పట్నం..పల్లెలు..కన్నీటిమయం
వర్షం విలయం సృష్టించింది.మిన్నుమన్నూ ఏకమైనట్టుగా కుంభవృష్టి కురడంతో విజయ వాడలో జనజీవనం అతలాకుత లమైంది. వానలకు వాగులు,వంకలు పొంగిపోర్లి కాలనీల్లోని లోతట్టు ప్రాంతా లను ముంచెత్తాయి. పధానంగా విజయ వాడ నగరపాలక సంస్థలకు భారీ నష్టం వాటిల్లింది.నగర శివారు ప్రాంతాలు, పలు కాలనీలు నీట మునిగాయి.నగరానికి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. బుడ మేరు ప్రభావిత ప్రాంతాలు, కాలనీలు, చెరువులను తలపిస్తున్నాయి.శివారు ప్రాంతాలవారు పడవల్లో ప్రయాణిస్తున్నారు. పల్లపు ప్రాంతాల్లో దాదాపు 5`7అడుగుల మేర వరదనీరు చేరగా,ప్రధాన, అంతర్గత రహదారులపై నాలుగు అడుగల ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది.ప్రజలు బయటకు వచ్చేందుకు అవకాశం లేక,నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు వీలులేక బిక్కుబిక్కుమని ఇళ్లలోనే కాలం గడుపుతు న్నారు. వరదనీరు పెరుగుతూ ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ చేరడంతో విద్యుత్తు సరఫరా ఆపేశారు. దీంతో అనేక ప్రాంతాలు చీకట్లో మగ్గుతున్నాయి.ఎత్తయిన భవనాల్లో చిక్కుకు పోయినవారు సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నారు. మంత్రులు, అధికారులు ప్రతిక్షణం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూనే ఉన్నారు.సహాయక చర్యలు ఆశాజనకంగా లేక ఆందోళన చెందుతున్నారు.చాలామంది ఇళ్లలోనే ఉండ పోియి అవస్థలు పడుతున్నారు.
భారీ వర్షాలకు విజయవాడ అస్తవ్యస్తం అయ్యింది. వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు.గత 30ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా విజయవాడలో రికార్డ్ వర్షపాతం నమో దైంది.బుడమేరు పొంగడంతో పలు కాలనీలు నీట మునిగాయి.నగరంలో రికార్డు స్థాయిలో వర్ష పాతం నమోదైంది.ఒక్క రోజే 29సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలి పింది.భారీ వర్షాలకు నగర జీవనం అస్తవ్యస్తం అయ్యింది. కాలనీలు,ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచి పోయింది.బాధితులు సాయం కోసం ఎదురుచూ స్తున్నారు.విజయవాడను వరదనీరు ముంచెత్తింది. బుడమేరు ఉప్పొంగుతోంది.దీంతో బడమేరు 11 గేట్లు ఎత్తివేశారు.కవులూరు వద్ద బుడమేరు కట్ట తెగి వరదనీరు కాలనీల్లోకి ప్రవేశిస్తుంది.
రికార్డు స్థాయిలో వర్షాలు
విజయవాడ నగరంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. దీంతో 30ఏళ్ల రికార్డు బద్దలైంది. చరి త్రలో ఎన్నడూ లేనంతగా..ఒకేరోజు (ఆగస్టు 31 శనివారం) 29సెంటి మీటర్ల వర్షపాతం నమో దైంది.అనేక కాలనీల్లో నాలుగు అడుగుల మేర నీరు నిలిచింది.ఆటోనగర్ నుంచి బెంజి సర్కిల్ వరకు వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. సెప్టెంబర్ 1న కూడా బెజవాడలో భారీవర్షాలు కురువడంతో బెజవాడ గజగజ వణికిపోతోంది.
ముంపులో కాలనీలు :విజయవాడ,గుంటూరు నగరాల్లో అనేక కాలనీలువరద నీటిలో నాను తున్నాయి.అపార్ట్‌మెంట్లసెల్లార్లలోకి వర్షపు నీరు చేరి,ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం కాలు బయటపెట్టలేని పరిస్థితి నెల కొంది.నగర శివార్లలోని కండ్రిగ వద్ద రహ దారిపై భారీగా నీరు నిలవడంతో విజయవాడ-నూజివీడు మధ్య రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నున్న ప్రాంతంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది నివాసాలు నీటము నిగాయి.రైల్వేట్రాక్ అండ ర్‌పాస్ వద్ద 4బస్సులు నీట మునగగా క్రేన్ల సాయంతో అధికారులు… బస్సులను బయటకు తీశారు.మైలవరంలో వెలగలేరు గేట్లుఎత్తి వేశారు.దీంతో చుట్టుపక్కల కాలనీ ల్లోకి వరద నీరు చేరింది.రాజరాజేశ్వరి పేట వరద నీటిలో చిక్కుకుంది.
బుడమేరు ఉగ్రరూపం
సరిగ్గా20ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపునకు గురైంది.వాగులు,వంకలు ఆక్రమ ణకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని మరోసారి రుజువైంది.20ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్థాంతరంగా నిలిచిపోవడంతో నేడు దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు.20 ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని వేగం గా విస్తరించడం,బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. విజయవాడ నగరానికి పక్కగా ప్రవహించే కృష్ణానది కంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతోదశాబ్దాలుగా దానికి ముప్పు పొంచి ఉంది.2005లో చివరి సారి బుడమేరు బెజ వాడ పుట్టిముంచింది.2005సెప్టెంబర్‌లో వచ్చి న భారీ వర్షాలతో నగరం అతలాకు తలమైంది. విజయవాడ మూడొంతులు ముంపు నకు గురైంది. వరదల కారణంగా విజయవాడ లో కార్పొరేషన్ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి. దీనికి ప్రధాన కారణం బుడమేరు ఉగ్రరూపం తో ప్రవహించడమే. రికార్డు స్థాయిలో ఎగువన ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్త డంతో అదంతా విజయవాడను ముం చెత్తింది. తాజాగా బుడమేరు పొంగడంతో సింగ్‌నగర్, చిట్టీనగర్,ఇతర కాలనీలు జలది గ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై 5అడుగుల మేర నీరు నిలిచిపోయింది.
ప్రకాశం బ్యారేజీ
కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 7,69,443 క్యూసెక్కులు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.వాగులు, వంకలు పొంగిపోర్లుతాయని,ప్రజలు అప్రమ త్తంగా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమ త్తంగా ఉండాలన్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
రాజధాని ప్రాంతం
అమరావతి ప్రాంతంలో వరద నీరు చేసింది. చాలా ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. కరకట్ట సమీపంలోకి వరదనీరు చేరుతోంది. హైకోర్టుమార్గంలో వరదనీరు చేరింది.విజయ వాడలో గత రెండు రోజులుగా కురిసిన కుండ పోత వర్షాలకు రోడ్లు చెరువులను తలపి స్తున్నా యి. మురుగు నీరురోడ్లపై ప్రవహిస్తోంది. వరద నీటిలో కార్లు,ద్విచక్రవాహనాలుకొట్టుకు పోయా యి. 30ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విజయ వాడ విలవిల్లాడిరది.పాతబస్తీ,బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు,జాతీయ రహదారి,ఆటో నగర్ లో భారీ వరద పోటెత్తింది.విజయవాడ సమీ పంలోని జాతీయరహదారుల నీటిలో చిక్కు కుపోయాయి.
మొగల్రాజపురం ప్రమాదం
విజయవాడలోని మొగల్రాజపురం వద్ద ఆగస్టు 31న కొండచరియల విరిగిపడ్డాయి. ఈ ఘట నలో ఐదుగురు మృతి చెందారు. అధికారులు శిథిలాలను తొలగిస్తున్నారు.పడిపోయిన కొండ రాళ్లను డ్రిల్లింగ్ చేసి, భారీ క్రేన్లతో శిథిలాల తొల గింపు ప్రక్రియ చేపట్టారు. భారీ వర్షాల కారణంగా కొండ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.మొగల్రాజపురం మృ తుల కుటుంబాలకు ప్రభుత్వంరూ.5లక్షల పరిహారం ప్రకటించింది.
ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండ చరియలు
విజయవాడలో భారీ వర్షాలకు ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ప్రొటోకాల్ ఆఫీస్,డోనర్ సెల్ ధ్వం సం అయ్యాయి.ఈప్రదేశంలో భక్తులు లేకపో వడంతో ప్రమాదం తప్పింది. భారీ వర్షానికి ఘాట్ రోడ్‌లో పలుచోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఘాట్‌రోడ్‌ను మూసివేశారు.
రాయనపాడు ఘటన
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభా వంతో ఏపీలోభారీ నుంచి అతిభారీ వర్షాలు కురు స్తున్నాయి. ఎక్కడ చూసిన వరద నీటిలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విజయవాడ లోని బుడమేరు వాగు పొంగటంతో నగర ఔటర్ పరిధిలో ఉన్నరాయనపాడు రైల్వేస్టేషన్‌లోకి భారీ గా వరదనీరువచ్చిచేరింది రైల్వేస్టేషన్‌లో ఉన్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలిం చారు.ఆరో బెటాలియన్ ఎస్డీఆర్‌ఎఫ్ రెస్కూ టీమ్ రంగంలోకి దిగిసహాయక చర్యలను చేప ట్టింది.రాయనపాడులో నిలిచి పోయిన తమిళ నాడు ఎక్స్ ప్రెస్‌లోని ప్రయాణికులను రక్షించి, విజయవాడస్టేషన్‌కు తరలించారు. ప్రయాణికు లను ప్రత్యేక రైలులో తమిళనాడుకు తరలి స్తున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సిఎంపర్యటన
విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అంద రికీ సాయం అందు తుందని చంద్రబాబు వివ రించారు.సీఎం మాట్లాడారు.ఈ క్రమం లోనే వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు బోట్స్ చేరుకున్నాయి.వీటి ద్వారా సింగ్‌నగర్ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ చేశారు. మరో వైపు ఇళ్ల నుంచి బాధితులను బయటకు తెచ్చే పనులు వేగవంతమయ్యాయి.మరోవైపు ప్రైవేట్ హోటల్స్,దుర్గగుడి,అక్షయపాత్రల ద్వారా ప్రభుత్వం ఆహారం సమకూర్చింది. నిరంతర పర్య వేక్షణతో అధికారులుఆహారం సిద్దం చేసి పంపిణీ చేపట్టారు.ఎవ్వరూ ఆందోళన చెందా ల్సిన అవసరం లేదని,అందరికీ సాయం అందు తుందని పేర్కొన్నారు.మూడు పూటలా బాధితు లకు ఆహారం అందించాలని చెప్పారు.చిన్నా రులు,గర్భిణులను పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు.ఒకేప్రాంతంలో కా కుండా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లా లన్నారు. -గునపర్తి సైమన్