నిజం
నేటి ఆధునిక సమాజపు ఆలోచన, కానీ అందుకు భిన్నమైన దృక్పథంతో కొత్తకోణంలో రాసిన గిరిజన కథ ‘‘నిజం’’. మనుషులు, సమాజం, దేశం,తరతమ భేదం లేకుండా ఏనాటికైనా మార్పు చెంది తీరా ల్సిందే.అనే ఆశాభావంతో.. ఆలోచించే రచయిత్రి కథలన్నీ అలాంటి నిర్మాణాత్మక దృక్పథంతో ప్రయో జనాత్మకంగా తీర్చిదిద్ద బడ్డాయి. తన క్షేత్ర పర్యటనల్లో భాగంగా సందర్శించే గిరిజన గ్రామాల్లోని వాస్తవ సంఘటనలు, ప్రత్యక్షంగా గమ నించిన పరిజ్ఞానంతో ‘‘నిజం’’ కథ రాశారు. రచనా కాలం మార్చి 20,2006 జాగృతి వార పత్రికలో మొదట ప్రచురించబడిరది. అడవిబిడ్డలకు ప్రత్యేకంగా మతం,దైవాలు, ఉండవు వారు వేటి ద్వారా జీవనం సాగిస్తారో అవే వారి పాలిట దైవాలు..అవి వారి మతం… అభిమతం. అడవి బిడ్డలు విశ్వసించినట్టు దేని ద్వారా తమ జీవనం గడుస్తుందో దానినే దైవంగా ఆరాధించే లక్షణం ఆధునిక మానవులు అలవర్చుకుంటే ఇప్పుడున్న ఇన్ని మతాలు..నాగరికత ముసుగులో మనిషి సృష్టించుకున్న ఇన్ని రకాల దైవాల అవసరమే ఉండదు. ` శివల పద్మ , రచయితి.
సాధారణంగా గిరిజనులుఅంటే, కొండ కోనల్లో కాపురముంటూ, నాగరిక ప్రపంచం, లోకం పోకడ తెలియక, మూఢనమ్మకాలతో మూర్ఖ త్వం నిండిన, విచిత్ర వేషధారణలతో చిత్రంగా ఉం టారు. అనేది నేటి ఆధునిక సమాజపు ఆలోచన, కానీ అందుకు భిన్నమైన దృక్పథంతో కొత్తకోణంలో శివల పద్మ రాసిన గిరిజన కథ ‘‘నిజం’’. విద్యార్హ తల రీత్యా తెలుగు, ఫిలాసఫీ,ల్లో మాస్టర్ డిగ్రీలు పొందిన వీరు. కథా రచయిత్రిగా ‘‘ఎన్నాళ్లీ మౌ నం?’’ ‘‘ఫలించిన స్వప్నం’’ లాంటి కథా సంపు టాలు ప్రచురించిన ఈమె ఆలోచనా ధోరణిలాగే, కథా శిల్పం కూడా అద్భుతంగా ఉంటుంది. ‘‘సాధనమున పనులు సమకూరు ధరలోన’’ అన్న నానుడిని నిండుగా నమ్మిన ఆమె తాను నిత్యం చూస్తున్న సంఘటనలు,సమస్యలను,అనుభవాలను, వస్తువులుగా ఎంచుకుని ఎం చక్కని శిల్పసౌందర్యం అద్ది, అందమైన ఆలోచించదగ్గ కథలు రాయడంలో తను అందెవేసిన చేయి.
మనుషులు,సమాజం,దేశం,తరతమ భేదం లేకుండా ఏనాటికైనా మార్పు చెంది తీరా ల్సిందే.అనే ఆశాభావంతో.. ఆలోచించే రచయిత్రి కథలన్నీ అలాంటి నిర్మాణాత్మక దృక్పథంతో ప్రయో జనాత్మకంగా తీర్చిదిద్దబడ్డాయి. కథా రచయిత్రి తన క్షేత్ర పర్యటనల్లో భాగంగా సందర్శించే గిరిజన గ్రామాల్లోని వాస్తవ సంఘటనలు, ప్రత్యక్షంగా గమ నించిన పరిజ్ఞానంతో ‘‘నిజం’’ కథ రాశారు. దీని రచనా కాలం మార్చి 20,2006 జాగృతి వార పత్రికలో మొదట ప్రచురించబడిన గిరిజన కథ లోని కథనం, పరిశీలిస్తే…..
‘‘వారిజ’’ అనే పత్రిక రచయిత్రి తన స్నేహితురాళ్ళు సుధ,సునీతలతో కలిసి గిరిజన ప్రాం తాలతో పరిచయంగల‘మూర్తి’అనే సోదరుని సాయంతో ఒకచిన్నగిరిజన గ్రామం వెళ్లడంతో ప్రారంభమయ్యే కథ,ఆద్యంతం అడవుల్లోని వన వాసుల సుందర జీవన చిత్రాన్ని పాఠకుల కళ్ళకు కడుతూ,అందమైన అనుభవం అనుభూతిని,ఇచ్చి ఒకకొత్త ఆలోచన కలిగిస్తూ ముగుస్తుంది.తనదైన ‘‘కవితాత్మక ఉత్తమ వాక్య నిర్మాణ శైలి’’ సొంతం చేసుకున్న శివలపద్మకథా పయనం మరింత ఉత్తమోత్తమంగా సాగుతుంది. నగర జీవితంలో ఎంత వెతికినా దొరకని అనుభూతి సోయగం ‘వారిజ’ స్నేహితురాళ్ళ త్రయానికి అక్కడ లభ్య మౌతుంది. కానీ..బాహ్యప్రపంచంతో సంబం ధాలు లేకుండా,పూర్వకాలపు అనాగరిక పద్ధతు ల్లో, కూనరిల్లిపోతున్న అక్కడి గిరిజనుల పట్ల తక్కు వ భావం కలిగిన సుధ,సునీతలకు తన పరిశోధన ద్వారా వారి పూర్వాపరాలు తెలుసుకుని వారికి నాగరికత నేర్పడమే తన లక్ష్యం అని తన స్నేహితు రాళ్లకు సగర్వంగా చెబుతుంది. కానీ అక్కడ తాను ప్రత్యక్షంగా చూసిన పరిస్థితితో ఆశ్చర్యపోతుంది వారిజ.గిరిజన గ్రామంలో మూర్తి సేవా కార్యక్ర మాలు నిర్వహిస్తూ అక్కడి గిరిజనులతో సహృదయ సంబంధాలు కలిగి ఉంటాడు. అక్కడి వారంతా తనని తమ బంధువుగా భావించి ఆదరిస్తారు, ఆ చదువుతోనే స్నేహితురాళ్ళ బృందాన్ని అక్కడికి తీసుకువెళతాడు.
ముందస్తు సమాచారంతో అక్కడకు వెళ్లిన వీరిని ఆగూడెం ప్రజలంతా ఎంతో ఆత్మీ యంగా పలకరించడం,ఆహ్వానించడం,ఆధునిక అమ్మాయిలకు ఆశ్చర్యంగా అనిపించినా అది అడవి బిడ్డల సహజగుణం. మూర్తి అక్కడ తులసి అనే ఒక గిరిజన యువతిని ‘వారిజ’కు పరిచయం చేస్తాడు. ఆమె కట్టు బొట్టు రూపం చూసి తనకు మొదట చులకన భావం కలుగుతుంది.కానీ ‘తులసి’ లోని ఆప్యాయత పలకరింపులేకాదు.తను విశ్వ విద్యాలయ విద్యపూర్తి చేసి ఆగ్రామంలో ఒకబడి కూడా నడుపుతూ..జర్నలిజం కూడా చదువు తుం దని,చక్కని నాయకత్వ లక్షణాలు కలిగి,మంచి చైత న్యం నిండిన యువతి అని మూర్తి మాటల ద్వారా తెలుసుకున్న వారిజకి ఆశ్చర్యం కలుగుతుంది. చివరకు గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకునే పనిలో భాగంగా తులసి ఆధ్వ ర్యంలో అక్కడి గిరిజన మహిళలతో సమావేశం అయిన వారిజ స్నేహితురాళ్లకు చెంపలు చెళ్లు మనిపించేట్టు సమాధానాలు వస్తాయి.ప్రకృతితో ముడిపడి ఉండే వారి పండుగల గురించి, కట్న కానుకలు కనిపించని వారి పెళ్లిళ్లు, డబ్బు ప్రసక్తే లేకుండా సాగిపోయే వారి జీవనం గురించి, వృద్ధు లైన తల్లిదండ్రులను వారికొడుకులు కోడళ్ళు కాపా డే తీరు,ముసలి వారినినిర్లక్ష్యం చేస్తే గిరిజన కుటుం బాల్లో పాటించే,ఎలివేత,తదితర కట్టుబాట్లు, ఆచా రాల గురించి…ఆగిరిజన స్త్రీలు చెబుతూ ఉంటే ఈపట్టణ యువతులకు కళ్ళు బైర్లు కమ్ముతాయి, పేరుకు ఆధునిక ప్రాంతంలో నాగరికతతో జీవిస్తు న్నాము అని అనుకుంటున్నా,..అడవిబిడ్డల ఆత్మీయ సంస్కృతులతో పోల్చుకుంటే, మనం ఎంత అనాగరి కంగా జీవిస్తున్నామో నర్మగర్భంగా చెబుతూ రచ యిత్రి తనకు గల ‘మూలవాసి ప్రేమ’ను చెప్పకనే చెబుతారు.ఎంతో పటిష్టమైన కుటుంబ, సంఘ వ్యవస్థలకు, కట్టుబాట్లకు బద్ధులై జీవిస్తున్న ఈ వనవాసులు బాహ్యంగా అనాగరిక అవతారాల్లో అగుపించిన అంతర్గతంగా,మానసికంగా, నిజమైన మానవత్వం కలిగి జీవిస్తున్నారు అనే సందేశం ఈకథ ద్వారా అందించే ప్రయత్నం జరిగింది.
అడవిబిడ్డలకు ప్రత్యేకంగా మతం,దైవాలు, ఉండవు వారు వేటి ద్వారా జీవనం సాగిస్తారో అవే వారి పాలిట దైవాలు,అవి వారి మతం,అభిమతం. అడవి బిడ్డలు విశ్వసించినట్టు దేని ద్వారా తమ జీవనం గడుస్తుందో దానినే దైవంగా ఆరాధించే లక్షణం ఆధునిక మానవులు అలవర్చుకుంటే ఇప్పుడున్న ఇన్ని మతాలు,నాగరికత ముసుగులో మనిషి సృష్టించుకున్న ఇన్ని రకాల దైవాల అవ సరమే ఉండదు,అన్న భావన వ్యక్తం చేస్తుంది రచ యిత్రి. ‘‘వారిజ’’ తన గిరిజన ప్రాంత పర్యటనలో మనిషిని మనిషిగా గౌరవించే గొప్ప సుగుణాల సంపదలుగల అడవి బిడ్డలను…. వారిలో అడుగ డుగున అగుపించే అతిధి మర్యాదలు, నిష్కల్మష మైన, కాలుష్యరహిత జీవితాలు, చూసి మొదట తాము అనుకున్నట్టు వారికి ఏదో నాగరికత సంస్కా రాన్ని నేర్పి చైతన్యవంతుల్ని చేయాలి, అన్న ఆలోచ న మానుకుని వారినుంచే ఎంతో విలువైన సంస్కృతి సంప్రదాయాలు, తెలుసుకుని కొత్త ఆలోచనలతో తానేచైతన్యం చెందుతుంది.
గిరిజన సంస్కృతిని సంరక్షించడం అంటే వారికి ‘‘ఆధునిక మురికి సంస్కృతి’’ అంట కుండా చూడటంతోపాటు….వారిని వారిలాగే జీవింప జేసేస్తూ….మనమంతా వారికి అండగా తోడు ఉండటమే, నిజమైన గిరిజన సంస్కృతి సం రక్షణ, గిరిజన జాతి చైతన్య పతాక, అవుతుంది, అన్న వినూత్న అనుభవం ఐక్యసందేశం అంది స్తారు రచయిత్రి. దీనిలో గల క్లుప్తత,ఏకకాల, ఏకాంశ, లక్షణాల దృష్ట్యా ఇది అచ్చమైన ‘‘కథానిక’’ అనడంలో నిండు నిజం ఉంది. అలా..సార్థక నామధేయి అయింది కూడా.. కథానిక ప్రారంభం లో కనిపించే ఆసక్తి కథ నడపడం లో ఉండే సంబంధాలు చివరికి పాఠకులు ఊహించని ముగిం పు ఇలా ప్రతి విషయంలో రచయిత తీసుకున్న శ్రద్ధ కథకు మరింత వన్నె లద్దింది,నిజంగా ఈ ‘‘నిజం’’ కథ రచయిత్రి సంపూర్ణ రచనాపరిణితికి ఓమచ్చుతునక అనవచ్చు. (వచ్చే నెల సంచికలో మీ కోసం అట్టాడ అప్పలనాయుడు కథ అరణ్యపర్వం)
-డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు,ఫోను: 77298 83223