి. ప్లాస్టిక్ వాడకపోవడమే మంచిది. ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి, వృథాను అరికట్టాలి. వీలైనన్ని మొక్కలు నాటి వన సంరక్షణ చేపట్టాలి. తొమ్మిదో దశకం నుంచిప్రపంచవ్యాప్తంగా సుమారు 12.9 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ భూములు కనుమరుగయ్యాయి.ఈ చిన్న సూచనలు పాటిస్తే భూతాపం కొంత తగ్గించవచ్చు.బయటకు వెళ్లే సమయంలో వాహనాలు కాకుండా నడిచి వెళ్ళడం లేదా సైకిల్‌ను ఎంచుకోవడం. దూర ప్రాంతాలకు వెళ్లటేప్పుడు స్వంత వాహనాలు కాకుండా ప్రజా రవాణను ఆశ్రయించడం.మాంసాహారానికి దూరం గా ఉండటంవల్ల కూడా కార్బన ఉద్గారాల ప్రభా వాన్ని తగ్గించవచ్చు.పర్యావరణ అనుకూల ఉత్పత్తు లను ఉపయోగించాలి.చెత్తను ఎప్పటికప్పుడు తొల గించాలి. పునర్వినియోగ ఇంథనాలు, వస్తువులను వినియోగించాలి.స్థానికంగా దొరికే ఆహారాన్నే విని యోగించాలి.
వాతావరణ చర్య.. అపారమైన సవాళ్లు
ఏటా ధరిత్రీ దినోత్సవాన్ని ఒక ప్రత్యేక అంశాన్ని ఎంపిక చేసుకుని కార్యక్రమాలను నిర్వ హిస్తారు.ఈఏడాది‘వాతావరణ చర్య.. అపా రమైన సవాళ్లు…కానీ అనేక అవకాశాలు’ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు.వాతావరణ మార్పులపై చర్య 50 వ వార్షికోత్సవం సందర్భంగా చాలా ముఖ్యమైన అంశంగా గుర్తించింది. వాతావరణ మార్పు మాన వాళి భవిష్యత్తుకు, ప్రపంచాన్ని నివాసయోగ్యంగా మార్చే జీవిత-సహాయక వ్యవస్థలకు అతిపెద్ద సవాల్‌ను సూచిస్తుంది. పెరుగుతున్న భూతాపం, పలు ఉపద్రవాలకు కారణమవుతున్న వాతావరణ మార్పులను పట్టించుకోకుండా పరుగులు పెడుతున్న మనిషికి కరోనా వైరస్ ఇచ్చిన రaలక్…భూమా తకు మాత్రం గొప్ప వరమే అయింది. ఏకంగా భూమిపైనా లోపలా కూడా కనీవినీ ఎరుగని మార్పు లు చోటుచేసుకుని ఈ యాభయ్యో ధరిత్రీ దినోత్సవ సందర్భంగా మానవాళికి మరువలేని గుణపాఠంగా మారుస్తున్నాయి.
సమాధానం చెప్పిన ప్రకృతి
వాతావరణ మార్పులు, శిలాజ ఇంధ నాల వాడకంపైనా గత మూడేళ్లక్రితం ప్రపంచ వ్యాప్తంగా యువతరం పెద్దఎత్తున ఆందోళన చేసి దేశాధినేతలనే నిలదీశారు. ప్రకృతే వారికి సమాధా నం చెప్పిందా అన్నట్లుంది నేటి పరిస్థితి. ప్రపంచా న్ని ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోం ది. దీంతో పలు దేశాలలో లాక్‌డౌన్‌వల్ల అన్ని పనులు ఆగిపోవడంతో కర్బన ఉద్గారాలూ తగ్గా యి. భారతదేశంలోనూ ప్రజా రవాణా నిలిచిపోయి ఇంధనాల వాడకం దాదాపు 66 శాతం తగ్గింది. ఇంధనానికి డిమాండు తగ్గడంతో చమురు ఉత్ప త్తీ,బొగ్గు తవ్వకాలు తగ్గిపోయాయి.చరిత్రలో ఎన్న డూలేని విధంగా చమురు ధరలు పాతాళానికి పడిపోయాయి.ఫలితంగా చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో అన్ని రకాల కాలుష్యాలకూ అడ్డుకట్ట పడిర ది.ఈ మార్పు ఎంత కాలం ఉంటుందో తెలియదు. ఎందుకంటే 2008-09లో పెద్దఎత్తున ఆర్థిక మాం ద్యం ఏర్పడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాల విడుదల ఒకశాతం తగ్గింది. అప్పుడు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రభుత్వా లన్నీ ప్రోత్సాహకాలను ప్రకటించడంతో తర్వాత ఏడాది ఉద్గారాలు ఏకంగా 5 శాతం మేర పెరిగా యి.ఆ పొరపాటు ఇప్పుడు జరగకుండా చూసు కోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదైతే, అవసరానికీ విలాసానికీ మధ్య గీత గీసుకుని వ్యవహరించాల్సిన బాధ్యత ప్రజలది.
కరోనా ఎఫెక్ట్.. తేరుకుంటున్న నదులు
భారతీయులకు పవిత్రమైన గంగానది తీరం పొడవునా ఉన్న పరిశ్రమల నుంచి వచ్చే రసాయన వ్యర్థాలతో, యాత్రికులు పడేసే చెత్తతో కలుషితమైపోయి, తాగడానికి కాదు కదా, స్నానానికి కూడా పనికిరాని పరిస్థితికి చేరుకుంటోంది. గంగా నదిని శుభ్రం చేయాలంటూ ఎందరో ఆందోళనలు చేస్తూసే ఉన్నారు. ప్రభుత్వాలు కూడా ప్రక్షాళనకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా పరిస్థితిలో ఇసుమంత కూడా మార్పు లేదు. అలాంటిది లాక్ డౌన్‌తో ఫ్యాక్టరీల మూసివేయడంవల్ల వ్యర్థాలు నదిలోకి రావడం ఆగిపోయి గంగమ్మ కొత్త అందా లను సంతరించుకుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గంగానది పొడవునా ఏర్పాటుచేసిన 36 కేంద్రాలతో లాక్‌డౌన్ తర్వాత పది రోజులకే వాటి ల్లో 27 కేంద్రాల వద్ద నీటి నాణ్యత బాగా మెరుగు పడిరది. అక్కడి నీరు మనుషులు స్నానం చేయడా నికీ జలచరాలు ఆరోగ్యంగా బతకడానికీ అనువుగా ఉన్నాయనీ నీటిలో ప్రాణవాయువు పరిమాణం పెరిగిందనీ ఈ పరీక్షలు చెబుతున్నాయి. దేశంలోనే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ నగరాల మీదుగా ప్రవహిస్తూ పరిశ్రమల వ్యర్థాలను మోస్తున్న నదులన్నీ లాక్‌డౌన్ దెబ్బకి కాస్త తేరుకుంటున్నాయి.
లాక్‌డౌన్‌తో నెమ్మదించిన భూమాత
లాక్‌డౌన్‌తో అన్ని రవాణాలు నిలిచి పోగా..నిర్మాణాలు,గనుల తవ్వకాలు ఆగిపోయా యి.నిత్యం హోరెత్తే ఈపనులు భూమాతకు ఊపిరి సలపనివ్వడం లేదేమో…మన ఉరుకులు పరుగు లతో ఆమె కూడా అలసి పోతుందేమో…లాక్‌డౌన్ వేళ తానూ కాస్త నెమ్మదించింది.లాక్‌డౌన్ ప్రభా వం భూమి మీద ఎలా ఉందోనని భూకంప శాస్త్రవే త్తలు పరిశోధించారు.భూమి పొరల లోపల నుంచి అనునిత్యం విన్పించే హోరూ, ప్రకంపనలూ (సీస్మిక్ నాయిస్,వైబ్రేషన్స్)బాగా తగ్గినట్లు రాయల్ అబ్జర్వే టరీ ఆఫ్ బెల్జియంకి చెందిన శాస్త్రవేత్తలు గుర్తిం చారు. కరోనా వైరస్ వ్యాప్తికి మూల కేంద్రమైన వూహాన్ పారిశ్రమిక నగరం.దీంతో అక్కడ లాక్ డౌన్ ప్రకటించిన కొద్దిరోజులకే అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అక్కడ ఎంతో శుభ్రంగా దృశ్యాలన్నీ స్పష్టంగా కనిపించడం నాసా శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేసింది.గొడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్లో గాలి నాణ్యత మీద పరిశోధన చేస్తున్న ఫెయ్ లియు అనే శాస్త్రవేత్త లాక్‌డౌన్ అనే ఒకే ఒకచర్యతో నగరం చుట్టూ ఉన్న వాతావరణం ఇంతగా మారిపోవడాన్ని చూడ డం ఇదే మొట్టమొదటిసారి అని పేర్కొన్నాడు.
మనిషి కనపడకపోతే వాటికి స్వేచ్ఛ దొరికింది
మనిషి కనపడకపోతే పక్షులూ జంతు వులూ ఎంతస్వేచ్ఛగా తిరుగుతాయో తెలిపే దృశ్యా లుగమనిస్తూనే ఉన్నాం.అపార్ట్‌మెంట్ బాల్కనీ గోడ లపై కువకువలాడుతున్న పక్షుల జంటల ఫొటోలూ నడివీధిలో పురివిప్పి నాట్యమాడుతున్న నెమళ్లు, కోయిలమ్మ పాటలు, పిచ్చుకల కిలకిలలు సందడి చేస్తున్నాయి. కేరళలోని ఓపట్టణంలో నడివీధిలో నిదానంగా నడుస్తున్న ఓపునుగు పిల్లి,ఒడిశా తీరం లో హాయిగా ఆడుకుంటున్న ఆలివ్‌రిడ్లీ తాబేళ్లు, ముంబయి తీరంలో అలలపై కేరింతలు కొడుతున్న డాల్ఫిన్లూ,తిరుమలలో సంచరిస్తున్న జంతువులు, ఇజ్రాయెల్‌లోని కార్మేలియా నగరం మధ్యలో పార్కు లో గడ్డి మేస్తున్న అడవిపందులు,జపాను వీధుల్లో షికారు చేస్తున్న జింకలూ,టెల్ అవీవ్ విమానాశ్ర యంలో వాకింగ్‌కి బయల్దేరిన బాతులు,వేల్స్ లోని ఒకనగరం వీధుల్లో గొర్రెల మంద వాహ్యాళీ… ఇలాంటి ఎన్నో వీడియోలు గత కొన్ని వారాలుగా ప్రసారా మాధ్యామాల్లో దర్శనమిస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.మానవుడి జోక్యం లేకపోతే ప్రకృతి ఎంత సహజంగా,ఎంత అందంగా ఉంటుందో చెప్పడానికి నిదర్శనాలు ఇవన్నీ.1.వాహానాల వాడకం తగ్గిద్దాం.2.అనవసర విద్యుత్ వాడకాన్ని తగ్గిద్దాం.3.అడవులను నాశనం చేయకుండా.. చెట్లనుపెంచడం అలవరచుకుందాం.4.భూమికి హాని చేసే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేదిద్దాం. మనిషి మనుగడకు నష్టం చేసిన కరోనా మాత్రం పుడమి తల్లికి మంచి చేస్తుందనే చెప్పు కోవాలి. మనిషి సృష్టించిన కాలుష్యం నుంచి ధరణి బయట పడేలా చేస్తుంది. మనిషిని నాలుగు గోడల మధ్య బందించి..అలాగే వ్యర్థా లతో నిండిపోయిన నదు లు మళ్లీ స్వచ్చంగా కనిపిస్తున్నాయి.
ఇంతకాలం భూగర్భంలో భగ భగమని మండు తోన్న ఉష్ణం ఉబికివచ్చే తరుణం వచ్చేసింది. సమస్త జీవరాసులను వణికిస్తూ మానవాళిని వెంటాడే స్తుంది నిప్పులు చిమ్మకుంటూ వచ్చే ఆ ప్రచంఢాగ్నికి సర్వం వినాశమవు తుంది. ధ్రువాల మంచు కరడగం,సముద్ర మట్టాలు పెరగ డం,ద్వీపసమూ హాలన్ని సముద్ర గర్భంలో నిక్షప్తమ వవ్వడం ఇవన్నీ జరుగుతాయి.ఈ విపత్కర పరిణా మాలే కాదు.సమీప భవిష్యత్తులో కరువు కాటకాలు, వరదలు, తుపానులు భూమండలాన్ని అతలాకుత లం చేస్తా యని అమెరికన్ శాస్త్రవేత్తలు హెచ్చరి స్తున్నారు.భూమ్మీద నిత్యం విడుదల అవుతున్న ఉష్టం మొత్తం బయటకు వెళ్లడం లేదు. అందులో సగానికి సగం భూమ్మీదే దాగి వుంటోంది.ఏదో సమయంలో అది ఉబికి రావచ్చు.అదే జరిగితే ఊహించడానికే భయ మేస్తోంది.రోడ్లపై క్షణం తీరక లేకుండా తిరుగా డుతున్న వాహనాలు. నిరంతరం పొగలు కక్కుతున్న ఫ్యాక్టరీలు. ఇలాంటి వాటిల్లో ఇంధనం దహనం కావడంవల్ల విడుద లయ్యే ఉష్టం భూమి నుంచి విడుదల అవుతున్న దానికి సమానంగా వుండాలి. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు.వాతావరణంలోకి ప్రవేశించే ఉష్టం కంటే బయటికి పోయే ఉష్టం తక్కువవుతోందని అమఎరికాలోని నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫి యర్‌కు చెందిన జాన్ ఫసుల్లో అభిప్రా యపడు తున్నాడు.భూమ్మీద ఎంత ఉష్టం విడుదల అయిందో అంతే ఉష్టంవాతావరణం నుంచి బయటకు వెళుతున్నట్టు ఉపగ్రహ సెన్సర్లు ఇతర పరిక రాలు గుర్తించాలి.అయితే అలా జరగడం లేదు.ఆ ఉష్ణ మంతా సముద్ర గర్భంలోవుంటోంది. దీని కారణం గానే పసిఫిక్ మహాసముద్రంలోని ఎల్‌ని నోలు సంభవించి ఉష్ట ప్రాంత భూముల్లో వర్షాభావ పరిస్థితులు వస్తాయి.మరికొన్నిచోట్ల కనివినీ ఎరు గని రీతిలో వరదలు ముంచెత్తుతాయి.కాలం కాని కాలంలో వర్షాలు కురుస్తాయి. అతివృష్టి అనావృష్టి వరసపెట్టి వస్తాయి. వాతావరణంలో జరుగుతున్న మార్పులన్నింటికీ మనమే బాధ్యులం.భూమిపై పెరు గుతోన్న ఉష్టోగ్రతలకు మనమే కారణం ముం దస్తు హెచ్చరికలు లేకుండా ముంచుకొస్తున్న పెను విపత్తులకు మనమే కారకులం. ధ్రువాల మంచు కరిగే శాతం ఎక్కువైంది. ప్రపంచవ్యాప్తంగా పెరిగి న ఇంధన వాడకమే గ్లోబ ల్ వార్మింగ్‌కు ప్రధాన కారణం..మరో పక్క ఓజోన్ పొరకు చిల్లు ఏర్పడ టం వల్ల భూమిపై ఉష్టోగ్రతలు పెరుగుతున్నాయి. -(జి.ఎ.సునీల్ కుమార్)