పార్లమెంటు సాక్షిగా విశాఖ ఉక్కుపై కేంద్రం దాడి
విశాఖ ఉక్కు అమ్మకంపై ప్రజల్లో వ్యక్త మౌతున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేని బిజెపి… దుష్ప్రచారానికి పార్లమెంటు వేదికగా పూనుకుంది. తన సన్నిహిత కార్పొరేట్ వర్గానికి దీనిని ధారాదత్తం చేయడానికి ప్రజల్లో విశాఖ ఉక్కు ఖ్యాతిని మసక బార్చేందుకు కుట్ర పన్నింది. మొన్న పార్లమెంటులో విశాఖ ఉక్కుపై సభ్యులు అడిగిన ప్రశ్నలను ఆసరా చేసుకొని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి విషం కక్కారు. వాస్తవాలకు పాతరేసితీవ్రమైన అబద్ధాలు వల్లించారు.అబద్ధం 1: విశాఖ ఉక్కుకు కేప్టివ్ మైన్స్ లేకపోవడం వల్ల నష్టాలు రాలేదు –-డా॥ బి.గంగారావు
ఇది పచ్చి అబద్ధం. కేప్టివ్ మైన్స్ అంటే ప్రభుత్వం ఉక్కు పరిశ్రమలకు ముడిఇనుప గనులు కేటా యించడం.దేశంలో సొంతముడి ఇనుప గనులు లేని ఏకైక పరిశ్రమ విశాఖ ఉక్కు.అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్టీల్ పరిశ్రమలకు ప్రభుత్వం సొంత ఇనుప గనులు కేటాయించింది.ఇంకా నిర్మాణం జరగని బ్రాహ్మణి స్టీల్‌కి, పోస్కోకి కూడా సొంత ముడి ఇనుప గనులు కేటాయించారు.స్టీల్ ఉత్పత్తి వ్యయంలో ముడి ఇనుప ఖనిజంపై చేసే ఖర్చు చాలా కీలక మైంది.విశాఖ ఉక్కుకి సొంత ముడి ఇనుప గనులు లేకపోవడంవల్ల ప్రైవేట్ వారి నుండి కొనుగోలు చేస్తున్నది.ఈ ఏడాది ఒక టన్ను ముడి ఇనుప ఖనిజాన్ని సగటున సుమారు రూ.8500 కు కొనుగోలు చేశారు.టాటా,జిందాల్,మిట్టల్ తది తర పరిశ్రమలన్నీ సొంత గనులు ఉండటం వల్ల ఒకటన్ను ముడి ఇనుప ఖనిజాన్ని కేవలం రూ. 800కే సమీకరించు కోగలిగాయి.దీనివల్ల విశాఖ స్టీల్‌ప్లాంట్ ఇతర అన్ని స్టీల్ప్లాంట్ల కంటే రూ.2 వేల కోట్లకుపైగా అదనంగా ముడి ఖనిజంపై ఖర్చు భరించాల్సి వస్తున్నది.ఫలితంగా ఉక్కు ఉత్పత్తి వ్యయంలో56శాతం విశాఖ స్టీల్ ముడి పదార్ధాలకు ఖర్చవుతున్నది.ఇతర స్టీల్‌ప్లాంట్లకైతే ఈ వ్యయం 30శాతం మాత్రమే ఉంటుంది.మార్కెట్లో మా త్రం స్టీల్ అంతర్జాతీయ రేట్ల ప్రకారం అన్ని కంపె నీలు ఒకే రేటుకు అమ్మాలి.అయినప్పటికీ ఈ ఏడాది 2022జనవరి నాటికి రూ.739కోట్లు నికర లాభం ఆర్జించింది.సొంత ఇనుప గనులు కేటాయిస్తే ఏడాదికి 2 వేల కోట్లకు పైగా లాభాలు ఆర్జిస్తుంది.
అబద్ధం2 :విశాఖ ఉక్కుకు భారీగా నష్టాలు, రుణ భారం
గతఏడేళ్ళలో విశాఖఉక్కు రూ.7122కోట్లు నష్టాలు చవి చూసిందని, రుణ భారం కూడా రూ.22 వేలకోట్లు ఉందని మంత్రి వాపోయారు. విశాఖ ఉక్కు2015-16నుండిలాభాల్లోనే కొనసాగు తున్నది.ఇది వాస్తవం.అయితే విశాఖ ఉక్కుకు ఇటీవల నికర నష్టాలు ఎందుకు వస్తున్నాయంటే మొదటిది దీనికి సొంత ఇనుప గనులు లేకపో వటం.ముడి ఇనుప ఖనిజంధర ఈ ఆరేళ్లలో నాలుగురెట్లు పెరిగింది. రెండోదిప్లాంట్ 33 లక్షల టన్నుల నుండి 73లక్షల టన్నులకు విస్తరిం చింది. రాయబరేలిలో 500 కోట్లతో రైలు చక్రాల తయారి పరిశ్రమను నిర్మించింది. వీటికోసం ప్లాంట్‌కి ఉన్న మిగులు నిధులతో పాటు బ్యాంకుల నుండి అప్పులు తీసుకుని విస్తరణ చేపట్టింది.కేంద్ర ప్రభు త్వం ఈవిస్తరణకు ఒక్క రూపాయి పెట్టుబడి ఇవ్వ లేదు.అందువల్ల రూ. 22 వేల కోట్ల అప్పు చేయాల్సి వచ్చింది.పైపెచ్చు అప్పుపై14శాతం వడ్డీ చెల్లిం చాల్సి వస్తున్నది. ప్రైవేట్ స్టీల్ కంపెనీలకు బ్యాం కులకు ఇచ్చేవడ్డీ రేట్లు విశాఖ స్టీల్‌కి కూడా కేంద్ర ప్రభుత్వం వర్తింప చేస్తే ఏడాదికి కనీసం రూ.700 కోట్లు వడ్డీ ఆదా అవుతుంది.ఈ విస్తరణ ద్వారా సుమారు పదివేల మందికిఉద్యోగాలు కల్పించింది. దేశంలో ఏ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌కి అప్పులు లేవు? అంతే కాదు దేశంలో ఉన్న 8 బడా స్టీల్ కంపెనీలు సుమారు రూ. 2లక్షల 15 వేల కోట్లు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టాయి.కేంద్ర బిజెపి ప్రభుత్వం మద్ద తుతోనే రుణాల రద్దు జరిగాయి. విశాఖస్టీల్ ప్లాంట్ ఏ బ్యాంకుకు ఒక్క రూపాయి ఎగ్గొట్టలేదు. నికర నష్టాలున్నా గత ఏడేళ్ళలో సుమారు16 వేల కోట్లు కేంద్రానికి పన్నులు చెల్లించింది
అబద్ధం 3 : విశాఖ ఉక్కు ఉత్పాదకత, ఉత్పత్తి తగ్గింది. రెండేళ్ల నుండి జీతాలు ఇవ్వలేని స్థితి
గత రెండేళ్లు కోవిడ్ సంక్షోభం కొనసాగినప్పటికీ విశాఖ ఉక్కు తన ఉత్పత్తిని 60 లక్షల టన్నులకు పైగా చేయగలిగింది.అంతేగాక గతఆరేళ్లలో టర్నో వర్ రూ.12వేల కోట్ల నుండి రూ.24 వేల కోట్లకు పెంచుకోగలిగింది.ఉత్పాదకత బాగా ఉందని, 88 శాతం ఉత్పత్తి సామర్ధ్యాన్ని వినియోగించు కుంటు న్నదని సాక్షాత్తూ స్టీల్ పార్లమెంట్ స్టాండిరగ్ కమిటీ తన నివేదిక లోనే పేర్కొన్నది.వాస్తవంగా ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం 2025 నాటికి 120 లక్షల టన్నులకు పెంచుకోవాలి.కానీ కేంద్ర బిజెపి నుండి ఆర్థిక సహకారం లేకపోవడంతో ఈ విస్తర ణకు నోచుకోలేక పోయింది.అలా జరిగి ఉన్నట్ల యితే మరో50వేల మందికి ఉద్యోగాలు కల్పించ బడేవి.కోవిడ్ కాలంలో దేశంలోని అన్ని ప్రయివేటు స్టీలు పరిశ్రమలు కార్మికులను తొలిగించటం, జీతా ల్లో కోత పెట్టడం చేశాయి. కానీ విశాఖ ఉక్కులో మాత్రం ఈదారుణం జరగలేదు.అంతేకాదు ఏడా దికి రూ.2588 కోట్లు జీతాలకే చెల్లిస్తున్నది.
అబద్ధం 4 : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరిగినా ఇలాగే ఉంటుంది! ఉద్యోగాలు పెరుగుతాయి!!
ప్రైవేటీకరణ జరిగితే ప్లాంట్ ఎక్కడికి పోదు. అక్కడే ఉంటుందని పార్లమెంట్లో ఉక్కు మంత్రి వ్యం గ్యంగా చెప్పారు.విశాఖ స్టీలు ప్రైవేటీకరణ జరిగితే ఏమౌతుంది? తొలుత దీని విస్తరణకు ఉన్న ఏడు వేల ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ పేర అమ్మే స్తారు. ఉద్యోగులందరినీ వి.ఆర్.ఎస్ కింద తొలగి స్తారు.జీతాల్లోభారీగా కోతలు పెడతారు. కాంట్రా క్టు కార్మికులను సైతం తొలగిస్తారు. ఏఒక్కరికి ఉద్యోగ భద్రత ఉండదు.కార్మిక హక్కులు అమలు ఉండదు. ఈ చర్యలు మొత్తం విశాఖ నగర ప్రజల ఆర్థిక జీవనాన్ని దెబ్బతీస్తుంది.ఎయిర్ ఇండియాని, నీలాచల్‌స్టీల్‌ని టాటా కొన్నతరువాత జరిగిందేంటి? కార్మికులను కేవలం ఏడాది మాత్రమే కొనసా గిస్తాం, ఆ తరువాత వి.ఆర్.ఎస్ ద్వారా అందరినీ తొలగిస్తాం అని ప్రకటించారు. విశాఖఉక్కు ప్రైవేటీ కరణ చేస్తే ఇదే జరుగుతుంది.
అబద్ధం 5 : ఉక్కు నిర్వాసితులకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశాం !
విశాఖ స్టీల్ కోసం 16,500 కుటుంబాలు 22 వేల ఎకరాల భూమిని త్యాగం చేశారు,64 గ్రామా లు తొలగించబడ్డాయి. ఇప్పటివరకు ఇచ్చిన శాశ్వత ఉద్యోగాలు 8 వేలు మాత్రమే.ఇంకా సగం మందికి పైగా ఇవ్వాల్సి ఉంది.ఐదువేల ఉద్యోగాలకే ఒప్పం దం జరిగిందని ఇక ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరమే లేదని మంత్రితెగేసి చెప్పారు. నిర్వా సితుల ఉద్యోగాల కోసం అనేక పోరాటాలు జరిగా యి. కాలక్రమంలో నిర్వాసితులందరికి ఉద్యోగాల కల్పనకు అనేక ఒప్పందాలు,హామీలు జరిగాయి.ఈ వాస్తవాలను మంత్రి కప్పిపుచ్చారు. ఇటీవల ఉద్యోగాల భర్తీకిఇచ్చిన నోటిఫికేషన్‌ను కూడా బిజెపి దుర్మార్గంగా రద్దు చేయించింది.ఉక్కు ఉద్యమాన్ని చీల్చడానికి, నీరుగార్చడానికి బిజెపి అనేక కుట్రలకు పాల్పడిరది.నిర్వాసితులపైవల పన్నింది. నిర్వా సితులకు ఉద్యోగాలు ఇస్తామని, మేలు చేస్తామని నమ్మబలికింది.బిజెపి అగ్ర నాయకత్వం విశాఖలో వుండి కొందరిని తనవైపు తిప్పుకోవడానికి కూడా ప్రయత్నం చేసింది.అయినా ఉద్యమంలో చీలిక తీసుకు రాలేకపోయింది.చివరికి ఇప్పుడు నిర్వా సితుల పట్ల బిజెపి తన అసలు నైజాన్ని పార్ల మెంట్లో బయటపెట్టింది.నిర్వాసితు లకు అన్నీ ఇచ్చేశాం.ప్లాంట్‌కు నిర్వాసితులకు ఎటువంటి సం బంధం లేదనేవిధంగా దుర్మార్గంగా తెగేసి చెప్పింది
అబద్ధం6: నీలాచల్ స్టీల్ ప్రైవేటీకరణవల్లఉద్యోగుల జీతాలు రెట్టింపు అయ్యాయి
వాస్తవం ఏమిటంటే ఈ కంపెనీని టాటాకి గత నెల బిజెపి అమ్మేసింది. ఈఅమ్మకంలో నీలాచల్ కంపెనీ ఉద్యోగులను కేవలం ఏడాది మాత్రమే కొనసాగించ టానికి, తరువాత వి.ఆర్.ఎస్ తో వీరిని తొలగించ టానికి టాటాతో బిజెపి ఒప్పందం చేసుకుంది.అంటే త్వరలో పర్మినెంట్ ఉద్యోగులం దరినీ తొలగించటం ఖాయం.ఈ నిజాన్ని దాచిపెట్టి ఉద్యోగులకు జీతాలు రెట్టింపయ్యాయనడం ప్రజలను మోసగించడమే. పైగా,మోడీ అధికారం చేపట్టిన తరువాత పూర్తిగా ప్రభుత్వ కంపెనీలను అమ్మేసిన దానిలో నీలాచల్ స్టీల్ రెండోది.గత ఏడాది లక్షల కోట్ల విలువ చేసే ఎయిర్ ఇండి యాను18వేలకోట్లకుటాటా కి అమ్మేశారు. నీలాచల్ స్టీల్ ఆస్తుల విలువను కేంద్ర ప్రభుత్వం రూ.5616 కోట్లుగా నిర్ధారించి దీనిని రిజర్వు ధరగా ప్రకటిం చింది. టాటా స్టీల్ దీనిని ఏకంగా రూ.12,011 కోట్లకు కొనుగోలు చేసింది. ఇదెలా సాధ్యమైంది? ఈ కంపెనీకి వందేళ్ళకు సరిపడా 874 హెక్టార్లలో సుమారు 102 మిలియన్ టన్నుల ముడి ఇనుప గనులు ఉన్నాయి. ప్రస్తుత రేటు ప్రకారం ఈ గనులు అమ్ముకుంటే సుమారు రూ.80వేల కోట్లు ఆదాయం వస్తుంది. అంతేగాక ఈప్లాంట్ 100 లక్షల టన్ను ల తక్షణ విస్తరణకు అన్ని అవకాశాలు న్నాయి. 2500 ఎకరాల మిగుల భూమి ఉంది. పారదీప్ పోర్టుకి దగ్గరలో ఉంది.మోడీ ప్రభుత్వం అందుకే టాటా స్టీల్‌కి కట్టబెట్టింది. విశాఖ ఉక్కులో దీనిని కలిపివేయాలని డిమాండ్ చేసినా బిజెపి అంగీక రించలేదు.
అసలు కుట్ర ఏమిటి ?
దేశంలోని ప్రభుత్వ స్టీల్ కంపెనీ లన్నింటిని బడా కార్పోరేట్ల పరం చేయాలన్నదే బిజెపి కుట్ర. వామపక్షాలు మినహా దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఈ విధానాలను బలపరుస్తున్నాయనేది వాస్తవం.90వ దశకంలో మొత్తం దేశీయ స్టీల్ ఉత్పత్తిలో ప్రభుత్వ స్టీల్ కంపెనీల వాటా 46 శాతం ఉండేది. నేడు 17 శాతానికి పడిపోయింది.గత 3 దశాబ్దాల ప్రైవేటీ కరణ విధానాల వలన టాటా,మిట్టల్,జిందాల్ వంటి 6బడా కంపెనీలు స్టీల్‌రంగంలో అతి పెద్ద కంపెనీలుగా అవతరించాయి.నేడు స్టీల్ ఉత్పత్తిలో వీటి వాటా 46 శాతానికి చేరింది. ఇప్పుడు ప్రభుత్వ స్టీల్ పరిశ్రమల న్నిటినీ తమ సొంతం చేసుకో వడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.అలాగే మొత్తంస్టీల్ ఉత్పత్తిలో నేడు చిన్నతరహా స్టీల్ కంపె నీల మొత్తం కంపెనీలవాటా42శాతం ఉంది.వీటిని కూడా ఈబడా కంపెనీలు మింగే యడానికి ప్రయత్నం చేస్తున్నాయి.అందుకు బిజెపి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. ఫలితంగా జరగబోయే పరిణామం ఏంటంటే మొత్తం దేశీయ స్టీల్ రంగం కేవలం నాలుగైదు బడా కంపెనీల గుత్తాధిపత్యం లోకి వెళ్ళబోతున్నది. వ్యాసకర్త: గౌరవాధ్యక్షులు, స్టీల్‌ప్లాంట్ గుర్తింపు యూనియన్ (సిఐటియు)