పిల్లలదే ఈ ప్రపంచం..
ఈ ప్రపంచం పిల్లలకు సరిపడా ఉండాలా? ప్రపంచానికి వీలుగా పిల్లలుండాలా?అని అడుగుతారు రవీంద్రనాధ్ ఠాగూర్.‘సమా జంలో అత్యంత హానికి గురికాగల వాళ్ళు ‘పిల్లలు’.వారికి హింస,భయం లేని జీవి తాలను అందిద్దాం’అన్నారు నెల్సన్ మండేలా. బాల్యాన్ని కోల్పోయి బానిసలుగా దుర్భరమైన బతుకులీడుస్తున్న పిల్లలు మన చుట్టూ ఇంకా ఎందరో ఉన్నారు.‘మూడు మూరల కర్రతో ముప్పై ఎడ్లతో సోపతి నాదయ్యో దిక్కు దిక్కున ఉరకంగా లేలేత కాళ్ళకు గుచ్చెను ముళ్ళయ్యో’ అనే పాల బుగ్గల జీతగాళ్ళు ఇంకా గ్రామాల్లో కన్పిస్తూనే ఉన్నారు.‘బంగ్లాలూడ్చీ, బాసన్లు తోమీ, కలిగినోల్ల కాల్లే పడితే తినబోతే ఎంగిలి కూడూ..నీ ఈపునిండా ఎర్రని వాతలే’ ఇలా పట్నం వచ్చి పనుల్లో ఉండి హింసను అనుభవిస్తూ బెదురు చూపులతో గడుపుతున్న చిన్ని ప్రాణాలు ఇంకా ఉన్నాయి.‘కన్నోరి నెరగవు ఉన్నోరినెరగవు ఆదరించే వారినె రగవూ..చెత్త కుండే తండ్రై సాకేనా నీళ్లపంపు తల్లైసాకెనా’అంటూ తప్పిపోయి వచ్చినా, పారిపోయి వచ్చినా,తప్పించుకొని వచ్చినా.. అనాధలై వీధిలోనే బతికే బాల్యం,ఛిద్రమైన వీధి బాలలూ పెరుగుతున్నారే కానీ తరగడం లేదు. బాలల హక్కులను కాపాడేందుకు, బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రజల్లో అవగా హన కల్పించేందుకు 2002 నుండి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం బాల కార్మిక వ్యతిరేక దినంగా ప్రకటించి ప్రారంభించారు. అప్పటి నుండి ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చి ఇటుక బట్టీలలో మట్టి కొట్టుకున్న చిన్నారులు,చిన్నారి వేళ్ళతో రాళ్ళను గాజుల్లో పొదిగి వంటి నిండా అంటుకున్న మెరుపులుతో,అమాయకంగా చూస్తున్న గిడసబారిన పిల్లలూ ఇలా ఎన్నో సీన్స్ కళ్ళ ముందు కన్పిస్తూ..35ఏండ్లు గడిచి పోయా యి.వీళ్ళ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. బాల కార్మిక వ్యవస్థ మూడు పువ్వులు ఆరుకా యలుగా వర్థిల్లుతూనే ఉంది. ఇంకా ఎన్నేళ్ళు? పిల్లలంతా హాయిగా ఆనందంగా ఉండే రోజు రాదా? ఇవన్నీ జవాబులేని ప్రశ్నలుగా మిగిలి పోతూనే ఉన్నాయి. కుటుంబ కలహాలు, గృహహింస ప్రకృతి విపత్తులు,కుల,మత సంఘర్షణలు,నిర్లక్ష్యానికి గురైనవారు, తప్పి పోయిన పిల్లలు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారు, ఆకలి, పేదరికం వల్ల పనిదొ రకని కుటుంబాలతో వలస వచ్చిన పిల్లల జీవితమంతా ఓ గమ్యం తెలియని ప్రయా ణం.ఈ ప్రయాణంలో సుమారు 214 మిలి యన్ల మంది పిల్లలున్నారు.
బాధ్యత ప్రభుత్వాలదే
వలస వెళ్ళిన చోట హింస,దోపిడీ,సౌకర్యాలు లేకపోవడం,అనారోగ్యాలు,పిల్లలకు చదువు లేకపోవడం..అన్నిటినీ మించి కొత్త చోటులో నిర్భంధిస్తారా? వెనక్కి పంపుతారా? ఆపుతా రా? ఉండనిస్తారా?తెలియదు. వాళ్ళు ఉండా లనుకుంటున్నారా? తిరిగి వెళ్ళాలను కుంటు న్నారా?అని పిల్లల్ని అసలు అడగరు. వలస కార్మికుల రక్షణ కోసం కార్మికశాఖ అనేక విధానాలను రూపొందించింది.వీటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఆయా ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాలతో కూడా సంప్రదింపులు జరపవలసి ఉంటుంది. ఆ క్రమంలో పిల్లలు దోపిడీకి గురి కాకుండా చదువుకి ఏర్పాట్లు చేయడం,మరీ ముఖ్యంగా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం అవస రం.వాళ్ళ భవిష్యత్ నిర్మాణంలో వాళ్ళే భాగస్వా మ్యం వహించాలి కదా!
యావత్ సమాజ బాధ్యత
1973లో అంతర్జాతీయ కార్మిక సంస్థ హక్కుల ప్రకటన 138వ ఒడంబడిక,1999లో182 ఒడంబడిక బాలకార్మికతను ఈ విధంగా నిర్వచించింది.12,14 ఏండ్ల లోపు పిల్లలు ఆర్థిక కార్యకలాపాలతో ముడిపడి పనిచేయడం, ప్రమాదకర, హానికర పనుల్లో బలవంతంగా నియమించబడటం, వ్యభిచారానికి ఉపయో గించటం, అక్రమ రవాణా చేయబడటం, అసాంఘిక కార్యకలాపాల్లోకి, ప్రమాదాల్లోకి నెట్టివేయబడటం’ అత్యంత దారుణం. అలాగే 1989లో విశ్వ బాలల హక్కుల ప్రకటన ఏం చెపుతుందంటే ‘ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేసి,చదువుకు,ఆరోగ్యానికి హాని కలిగిం చేలా వారి శారీరక, మానసిక, సామాజిక, నైతిక ఎదుగుదలకు ఆటంకం కలిగించే పనుల నుండి పిల్లల్ని రక్షించాలి’ అని. పిల్లల సంక్షేమం యావత్ సమాజ బాధ్యత అని ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలన్నీ అంగీకరించి హామీనిచ్చాయి. అయితే హైదరాబాద్‌లో జరిపిన ఓచిన్న సర్వే ప్రకారం28,560మంది వీధుల్లోకి వచ్చేస్తే వాళ్ళల్లో 18,670మంది బాలకార్మికులుగా మారారు. 18,827 మంది చదువుకోగా, అసలు చదువుకోని వాళ్ళు 17,056. వీధుల్లోనే నివసిస్తూ పని చేసేవాళ్ళు 20,056 మంది ఉన్నారు. భారతదేశంలో శతాబ్దాల తరబడి బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతున్న బాలల ముఖ చిత్రాన్ని ప్రతిబింబిస్తుంది. బడిలో ఉండాల్సిన పిల్లలను, ఆట పాటలతో గడపాల్సిన బాల్యాన్ని బందీ చేయడం ఒక అనాగరిక చర్య.ఇది మన భారతదేశ సమస్య మాత్రమే కాదు. ప్రపం చంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబం ధించింది కూడా.బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి స్థిరమైన,దీర్ఘకాలిక కృషి ఎంతో అవసరం. బాలకార్మికుడు అనే పదానికి సార్వత్రికంగా ఆమోదించిన నిర్వచనమే మిటంటే ‘బాల్యాన్ని నాశనం చేసే రీతిలో పిల్లలతో పని చేయించడం’.పిల్లల శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధికి అవరోధమై, వారికి అక్షరాస్యత,వినోదాన్ని పొందే అవకాశం ఇవ్వని పనిని,ఆస్థితిని బాలకార్మిక వ్యవస్థగా పేర్కొంటారు.బాలలంటే 5నుంచి14 సంవత్స రాల వయసు గలవారు. అయితే, తల్లిదండ్రుల పేదరికం, నిరక్షరాస్యత కారణంగా ఎందరో బాలలు బాలకార్మికులుగా జీవిస్తున్నారు. అవసరాల కోసమో, అదనపు ఆదాయం కోసమో పేద కుటుంబాలు తమ పిల్లలను పనుల్లోకి పంపిస్తున్నారు. ఎంతో మంది బాల లు వ్యవసాయ పనుల్లో, నిర్మాణ రంగాల్లోనే కాకుండా ప్రమాదకర వృత్తులైన ఇసుకబట్టీలు, పలకల తయారీల్లో, క్వారీల్లో, గాజు పరిశ్రమ, మైనింగ్ రంగాల్లో బ్రతుకీడుస్తున్నారు. దీనివల్ల పిల్లలు శారీరక, మానసిక పెరుగుదల లేకుండా దీర్ఘకాల దుష్పరిణామాలకు గురవుతున్నారు. పిల్లల్లో సహజంగా ఉండే నైపుణ్యాలు, సామర్ధ్యాలు నశించిపోవడం, భావి భారత మానవ వనరులు దుర్వినియోగమవడమే.
ఎప్పుడు ప్రారంభమయింది..?
పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన మొదటి రోజుల్లో ఈ బాలకార్మిక వ్యవస్థ కూడా ప్రారంభమైంది. మొదటిసారి 1803లో బ్రిటన్ బాలకార్మిక నియంత్రణ కోసం చట్టం తెచ్చింది.1819లో ఫ్యాక్టరీ చట్టాలు వచ్చాయి. పనిగంటల నియంత్రణ ఫ్యాక్టరీల్లో, కాటన్ మిల్లుల్లో జరిగింది.ఆతర్వాత 1948లో కర్మాగారాల చట్టం వచ్చింది.1966లో బీడీ, చుట్ట కార్మికుల పని పరిస్థితులు ఉద్యోగ నిబం ధనలు వచ్చాయి.1970లో కాంట్రాక్ట్ కూలీల నియంత్రణా,నిషేధ చట్టం.ఆ తర్వాత అంత: రాష్ట్ర వలస కార్మికులచట్టం 1979 వచ్చింది. 1988లో దుకాణాలు, సంస్థల చట్టం. 1958 లో వాణిజ్యనౌకల చట్టం.1952లో గనుల చట్టం పై అన్ని చటాలు 14ఏండ్లలోపు పిల్లలు పనిచేయటాన్ని నిషేధిస్తున్నాయి.
మానవహక్కుల ఉల్లంఘనే
బాలకార్మికత కూడా మానవహక్కుల ఉల్లంఘనే అనిచెప్పవచ్చు.రాజ్యాంగం ప్రకారం కూడా స్వేచ్చా,సమానత్వం,గౌరవం,వివక్షత, హింస లేని జీవితాలు పిల్లల హక్కు.రాజ్యాంగంలోని ఆర్టికిల్ 24 ప్రకారం14ఏండ్ల లోపు పిల్లలు ఫ్యాక్టరీలలో లేక ఇతర అపాయకరమైన పరిస్థి తులతో పనిచేయడం నిషేధించబడిరది. ఆర్టికి ల్ 39 (ఇ)(ఎఫ్) ప్రకారం లేతవయసులో ఉన్న పిల్లల ఆరోగ్యం,శరీరసత్తువ దుర్వి నియోగం కాకూడదు.వయసుకి తగని వ్యాపకాల్లో బలవం తంగా నెట్టే పరిస్థితులు లేకుండా చర్యలు తీసుకోవాలి.పిల్లలను, యువతను దోపిడీకి గురికాకండా చూడాలి.‘పిల్లల అభివృద్ధి కోసం జాతీయ ప్రణాళికల్లో మానవ వనరుల అభివృద్ధి ముఖ్యమైన ప్రాధాన్యత కలిగి ఉండాలి. అసమా నతలను పోగొట్టి సామాజిక న్యాయాన్ని అందించడం మన అందరి ముఖ్య ఉద్దేశ్యం కావాలి. మన జాతీయ విధానం ప్రకారం సంపూర్ణమైన బాలల అభివృద్ధికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అన్నారు జస్టిస్ మదన్ బి లోకూర్.ఒక న్యాయమూర్తిగా ఉంటూ పిల్లల హక్కుల చట్టాలలో సవరణల కోసం విశేష కృషి చేసిన గొప్ప వ్యక్తి ఈయన.
తీవ్రమైన దోపిడీ
120అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకారం.. భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్య లో బాలకార్మికులున్నారు.14ఏండ్ల లోపు బాల లు 250మిలియన్ల (ఇప్పుడిరకా పెరిగిఉండ వచ్చు) మంది బాలకార్మికులు ఉంటే,వారిలో 50 మిలియన్ల మంది ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు.20మిలియన్లు వెట్టి చాకిరీలో, 20లక్షల మంది ముఖ్యంగా బాలికలు అక్రమ రవాణాకు గురౌతున్నారు. మరికొంత మంది కుటుంబాల్లో ఇంటి పనుల్లో ఉండి పోతు న్నారు.అలాగే వ్యవసాయ పనులు,చేతి వృత్తులు,కుటీర పరిశ్రమల్లో ఎలాంటి జీతం లేకుండా పనిచేస్తున్నారు. ఇంకానిర్మాణ పనులు,చెత్తతో ఉత్పత్తులు,ఇతరుల వద్ద పని చేయడంతో పాటు స్వయం ఉపాధి పనులు చేస్తున్నారు.వెట్టి చాకిరీలో భాగంగా కార్పెం టర్,ఎంబ్రాయిడరీ పనులు,గనులు,షాపులు, రెస్టారెంట్స్‌లో పసులు,వ్యభిచారం,అశ్లీలంతో కూడిన పనులు చేయించబడుతున్నారు. 2000లో ప్రపంచ వ్యాప్తంగా Gశ్రీశీపaశ్రీ వీaతీషష్ట్ర aస్త్రaఱఅర్ జష్ట్రఱశ్రీస ూaపశీబతీ జరిగింది.ఈ సందర్భంగా నేను 24గ్రామాలు కాలినడకన తిరిగి ప్రచారం చేశాను.పాటలు, నాటికల ద్వారా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పని చేశాను.ఆక్రమంలో 12ఏండ్ల బాలకార్మికుని కొట్టి చంపిన సంఘటన దానిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి ఆ యజమాని (హంతకుడు)కి శిక్ష పడేలా చేయగలిగాం.
కారణాలు ఇవే
బాలకార్మిక వ్యవస్థకు మూలకారణాలైన పేదరికం,నిరుద్యోగం,నిరక్షరాస్యత, వేధింపు లుతో పాటు మంచి పాఠశాలలు,నాణ్యమైన విద్య అందివ్వలేకపోవడం.లాగే మహిళలకు పరిమిత అవకాశాలు,మరీ ముఖ్యంగా పిల్లలు పనిచేస్తే వచ్చే ప్రమాదాలు,నష్టాలను తేలిగ్గా చూసే విధానం,యజమానుల లెక్కలేని వైఖరులు వీటన్నింటిపై అందరికీ అవగాహన కల్గించాలి. ప్రయారిటీలో పిల్లలుండాలి. ఈసమస్యలను ఇప్పుడు మనం తేలిగ్గా తీసు కుంటే రేపటి సమాజం ఆటవిక సమాజం కాగలదు.పిల్లలు భావి సంపద అని చెప్తుంటారు.కానీ మెటీరియల్‌గా,ఆస్తిగా చూడ టం సరికాదు.ప్రాణం ఉన్న ఆలోచన ఉన్న వ్యక్తులుగా వారిని చూడాలి.అంటే సుస్థిర అభి వృద్ధి లక్ష్యాలను సాధించుకునే దిశగా ప్రభు త్వాలు,పౌర సమాజం స్వచ్ఛంద సంస్థలు కలసి ప్రయత్నం చేయాలి.
బాలల హక్కుల చట్టం ప్రకారం
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం చేసిన చట్టాలు అమలు చేసేందుకు రూపొందించిన యంత్రాంగాన్ని సమర్థవంతంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత అందరిది.బాలకార్మిక చట్టం 1986 సవరణ చేస్తూ బాలలు,యువ కార్మిక (నిషేద నియంత్రణ)చట్టం2016గా రూపొందించడం జరిగింది.దీని ప్రకారం14 ఏండ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరం.14నుండి18ఏండ్ల యుక్తవయసు పిల్లల్ని ప్రమాదకరమైన పనుల్లో పెట్టుకోవడం నేరం. దీనికి 6నెలల నుండి 2ఏండ్ల వరకూ జైలు శిక్షతో పాటు 50వేల వరకు జారిమానా ఉం టుంది.పై నేరాలు తల్లిదండ్రులు, సంరక్షకుల ద్వారా చేయబడితే 10వేల జరిమానా. అలాగే ముందుగా డబ్బు అప్పు ఇచ్చి పిల్లల్ని పనిలో పెట్టుకోవడం కూడా నేరంగా పరిగణించ బడుతుంది.దీనికి 1976ప్రకారం 3ఏండ్ల జైలు శిక్షతో పాటు జరిమానా ఉంటుంది.
బాలల సంక్షేమ సమితి
బాలల సంక్షేమ సమితి అనే సంస్థ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడిరది. పిల్లలు పనిలో ఉన్న సమాచారం అందగానే చైల్డ్ లైన్ లేదా చైల్డ్ ప్రొటెక్షన్ సిబ్బంది,పోలీసులు,లేబర్ డిపార్ట్‌మెంట్,లేబర్ ఆఫీసర్ లేదా స్వచ్చంద సంస్థలుగాని రిస్క్యూ చేసి ఎప్‌ఐఆర్ నమోదు చేసి 24 గంటలలోముందు హజరుపరచాలి. పనిలో పెట్టుకొన్న యజమానికి లేబర్ కోర్ట్ ద్వారా శిక్షలు,జరిమానాలు ఉంటాయి.బాలల న్యాయ చట్టం ప్రకారం బాలలను ఎవరైనా పనిలో పెట్టుకొన్నా, వెట్టిచాకిరీ కోసం వినియో గించినా,పని కోసం అమ్మినా,కొన్నా,జీతం ఇవ్వకుండా యజమాని వాడుకున్నా 5ఏండ్ల జైలు,జరిమానా విధిస్తారు.పై నేరాల్లో పిల్లలు వికలాంగులైతే నేరస్తులకు రెట్టింపు శిక్ష ఉం టుంది.
ఎవరికి ఫిర్యాదు చేయవచ్చు – (ఐక్యరాజ్యసమితి విశ్వ బాలల హక్కుల తీర్మానంలో పొందుపరిచిన హక్కులే పైన తెలియజేసిన 12 అంశాలు), వ్యాసకర్త : ఎక్స్ చైర్మన్,ఛైల్డ్‌వెల్‌ఫేర్ కమిటీ- (పి.శ్యామలాదేవ