నిగ్గు తేలని..లేట్‌రైట్ క్వారీ అక్రమాలు
అనకాపల్లి,కాకినాడ జిల్లాల సరిహద్దు లను ఆనుకుని నాతవరం మండలం భమిడికలోద్దు లో121హెక్టార్ల విస్తీర్ణంలో లేట్‌రైట్ క్వారీ ఉంది. ఈక్వారీ అనుమతుల నుంచి నిర్వహణ వరకు అన్నీ ఉల్లంగనలు చోటు చేసుకున్నట్లు జాతీయ హరిత ట్రైబ్యూనల్(ఎన్‌జీటీ)కు ఉమ్మడి విశాఖ జిల్లా దళిత ప్రగతి సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కొండ్రు మరిడియ్య ఏడాదిన్నర క్రితమే ఫిర్యాదు చేశారు.
ఒక ప్రభుత్వం పోయి మరో ప్రభుత్వం వచ్చినా వారి తలరాత మాత్రం మారడం లేదు. పచ్చని అడవులను నాశనం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా అడవుల్లో ఉన్న అపారమైన లేట్‌రైట్ మైనిం గ్‌పైన మాఫియా కన్ను పడిరది.ఈ విలువైన ఖని జాన్ని తవ్వేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతు న్నాయి. గిరిజనుల పేరు మీదుగా అనుమతులు పొంది లబ్ధి పొందాలని చూస్తున్నారు. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం సరుగుడు పంచాయితీ పరిధిలో లేట్ రైట్ ఖనిజం అపారం గా ఉంది. ఈ భూములపై చట్ట పరమైనహక్కులు, రాజ్యాగ పరమైన రక్షణలు ఈపంచాయితీలో నివసించే గిరిజనులకే ఉన్నాయి.ఇక్కడవున్న లేట్‌రైట్ తవ్వేందుకే తప్పా గిరిజన చట్టాలఅమలు,వారి సంక్షేమం ఏప్రభుత్వనికి పట్టడం లేదు.అసలు ఈతవ్వకపు అనుమతులు పొందాలంటే పిసా చట్టం ప్రకారం గ్రామసభ అనుమతి,అటవి హక్కుల చట్టం గ్రామ కమిటి అమోదం తప్పని సరిగా ఉండాలి.కానీ, కాంట్రాక్టర్లు అవేమీ పట్టించు కోకుండా బినామీల పేరు మీదుగా ఈ మైనింగ్‌ను తవ్వి ఖజనా నింపుకోవాలని చూస్తున్నారు. అభి వృద్ధి మాటే ఎరుగని గిరిజనులకు మైనింగ్ మాఫి యా చుక్కలు చూపిస్తున్నారు. ఎలాంటి అనుమతు లు లేకుండా అడవిని నాశనం చేసే మైనింగ్ తవ్వ కాలు జరిపితే తాము ఊరుకోమని ఆదివాసులు తెగేసి చెప్తున్నారు.
నాతవరం మండలం సుందరకోట పంచాయతీ పరిధి భమిడికలొద్దిలో121హెక్టార్ల విస్తీర్ణంలోఏటా10లక్షల క్యూబిక్ మీటర్ల లేటరైట్‌ను 15 ఏళ్లపాటు తవ్వుకునేందుకు జర్తా లక్ష్మణరావు అనే గిరిజనుడికి రెండు నెలల క్రితం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాలుష్య నియంత్రణ మండలి అంతకు ముందే ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. తరువాత కేంద్ర అటవీ,పర్యావరణ మంత్రిత్వ శాఖకు సిఫారసు చేయగా అక్కడ నుంచి అనుమ తులు వచ్చాయి.ఈ మేరకు ఆఘమేఘాలపై లేట రైట్ తవ్వకాలు ప్రారంభించారు. అధికారుల లెక్కల మేరకు ఇప్పటివరకు 8,500క్యూబిక్ మీటర్ల మేర ఖనిజాన్ని తవ్వి తరలించారు. మైనింగ్‌లో అను భవం వున్న ఒకనిపుణుడిని స్వయంగా లీజుదారుడే నియమించుకున్నారు.అతని పర్యవేక్షణలో లేటరైట్ తవ్వకాలు చేస్తున్నారు.ఖనిజాన్ని పక్కనే వున్న కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో జల్దాం వద్ద డంపింగ్ యార్డుకు ఏర్పాటు చేశారు.అక్కడ నుంచి ఇతర వాహనాల్లోకి లోడిరగ్ చేసి,తూకం వేసిన అనంతరం గమ్యస్థానాలకు రవాణా చేసే వారు.
అత్యాశే కొంప ముంచిందా..!
భమిడికలొద్దిలో జరుగుతున్న లైట్‌రైట్ తవ్వాకలను తరలించడానికి మాఫియా మరింత వేగాన్ని పెంచాలని ఆలోచించింది.దీనికి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు,సంబంధిత ఉన్నతాధికారు లను సంప్రదించి వారి కోరికున్నంత ముడిపులు చెల్లించేసింది.భమిడికలొద్దిలో జరుగుతున్న లేటరైట్ తవ్వకాలను గనులశాఖ అధికారులుగానీ, ఫారెస్టు, రెవెన్యూశాఖల అధికారులు గానీ ఇక్కడ తవ్వే లైట్‌రైట్ ఖనిజాలు ఏశాఖ పరిధిలోకి వస్తాయి.. ఏజిల్లా పరిధిలో ఉంది అనే అంశాలను పరిగణన లోకి తీసుకోలేదు సరికదా మచ్చు కైనా పర్యవేక్షించ లేదు. దీంతో మైనింగ్ మాఫియా రెచ్చిపోయి అత్యా శకు పోయింది.అడిగే నాధుడు,ప్రశ్నించే మేథావులు లేక అటూ కాకినాడ జిల్లా,ఇటు అనకాపల్లి జిల్లా సరిహద్దుల్లో ఉన్న దట్టమైన అటవీప్రాంతం మద్య లో నుంచి మైనింగ్ మాఫియా విశాలమైన రహ దారి నిర్మాణానికి ఉపక్రమించింది. లైట్‌రైట్ తరలింపునకు భమిడికలొద్దు నుంచి కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంక వరకు 28 కిలో మీటర్ల రోడ్డు 30అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మా ణానికి పూనుకున్నారు.రోడ్డు నిర్మాణంలో వేలాది వందేళ్లు వయస్సుగల పచ్చని వృక్షాలు నరికేశారు. అనే పచ్చనిచెట్లు,వనకుమూలకులు నేలమట్టం చేశారు.ఫలితంగా పర్యావరణానికి తీవ్రమైన విఘాతంకలిగించారు.అడ్డొచ్చుని జంతవులు, జీవ రాశులను హతమార్చారు.అంతే కాకుండా రోడ్డు నిర్మాణానికి కాకినాడ జిల్లా ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ.60లక్షలు ఖర్చు చేశారు. పైగా గిరిజన గ్రామాలకు రహదారి సదుపాయం కల్పిస్తు న్నామని,సాగునీటి వనరులను కప్పేశారు. భారీ వాహనాల రాకపోకలతో జీవజాతులు ప్రాణాలకు ముప్పుతెచ్చారు.తాగునీటికి ఆధారమైన ఊటగెడ్డ లను కలుషితం చేశారు. స్థానికులకు అధికార పార్టీనేతల ద్వారా తాయిలాలు ఆశ చూపించి క్వారీ నిర్వహణకు ఆటంకం లేకుండా చేసుకు న్నారు. ఈ లేట్‌రైట్ తవ్వకాలపై అప్పట్లోనే కొందరు స్థానికులు అధికారులకు ఫిరార్యదు చేసినా పట్టించు కోలేదు.దీంతో జాతీయ హరిత ట్రైబ్యూనల్‌ను ఆశ్ర యించాల్సి వచ్చింది. గతేడాది కాలంగా విచరణ కొనసాగుతుంది.సంయుక్త కమిటీ నివేదిక ఆధా రంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈనెల 24న ఎన్జీటీలో ఈ కేసు మరలా విచారణకు రానుంది. అప్పటిలోగా కమిటీ నివేదిక అందజేయ డానికి అధికారులు సన్నద్దమవుతున్నారు.
– గునపర్తి సైమన్