పీసా కమిటీ ఎన్నికల్లో అంతరంగమేమిటీ?
రాజ్యాంగంలో ఆదివాసులకు కల్పించిన రక్షణ చట్టాల్లో పెసాచట్టం1996(షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడి గింపు చట్టం)ఒక్కటి.ఈచట్టం ఐదువ షెడ్యూల్డ్‌ప్రాంతాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమా చల్‌ప్రదేశ్,జార్ఖండ్,మధ్యప్రదేశ్,మహారాష్ట్ర,ఒడిశా,రాజస్థాన్,తెలంగాణవంటిపదిరాష్ట్రాలకుపెసా చట్టం
1996 వర్తిస్తోంది.ఆదివాసీప్రాంతాల్లో గ్రామపంచాయితీని కాకుండా గ్రామసభను కేంద్రబిందువు చేశారు. గ్రామసభకు విశేషాధికారాలనుకల్పించారు.షెడ్యూల్ గిరిజనులకు స్వపరిపాలన అందించడం,షెడ్యూల్ తెగలసంస్కృతి, సంప్రదాయాలు,వివాద పరిష్కార పద్దతుల రక్షణ,గ్రామసభకు అధికారం తీసుకునే నిర్ణయం ఉంది.ఈచట్టం ప్రాముఖ్యతపై19992010వరకు దశాబ్దకాలంపాటు విశ్రాంతిఐఏఎస్ అధికారి బీడీశర్మ,ఉస్మానియా సెంట్రల్ యూనివర్శిటీ విశ్రాంతి ఫ్రొఫెసర్ జేపీరావు వంటి సామాజిక ఉద్యమనేతలు మావూళ్లో మారాజ్యం అనే నినాదంతో ఆదివాసీల స్వపరిపాలనకోసం పోరాడి గిరిజన తండాలు,గూడేలు తిరిగి ఆతరం ఆదివాసీ ప్రజలకు పెసా చట్టంపై అవగాహన కల్పించారు.అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అనంతగిరి మండలం నిమ్మలపాడు లోనూ సమత ఆధ్వర్యంలో మావూళ్లో మారాజ్యం స్థూపం కూడా నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈచట్టం ప్రాధాన్యతను గ్రహించి రాష్ట్ర పంచాయితీ గ్రామీణాభివృద్ధి శాఖ,ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్ గ్రామసభ ప్రాముఖ్యతపై ప్రజలకు కాస్త అవగాహన కల్పించారు.గతేడాది ఆగస్టులో రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజున13,326 గ్రామపంచాయితీల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి గ్రామసభ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశారు.దీంట్లో ఏపీలో ఐదో షెడ్యూల్ ఏరియా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు.ఆ తర్వాత రెండు గతేడాది డిసెంబర్‌లో పెసా చట్టం
1996 అమలుపై రాష్ట్రప్రభుత్వం గిరిజన గ్రామాల్లో కమిటీ ఎన్నికలు నిర్వహించింది.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు అన్నీ ఐటీడీఏ పరిథిలోఉన్న గిరిజన గ్రామాల్లో ప్రభుత్వ యంత్రాంగం పెసా కమిటీ ఎన్నికలు నిర్వహించి ఎంపిక చేశారు.
అయిత,ే ఈపెసాచట్టం వచ్చిదాదాపుగా 29ఏళ్లు అవుతుంది.నాటి నుంచి నేటి వరకు ఏప్రభుత్వం పట్టిం చుకోలేదు.కూటమి ప్రభుత్వం మాత్రం ఆఘమేఘాలపై పెసా కమిటీలు ప్రభుత్వ నియమ నిబంధనలతో ఎంపిక పూర్తి చేసింది.ఎంపికైన కమిటీ సభ్యుల్లో చాలా మంది యువతకే ప్రాధాన్యత ఇచ్చారు.ఇటీవల నేను అనంతగిరి మండలం నిమ్మలపాడు,రాళ్లవలస,కరకవలస గిరిజనగ్రామాలను సందర్శించాను.ఆప్రాంత పెసా కమిటీ సభ్యులనుస్థానికులు పరిచయం చేశారు.ఎన్నికైన కమిటీసభ్యులందరూ కుర్రగ్యాంగే.వారికిఈచట్టంపై ఏమాత్రం అవగాహన లేని పరిస్థితులను గమనించాను.రాజ్యాంగబద్దమైన చట్టాల కోసం అవగాహన లేని అమాయకులను ఎంపిక చేయడంపట్ల ప్రభుత్వ అంతరంగం ఏమిటీ గిరిజన మేథావులు ప్రశ్నిస్తున్నారు. ఈప్రక్రియలో బహుళ జాతి పెట్టుబడిదారుల స్వార్ధం కన్పిస్తోందని భావిస్తున్నారు.ఇక్కడవున్న వనరుల దోపిడికి సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.దీంట్లో భాగంగానే ఇటీవల విశాఖలో జరిగిన పర్యాటక ప్రాంతీయ పెట్టు బడులదారుల సమ్మెట్‌లో రాజ్యాంగబద్దమైన పదవిలోఉన్న రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుచేసిన వ్యాఖ్యాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రసంచలనం రేపాయి.దీంట్లోభాగంగానే అయ్యన్న వ్యాఖ్యాలపై భగ్గుమన్న మన్యం ఈనెల 11,12 తేదీల్లో కూడా రాష్ట్రవ్యాప్త మన్యం బంద్‌ను ప్రకటించడం గమనార్హం.
ఈనేపథ్యంలో ప్రభుత్వకుటిల నిర్ణయాలు,ఆలోచనలపై నేటి గిరిజనతరం ఆలోచించాలి.ముల్లును ముల్లు తోనే తీయాలనే చందంగా రాజ్యాంగబద్దంగా ఎన్నికైన పెసా కమిటీ సభ్యులతోనే గ్రామసభల ద్వారా ఇక్కడ ఉన్న అపారమైన నిక్షేపాలు దోపిడికి రంగం సిద్దమవుతుందనేది కమిటీ సభ్యులు ఆలోచించాలి. దీనిపై గిరిజన సంఘనాయకులు,ఉద్యోగులు,ప్రజలు యావత్తు అప్రమత్తంగా వ్యవహరించాలి.ఇప్పటికే చింతపల్లి,పార్వతీపురం ఏరియాలో అదాని ప్రాజెక్టు కోసం సన్నహాలు సాగుతున్నాయి.ఇటీవల జరిగిన ఏపీ కాబినేట్ సమావేశంలో అల్లూరి జిల్లాలో అదాని ప్రాజెక్టుల నిర్వహణపై సీఎం ప్రకటించడం తెలిసిందే.ఇప్పటికైనా పెసా కమిటీలు ఎన్నికల్లో పాలకుల కుతంత్రాల ఎన్నికైన అమాయక గిరిజన యువత గ్రహించాలి.గ్రామసభల తీర్మాణాల్లో ఏకపక్ష నిర్ణయాలు కాకుండా భవిష్యత్తు తరాల కోసం,ప్రజల పక్షాన నిలబడి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.లేని పక్షంలో గిరిజన ప్రజల భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదం ఉంది.! – రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్