నా ఆరోగ్యం నా హక్కు చట్టం చేయాలి

ఆరోగ్యహక్కు ద్వారా గౌరవంగా, ఆనందంగా జీవించడం.. దేశ పురోగతుల్లో పాలు పంచుకోవడం..అవసరమైన భౌతిక,మానసిక, సామాజిక పరిస్థితులను మెరుగైన ప్రమాణాలతో అందుకునే అర్హత ప్రతి పౌరునికీ కలుగుతుంది. ఆరోగ్యం సమకూరుతుంది.అందుకే అందరికీ ఆరోగ్యం అందాలంటే..ప్రభుత్వాల దయాదాక్షి ణ్యాలపై ఆధారపడటం కాకుండా ఆరోగ్యమన్నది హక్కుగా ఉండాలి.అందుకొరకు కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలన్నీ తప్పక ఆరోగ్యహక్కు చట్టాన్ని తీసుకు రావాలి. చట్టాన్ని తీసుకురావడమే కాదు.. దాన్ని ఆచరణలో పెట్టాలి.అప్పుడే అందరికీ ఆరోగ్యం అందే పరిస్థితి వస్తుంది. పేదవాడికి వైద్యం సరిగా అందక..వైద్య ఖర్చులకు తనసొంత జేబులో నుంచి ఖర్చు పెట్టుకోలేక..మరింత పేదవాడిగా మారు తున్న పరిస్థితి. ప్రస్తుతం ఉన్న ఈ విపత్కర ఆరోగ్య పరిస్థితిలో ప్రజలందరికీ ఆరోగ్య హక్కును ప్రాథ మిక మానవహక్కుగా సూచించడమే మంచి పరిణామం.2000 సంవత్సరాల నాటికి అందరికీ ఆరోగ్యం అందాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1977లోనే నిర్ణయించింది.1978లో జరిగిన అల్మా-అటా ప్రకటనలో ప్రజలందరికీ ఆరోగ్యం అందే విధంగా అడుగులు వేస్తామని సంతకాలు చేసిన జాబితాలో మన దేశం కూడా ఉంది. కానీ పేదవానికి అందుతున్న ఆరోగ్య సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆరోగ్య అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
చట్టం అవసరం. : మనిషి జీవనశైలిలోను, వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా అనేక వ్యాధులు విపరీతంగా విస్తరిస్తున్న పరిస్థితిలో మనం జీవిస్తున్నాం.మలేరియా,డెంగ్యూ, అతిసార, మీజిల్స్‌,కరోనాలాంటి అంటువ్యాధులు..బి.పి, షుగర్‌,కొలెస్ట్రాల్‌, ఊబకాయం, క్యాన్సర్‌ లాంటి వ్యాధుల ప్రాబల్యం రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం మనదేశంలో ప్రతి నాలుగో వ్యక్తికి షుగర్‌ ఉందని, భవిష్యత్తులో ఈసంఖ్య మరింత ఎక్కువ కాబోతుందని అంచ నాలు తెలుపుతున్నాయి. వైద్య రంగంలో అనేక మార్పులు వచ్చాయి.వైద్యం ఎంతో అభివృద్ధి చెం దింది.ఈ ఆధునిక వైద్యం పేదవాడికి అందే పరిస్థితిలో లేదు.వీరికి అవసర మైన వైద్యం ప్రభుత్వ వైద్యశాలలో పూర్తిగా అంద డం లేదు.డబ్బులు పెట్టి కొనుక్కోగల పరిస్థితి వారికి లేదు. విపరీతం గా పెరుగుతున్న మందుల ధరలు,వైద్యం కోసం అయ్యే ఖర్చులను పేద ప్రజలు భరించలేక మరింత పేదరికంలోకి నెట్టబడు తున్నారు.
ముందస్తు జాగ్రత్తలు..: జబ్బు చేసిన తరువాత వైద్యం చేయడం మాత్రమే ఆరోగ్యంకాదు. జబ్బుకు వైద్యం చేయడంతో పాటు జబ్బు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా ఆరోగ్యంలో భాగమే.మంచినీరు అందించడం,పారిశుధ్య కార్య క్రమాలు సక్రమంగా నిర్వహించడం,టీకాలు వేయించడం,పౌష్టికాహారాన్ని అందించడం నివా రణ మార్గాలలో అత్యంత ప్రధానమైనవి. వీటిని సరైన పద్ధతిలో ప్రజలకు అందించకపోవడంతో అనేక అంటురోగాలు వ్యాపిస్తున్నాయి. వైద్య శాస్త్రంలో వస్తున్న ఆధునిక పద్ధతులు సాధారణ ప్రజలకు అందుబాటులో లేక వైద్య రంగంలో అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మనకున్న వైద్యరంగం దరిదాపుగా 80 శాతం ప్రైవేటురంగం చేతుల్లోనే ఉంది. ఆరోగ్యశ్రీ లాంటి వైద్య సేవలు సాధారణ ప్రజలకు కొంత ఊరట కలిగించినా,ఎక్కువ సందర్భాలలో పేద వాని జేబులో నుంచి వైద్యం కొరకు ఖర్చు చేయా ల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇది సరైన విధానం కాదు. ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరాలకు సరిపడా వైద్యం అందడం లేదు. ప్రజలందరికీ సమగ్రమైన,నాణ్యమైన ఆరోగ్య సేవలను, పౌష్టి కాహారాన్ని, మంచి నీటిని, పారిశుద్ధ్యాన్ని అందిం చగలిగితే సాధారణ ప్రజలు ఉన్నత ప్రమాణాలతో, భరోసాతో జీవించగలుగుతారు. అప్పుడు సమాజం అభివృద్ధి పథంలో నడుస్తుంది. అసమానతలు లేని మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను ప్రజలందరికీ అందించాలంటే వైద్యం ప్రభుత్వాల దయాదాక్షి ణ్యాల మీద ఆధారపడకుండా, ఆరోగ్యమన్నది ప్రభుత్వ బాధ్యతగా, ప్రజల హక్కుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఉపయోగాలు..
పుట్టుక నుంచి చివరి శ్వాస విడిచే వరకు నిరాకరణ లేని, అసమానతలు లేని నాణ్య మైన వైద్య సేవలను ప్రభుత్వ పర్యవేక్షణలో ఉచితంగా పొందవచ్చు.
రాష్ట్ర ప్రజలందరికీ ప్రభుత్వ, ప్రైవేటు / స్వచ్ఛంద ఆసుపత్రులలో దేనిలోనైనా ముందుగా ఫీజు చెల్లించకుండా..వెంటనే, అసమా నతలు లేకుండా అన్ని రకాల వైద్య సేవలను ఎల్లవేళలా పొందగలిగే అవ కాశం ఉంటుంది.
మెడికో లీగల్‌ కేసైనా, చికిత్సలో ఆలస్యం లేకుండా అన్ని స్థాయిలలో వైద్యం అందు కునే పరిస్థితి ఏర్పడుతుంది.
గ్రామస్థాయి నుంచి నగర స్థాయి వరకు అన్ని ప్రాథమిక,ద్వితీయ,తృతీయ స్థాయి ఆసుపత్రులకు త్వరగా చేరుకునే రెఫెరల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగు తుంది.
ప్రభుత్వం తప్పనిసరిగా ఆసుపత్రుల వద్ద పాలియేటివ్‌ కేర్‌ (దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఉపశమనం కలిగించే సేవలు), చికిత్స పొంది పూర్తిస్థాయిలో కోలుకుని..తమ పనులు తాము చేసుకు నేలా ప్రోత్సహించే పునరావాస సంరక్షణ సేవలు కూడా ఏర్పాటు చేయబడతాయి.
జబ్బు వచ్చిన తర్వాత వైద్యం చేయడమే కాకుండా వ్యాధి నివారణ, ఆరోగ్య సంరక్షణ, ప్రోత్సాహక వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
వయసు పైబడిన ముసలివారికి కలిగే దీర్ఘకాలిక వ్యాధులకు అవసరమైన వైద్యం కూడా అందుబాటులోకి వస్తుంది. వీరి జీవితానికి కావలసిన ఆర్థిక, సామాజిక ఉపశమన సదుపాయాలు కూడా కలిగించబడతాయి.
ప్రభుత్వాలు చేయాల్సినవి..
ఆరోగ్యం ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా ఉండాలంటే ఆరోగ్య మన్నది ఒకహక్కుగా ఉండాలి. ఈ హక్కును కల్పించడం కొరకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య హక్కు చట్టాన్ని తీసుకురావాలి. ఈ చట్టాన్ని ప్రభుత్వాలు ఆచరణలో పెట్టాలి. ఆ¸రోగ్యమన్నది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉండాలి. ప్రస్తుతం మన కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ కోసం స్థూల జాతీయ ఉత్పత్తిలో 1.2శాతం నుంచి 2.1శాతం వరకు ఖర్చు చేస్తుంది. దిగువ,మధ్య ఆదాయ దేశాలు చేస్తున్న సగటు వ్యయం 5.2శాతంగా ఉంది.పొరగు దేశాలతో పోల్చుకుంటే మన ఆరోగ్య రంగం బడ్జెట్‌ ఎంత తక్కువగా వుం దన్నది ఈసంఖ్యలు తెలుపుతున్నాయి. Ê ఆరోగ్య రంగ కేటాయింపులను శరవేగంగా పెంచుతూ జాతీయ స్థూల ఆదాయంలో 3.5శాతానికి చేరేలాగా చూడాలి. ఆరోగ్య వ్యయం కోసం రాష్ట్రాలు ప్రత్యేక ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకోవాలి.
ఆరోగ్యంపై జరిగే ఖర్చులు భరించడం వల్ల ఎవరూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోకూ డదు. వైద్య ఖర్చుల కొరకు ప్రజలు వారి జేబులో నుంచి ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండకూడదు. ప్రస్తుతం ఉన్న 80శాతం నుంచి కనీసం 25శాతానికి వెంటనే తగ్గేలాగా చూడాలి.
ఖాళీగా ఉన్న పోస్టులను పూరించాలి. ఆరోగ్య కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూడాలి. ఆరోగ్య సదుపాయానికి కూడా ఖాళీ స్థానం ఉండకుండా చూడాలి. ప్రజారోగ్య సంస్థల్లో కాంట్రాక్టు సిబ్బందితో పూరించకూడదు. కాంట్రాక్టు ఆరోగ్య కార్యకర్తలందరినీ క్రమబద్ధీకరించాలి. తగిన వేతనాలు, కార్మిక చట్టాల ప్రకారం రక్షణ కల్పించాలి.
ఆరోగ్య వ్యవస్థలను నిర్వహించడం కోసం ఆర్థిక,పరిపాలన అధికారాలను ప్రాంతీయ సంస్థలకు అప్పజెప్పాలి.
మందులను సరసమైన ధరలకు అందు బాటులోకి తేవాలి.నాణ్యతలో తేడా లేకుండా చూడాలి.
ఆరోగ్య సంరక్షణ ప్రధానంగా ప్రభుత్వ బాధ్యత. పిఎం.జె.ఎ.వై.ఆరోగ్యశ్రీ, పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌లవంటి ప్రభుత్వ నిధులతో కూడిన ఆరోగ్య బీమా పథకాలను దశల వారీగా తొలగించాలి.
మెరుగైన క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రైవేట్‌ హెల్త్‌కేర్‌ సెక్టార్‌ను నియంత్రించాలి.
మెడికల్‌ ఎడ్యుకేషన్‌ యొక్క వాణిజ్యీకరణను ఆపాలి.
వైద్యసేవలను ప్రజల హక్కుగా గుర్తించి, మనదేశంలో ఆరోగ్యహక్కు చట్టాన్ని తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రం రాజస్థాన్‌. ఈ ఆరోగ్య హక్కు బిల్లుని 2023,మార్చి 21న రాజస్థాన్‌ అసెంబ్లీ ఆమోదించింది. ప్రస్తుతం ఆచరణ ప్రారంభదశలో ఉన్నారు. అలాగే మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యహక్కు చట్టాన్ని తీసుకురావాలి. ప్రస్తుతం మనం శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికల వాడి వేడి వాతావరణంలో ఉన్నాం. ఎన్నికలలో నిలబడిన పార్టీల వారు నెగ్గితే ఏ కార్యక్రమాలు అమలు చేయబోతున్నారన్న విషయాన్ని వారివారి ఎన్నికల మేనిఫెస్టోలో తెలియజేసుకుంటారు.ఆరోగ్య హక్కు చట్టాన్ని కూడా వారి ఎన్నికల మేనిఫెస్టోలో పొందు పరచాలి. ఆమేరకు ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేయాలి. ఆరోగ్యహక్కు చట్టాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన వారికే ఓటు వేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగబద్ధమైన విభజన బాధ్యతలు ఆరోగ్యాన్ని ఉమ్మడి జాబితాలో ఉంచాయి. ఈ ఆరోగ్య హక్కును సాధించే దిశగా ఇరు ప్రభుత్వాలు కలసి పనిచేయాలి.
వైద్యం కోసం స్వంత ఖర్చులు..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రసూతి మరణాల రేటు,శిశు మరణాల రేటుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఇది హర్షించదగ్గ పరిణామం. అయితే, రెండు ప్రధాన పోకడలు తీవ్రమైన ఆందోళనను సూచిస్తున్నాయి.ఒకటి సంక్రమిత వ్యాధులు. రెండు, ప్రజలకు స్వంత జేబుల్లోంచి అయ్యే వైద్య ఖర్చు.మొదటి విషయానికి వస్తే,సంక్రమిత వ్యాధు లు మొత్తం వ్యాధి భారంలో మూడిరట ఒక వంతు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ భారం 29శాతం కాగా, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఇది కేవలం 13 శాతం మాత్రమే. కుష్టు వ్యాధులు, టీబీ,ఎయిడ్స్‌ (హెచ్‌ఐవి) ఐరన్‌ లోపం,రక్తహీనత, ముందస్తు జనన సమస్యలు, శ్వాస కోశ ఇన్ఫెక్షన్లు, అతిసార వ్యాధులు, పోషకార లోపం,కిడ్నీ జబ్బులు, మద్యం, మాదక ద్రవ్యాల వినియోగం వంటి మొదటి 10 ప్రాణాంతక వ్యాధులలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా కొనసాగుతుంది. రెండవది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ఆరోగ్యశ్రీ కింద 90 శాతం కుటుంబాలు అందులో ఉన్నప్పటికీ వైద్యం కోసం తమ సొంత జేబు నుంచి పెట్టే ఖర్చు చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది.
వ్యాధుల భారం.. ఆరోగ్య అసమానతలు
రాష్ట్ర విభజన (2014)తర్వాత ఆంధ్రప్రదేశ్‌ తన మొత్తం రాష్ట్రబడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయిం చింది కేవలం 4.2శాతం మాత్రమే.కరోనా సమయంలో రెండు సంవత్సరాలు కొంచెం ఎక్కువ 6శాతం 2021-22లో కేటాయించారు. జాతీయ ఆరోగ్య వ్యయం 40.8శాతం అయితే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 30శాతం మాత్రమే ఖర్చు పెడుతోంది. అయితే ఇదంతాఎక్కువ భాగం ఎక్కడ నుండి వస్తోందని చూస్తే దాదాపు 67శాతం తమ స్వంత జేబుల్లోంచి వైద్య ఖర్చులు భరించాల్సి వస్తోంది.ఇది జాతీయ సగటు (48.8శాతం) కన్నా ఎక్కువే. దీని ప్రభావం అన్ని వర్గాలు, కులాలు, జెండర్స్‌ మీద ఒకే రకంగా ఉందా అంటే కాదు అనే చెప్పాలి.కింది వర్గాలు, కులాల మీద విపరీత మైన భారం పడుతోంది. వీళ్లకు ఖర్చులు సమ కూర్చుకోగలిగితే వైద్యం దొరుకుతుంది.. లేకుంటే వైద్యం జోలికి వెళ్ళలేరు. ఇవన్నీ ఏమి సూచిస్తు న్నాయంటే ఆంధ్రప్రదేశ్‌లో అట్టడుగువర్గాలు, కులాలు, స్త్రీ-పురుషులకు పెరిగిన వ్యాధి భారం, అసమానతలు,దుర్బలత్వాన్ని స్పష్టంగా సూచి స్తుంది.మనదేశంలో ఆరోగ్య సంరక్షణ, వైద్య చికిత్స ప్రక్రియలో ప్రజలు ఏమేరకు పేదరికానికి గురవుతున్నారో వ్యయ విశ్లేషణ వెలుగులోకి తెస్తుంది. జనాభాలో 3 శాతం-4 శాతం మంది సగటున ప్రతి సంవత్సరం దారిద్య్ర రేఖకు దిగువన నెట్టివేయబడుతున్నారని అంచనాలు చూపిస్తున్నా యి. దీని ఫలితంగా ఆరోగ్య అసమానతలు పెరుగుతున్నాయని ఈ పరిస్థితికి ముఖ్యమైన కారణం ఇన్‌-పేషెంట్‌ (ఆసుపత్రిలో చేరి, చికిత్స చేయించుకునేవారు) ఆసుపత్రి చికిత్స అన్న విషయం ప్రాథమిక అధ్యయనాలు చెపుతున్నాయి. ఇన్‌ పేషంట్‌ ఆసుపత్రి చికిత్స చాలా ఖర్చుతో కూడుకొన్న కారణంగా వైద్య ఖర్చులు కింది వర్గా లకు భారమయ్యాయి. కోవిడ్‌-19కోసం సగటు వైద్య వ్యయం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన రోగులు రూ.17,000 చెల్లిస్తే, ప్రైవేట్‌ ఆసుపత్రుల విషయంలో ఇది ఐదు కంటే ఎక్కువ రెట్లు. అంటే వారికి సగటున రూ.90,000 ఖర్చు అయిందని కరోనా ఎకల్‌ మహిళ పునరివాసన్‌ సమితి,జన్‌ ఆరోగ్య అభియాన్‌ చెప్తున్నాయి. గ్రా మీణ ప్రాంతాల్లో ఆసుపత్రి చికిత్సకు రూ.13,010 సగటున ఖర్చయితే,పట్టణ ప్రాంతాల్లో రూ.30, 112 ఖర్చవుతోంది. ముఖ్యంగా 50శాతం పైగా వ్యయం మందుల మీదే ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
యూనివర్సల్‌ హెల్త్‌ కేర్‌..
వ్యాధి ప్రారంభమైన తర్వాత ఆసుపత్రి చికిత్సపై దృష్టి పెట్టడం కంటే వ్యాధిని నివారించేందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అనేక అధ్యయనాలు సూచించాయి. నిర్ణయాత్మకంగా జీవితాన్ని, శ్రేయస్సును పొడిగించగల ముందస్తు రోగ నిర్ధారణ, చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టడం ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యం. ఔట్‌ పేషంట్‌ చికిత్స లో ప్రధానంగా మందులకు వివిధ రకాల టెసు ్టలకు అయ్యే ఖర్చు వల్లే పేదరికంలోకి నెట్టబడు తున్నారు. కార్పొరేట్‌ వైద్యం, ఇన్సూరెన్సు ద్వారా నడిపిస్తున్న ఆరోగ్య సేవలు ఆరోగ్య సంరక్షణ చేయ కపోగా, అసమానతలు, అంతరాలు పెంచుతున్నా యి.ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ప్రాథమిక స్థాయి నుండి తృతీయ స్థాయి వరకు ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును పటిష్టం చేయాలి. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ దిశగా (యూనివర్శల్‌ హెల్త్‌ కేర్‌) ప్రభుత్వాలు అడుగులు వేయడం తప్ప వేరే మార్గం లేదు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ నమూనాలను అధిగమించి, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ వైపు అడుగులు వెయ్యాలి.
మానసిక ఆరోగ్యం..
మానసిక ఆరోగ్యం అనేది మానసిక శ్రేయస్సు స్థితి. ఇది ప్రజలు జీవితంలోని ఒత్తిళ్లను ఎదుర్కొనే క్రమంలో వస్తోంది.వారివారి సామర్థ్యాలను గ్రహించడానికి,బాగా నేర్చుకోవడానికి, బాగా పని చేయడానికి ఒత్తిడికి గురవుతున్నారు. దీని ప్రభా వం సమాజంపై ఉంటుంది. ఇటీవల అనేకమంది విద్యార్థుల నుంచి స్త్రీలు,యువకులు, మధ్య వయ స్కులు, వృద్ధులు..ఒకరని కాదు..అన్ని వయస్సుల వారూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇది అంతర్గత సమస్య అయినా..అది బాహ్య ప్రభా వాన్ని కలుగజేస్తుందనేది అంతే వాస్తవం. మానసిక ఆరోగ్యంతోనే మనశ్రేయస్సు సమగ్రతను సంతరించుకుంటుంది. ఏసమయంలోనైనా, మాన సిక ఆరోగ్యాన్ని రక్షించడానికి, అణగదొక్కడానికి విభిన్నమైన వ్యక్తిగత,కుటుంబం,సంఘం, నిర్మాణా త్మక కారణాలు మిళితం కావచ్చు. చాలా మంది వ్యక్తులు స్థితిస్థాపకంగా ఉన్నప్పటికీ, పేదరికం, హింస, వైకల్యం, అసమానతలతో సహా ప్రతికూల పరిస్థితులకు గురయ్యే వ్యక్తులు మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది.అనేక మానసిక ఆరోగ్య పరిస్థితు లను సాపేక్షంగా తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు.,అయినప్పటికీ ఆరోగ్య వ్యవ స్థలు గణనీయంగా తక్కువగా వనరులను కలిగి ఉన్నాయి. చికిత్స అంతరాలు ప్రపంచవ్యాప్తంగా విస్తతంగా ఉన్నాయి. డెలివరీ చేయబడినప్పుడు మానసిక ఆరోగ్య సంరక్షణ తరచుగా నాణ్యతలో తక్కువగా ఉంటుంది. మానసిక ఆరోగ్య పరిస్థితు లు ఉన్న వ్యక్తులు చులకనగా చూడబడుతున్నారు. హేళనకు గురవుతున్నారు. వ్యాసకర్త : అధ్యక్షులు, ప్రజారోగ్య వేదిక.(ప్రజాశక్తి సౌజన్యంతో..)- డాక్టర్‌ ఎం.వి.రమణయ్య