పర్యావరణానికి ప్రాణాధారం కాప్‌-26

భూమిపై జీవజాలం ఉనికికి ప్రమాదకారిగా మారిన వాతావరణమార్పులపై ప్రపంచదేశాలు మరోసారి దృష్టి సారించాయి. స్కాట్‌లాండ్‌ గ్లాస్గో నగరంలో కాన్ఫిరెన్స్‌ ఆఫ్‌ ద పార్టీస్‌(కాప్‌26) సదస్సు ఈ ఏడాది నవంబరులో జరిగింది. పన్నెండు రోజుల (నవంబర్‌ 1నుంచి 12తేదీల మధ్య ) పాటు జరిగిన సదస్సులో 197 దేశాలు పాల్గొన్నాయి. ప్రతిఏటా197దేశాల నుంచి 25వేల మంది ప్రతినిధులు హజరయ్యారు.వాతావరణమార్పులపై యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌ (ఖచీఖీజజజ) ఆధ్వర్యంలో జరిగే కన్వెన్షన్‌ ఇది. పర్యావరణంపై మానవకార్యకలాపాల ప్రభావాన్ని పరిమితం చేయడమేలక్ష్యంగా ప్రపంచంలోని ప్రతిదేశం,ప్రతి భూభాగం అంగీకరించి సంతకం చేసిన అంతర్జాతీయ ఒప్పందం కాప్‌.1994 మార్చి 21న తొలి ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 25 సమావేశాలు జరగ్గా,ఈ ఏడాది జరిగింది26వది.గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా పారిశ్రామిక విప్లవానికి పూర్వం ఉన్న ఉష్ణోగ్రతలు 1.5 సెల్సియస్‌ పెరుగుతున్నాయి.ఈ ఉష్ణోగ్రతలు ఇలా పెరుగుతూ పోతే భూమికి తిరిగి బాగు చేసుకోలేని ప్రమాదాన్ని సృష్టిస్తాయి. ఈసమ్మిట్‌లో కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాలు,వ్యూహాలుసరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అన్నది చర్చించు కోవడానికే ఈ సదస్సును ఏర్పాటు చేశారు. పెట్రోలు,డీజిల్‌,బొగ్గు వంటి శిలాజఇంధనాలను మండిరచడంవల్ల భూమి నానాటికీ వేడెక్కుతోంది.వాతావరణ మార్పులతో ముడిపడిన తీవ్ర వడగాల్పులు,వరదలు,కార్చిచ్చు వంటి విఫత్తుల తీవ్రత పెరుగుతోంది.గడిచిన దశాబ్దం..అత్యంత ఉష్ణమయంగా రికార్డులకెక్కింది.ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల కట్టడికి తక్షణ చర్యలు అవసరమన్న నిపుణుల అభిప్రాయానికి ప్రపంచ నేతలు హజరయ్యారు. కాఫ్‌26 అన్ని వాతావరణ శిఖరాలలో అత్యంత ప్రత్యేకమైనది.సమ్మిట్‌లో కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడానికి యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌ (ఖచీఖీజజజ) గుర్తించిన ప్రణాళికలను అమలు చేశామని యూకే ప్రభుత్వం చెప్పింది.

ఆర్ధికసాయం,పర్యావరణ న్యాయంవంటి అంశాలపై కాఫ్‌26సదస్సులో ఎక్కువగా చర్చించారు.వర్ధమాన దేశాల్లో తలసరి కాలుష్యం తక్కువ.గతంలో వెలువడిన కర్బనఉద్గారాలకు చాలా వరకూ ఈ దేశాలు కారణం కాదు.అయినా ఆ దుష్ప్రభవాలను అవి ఎదుర్కొవాల్సి వస్తోంది. స్వీయ ఉద్గారాలను తగ్గించుకోవడానికి,విఫత్తులను తట్టుకునే మౌలిక వసతులను నిర్మించుకోవడానికి ఈ దేశాలకు డబ్బు అవసరం. ఈనేపథ్యంలో2020నాటికి పేద దేశాలకు ఏటావంద బిలియన్‌ డాలర్ల మేర పరిహారం ఇస్తామని 2009లో ధనిక దేశాలు హామి ఇచ్చాయని భారత్‌ పేర్కొంది. కార్బన్‌క్రెడిట్‌ మార్కెట్లను పునురుజ్జీవింపచేయాలి.మా పరిశ్రమలను సులువుగా ఉపయోగించుకోగలిగేలా శుద్ద పరిజ్ఞానాలను అందుబాటులో ఉండాలి. 2025 తర్వాత చేయాల్సిన దీర్ఘకాల వాతావరణ ఆర్ధికసాయంపై దృష్టి పెట్టాలి. అంతర్జాతీయ సౌర సంకీర్ణం వంటి వాతావరణ సంబంధ కూటములను బలోపేతం చేయాలని భారత్‌ డిమాండ్‌ చేసింది.

ఉత్తరధ్రవం నుంచి దక్షిణ ధ్రువం వరకు భూగోళంవేడెక్కిపోతుంది.ఆర్కిటెక్‌,అంటార్కిటికాల్లో హిమాలయాల్లో.. హిమానీ నదాల్లో మంచు వేగంగాకరిగిపోతుంది. సముద్రాల్లో నీటి మట్టాలు పెరుగుతూ తీరప్రాంతాలను కోతకు గురిచేస్తున్నాయి. భారత్‌పైనా తీవ్ర ప్రభావం పడిరది. సమీపంలోని థార్‌ నుంచి కాక దూరాన ఉన్న సౌదీ ఆరేబియా నుంచి కూడా ఎడారి దుమ్ముధూళి హిమాలయాలపైకి వచ్చిపడి వేగంగా మంచుకరిగిపోతోందని తాజా అధ్యయనం తేల్చిచెప్పింది. ఢల్లీి తదితర నగరాల నుంచి కూడా దుమ్ముకణాలు ఎగిరివస్తున్నాయి. ఆసియాఖండ వాతావరణ సమతుల్యతకు హిమాలయాలే ఆయువుపట్టు.సరిగ్గా దాని మీదే భూతాపం దెబ్బకొడుతోంది.ఉత్తరాఖండ్‌లో ఈ ఏడాది హిమానీ నదులు కరిగి మెరుపు వరదులు వచ్చి రెండు ఆనకట్టలు కొట్టుకుపోయాయి. హిమచల్‌ ప్రదేశ్‌,జమ్మూకాశ్మీర్‌లో ఉన్నట్టుండి ఆకాశానికి చిల్లు పడినట్లు ఆకస్మిక కుంభవృష్టి,వరదులు సంభ వించాయి. ఎండాకాలంలో భానుడి భగభగలు ఏటేటా అధికమవుతున్నాయి. బంగాళాఖాతం,ఆరేబియా సముద్రాలలో పుట్టుకొచ్చే తుఫానులు,వాయుగుండాల సంఖ్య,అవి కలిగించే నష్టం నానాటీకీ పెరిగిపోతుందని భారత్‌ తెలియజేయడం విశేషం.
-రెబ్బాపగ్రడ రవి,ఎడిటర్‌