పని హక్కును ప్రాధమిక హక్కుగా గుర్తించాలి
నిరుద్యోగ సైన్యం ఎంత ఎక్కువగా వుంటే పెట్టుబడిదారీ విధానంలో అంత దోపిడీ చేయవచ్చు. వంద మంది కార్మికులు జీతాలు పెం చాలని అడిగితే రెండు వందల మంది ఇంకా చౌకగా పని చేస్తామనే విధంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో అమలు జరుగు తుంది.దేశంలోని ప్రజలందరికీ చదువు చెప్పాలంటే కోట్లాది మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు దొరుకుతాయి. ప్రజలం దరికీ వైద్యం సమకూర్చాలంటే అనేక కోట్ల మందికి ఉద్యోగాలొస్తాయి. కానీ పెట్టుబడిదారీ విధా నంలో ప్రజలందరికీ కనీస సౌకర్యాలు కల్పించడానికి పాలకవర్గం ప్రయత్నించదు.
ఉపాధి కల్పించడమంటే యువతీ, యువకులను దేశ సంపద సృష్టికర్తల్లో భాగస్వాములుగా చేయ డం.వారి శారీరక,మానసిక శక్తిని ఉపయోగించు కోవడం.‘నేను పని చేస్తాను. నాకు పని కల్పించండి’ అని అడిగితే పని కల్పించలేని స్థితిలో ప్రభుత్వాలు వుండడం దేశాభివృద్ధికి,సౌభాగ్యానికి హానికరం. ఒకప్పుడు అత్యంత వెనుకబడిన దేశంగా వున్న చైనా నేడు అమెరికాతో ఢ కొట్టగలుగుతుందంటే ఆదేశ మానవ శక్తిని ఉపయోగించుకోవడమే కార ణం.‘నేటి భారతదేశం’అనే పుస్తకంలో రజనీ పామే దత్ చెప్పినట్లుగా ఒకమనిషికి నోరు మాత్రమే వుండదు. రెండు కాళ్లు, రెండు చేతులు వుంటాయి. ఒక మనిషి సంపదను సృష్టించి పది మందికి పెట్టగలిగిన ఆధునిక పరిజ్ఞానం నేడు పెరిగింది. పెట్టుబడిదారీ వ్యవస్థలో పెరిగిన ఆధునిక పరిజ్ఞా నాన్ని తమ లాభాల పెంపుదలకు పెట్టుబడిదా రులు ఉపయోగించుకుంటున్నారు. మానవ వనరు లు పుష్కలంగా వున్న భారతదేశంలో రోబోట్లను ఉపయోగించడమంటే ఇదే. పెట్టుబడిదారులు తమ లాభాల కోసమే యువతీ, యువకులను నిరుద్యోగు లుగా చేసి రోబోట్ వంటి యంత్రాలను ప్రోత్సహి స్తున్నారు. ఇదిపెట్టుబడిదారీ విధాన సహజ లక్ష ణం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవాలి. ఆసౌకర్యం ప్రజలకు కల్పిం చి,పని గంటలు తగ్గించాలి. విశ్రాంతి పెంచాలి. కానీ కాలుష్య కోరల్లోని రసాయన పరిశ్రమల్లో మనుషులతో విషాన్ని మింగించే ఎరువులు, రసా యన కంపెనీల్లో కూడా రోజుకు 8నుంచి12 గంట లు పని చేయిస్తున్నారు. సోషలిస్టు దేశాల్లో ఇటు వంటి పరిశ్రమల్లో వారానికి ఐదురోజులు, రోజుకు ఆరుగంటలు మాత్రమే పని కల్పించే పద్ధతి వుంది. మనుషుల ప్రాణాలకు సోషలిస్టు దేశాల్లో విలువ వుంటుంది.
కరోనా సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రజలందరికీ టీకాలు ఇవ్వడంలో తాత్సారం చేసింది. కరోనాతో 2021జూన్ 26నాటికి3.94లక్షల మంది ప్రాణా లు కోల్పోయారు. కరోనా మొదటి దశలో మిలట్రీ కర్ఫ్యూలా దేశమంతా లాక్డౌన్ విధించడంతో లక్షలాది మంది వలస కార్మికులు వేల కిలోమీటర్లు మూటా ముల్లే నెత్తిన పెట్టుకొని సొంత గ్రామాలకు కాలిబాట పట్టారు. దారిలో వేలాది మంది మర ణించారు. అంతేకాకుండా ప్రభుత్వ లెక్కల ప్రకా రం కరోనా కాలంలో 7.7 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఏప్రిల్, మే నెలలో 2.2 కోట్లమంది ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగం 12 శాతం పెరిగింది. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రా ల్లో నిరుద్యోగ సమస్యను 20ఏళ్లలో పరిష్కరిం చాలని ఆదేశించారు. 20 ఏళ్ల తరువాత నిరుద్యోగ సమస్య రెట్టింపు అయింది. 75 ఏళ్ల స్వాతంత్య్రా నంతరం నిరుద్యోగం అనేక రెట్లు పెరిగింది తప్ప తగ్గలేదు. కారల్‌మార్క్స్ చెప్పినట్లు పెట్టుబడిదారీ విధానం ఉన్నంతకాలం నిరుద్యోగ సమస్య కొనసా గుతుంది. నిరుద్యోగ సైన్యం ఎంత ఎక్కువగా వుంటే పెట్టుబడిదారీ విధానంలో అంత దోపిడీ చేయ వచ్చు. వంద మంది కార్మికులు జీతాలు పెంచాలని అడిగితే రెండు వందల మంది ఇంకా చౌకగా పని చేస్తామనే విధంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో అమలు జరుగుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో కూడా ఉపాధి అవకాశాలు మెండుగా వుంటాయి. కానీ పాలకవర్గం ఈ అవకాశాలు కల్పించదు. దేశంలోని ప్రజలందరికీ చదువు చెప్పాలంటే కోట్లా ది మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు దొరుకుతాయి. ప్రజలందరికీ వైద్యం సమకూర్చాలంటే అనేక కోట్ల మందికి ఉద్యోగాలొస్తాయి. కానీ పెట్టుబడిదారీ విధానంలో ప్రజలందరికీ కనీస సౌకర్యాలు కల్పించడానికి పాలకవర్గం ప్రయత్నించదు. ప్రజల సంక్షేమం కంటే తమ లాభాలకు ప్రాధాన్యత ఇస్తారు.‘లియాంటివ్’ అర్థశాస్త్రంలో చెప్పినట్లు దేశంలో బొగ్గు ఉత్పత్తి అధికంగా వుంటుంది. బొగ్గుల ఉత్పత్తి ఎక్కువగా జరిగింది కాబట్టి బొగ్గు గనుల కార్మికులను పనిలో నుంచి తొలగిస్తారు. దాంతో కార్మిక కుటుంబం కనీసం చలి కూడా కాచుకోలేక చనిపోతుంది. ఇది పెట్టుబడిదారీ వ్య వస్థ నిజ స్వరూపం. అందుకే ఆర్థిక సంక్షోభాలు ప్రతీ పదేళ్లకు కొనసాగుతూనే వుంటాయి. సోష లిస్టు వ్యవస్థ దీనికి పూర్తి భిన్నం. సోషలిస్టు దేశాల్లో ‘పని హక్కు’ ప్రాథమిక హక్కుగా వుంటుంది. ప్రతి ఒక్కరికీ ఉచితవిద్య ప్రభుత్వమే అందిస్తుంది. 18 ఏళ్లు నిండిన తరువాత అందరికీ ఉపాధి కల్పి స్తుంది. పని హక్కు కల్పించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత. ఓటుహక్కు, భావ ప్రకటనా హక్కు వలె పని కూడా ఒకప్రాథమిక హక్కు. ప్రపంచంలో 143కోట్ల జనాభా కల్గిన చైనాలో గానీ, చిన్న దేశాలైన క్యూబా,వియత్నాం లోగానీ నిరుద్యోగ సమస్య వుండదు. అందరికీ ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పిస్తుంది. క్యూబా 95 శాతం ప్రభుత్వరంగం లోనూ,5శాతం కోఆపరేటివ్ రంగంలోనూ ఉపాధి కల్పించింది. ఉచిత విద్య, వైద్యం, ఇంటి సౌకర్యం నామమాత్రపు రేట్లతో ప్రభుత్వమే కల్పించడం వల్ల ప్రజలపై భారాలు ఉండవు. ఒకప్పుడు రష్యా తో సహా తూర్పు జర్మనీ వరకు యూరప్ ఖండంలో నిరుద్యోగ సమస్య వుండేది కాదు. 1991తరు వాత పెట్టుబడిదారీ విధానం తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత స్పెయిన్,గ్రీస్ దేశాల్లో 25 నుంచి 30 శాతం వరకు నిరుద్యోగం పెరిగింది. అమెరికా లాంటి అత్యాధునిక దేశాల్లో సైతం నిరుద్యోగం 9శాతం వరకు పెరిగింది. ఇప్పటివరకు ప్రభుత్వ రంగం బలోపేతంగా వుండడం వల్ల ఆర్థిక సంక్షోభ ప్రభావం భారతదేశంలో తగినంతగా లేదు. అయి నా నిరుద్యోగం నేడు విలయతాండవం చేస్తున్నది. డిగ్రీ, పీజీ లు చేసిన వారు బంట్రోతు ఉద్యోగాల కోసం ఎగబడుతున్నారు. అతితక్కువ వేతనం లభించే చిరు ఉద్యోగాలకు లక్షల్లో దరఖాస్తులు చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 18న జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు కల్పించిందీ,వచ్చే ఏడాదిఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పడం మంచిదే. కానీ లేని ఉద్యోగాలు ఇచ్చినట్లు కాకిలెక్కలు చెప్పడం సరైనది కాదు. దశాబ్దాల క్రితం నుంచి ఆర్టిసి పర్మినెంట్ కార్మికులకు కొత్తగా ఉద్యోగాలు ఇచ్చి నట్లు లెక్కల్లో చూపించడం తప్పు. భర్తీ చేసినట్లు చెప్పిన6,03,756ఉద్యోగాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యో గులు3,99,791మంది వున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ ఉద్యోగుల భర్తీలో చూప డం అన్యాయం. మున్సిపల్, విద్యుత్ రంగాల్లోని కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ కార్మికులను…ఎ.పి కాం ట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ 93 వేల మందికి పైగా కార్మికులను పర్మినెంట్ కార్మికులుగా చూపిం చడం ఆశ్చర్యకరం. రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినట్లుగా ఉద్యోగాల విప్లవం వస్తుందన్న మాటలు బూటకమని రుజువైంది. గత ప్రభుత్వం ఖాళీలు నింపని ప్రభుత్వ ఉద్యోగాలను ఈ క్యాలెండర్లో ప్రకటించలేదు. ఆఖాళీలు హుష్ కాకి అయ్యాయి. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగం, రైల్వేలోని లక్షలాది ఖాళీఉద్యోగాలను రద్దు చేస్తున్నది. ఒకవేళ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలుపై ఉద్యోగాలన్నీ పర్మినెంట్ ఉద్యోగాలు కల్పించినా, భారతదేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. నిరుద్యోగ సమస్యను పెట్టుబడిదారీ విధానం పరిష్క రించదు. కార్మికవర్గం నిరుద్యోగానికి వ్యతిరేకంగా పోరాడాలి. తొలగించబడిన, ఉపాధి కోల్పోయిన కార్మికుల గురించే ట్రేడ్ యూనియన్లు పోరాడుతు న్నాయి. ఇది సరికాదు. రాజ్యాంగం లోని ప్రాథమిక హక్కుగా గుర్తించి నిరుద్యోగ యువతీ, యువకు లందరికీ పని హక్కు కల్పించేలా పోరాడాలి. అప్పుడే నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం. యువతీ,యువకులు నేడు జరుపుతున్న పోరాటానికి కార్మికవర్గం చేతులు కలపాలి. కార్మికవర్గం అండ వున్నప్పుడే యువతీ, యువకుల పోరాటం మరింత ముందుకు సాగుతుంది. ఇది కార్మికవర్గం బాధ్యత.
ఉపాధిపై కరోనా మహమ్మారి వేటు
కరోనాతో దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరగడమేగాక అనేకమంది జీవనోపాధి కోల్పోయి నట్లు సర్వేలు చెబుతున్నాయి. మహమ్మారి రెండో దశ విజృంభణతో ఆర్థికకార్యకలాపాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ఫలితంగా ఉత్పాదకత, సేవా రంగాలు తీవ్రంగా ప్రభావితమై..ఉద్యోగార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.కరోనా సంక్షోభంలో అనేక సంస్థలు ఆర్థిక ఒడుదొడుకులను ఎదుర్కొంటూ, తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. భారాన్ని తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిం చడం, వేతనాల్లో కోత విధించడంవంటి చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే దేశాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు-ఈ పరిస్థితి ఆజ్యం పోస్తోంది. ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చడానికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కొన్ని నిత్యావసర సరకులను అంద జేస్తున్నప్పటికీ,అవి అందరికీ సరిపోవడంలేదు. పిల్లల చదువులు, వైద్య ఖర్చులు వంటి అవసరా లకు సరిపడా ఆర్థిక వనరులు లేక తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కొన్ని నెలలుగా మెల్లగా కోలుకుం టున్న ఉపాధిరంగంపై-కొవిడ్ రెండో దశ వ్యాప్తి తో తీవ్ర ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. అనేక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న కఠినతరమైన కొవిడ్ నిబంధనలు, పాక్షిక లాక్డౌన్లతో నిరుద్యోగం కనీసం పదిశాతం మేర పెరిగినట్లు అనేక అధ్యయ నాలు వెల్లడిస్తున్నాయి.నైపుణ్య శిక్షణ అవసరం అసంఘటిత రంగంలో పనిచేసే లక్షలాది ప్రజల ఆర్థిక పరిస్థితిలో గతఏడాది కాలంగా పురోగతి లేకపోగా, తిరోగమనం కనిపిస్తోంది. కేంద్ర కార్మిక శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది మార్చి తొమ్మిదో తేదీ వరకు ఉద్యోగ అవకాశాలను ప్రోత్సహిం చడానికి ప్రారంభించిన ఆత్మనిర్భర్ భారత్ ద్వారా సుమారు 16.5లక్షల మంది కార్మికులు లబ్ధి పొం దారు. పీఎంజీకేవై కింద38.82లక్షల మంది ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాల్లో రూ.2,567.66 కోట్లు జమ చేసినట్లు ప్రకటించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం సైతం కరోనా కష్టకాలంలో గ్రామీణ ప్రాంతప్రజలకు ఉపాధి కల్పించడంలో కీలకపాత్ర పోషించింది. ఈ పథ కం ద్వారా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పెద్ద యెత్తున చేపడితే నిరుద్యోగ సమస్యను కొంతవరకు ఎదుర్కోవచ్చు.‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండి యన్ ఎకానమీ’ అంచనాల ప్రకారం భారత్‌లో 4.40 కోట్లమంది నిరుద్యోగులు ఉన్నారు. వీరిలో 2.80కోట్ల మంది ఉపాధి కోసం నిత్యం ప్రయత్నా లు చేస్తున్నారు. మిగతావారు ఉపాధిని కోరుకుం టున్నా దానికోసం తీవ్రంగా ప్రయత్నించడంలేదు. ప్రస్తుతం ఉన్న నిరుద్యోగుల్లో 3.80కోట్లమంది యువకులే. పట్టణాలనుంచి గ్రామాలకు వెళ్లే శ్రామికుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండటంతో నిరుద్యోగ సమస్య మరింత జటిల మయ్యే ప్రమాదమూ ఉంది.ఈ సంక్షోభ సమ యంలో నిరుద్యోగులను ఆదుకోవడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉంది. నిరుద్యోగ సమస్య పెరిగేకొద్దీ దేశంలో నేరాలూ పెచ్చరిల్లడం సహజం. ఉపాధి కల్పనపై దృష్టి సారించడం ద్వారా శాంతిభద్రతల సమస్య లనూ గణనీయంగా తగ్గించవచ్చు. ప్రభుత్వ శాఖల్లో అన్ని రకాల ఉద్యోగాల ఖాళీలనూ వేగంగా భర్తీ చేయా ల్సిన అవసరం ఉంది. ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనకు అవసరమైన ప్రోత్సాహకాలను ఇవ్వాలి. స్వయం ఉపాధి కోసం ప్రయత్నించే నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందించాలి. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, శిక్షణను కల్పించాలి. నిరుద్యోగ సమస్యను పరిష్కరించ డానికి స్వయం ఉపాధికోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై విస్తృతమైన అవగాహన కల్పించా ల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. స్థానిక సంస్థలకు కీలక బాధ్యతలు అప్పగించి, స్వయం ఉపాధిని పెంపొందించే పనులకు పెద్ద పీట వేయాలి. నూతన ఆవిష్కరణలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. పట్టణ, గ్రామీణ మానవ వనరులను పూర్తిస్థాయిలో విని యోగించుకోవాలి.ఉపాధి కల్పన పెరిగితే దేశ ఆర్థికాభివృద్ధి రేటు సైతం ఆశించినదానికన్నా మెరు గ్గా ఉంటుంది. వలస కార్మికులకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాల్ని స్థానిక ప్రభుత్వాలు విధిగా నమోదు చేసి, ప్రభుత్వ రికార్డుల్లో పొందుపరచాలి. దీనివల్ల శ్రామికులకు అవసరమైన సహాయాన్ని నేరుగా అందించడానికి అవకాశం ఉంటుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరకులు అందరికీ అందేలా చూడాలి.సరఫరా పెంచాలిగత సంవత్సరం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి- జన్‌ధన్ ఖాతా కలిగిన మహిళలకు ఆర్థిక సహా యాన్ని ప్రకటించినట్లుగానే.. ఇప్పుడూ ఆర్థిక సహా యాన్ని సమకూర్చాలి. ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి పెద్దయెత్తున ఆర్థిక వనరులను కూడగట్టాల్సి ఉంటుంది. కరోనా కష్టకాలంలో ప్రజాసంక్షేమం కోసం ఖర్చు చేయడమే పరమావధి కావాలి. ప్రభుత్వ ఖర్చు పెరగడంవల్ల లోటు పెరిగి పోయినప్పటికీ, నేటి పరిస్థితుల దృష్ట్యా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అందుకే ప్రభుత్వం ఉపాధి కల్పన కార్యక్రమాలకు పెద్దయెత్తున శ్రీకారం చుట్టాలి.కొవిడ్ వ్యాక్సిన్‌కు తీవ్రంగా కొరత ఉన్నందువల్ల- టీకాల సరఫరాను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ టీకా వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ రంగం, కొన్ని ప్రైవేటు కంపెనీలు దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు, ప్రజల్లో ధైర్యాన్ని పాదుగొల్పేందుకు పరస్పర సహకారంతో ముందుకు వెళుతున్నాయి. ప్రణాళికాబద్ధంగా ఉపాధి కల్పన, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు అమలు జరిగినప్పుడే ప్రజలు భవిష్యత్తుపై భరోసాతో ఉంటారు. దానివల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటానికీ ఆస్కారం ఉంది.
సమస్య ఎంత తీవ్రంగా ఉందో వెల్లడిరచిన (జవీIజు)
భారత్‌లో నిరుద్యోగ సమస్య ప్రస్తావన వచ్చిన ప్రతీసారి ప్రధాని మోదీ తమ ప్రభుత్వం చాలానే చేసిందని చెబుతున్నారు. ఉపాధి, ఉద్యోగ రంగాల్లో భారత్ పురోగమిస్తోందని..గత నాలుగేళ్ల లో 6లక్షల మంది ప్రొఫెషనల్స్ ఉపాధి పొందారని ఇటీవల వెల్లడిరచారు. అయితే వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని సర్వేలు,పలు నివేది కలు చెబుతున్నాయి. భారత్‌లో నిరుద్యోగ సమస్య ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ప్రభుత్వ శాఖల్లో ఏచిన్న అటెండర్ పోస్టుకు నోటిఫి కేషన్ విడుదలైనా..పీజీలు,పీహెచ్‌డీలు చేసిన వారు కూడా దరఖాస్తులు చేసుకుంటున్న పరిస్థితి. దేశం లో నిరుద్యోగానికి సంబంధించి సెంటర్ ఫర్ మాని టరింగ్ ఇండియన్ ఎకానమీ(జవీIజు) సంస్థ తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడిరచింది.2016 సెప్టెం బర్ నుంచి ఇప్పటివరకు నమోదైన నిరుద్యోగ రేటును పరిశీలిస్తే..ఫిబ్రవరిలో అత్యధికంగా 7.2 శాతం నిరుద్యోగ రేటు నమోదైంది. గతేడాది 2018, ఫిబ్రవరి నెలలోనిరుద్యోగ రేటు 5.9 శా తం ఉండగా ఇప్పుడది మరింత పెరిగింది. దేశ వ్యాప్తంగా కొన్నివేల ఇళ్లనుంచి సేకరించిన సమా చారం ప్రకారం.. ఈసర్వే నివేదికను తయారు చేసినట్టు (జవీIజు) తెలిపింది.ముంబైలోని థింక్ ట్యాంక్ సంస్థ ఛైర్మన్ మహేష్‌వ్యాస్ తెలిపిన వివ రాల ప్రకారం..గతేడాది ఫిబ్రవరి నాటికి ఇండి యాలో 406 మిలియన్ల ఉద్యోగస్తులు ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అది 400 మిలియన్లకే పరిమితమైంది. భారత్‌లో నిరుద్యోగ సమస్య ప్రస్తావన వచ్చిన ప్రతీసారి ప్రధాని మోదీ తమ ప్రభుత్వం చాలానే చేసిందని చెబుతున్నారు. ఉపాధి,ఉద్యోగ రంగాల్లో భారత్ పురోగమి స్తోం దని.. గతనాలుగేళ్లలో 6లక్షల మంది ప్రొఫెషన ల్స్ ఉపాధి పొందారని ఇటీవల వెల్లడిరచారు. అయితే వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని సర్వేలు,పలు నివేదికలు చెబుతున్నాయి. నిరుద్యోగానికి సంబంధించి కొన్ని వారాల క్రితం ఓవార్తా పత్రిక కొన్ని లెక్కలను బయటపెట్టింది. అయితే అధికారులు మాత్రం దాన్ని కొట్టిపారేశారు. సదరు పత్రిక బయటపెట్టిన వివరాల ప్రకారం.. దేశంలో గత45ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 2017-18లో నిరుద్యోగ సమస్య తీవ్రమైంది. జవనవరిలో (జవీIజు) విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం..పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు తర్వాత 2018లో దాదాపు 11మిలియన్ల మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు.
ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. నోట్ల రద్దు ప్రభావం ఉద్యోగా లు, చిన్న తరహా పరిశ్రమలపై ఎలాంటి ప్రభావం చూపించిందన్న దానికి సంబంధించి తమవద్ద ఎలాంటి డేటా లేదని గతనెలలో ప్రభుత్వం ప్రక టించింది.-(సిహెచ్. నర్సింగరావు /డాక్టర్ చిట్టెడి కృష్ణారెడ్డి)