నైపుణ్యం గల యువతతోనే ప్రపంచాభివృద్ధి
మానవుడు ఆదిమకాలం నుంచి శ్రమ ద్వారా నేటి కంప్యూటర్ యుగం తాజాగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) దాకా ప్రయాణం సాగిస్తున్నాడు. శ్రమకు ఆలోచనతో, సృజనాత్మకతతో, నైపుణ్యం జోడిరచడం ద్వారా మాత్రమే ఇంతటి ముందడుగు సాధించగలిగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. నేటి పోటీ ప్రపంచంలో రాణించాలన్నా, నిలబడాలన్నా తప్పకుండా స్కిల్స్ ఉండాల్సిందే. ప్రపంచదేశాల్లో ఎక్కడాలేని యువశక్తి మన దేశంలోనే ఉంది. వారికి సరైన నైపుణ్యం కల్పించి, వారి సామర్థ్యాల్ని సద్వినియోగం చేసుకుంటే దేశం అభివృద్ధి చెందుతుంది. పదేళ్లుగా కోట్లాది మంది యువత తమ కలల్ని సాకారం చేసుకోలేక, ఉపాధి లేక నిర్వీర్యంగా ఉన్నారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడ యువశక్తిని ఉపయోగించుకుంటేనే సాధ్యం. నైపుణ్యాలు గల యువతతోనే ప్రపంచ అభివృద్ధి, శాంతి సాధ్యమవుతుంది.
ఆధునిక పోటీ ప్రపంచంలో సరైన,నైపుణ్యాలు ఉంటేనే కొలువులు దక్కించుకోవడం సాధ్యమవు తుంది.ఆ నైపుణ్యాలను మప్పేందుకు కేంద్రం చేపడుతున్న చర్యలు ఆశించిన ప్రయోజనాలను అందించడం లేదు.ప్రస్తుతం యువజనుల నైపుణ్యాల మెరుగుదలకు వృత్తి శిక్షణా,ఇంటర్న్‌షిప్, అప్రెంటిస్‌షిప్, ఆన్లైన్ కోర్సులు,వర్క్‌షాపులు,సెమినార్లు,మెంటార్ షిప్,వెబ్‌నార్స్,సాఫ్ట్ స్కిల్స్‌ట్రైనింగ్,లాంగ్వేజెస్ ట్రైనింగ్, కెరియర్ కౌన్సెలింగ్,జీవన నైపుణ్యాలు,క్రీడలు, సృజనాత్మక సాధనాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ వంటివి వేదికలుగా ఉన్నాయి.అయితే అవి అందరికీ అందుబాటులో లేకపోవడం లేదా వాటి గురించి ఎక్కువ మందికి ముఖ్యంగా యువతకు తెలియకపోవడం, తెలియజేసే పరిస్థితిలో పాలకులు లేకపోవడం మన దురదృష్టకరం.ఇప్పటికే గ్రామాల్లోకి అన్ని సౌకర్యాలు వస్తున్నప్పటికీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోగా-ఉన్న ఉపాధిని ఊడగొట్టే పరిస్థితి నెలకొంది.గ్రామీణస్థాయి నుంచే బేసిక్ స్కిల్స్ అభివృద్ధికి ప్రత్యేకకృషి జరగాల్సి ఉంది.ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్న విద్యకు,చేస్తున్న పనికి సంబంధం లేకుండా పోయింది.విద్యకు,నైపుణ్యాలకి,ఉపాధికి అంతరాన్ని తగ్గించాలి.చదువుతోపాటు స్కిల్స్ నేర్చు కోవడంద్వారా నేటియువతకు బంగారు భవిష్యత్తు నిర్మించుకోవడానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయి.
నైపుణ్యాలు-పథకాలు
ప్రస్తుతం సాంకేతిక విద్య అన్ని రంగాల్లో కీలకమైంది. యువతలో నైపుణ్యాలు పెంపొందిం చేందుకు కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు,అనేక వేదికలు-సంస్థల ద్వారా స్కిల్స్ నేర్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్‌యోజన,నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్,స్కిల్ ఇండియా మిషన్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన,జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో ఉడాన్,రోజ్ గార్ మేళా, క్రాఫ్ట్ మెన్ ట్రైనింగ్ స్కీమ్ వంటి పేర్లతో యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ పెంచడానికి ప్రభుత్వం పూనుకుంది. ఒక్క స్కిల్ ఇండియా మిషన్ ద్వారా ప్రతి సంవత్సరం కోటిమందికి పైగా స్కిల్స్ నేర్చుకొని బయటకు వస్తారని ప్రభుత్వం చెబుతుంది.కానీ అందులో ఎంతమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయో చెప్పడం లేదు. అంతేకాదు..నాణ్యమైన నైపుణ్యాలు ఇంకా అందుబాటులోకి రావడంలేదు. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే అందరికీ స్కిల్ నేర్పించడానికి చాలాకాలం పట్టే అవకాశం ఉంది. అక్కడక్కడ కొన్ని ప్రైవేటు సంస్థలు లేదావ్యక్తులు లాభాల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు నిర్వహి స్తున్నారు.అవి అందరికీ అందుబాటులో ఉండడం లేదు.ఫీజులు కూడా భయంకరంగా వసూళ్లు చేస్తుంటారు. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పుడున్న దానికి మూడిరతలు స్కిల్‌డెవలప్‌మెంట్ వేదికలను ఏర్పాటు చేయాలి.వాటికి నిధులు ఇవ్వాలి. నిధులు సక్రమంగా ఖర్చు చేయాలి. అప్పుడుగానీ పరిస్థితి మెరుగుపడదు.నేడు సాధారణ డిగ్రీ చదివిన వారికి ఎటువంటి అవకాశాలు ఉండడం లేదనేది జగమె రిగిన సత్యం. కేవలం డిగ్రీ కాగితాలతో యువత కడుపు నిండదు. నాణ్యమైన శిక్షణా నైపుణ్యాలను మెరుగుపరచడానికి-నాణ్యమైన శిక్షణా కార్యక్ర మాలు ఉండాలి.పరిశ్రమల అవసరాలను గుర్తించి, వాటికి అనుగుణంగా శిక్షణ ఇవ్వాలి.గ్రామీణ ప్రాంతాల నుండి కూడా యువత ఈ శిక్షణా కార్య క్రమాలకు సులభంగా చేరుకునే విధంగా ఉండాలి. ప్రభుత్వం మరిన్ని శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడం,నిధులను కేటాయించడం-నైపుణ్యా భివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయడం ఒక్కటే మార్గం.
2024 థీమ్
చాలా సంవత్సరాలుగా ఉపాధి, ఆర్థిక అసమానత వంటి ప్రపంచ సవాళ్లను యువత ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ‘శాంతి, అభివృద్ధి కోసం యువత కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ, స్థిరమైన పురోగతికి ఏజెంట్లుగా యువత ఉండాలి’ అని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది.
ప్రపంచ అనుభవం
కొన్ని రంగాల్లో అయితే కచ్చితంగా నైపుణ్యం ఉంటేనే ఉద్యోగం లేదా ఆరంగంలో ప్రత్యేక శిక్షణ తర్వాతే ఉపాధి వంటి నిబంధనలు కూడా ఉన్నాయి.ఏరంగంలోనైనా బేసిక్ స్కిల్స్ అనేవి తప్పనిసరి. జర్మనీలో డ్యూయల్ ఎడ్యుకేషన్ సిస్టమ్’ ద్వారా ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు పరిశ్రమల్లో శిక్షణ పొందుతారు.ఇది వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. సింగపూర్ స్కిల్స్ ఫ్యూచర్ వంటి కార్యక్రమాలు నిరంతరం నైపుణ్యా లను మెరుగుపరచే అవకాశాలను కల్పిస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లో సైతం 80శాతం నైపుణ్యం కలిగిన వారికే ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ రోజు అమెరికా లాంటి దేశాల్లోనూ విద్యార్థి దశ నుంచే నైపుణ్యాలు మెరుగుదలకు అవకాశాలు కల్పిస్తున్నాయి. చదువు, దానికి తగ్గ శిక్షణ ఉంటుంది.ఈ రోజు ప్రపంచ దేశాలు అందరికీ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపరుస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో కొందరు యువతకు మాత్రమే నైపుణ్య శిక్షణా అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. మరికొందరు అవగా హన, అవకాశాలు అందుబాటులో లేకపోవ డం వల్ల వెనుకబడుతున్నారు.యువతలో స్కిల్స్ పెంచేందుకు మరిన్ని శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలి.ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను చేపట్టాలి.పాఠశాల, కాలేజీ స్థాయిల్లోనే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిం చాలి.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014జూన్‌లో యువజనులకు నైపుణ్య శిక్షణా,ఉద్యోగ అవకా శాలు కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభించారు. యువత కు బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించేందుకు ముందుగా ఇంజనీరింగ్ కళాశాలలో టెక్నికల్ ఎంప్లాయిమెంట్ స్కిల్ సెంటర్ ఏర్పాటు చేశారు. తర్వాత డిగ్రీ కళాశాలలో ఆతర్వాత నిరుద్యోగ యువతకు కుట్టు,బ్యూటీపార్లర్,టైలరింగ్, ఎంబ్ర యిడరీ,ఎలక్ట్రికల్, కొలిమి వంటి చేతి వృత్తులలో నైపుణ్యం పెంచేందుకు కృషి చేస్తుంది.
ప్రస్తుతం 26నైపుణ్య కళాశాలలు, 192 స్కిల్ హబ్‌లు కేంద్రంగా నడుస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 70 శాతంపైన యువత బేసిక్ స్కిల్స్ రావడం లేదు. ప్రస్తుతం ఇతర పట్టణాలకు వెళ్లి, బతకడానికి ఎక్కువ స్కిల్స్ నేర్పుతున్నారు. భవిష్యత్తులో మాత్రం ఎక్కడికక్కడే ఉపాధి అవ కాశాలు కల్పించే స్కిల్స్ నేర్పించాలి. గ్రామ స్థాయి నుంచి సొంత భవనంతో పర్మినెంటు ఉద్యోగులచే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుచేసి, నిధులు ఇవ్వాలి. ఇప్పటికే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు సెజ్,నాన్‌సెజ్,యస్‌ఈజడ్ పేర్లతో తీసుకున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఐటి, ఫార్మా, వ్యవసాయ,ఎంఎస్‌ఎంఈ ఇండిస్టీస్‌ను అభివృద్ధి చేయాలి.ఈ రోజు ప్రభుత్వం నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరుకున్న ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఱెంజ్ ఆఫీసును నిరుద్యోగ యువతకు స్కిల్ శిక్షణ ఇచ్చే కేంద్రాలుగా తీర్చిదిద్దాలి.రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధు లు కేటాయించి, ఖర్చు చేయాలి. ఈరోజు సాంకే తిక విద్య కీలకమైంది. కాబట్టి ప్రతి కళాశాలలో ఇంటెన్సివ్ నిర్వహించాలి.రాష్ట్రంలో 245 ఇంజ నీరింగ్ కళాశాలలు ఉన్న కేవలం నాలుగైదు కళా శాలల్లో చదివినవారికి మాత్రమే ఉద్యోగాలు వస్తు న్నాయి.అంటే దానికి కారణం స్కిల్స్,దాని అను బంధ ఏక్విమెంట్స్ ఉండటమే.మన రాష్ట్రంలో విస్తారంగాఉన్న సహజ వనరులను శుద్ధి చేసుకునే స్కిల్స్ అందుబాటులోకి తెచ్చి, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచవచ్చు ఎంతో కొంత నిరుద్యోగాన్ని రూపుమాపవచ్చు.ప్రభుత్వం విద్యా విధానాలను మెరుగుపరచడం, శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడం చేయాలి. అలాగే పరిశ్రమలతో కలసి శిక్షణా కార్యక్రమాలను రూపొందించ డం, నిధులు కేటాయించడం, యువతను ప్రోత్సహిం చడం వంటివి చేయాలి. నైపుణ్యాభివృద్ధికి కావాల్సి న వనరులు అందుబాటులో ఉండాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువతకు సమాన అవకాశాలు కల్పించాలి. పరిశ్రమల అవసరాలను పరిగణన లోకి తీసుకుని అనుగుణంగా శిక్షణా కార్యక్రమాలు రూపొందించాలి. యువత భవిష్యత్తు కొరకు నైపు ణ్యాలు అత్యంత ముఖ్యమైనవి. మంచి నైపుణ్యాలు ఉన్నప్పుడే వారు సమాజంలో, పరిశ్రమల్లో మంచి స్థాయికి చేరుకుంటారు.ప్రస్తుత పరిస్థితుల్లో, టెక్నాలజీ ప్రగతితో పాటు, అనేక కొత్త నైపుణ్యా లను నేర్చుకోవడం అవసరం. యువతలో ఉన్న నిరుద్యోగాన్ని రూపు మాపడానికి మనరాష్ట్రంలో ఉన్న వనరుల ఆధారం గా చేసుకుని, విద్యార్థులకు ప్రాథమిక దశలోనే స్కిల్స్ నేర్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం యూత్ పాలసీ ప్రకటించాలి.యూత్ పాలసీలో విద్య, వ్యవస్థాపకత-ఆవిష్కరణ, నైపుణ్యా భివృద్ధి,ఉపాధి,ఆటలు,సంఘసేవ,సామాజిక న్యా యం,దేశరక్షణ,ఐక్యత,సంక్షేమ పాలన రాజకీయ ప్రోత్సాహం వంటి అంశాలతో కూడిన పాలసీ ప్రకటించాలి.
రంగాల ప్రాధాన్యత
మన దేశంలో ఇప్పటికీ ప్రాథమిక రంగం వ్యవసాయమే. అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం వ్యవసాయం.కాబట్టి యువ రైతు లకు నూతన వ్యవసాయ పద్ధతులు, నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. గ్రామీణ,మండలస్థాయిలో అయినా ఇటువంటి యంత్రాంగం ఏర్పాటు చేయడంద్వారా వ్యవసా యాన్ని లాభసాటి చెయ్యొచ్చు.వ్యవసాయంలో ఇప్ప టికీ పాతకాలపు పద్ధతులే ఉండటం,భూసార పరీ క్షలు,విత్తన పరీక్షలు,భూగర్భజలాలు గురించి, ఎరు వులు గురించి,వాతావరణ మార్పులు గురించి అవ గాహన లేకపోవడం వల్ల-రైతులు తీవ్రంగా నష్టపో తున్నారు.దాని ఫలితంగా వలసలు వెళ్తున్నారు. రైతులు పండిరచిన ప్రత్తి,వేరుశనగ,టమోటా, ఉల్లి,వరి,మిరప,పండ్లుతోటలు ప్రాసెసింగ్ యూ నిట్లు ఏర్పాటు చేసి-శిక్షణ ఇవ్వాలి. స్కిల్స్ నేర్పిం చడం,డైరీఫాం,కోళ్ల పరిశ్రమ,చేపల పెంపకం మొదలైన వాటికి ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలి. ఇలాంటి చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేయాల్సి ఉంది.స్వయంఉపాధిని పెంచాల్సిన అవ సరం ఉంది.ఇందులో ఎటువంటి స్కిల్, ట్రై నింగ్ లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా జరిగే అన ర్థాలు మనం ఇటీవల చూస్తున్నాం. కేవలం లాభా లు కోసం కార్పొరేట్ సంస్థలు దారుణాలకి పాల్పడ్డ సంఘ టనలు కోకొల్లలుగా ఉన్నాయి.ఉదాహర ణకు పరిశ్రమలో కార్మికు లకు స్కిల్ నేర్పకుండా పని చేయించడంవల్ల ప్రమాదాలు జరగడం. గ్రామాలలో కనీసం విద్యుత్‌పై అవగాహన లేని వారు ఆపరేటర్లుగా,లైన్‌మెన్లుగా ఉంటున్న పరిస్థితి. వారందరికీ వారి వారి రంగంలో స్కిల్స్ నేర్పిస్తే మరింత మెరుగైన ఫలితాలు అక్కడ మనం చూడ వచ్చు.పరిశ్రమల్లో స్థానికులకు శిక్షణ ఇవ్వాలి. తద్వారా75శాతం స్థానిక యువతకే అవకాశం ఇవ్వొచ్చు. తృతీయ రంగం -సేవలు రోజు రోజుకు పెరుగుతున్న శాస్త్ర సాంకేతిక రంగాలలో పెరుగు తున్న అభివృద్ధి. సమాచార రంగం అత్యధిక ఆదా యం వస్తున్నది. యువతకు ముఖ్యంగా స్కిల్‌ఉన్న యువతకు అత్యధిక అవకాశాలు ఈరంగంలో కనిపిస్తు న్నాయి.సమాచారం రంగం ఎంత వేగం గా పెరుగుతున్నా-సరైన స్కిల్స్ లేకపోతే అంతే ప్రమాదం జరుగుతుంది.విద్యార్థులకు కనీసం ప్రాక్టికల్స్ కూడా నిర్వహించ కుండా పాస్ చేస్తు న్నారు.ఇది నైపుణ్యాలు రాకపోవడంతో పాటు వారి భవిష్య త్తుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుత ప్రభు త్వంలో నెహ్రూ యువజన కేంద్రాలు నిధులు,సిబ్బంది లేక తీవ్రనిర్లక్ష్యానికి గురయ్యాయి. భారత నిర్మాణ వాలంటీర్లకు స్కిల్స్ నేర్పించి, వారి ద్వారా విద్యార్థులకు,నిరుద్యోగులకుబేసిక్ స్కిల్స్‌తో ట్రైనింగ్ ఇచ్చి-స్టయిఫండ్,వసతి సౌకర్యాలు కల్పించాలి.
నైపుణ్యం కలవాడే విజేత
చదువు పూర్తవగానే ఇక మనం నేర్చు కోవాల్సింది ఏం లేదు అని అనుకోవద్దు. నేర్చు కోవడం అనేది నిరంతర ప్రక్రియ,నేటిపోటీ ప్రపం చంలో ఎంత నేర్చుకున్నా, ఏం నేర్చుకున్నా తక్కువే అవుతుంది. జీవితంలో వ్యక్తిగతంగా, వృత్తిగతంగా పురోభివృద్ధి సాధించాలంటే ఎప్పటిక ప్పుడు మన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి,కొత్త నైపు ణ్యాలను నేర్చుకుంటూ ఉండాలి. నైపుణ్యా లను మెరుగుపరచుకోవడానికి మార్గాలను వెతక డం వ్యక్తిగత వృద్ధికి మొదటి మెట్టు. మిమ్మల్ని మీరు నవీకరించుకుంటూ ఉంటే లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు,ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకోవచ్చు, కెరీర్‌లో పురోగతిసాధించవచ్చు.జీవితంలోఉన్నత స్థితికి చేరుకోవచ్చు.నైపుణ్యాల ఎంపిక కూడా చాలా కీలకం. మీరు మీ బలాలు, బలహీ నతల గురించి సరైన అవగాహన కలిగి ఉంటే, మీరు అభివృద్ధి చేయాలనుకుంటున్న నైపుణ్యాలను ఎంచుకోవడం పై ఆలోచన చేయండి. మీరు మీ బలమైన నైపుణ్యా లపై పనిచేస్తూ వాటిని తదుపరి స్థాయికి తీసుకెళ్లా లనుకుంటున్నారా?లేక,బలహీనంగా ఉన్న నైపు ణ్యాలను సానపెట్టాలనుకుంటున్నారా? లేక కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనుకుంటున్నారా? అనేది నిర్ణయించుకోండి.మీరు ఏనైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవాలని ఎంచుకున్నా, అది మీరు మరింత ప్రభావవంతంగా పనిచేయడానికి, మీరు మీ లక్ష్యా న్ని సాధించడానికి, మీ కెరీర్‌లో ముందుకు సాగడా నికి సహాయపడేదై ఉండాలి.
ఇతరుల అభిప్రాయాన్ని అడగండి
ఎంచుకున్న నైపుణ్యాలపై మీ అంచనా అంత కచ్చితమైనది కాకపోవచ్చు.కాబట్టి ఈ మార్గంలో మీ సందేహాలు తీర్చడానికి,అపోహ లను తొలగించడానికి మీ స్నేహితులు,కుటుంబ సభ్యులు,సహోద్యోగులతో మాట్లాడండి,వారు ఏ నైపుణ్యాలను మెరుగుపరచాలని సిఫార్సు చేస్తారో అభిప్రాయాన్ని అడగండి
విమర్శలను స్వీకరించండి
పనితీరు బాగాలేదని మీపై ఎవరైనా విమర్శలు చేస్తే వాటిని వ్యక్తిగత దాడిగా తీసుకో కండి,వారికి విరుద్ధంగా ప్రవర్తించకండి. బదులు గా,ఇతరులు వారు చెప్పేది వినండి,దానిపై చర్చిం చండి.ఇతరుల విమర్శలు, సూచనలను తార్కిక దృక్కోణం నుండి విశ్లేషించడానికి ప్రయత్నించండి. అవి సరైన పాయింట్‌ని హైలైట్ చేస్తున్నాయో లేదో చూడండి.నిజమేనని భావిస్తే ఆ విమర్శలను స్వీకరించి నైపుణ్యాలను మెరుగు పరుచు కోడానికి సిద్ధంకండి.
నైపుణ్యాలకు శిక్షణ ఇవ్వండి
నైపుణ్యాలను నేర్చుకోవడమే కాదు, వీటిని సాధన చేయడం కూడా ముఖ్యమే. ఏవస్తు వునైనా ఉప యోగించకుండా ఉంటే అదికొంత కాలానికి తుప్పు పట్టడం,పనిచేయకుండా పోతుం ది.నైపుణ్యం అయినా అంతే, మీరు వాడకుండా ఉంచే నైపుణ్యం సాధనచేయకపోతే కొంతకా లానికి నిరుపయోగంగా మారుతుంది.అప్పుడు నేర్చుకుని కూడా లాభం లేదు. కాబట్టి మీరు ఏదైనా ఒక నిర్దిష్ట నైపుణ్యంలో నైపుణ్యం సాధించాలను కుంటే, నిరంతరం శిక్షణ పొందాలి.
వ్యాసకర్త:-,డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి- (గుమ్మల రామన్న)