నైజరు తేనె

ప్రముఖ పరిశోధక రచయిత, విశ్లేషకులు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజుథింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్న ఈ నెల సంచికలో కథా విశ్లేషణ తెలుగు సాహితీలోకానికి సుపరిచితులైన సుప్రిసిద్ద సాహితీవేత్త ‘బలివాడ కాంతరావు ’ కథా రచన ‘ నైజరు తేనె ’ కథా చదవండి..! – సంపాదకులు
సుప్రసిద్ధ తెలుగు కథా రచయిత బలివాడ కాం తారావు (03-7-1927,06-05-2000) శ్రీకాకుళం జిల్లా మడపాం గ్రామంలో జన్మిం చారు కథారచయితగా సుమారు 400కథలు రాశారు. వాటిలో ఒక గిరిజన కథ ‘‘నైజరు తేనే’’ దీని రచనా కాలం 1977.కథలో ప్రధాన పాత్రధారి కథకుడు కావడం ఒక విశేషం. దీని ద్వారా రచయితకు ఆదివాసి బిడ్డల మీద ఎలాంటి ప్రేమ ఉందో అర్థమవు తుంది. అనుభూతి ప్రధానమైన ఈకథలో గిరిజన జీవితాలు అవి కలుషితం చెందిన, చెండబోయే తీరు గురించి రచయిత కాంతారావు తన దైన బాధ్యతా యుతంగా ఆర్తితో అందంగా వెల్లడి చేస్తారు.
సుప్రసిద్ధ తెలుగు కథా రచయిత బలివాడ కాం తారావు (03-7-1927,06-05-2000) శ్రీకాకుళం జిల్లా మడపాం గ్రామంలో జన్మిం చారు కథారచయితగా సుమారు 400కథలు రాశారు. వారి కథల్లో కొన్ని గిరిజన జీవితాలకు అద్దం పట్టే కథలు ఉన్నాయి.వాటిలో ఒక రిజన కథ ‘‘నైజరు తేనే’’ దీని రచనా కాలం 1977వ సంవత్సరం.
కథలో ప్రధాన పాత్రధారి కథకుడు కావడం ఒక విశేషం.రచయిత తాను అనుభూతి చెందిన సంఘటనల సమాహారమే ఈకథ. దీని ద్వారా రచయితకు ఆదివాసి బిడ్డల మీద ఎలాంటి ప్రేమ ఉందో అర్థమవు తుంది.అనుభూతి ప్రధానమైన ఈకథలో గిరిజన జీవితాలు అవి కలుషితం చెందిన, చెండబోయే తీరు గురించి రచయిత కాంతారావు తన దైన బాధ్యతా యుతంగా ఆర్తితో అందంగా వెల్లడి చేస్తారు. భాష రీత్యా నాటి పలుచని గ్రాంథిక వాతావర ణం కనిపించిన, కథ ఆద్యంతంఉత్తమ పురుషలో కొనసాగడంతో పఠన సౌలభ్యం నిండుగా ఉందనిపి స్తోంది.అలాగే కథ పేరు కూడా ఆడబిడ్డలకు చెందిన ముఖ్యమైన అటవీఉత్పత్తిని ఎంపిక చేయడం, అందునా రచయితకు,అడవి బిడ్డల సంస్కృతిపట్ల ఆందోళనను కథ నామౌచిత్యంతో అన్వ యించి చెప్పడం మొదలైన లక్షణాలన్నీ రచయిత ప్రతిభ కు అద్దం పడతాయి.ఇక కథ విషయానికి వస్తే ఒకసంపన్న కుటుంబానికి చెంది న యువకుడు (రచయిత) తన తాతల నుండి తమ కుటుం బంలో జరిగిన సంఘట నలు గుర్తు చేసుకుం టూ తన ప్రయాణంలో పొందిన ఆనందపు పరవశంతో కథ ప్రారంభ మవుతుంది. నవం బరు నెల ఆఖరి వారంలో…. అంటే చక్కని సోయగాలతో ప్రకృతి అలరారే శీతాకాలపు వేళ,ఈ కథా నాయకుడు అడవి అందాలను ఆస్వాదిస్తూ చేసిన కారు ప్రయాణమే ఈ కథ ల్లోని ఇతివృత్తం.అందుకు ముందు పది సంవ త్సరాల క్రితం తాను మొదటిసారిగా ఈ అడవి మార్గం గుండా ప్రయాణిస్తుండగా పొద్దుగూకే వేళ రోడ్డు పక్క తన కారు చెడిపోవడం, అటుగా వెళుతున్న గిరిజన యువతి తనను చూడటం పడుచు యవ్వనంలోని అడవి బిడ్డ ‘‘పర్బతి’’ అందానికి కథకుడు తనకు తెలియ కుండానే ఆకర్షితుడు కావడం,అంతలోనే ఆ యువతి చేరువలోని తన గిరిజన గూడెం వెళ్ళే దారిలో కలిసిపోవడం జరుగుతుంది. కొద్ది సేపట్లో దేవుడు నుంచి 10మంది దాకా గిరిజ నులు కారు ఆగిన చోటికి రావడం అతనికి వారు మాట్లాడే భాష అర్ధం కాకపోయినా సైగల ద్వారా రాత్రి ఇక్కడ క్షేమం కాదని తమ గుడేనికి రమ్మని పిలిచినట్టు గ్రహిస్తాడు. వారితో కలిసిగూడెం బయలు దేరుతారు, ముందే అనుకున్న ప్రకారం డోలు సన్నాయి నాదస్వరం వాయిద్యాలతో తనకు ఎదురు వచ్చి బంతి పూల దండ వేసి అతనికి స్వాగతం పలికి నృత్యాలతో గూడెం తీసుకువెళతారు, వారి ఆచారం ప్రకారం ఆడామగా కలిసి గదబ నృత్యం చేస్తూ తమ గూడెం వచ్చిన అతిథికి మర్యాదలు చేస్తారు. గూడెం మధ్య మర్రిమాను వద్ద జరిగిన ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కథకుడు ఆరాత్రి గూడెం పెద్ద ఇంటి ముందు ఆతిథ్యం తీసుకుని ఆరాత్రి ఆనందం నిండిన సంతృప్తితో నిద్రపోతాడు. రాత్రి ఆగిరి జన గూడెం ‘‘చిక్కర పార’’లో ఆరుబయట వెన్నెల్లో అతడు పొందిన సంతృప్తి,ఆనందం, తన జీవి తంలో మరి ఎక్కడ దొరకలేదు. సంతృప్తికర రాత్రి నిద్ర అయ్యాక తెల్లవారి పొద్దున పనులు పూర్తి చేసుకోవడానికి ఆగూడెం నీటి ఆధారం చెరువుకు వెళ్లడంతో…. ముందు రోజు సందెకాడ రోడ్డుపక్క తనకు ఎదురైన యువతి నీళ్ల కుండతో కనిపిస్తుంది.అతడిలోని ఆర్తి చూపులు ఆమెకు అందాయి, మూగభాషలో నే గూడానికి ఓమూలనున్న తన ఇంటివైపు రమ్మని సైగల స్వాగతం పలకడంతో అందు కోసమే అన్నట్టు ఎదురు చూస్తున్నా అతని మనసు ఊయల లూగు తుంది,భూమికి పసుపు చీర పరిచినట్టు ఉన్న పసుపు పూల నైజర్‌ నూనె గింజల పంట చేనుకు గుండా నడుస్తున్న అతగాడి చిలిపి మనసు దారిలోనే ఒకసారి దాహం నటిస్తోంది!! తన భుజం మీది నీటి కుండ సాక్షిగా ఆమె అతడి దాహం తీరుస్తుంది. అందమైన అడవి దారి గుండా అంతే అందమైన అడవి యువతి నివాసపు పాకకు చేరిన వారి ప్రయాణం ఎలాంటి కల్మషం లేని స్వచ్ఛమైన అనురాగపు అనుబంధాన్ని పంచి రచయితకు జన్మకు సరిపడా అనుభూతి అందుతుంది.ఆ పడతి సీసాతో ఇచ్చిన ‘‘నైజరు తేనె ‘‘రుచి కూడ అంతే మధురాతి మధురంగా అతడి మనసుకు అల్లుకుపోయింది. అలా ఆనాటి మధుర స్మృతులు మూటగట్టుకుని పదేళ్ల తర్వాత అరమరికలు లేని అడది బిడ్డలతో కొన్నాళ్లు కలిసి ఉండి మనశ్శాంతి పొందాలనే ఆశయంతో అక్కడికి వచ్చిన అతడికి ఎదురైన చేదు అనుభవాలతో ఈ కథ ముగుస్తుంది. రచయితకు ఆడబిడ్డలకు ఆవహించిన ఆధునిక అసమానతలు పట్ల గల ఆవేదన అర్థమవు తుంది.పదేళ్ల తర్వాత అక్కడి అడవి బిడ్డలులో ఆధునిక జీవన విధానం కొట్టొచ్చినట్టు కనిపి స్తుంది. కొత్తగా వచ్చిన కరెంట్‌ వెలుగులు,మట్టి కుండల స్థానంలో స్టీల్‌ బిందెలు,పూరి గుడి సెలున్న చోట పెంకుటిళ్లు, వంటి మార్పులు చూసిన రచయిత ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. వారిలో అంతకు ముందు కాలం నాటి ఆత్మీయతలు అనుబంధాలు లేవు అంతా కృత్రిమత్వం, అభద్రత,రాత్రి గూడెంలో ట్యూబ్‌ లైట్‌ ల వెలుగులో సాగినవారి నృత్యంలో అంతా కృత్రి మత్వమే. అది ఏదో ఆశిస్తూ చేస్తున్న స్వార్ధతత్వం, అడుగడుగునా కనిపి స్తాయి. ఆరాత్రి గూడెంలో అతడు గదిలో నిద్రపోయినా నమ్మకం లేనట్టు ఎవరి ఇంటి తలుపులు వారు గడియలు పెట్టి బిగించు కున్నారు.అంతటా అభద్రతే ఆత్మీయతలు లేని ఆతిథ్యం,అతడిని తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. తెల్లవారి ఉన్న ఒక్క అనురాగపు ఆశకోసం చెరువు గట్టుకు వెళ్ళిన, అతనికి అందమైన మామిడి చెట్లు, నైజర్‌ పంటచేలు, కనిపించ లేదు.చెరువు నీళ్ళకు వచ్చిన వారి చేతుల్లో కుండలు లేవు ఇత్తడి బిందెలు, స్టీలు బిందెలు ఉన్నాయి, అక్కడి వారికి ఉపాధి ముసుగు వేసి కట్టబడ్డ విమానం కంపెనీ సాయంగా అక్కడి అడవి అందాలు అంతర్ధానం అయ్యి కాలుష్యపు మేఘాలు వారికి తెలియ కుండానే అడవికి,వారి జీవితాలకు ఆవహించాయి. ఇంత మారిన తన ఊహల సుందరి ‘‘ప్రేమ తునక’’ పర్బతిలో తాను తొలిసారి చూసిన స్వచ్ఛత ఉంటుందని ఆశ తో అటుగా అడుగులు వేసిన అతనికి పిల్లలకు పాలు పడుతున్న ఆమె కనిపించింది, ప్రేమ తాలూకు పరిమాణం తో సిగ్గుపడుతూ తన వైపు చూసిన, ఆమె పిల్లల్లో తెలియని భయం కోపపు చూపులు,ఆమె శరీరానికి కొత్తగా జాకెట్‌ వచ్చి చేరింది. ఆమె భర్త విమానం కంపెనీలో తోట మాలి మరి, నోరు తెరిచి తానే అడిగాడు ‘‘నైజరుతేనె’’ అని,ఇంట్లోకి వెళ్లి గాజుసీసాలో తేనె తెచ్చి అతని చేతికి అందించి ‘‘దాని విలువతే’’ అన్నట్లు చేయి చాపుతుంది. ఆ తేనె చుక్కలు నోట్లో వేసుకున్న అతడికి మధురం స్థానంలో చిరుచేదు అనిపిస్తుంది. పది రూపాయల నోటు ఆమె చేతికి అందించిన అతడికి భయంకరమైన పళ్ళతో ఆమె ముఖం కనిపిస్తుంది, మొదటిసారి అతని కళ్ళకి ఆమె జలపాతంల కనిపించింది. ఈ పదేళ్లకు ‘‘కుళ్లు కాలవలా’’ తయారయింది. గబగబ ఆ కృత్రిమ గూడెం నుంచి కదిలిపోయి రోడ్డు పక్కన గల తన కారు చెంతకు చేరేసరికి, ఓ పదిమంది గ్రామ పెద్దలు అతడిని వెంబడిరచారు… డబ్బులు ఇమ్మనే చేతులతో. అతడి మనసులో సుడులు తిరుగుతున్న కోపాన్ని దాచుకోలేక పర్సులోని డబ్బంతా కాగితపు ముక్కల్లా వాళ్ళ మీద చల్లి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో కథ ముగుస్తుంది. విభిన్నమైన కల్పితకథనమైన, అక్షరాల వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు అక్షరీకరించడంలో రచయిత బలివాడ కాంతారావు కృతార్థులయ్యారు.అందమైన అడవిబిడ్డల సంస్కృతి సాంప్ర దాయాలకు ఆధునికతతో కూడిన రక్షణ అత్యవసరం. కానీ ఆఅభివృద్ధి తాలూకు మార్పు వారిలోని అసలైన మనుగడకు చేటు రాన్నివ్వ రాదని ఆనాడు ‘‘బలివాడ’’ వారు ఆశించినదే ఈనాడు అందరూ ఆశిస్తున్నాము. ఆవిధంగానే అడవి బిడ్డల మనుగడ,అభివృద్ధి సాయంతో అంత రించి పోకూడదు,అని అందరం కోరు కుం దాం..చక్కని కథా వస్తువు ఎంత చక్కని శైలి అలవర్చిన రచయిత కథా కథనం అందరికీ ఆరోగ్యదాయకమైన విషయ విశేషం.