పీసా చట్టానికి 25 ఏళ్లు
మహోన్నత లక్ష్యఆలతో అమలులోకి తెచ్చిన పీసా చట్టం (పంచాయితీరాజ్‌షెడ్యూలు ప్రాంతాల విస్తరణ చట్టం1996) అమలులోకి వచ్చి పాతికేళ్లయింది. ఆదివాసుల జీవనోపాధుల మెరుగుదల,అటవీ హక్కుల కల్పన,మౌళిక వసతుల అభివృద్ధి తద తర కీలక అంశాల్లో వారికి స్వయంపాలన హక్కులు కల్పించే పీసా చట్టంస్పూర్తిని ఇన్నేళ్లలో ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా అర్ధం చేసు కోలేకపాయాయనే చెప్పాలి.పంచాయితీరాజ్ చట్టాన్ని దేశమంతటా ఒకే రీతిన అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసులతోపాటు,వారి మద్దతు సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. దాంతో కేంద్రప్రభుత్వం దిలీఫ్‌సింగ్ భూరియా ఆధ్వర్యంలో 73వ రాజ్యాంగ సవ రణతో 1992లో అమలులోకి వచ్చిన పంచాయితీరాజ్ చట్టంపై ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సులతో పార్లమెంటు 1996లో పీసా చట్టాన్ని(పంచాయితీరాజ్ షెడ్యూలు ప్రాంతాల విస్తరణ చట్టం)ఆమోదించింది. దాంతో ఆదివాసీ ప్రాంతాల్లో పరిపాలన,సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల అమలుకు గ్రామసభలను కేంద్రబిదువుగా మార్చారు.
కానీ ఇంత విశిష్టమైన అధికారులు గల పీసా చట్టాన్ని పరిపూర్ణంగా అమలు కావడం లేదు.అయితే ఈ మధ్యకాలంలోనే కొన్ని రాష్ట్రప్రభుత్వాలు ఆదివాసీ గ్రామాల్లో గ్రామసభలకు విలువనిస్తూ కొన్ని అంశాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. మహారాష్ట్రంలో అప్పటి గవర్నర్ విద్యసాగర్ మాత్రం గ్రామసభకు విశేషాధికారాలను కల్పించి పీసా చట్టాని అమలకు కృషి చేశారు. ఆ తర్వాత ఈ విధానాన్ని ప్రస్తుత గవర్నర్ భగత్‌సింగ్ కొష్యారి కొనసాగించడం ప్రశంసనీయం.అదే విధంగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ కూడా గ్రామసభను అమలు చేస్తున్నారు. పీసా,అటవీహక్కుల గుర్తింపు చట్టంతోపాటు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలు నిబంధనలను అమలు చేయడానికి రాష్ట్రాల్లో వ్యవస్థాగత విధానాలకు కృషి చేస్తున్నారు. ఈ చట్టాలను సంబంధించిన నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడం,అమలు తీరును పర్యవేక్షించేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు.
ప్రస్తుతం చత్తీస్గడ్ ప్రభుత్వం పీసా చట్టం అమలకు కమిటీలు నియమించి చట్టం లక్ష్యానికి చేరుకోవడానికి కృషి చేస్తోంది. పంచాయితీరాజ్‌శాఖ,రాష్ట్ర పరిపాలన ప్రణాళిక శాఖల్లోను వర్కింగ్ కమిటీలు నియమించింది. ఈ రెండు కమిటీలు పీసా చట్టానికి పనిచేస్తాయి. పంచాయితీరాజ్‌శాఖ నుంచి ముసాయిదా నిబంధనలు సిద్దం చేయడం,రాష్ట్ర కమిటీ పరిపాలన,ప్రణాళిక విధానాలపై పీసా చట్టాన్ని ప్రజల్లో తీసుకెళ్లేందకు ప్రణాళికలు రూపొందించడం. ముఖ్యంగా పీసా చట్టాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చట్టం సక్రమంగా అమలు జరిగేలా సూచనలు ఇస్తోంది.అయితే చత్తీస్‌గడ్‌లో ఆదివాసీ సమాజ్ అధికం.ఇక్కడ అక్షరాస్యత గల ప్రజలు ఎక్కువే.దీంతో మహోన్నతమైన పీసా చట్టం విశేష అధికారాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో చట్టాన్ని పరిపూర్ణంగా అమలు చేయడానికి అన్నీ రకాల మద్దతు ఉంది.
ఇప్పటికైనా పీసా,అటవీహక్కుల గుర్తింపు చట్టంతోపాటు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలులో పేర్కొన్న నిబంధనల అమ లుకు రాష్ట్రాల్లో వ్యవస్థాగత యంత్రాంగాన్ని సిద్దం చేయాలి.పీసా చట్టంతో సహా ఇతర గిరిజన రక్షణ చట్టాలు,సంబంధిత నిబం ధనలపై శిక్షణ,అవగాహన పెంచే బాధ్యత,అమలు తీరును పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించిన రాష్ట్రాల్లోని గిరిజన సంస్కృతి, పరిశోధన,శిక్షణ సంస్థలు సరిపడా సిబ్బంది,తగినంత నిధులు కల్పించాలి. పీసా చట్టం అమలులోకి వచ్చి పాతికేళ్లయిన సందర్భంలోనైనా గిరిజనుల అభిమతాన్ని గౌరవించాలి. పీసాచట్టం అమలుకు వాటిని సిద్దం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది! అదే విధంగా పంచాయితీ రాజ్ విస్తరణ చటట్టం మాదిరిగానే మునిసిఫల్ విస్తరణ షెడ్యూలు ఏరియా(మీసా) చట్టాన్ని రూపొందించారు. మున్సిపల్ చట్టాన్ని గిరిజన ప్రాంతాలకు విస్తరించాలనే ప్రతిపాదన దశాబ్దాల కాలంగా నలుగుతునేపథ్యంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చే యోచన ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. షెడ్యూలు ప్రాంతంలో మీసా చట్టం సంపూర్ణ దిశ నిర్ధేశాలు రూపొందించిన నేపథ్యంలోనే గిరిజన ప్రాంతాలను మున్సిపాలిటీలో విలీనం చేయాలి. అదిజరగకుండా మొండివైఖరితో ప్రభుత్వాలు వ్యవహరిస్తే చట్టానికి వ్యతి రేక అంతుందని పీసా చట్టంలో భూరియా కమిటీ సూచించింది.- రవి రెబ్బాప్రగడ- ఎడిటర్