పర్యావరణ పరిరక్షణ పుడమికి సంరక్షణ
నానాటికీ తీవ్రతరమవుతున్న పర్యావరణ మార్పులతో ప్రకృతి విఫత్తులు ముమ్మరి స్తున్నాయి. ఫలితంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. పంటలు, భూము లు దెబ్బతింటున్నాయి.దానివల్ల పుడమిపై మానవాళి జీవనం నరక ప్రాయం గా మారుతోంది. వాతావరణంలో పెనుప్రభా వాలు పుడమిపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రకృతి విఫత్తులు నానాటికీ పేట్రేగిపోతున్నాయి. ఇటీవల కేరళ రాష్ట్రం వాయనాడ్‌లో జరిగిన హృదయ విచారకర ఘటన యావత్తు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.ముఖ్యంగా దేశంలో అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసం పెను విషాదా లకు దారితీస్తోంది.తాజాగా కేరళలో చోటు చేసుకున్న విలయమే ఇందుకు ప్రబల నిదర్శ నం.విచ్చలవిడిగా ఆనకట్టల నిర్మాణంతో అరుణాచల్ ప్రదేశ్‌లోనూ ఇటువంటి విఫత్కర పరిస్థితులు నెలకొంటున్నాయి. – గునపర్తి సైమన్
నదులపై ఆనకట్టలు దేశ ఆర్ధికాభివృ ద్ధికి కీలకం.కానీ,వాటివల్ల వినాశకర పరిణా మాలు కూడా ఉంటాయని నర్మదలోయ,ఉత్తరాఖం డ్ ప్రజలు ఎన్నడో గ్రహించారు.అభివృద్ధి కోసం ప్రకృతిని,మానవ జీవితాలనుపణంగా పెట్ట కూడ దు.ప్రసుతతం అరుణాచల్‌ప్రదేశ్‌కు ఈజంట ప్రమాదాలు ఎదురవుతున్నాయి.అక్కడ169కి పైగా ఆనకట్టల నిర్మాణానికి ప్రయత్నాలు మొదలయ్యా యి.అరుణాచల్ భూకంప ప్రమాదప్రాంతంలో ఉంది.పైగా వాతావరణ మార్పులవల్ల అక్కడి పర్వతా లపై ఉన్న హిమనదాల్లో మంచు కరిగిపోతూ వరదలకు కారణమవుతోంది.ఇటువంటి పరిస్థితు ల్లో అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆనకట్టలు దిగువన ఉన్న అస్సామ్‌కు వరద ముంపు ముప్పును తీవ్రం చేస్తాయి.ఇది చాలదన్నట్టు అరుణాచల్ సరిహద్దు సమీపంలోని టిబెట్ భూభాగంలో యార్లంగ్ జాం గ్బో (బ్రహ్మపుత్ర)నదిపై చైనా 60,000 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తోంది.అది చైనాలో యాంగ్జేనదిపై నిర్మించిన బృహత్తర త్రీగోర్జెస్ డ్యామ్‌కన్నా మూడిరతలు పెద్దది.ఈసూపర్ డ్యామ్ వల్ల అరుణాచల్‌లోకి నీటిప్రవాహం తగ్గిపోతుంది. కాబట్టి అక్కడ11,000మెగావాట్ల ఎగువ సియాం గ్ ప్రాజెక్టు నిర్మాణానికి జాతీయ జల విద్యుదు త్పాదన సంస్థ(ఎన్‌హెచ్‌పీసీ)నడుం కట్టింది.
ప్రపంచాన్ని వెంటాడుతున్న ప్రకృతి విపత్తులు
ప్రపంచవ్యాప్తంగా అలా ప్రకృతి విప త్తుల ప్రమాదం ఎక్కువగా పొంచి ఉన్న 15 దేశాల జాబితాను 2018 వరల్డ్ రిస్క్ రిపోర్ట్ ప్రచురించి ంది.ఆ జాబితాలో భారత్ పొరుగు దేశం బంగ్లా దేశ్ కూడా ఉంది.భూకంపాలు,సునామీ, తుపాన్లు, వరదల లాంటి విపత్తుల బారిన పడే ప్రమాదం ఉన్న172దేశాలనుఈరిపోర్ట్ అధ్యయనం చేసింది. దాంతోపాటు ఆవిపత్తులకు ఆయా దేశాలు స్పం దించే శక్తినికూడా అంచనా వేసింది.జర్మనీకి చెంది న వివిధ సంస్థలు సంయుక్తంగా చేసిన ఈ అధ్య యనం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నలుగు రు పిల్లల్లో ఒకరు ప్రకృతి విపత్తులు పొంచి ఉన్న ప్రాంతాల్లోనే జీవిస్తున్నారు.గత ఏడాది ప్రకృతి విపత్తుల కారణంగా ఇళ్లను కోల్పోయి వలస వెళ్లిన వారిలో సగం మంది18ఏళ్ల లోపు వాళ్లేనని ఐరాస చెబుతోంది.ఈజాబితాలో ఎక్కువగా దీవులే ఉన్నా యి. వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టం క్రమంగా పెరుగుతుండటంతో, వాటికి పొంచి ఉన్న ప్రమాదం కూడా అంతకంతకూ పెరుగుతోంది.అన్నిటికంటే దక్షిణ పసిఫిక్ సము ద్రంలో ఉన్న వనువాటు దీవి పరిస్థితే మరింత ప్రమాదకరంగా ఉంది. ప్రకృతి విపత్తుల ప్రమాదం తో పాటు వాటిని ఎదుర్కొనే సన్నద్ధతను కూడా దృష్టిలో పెట్టుకొని ఈజాబితాను రూపొందిం చారు. అందుకే నిత్యం భూకంపాల బారిన పడే జపాన్,చిలీ లాంటి దేశాలు ఈ జాబితాలో కనిపిం చలేదు. అలాగే వందల ఏళ్ల పాటు పెరుగుతున్న సముద్ర మట్టం సమస్యతో పోరాడిన హోలాండ్ కూడా జాబితాలో 65వ స్థానంలోఉంది.ఈ దేశా లు విపత్తుల ప్రమాదాన్ని తగ్గించలేకపోవచ్చు, కానీ వాటిని సమర్థంగా ఎదుర్కోగలవని ఆనివేదిక చెబు తోంది.2030 నాటికి 32కోట్ల మంది ప్రజలు విపత్తులు ఎక్కువగా పొంచి ఉన్న ప్రాంతాల్లో జీవిస్తారని అంచనా.ఈ విపత్తులు ప్రజల జీవితా లను నాశనం చేయడంతో పాటు దేశాలను మరిం త పేదరికంలోకి నెట్టేస్తాయి.
ఇథియోపియాతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో అనారోగ్యం, వరకట్నాలతో పాటు కరవు లాంటి విపత్తులు కూడా ప్రజలను పేదరికంలోకి నెట్టేస్తున్నాయని ఓవర్సీస్ డెవలప ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక చెబుతోంది.2012 నాటి ‘మ్యాపిల్‌క్రాఫ్ట్’ నివేదిక ప్రకారం… ఆసి యాకు చెందిన బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, మయన్మార్, భారత్, వియత్నాం లాంటి దేశాలకే ఎక్కువగా ప్రకృతి విపత్తుల ప్రమాదం పొంచి ఉంది.విపత్తు లను నివారించలేకపోయినా,వాటిని సమర్థంగా ఎదుర్కోగలిగితే నష్టాన్ని చాలా వరకు తగ్గించొచ్చు. ఆ విషయంలో ఒడిశాను స్ఫూర్తిగా తీసుకోవచ్చని పర్యావరణ నిపుణులు చెబుతారు.1999లో ఒడిశా లో సంభవించిన తుపాను ధాటికి పదివేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తుపాను నుంచి ఒడిశా చాలాపాఠాలు నేర్చుకుంది. గత 20 ఏళ్లలో తుపాన్లను ఎదుర్కోవడానికి పక్కాగా సన్నద్ధమైంది. దానికోసం ప్రపంచ బ్యాంకు సహాయాన్ని సైతం తీసుకుంది. ఈక్రమంలో ఖరగ్‌పూర్ ఐఐటీ సహ కారంతో దాదాపు 900తుపాను సహాయక శిబి రాలను నిర్మించింది’1999 పెనుతుఫాను తరు వాత మేం పాఠం నేర్చుకున్నాం. ఆ పైన ఎలాంటి విపత్తు ఎదురైనా సమర్థంగాఎదుర్కోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాం.వీలైనంత తక్కువగా ఆస్తి, ప్రాణ నష్టం ఉండాలని భావించాం’ అని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక కమిషనర్ బిష్ణుపాద సేథి అన్నారు.‘గతంలో ఆంధ్ర ప్రదేశ్‌లో సంభవిం చిన ఫైలిన్ తుపానునే తీసుకుంటే ఆతుపాను ధాటికి ఆస్తి నష్టం ఎక్కువగా ఉన్నా ప్రాణ నష్టం తక్కువే.కాబట్టి ఆప్రాంతానికి ఆర్థికసాయం భారీగా అందలేదు. అది ప్రజల జీవన స్థితిగతుల మీద ప్రభావం చూపింది. చనిపోయే వారి సంఖ్యకూ, ఆర్థిక సాయానికీ ప్రత్యక్ష సంబంధం ఉంటుంది’ అని ఓవర్సీస్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్(ఓడీఐ) కు చెందిన డాక్టర్ మిషెల్ వివరిస్తారు.ప్రకృతి విపత్తుల కారణంగా మరింత పేదరికంలో జారి పోయే దేశాలజాబితానూ ఓడీఐ తయారు చేసింది. అందులో బంగ్లాదేశ్ తొలి స్థానంలో ఉంది.
1999 తరువాత ఒడిశా ఏమేం చర్యలు తీసుకుంది?
ఐఐటీ-ఖరగ్‌పూర్ సహాయంతో 879 తుపాను, వరద సహాయక శిబిరాలను నిర్మించారు. లక్షమందికి పైగా బాధితులకు ఆవాసం కల్పించేం దుకు 17వేలకు పైగా ప్రత్యేక కేంద్రాలను నిర్మిం చారు.తీర ప్రాంతాల్లో 122సైరన్ టవర్లతో పాటు, తుపాను హెచ్చరికలకు సంబంధించిన పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేశారు.17జిల్లాల్లో ‘లొకేషన్ బేస్డ్ అలారం వ్యవస్థ’ను ఏర్పాటు చేశారు. వీటి సాయంతో ప్రజలకు తుపాను ప్రభావానికి సంబం ధించిన సమాచారంతో పాటు రక్షణ చర్యలకు సంబంధించిన వివరాలను అందిస్తారు.బలమైన గాలులను తట్టుకునేలా తీరప్రాంతంలో ఇళ్ల గోడ లు,పైకప్పులను పటిష్ఠ పరిచారు.మత్స్యకారుల కోసం ప్రత్యకవార్నింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సామాజిక మాధ్యమాల సాయంతో ఎప్పటికప్పుడు వాతావరణంపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
మేల్కోలుపు అవసరం…
మానవాళిపై పడగవిప్పిన ప్రకృతి విఫత్తులను నిలువరించాలంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి.అందుకోసం అడవుల విస్తీర్ణా న్ని పెంచాలి.శిలాజ ఇంధనాల వినియోగాన్ని వీలై నంతగా తగ్గించి పునరుత్పాదక ఇంధన వనరుల వాడకాన్ని పెంచాలి.కర్బన్ ఉద్గారాలను తగ్గించుక పోతే 2100 సంవత్సరం నాటికి హిందూ మహా సముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు 3.8డిగ్రీల సెల్సి యన్ మేర ఎగబాకే అవకాశం ఉందని వాతా వరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.అదే జరిగితే కుండపోత వానలు,భీకర వరదలతో పెనువిలయం తప్పదన్న ఆందోళణలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు ఆరేబియా సముద్ర ఉష్ణోగ్రతలూ ఇటీవల పెరగడం తుఫానుల ముప్పును యాభైశాతం మేర పెంచింది.పుడమి పరిరక్షణకు కోరి కాఫ్ వంటి అంతర్జాతయ సదస్సులను నిర్వహిస్తున్నారు. వాటిలో చేసేతీర్మానాలను ప్రపంచదేశాలు సక్రమం గా అమలు చేయడం లేదు.భవిష్యత్ తరాలు భూ మిపై మనుగడ సాగించాలనే ఉష్ణోగ్రతలకు కళ్లెం వేయడం తప్పనిసరి.ఇందుకోసం కర్బన్ ఉద్గారా లను కట్టడి చేయడం,పుడమిని పర్యావర ణాన్ని పరిరక్షించుకోవడం అందరి బాధ్యత.
ప్రకృతితోనే భద్రమైన భవిష్యత్తు
భూమి మీద ఉన్న సకల జీవకోటికి ప్రకృతే ఆధారం. ఇది సృష్టి,స్థితి,లయలకు కారణ మైన ఒక శాశ్వతమైన మౌలిక ప్రమాణం. మనం చూస్తున్న ప్రకృతి సుమారు 450కోట్ల సంవత్స రాలలో అభివృద్ధి చెందిందని జీవశాస్త్ర చరిత్ర చెబుతోంది.డార్విన్ సిద్ధాంతం ప్రకారం జీవ పరిణామానికి,జీవుల వికాసానికి ప్రకృతి పుట్టినిల్లు. మనం పీల్చేగాలి,తాగేనీరు,తినే ఆహారం, పండిరచే నేల,భూమిలోని ఖనిజాలు,రాయి,కాంతి,ఉష్ణం, చెట్లు,జంతువులు అన్నీప్రకృతిలోభాగాలుగాఉంటూ సమతుల్యతను కాపాడుతున్నాయి.ప్రకృతి మన మనుగడకు తోడ్పడుతూ రోజువారీ జీవన వినియో గానికి ఉపయోగపడే అనేక అవసరాలను నిస్వా ర్థంగా తీరుస్తున్నది. అందుకే ప్రకృతిని తల్లి అని అంటారు.ప్రకృతి మనకు భౌతికావసరాలనే కాకుండా మానసికోల్లాసం, మనశ్శాంతి, మానసిక ఆరోగ్యం,రసాత్మకత అంతిమ ఆనందం ఇవ్వడా నికి ఉపయోగపడుతుంది. ప్రపంచంలో భారతీయ పర్యావరణ సంస్కృతి మహోన్నతమైంది. అనాది నుండి కూడా భారతీయులు ‘ప్రకృతిని ఆవిష్కరిం చుకోవడం ద్వారా మనల్ని మనం ఆవిష్కరించు కోవచ్చు’ అనే నైతిక తాత్విక చింతనను కలిగివుండి ప్రకృతిని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అనే భావనతో ప్రకృతిని ఆరాధిస్తూ, కాపాడుతూ ప్రకృతితో సామరస్య జీవనం గడిపేవారు. కానీ ఈ చరాచర జగత్తులో భాగమైన నేటి ఆధునిక మానవుడు అభివృద్ధి, విలాసవంతమైన జీవితం, శాస్త్ర పురోగతిల నెపంతో నేడు తనతో పాటు ప్రకృతిలో కోట్లాది జీవరాశులున్నాయని, ప్రకృతి సమస్త జీవరాశుల ఉమ్మడి ఆస్తి అనే విచక్షణను కోల్పోయి ప్రకృతిపై దాడి చేస్తూ అడవుల విధ్వం సం,ఆవాసప్రాంతాల విధ్వంసం జీవవైవిధ్య విధ్వం సం లాంటి రకరకాల విధ్వంసాలకు పాల్పడుతు న్నాడు.ఈ కారణంగా ప్రకృతి ప్రమాదంలోకి నెట్టి వేయబడటంతో అసంఖ్యాక వృక్ష, జంతు జాతులు అంతరించిపోతున్నాయి.
జీవించే హక్కును సైతం హరించి వేస్తున్న ప్రకృతి విధ్వంసం అనే సమస్య అణుబాం బు కన్నా ప్రమాదకరమైనదని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి సంరక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచటానికి, సుస్థిరా భివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రపంచ దేశాలన్నీ పూనుకున్నాయి. గత సంవత్సరం ప్రకృతితో సామ రస్య జీవనం గడపటం అనే నినాదంతో నిర్వహిం చగా, ఈ సంవత్సరం 28 జులై 2023 న ఫారెస్ట్స్ అండ్ లైవ్లీ హుడ్ -సస్టేనింగ్ పీపుల్ అండ్ ప్లానేట్ అనే ఇతివృత్తంతో ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సంర క్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ప్రధానంగా అసాధారణ వాతావరణ మార్పులు, భూతాపం,తీవ్రమైన చలి,ఓజోన్ పొర క్షీణత, అడవుల కార్చిచ్చు,సునామీలు,కొండ చరి యలు విరిగిపడటం,ఎల్ నినో,-లానినో పరిస్థి తులు, హీట్ వేవ్స్,తుపానులు,వరదలు, కాలుష్యం, కోవిడ్ -19 లాంటి మహమ్మారి,వ్యాధులు ప్రబల డం వంటి తీవ్ర పర్యావరణసమస్యలు,-పరిష్కార మార్గాలు, సహజ వనరుల సంరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణల గురించి చర్చనీయాంశాలుగా ఉంటా యి.ఈ సందర్భంగా పలు అంతర్జాతీయ పర్యా వరణ పరిరక్షణ సంస్థలతోపాటు జాతీయ పర్యావ రణ పరిరక్షణ సంస్థలు కూడా 2030 సంవత్స రాన్ని మైలు రాయిగా ఎంచుకొని, వారు రూపొంది స్తున్న పలు పరిశోధన అంశాలతో కూడిన పర్యావ రణ వ్యూహాల అమలు, వాటి లక్ష్యసాధనకు పాలకు లు, ప్రజలు సమష్టిగా నిరంతరం కృషి చేయాలని లేనిచో సమీప కాలంలో ప్రకృతి విలయం తప్పదని చేస్తున్న హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోవల సిన అవసరం ఎంతైనా ఉంది. నేచర్-2030ప్రో గ్రామ్ అనేది ఇంట ర్నేషనల్ యూని యన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్‌నేచర్ (ఐయుసియన్) అనే పర్యా వరణసంస్థ ప్రవేశపెట్టిన ఒకబృహత్తర మైన ప్రకృతి సంరక్షణ కార్యక్రమం.ఐయుసియన్ అనేది 1400 లకు పైగా ప్రభుత్వ, పౌరసమాజ సంస్థల సభ్య త్వం,15000 లకు పైగా పర్యావరణ నిపుణులను కలిగిన ప్రపంచంలోని అతిపెద, అత్యంత వైవి ధ్యమైన నెట్‌వర్క్ కలిగిన అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ సంస్థ.దీని ప్రధాన కార్యాలయం స్విట్జ ర్లాండ్‌లో ఉంది.ఈసంస్థ ప్రతినాలుగేండ్లకు ఒక సారి వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ (డబ్ల్యుసిసి) సమావే శాలను నిర్వహిస్తూ ప్రకృతి వనరులు జీవ వైవిధ్య సంరక్షణ, పునరద్ధర ణలే లక్ష్యాలుగా పర్యావరణ వ్యూహాలను రూపొం దిస్తూ ప్రపంచ దేశాలకు మార్గ నిర్దేశనంచేస్తుంది.ఒకే ప్రకృతి,-ఒకే భవిష్య త్తు (వన్ నేచర్-వన్ ఫ్యూచర్) అనే నినాదంతో నేచర్-2030 ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసి 2021-2030 కాలాన్ని ప్రకృతి పునరుద్ధరణ దశాబ్దంగా ప్రకటించింది.2020 తర్వాత వాతావరణ పరిస్థి తులు,గ్లోబల్ డైవర్సిటీ,సుస్థిరాభివృద్ధి అంశాల ప్రాతిపదికన నేచర్-2030 ప్రోగ్రామ్ ఎజెండాను రూపొందించింది.ఈపదేండ్ల కాలవ్యవధిలో 2030 నాటికి భూభాగం నీరు,సముద్రాలు, వాతా వరణం,జీవవైవిధ్యములను,మానవ ఆరోగ్యం, మానవ శ్రేయస్సులతో సమన్వయం చేసి సమగ్ర సుస్థిరాభివృద్ధి దిశగా ప్రోత్సహించడమే ఈప్రోగ్రా మ్ ముఖ్య లక్ష్యం.ఈ ప్రకృతి పరివర్తనాత్మక మార్పుకు రికగ్నైజ్,రిటేయిన్,రిస్టోర్,రిసోర్స్, రికనెక్ట్ అనే ఐదు(5-ఆర్స్) క్రాస్ కటింగ్ వాహ కాలు సహాయకారులుగా ఉపయోగపడుతాయి.