నాలుగున్నరేళ్లలో సంక్షేమ ఫలాలెన్నో..
సంక్షేమం పథకాలు అందరికీ అందాలి..కులం, మతం, ప్రాంతం, పార్టీలు,రాజకీయాలకుతీతంగా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు చేరాలి..పార్టీలకతీతంగా ప్రతి పేద వాడూ ధైర్యంగా బతికే అవినీతి రహిత,స్వచ్ఛమైన పరిపాలన తీసుకు వస్తాం..` సీఎం.జగన్
అభివృద్ధి,సంక్షేమం ఈ రెండిరటి ఫార్ములానే ప్రామాణికంగా తీసు కుని జగన్ పాలన కొనసాగుతోంది. తండ్రి నుంచి రాజకీయ వార సత్వాన్ని అందిపుచ్చుకున్న జగన్..వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బాటలోనే అడుగులు వేస్తున్నారు.ఎన్నికల ముందు ఆచరణ సాధ్యమయ్యే హామీలనే జగన్ ఇచ్చారు. ఇప్పుడు వాటిలో చాలా వరకు అమలు చేయడం సులు వైందని అంటున్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి కేబినెట్లోనే 14 మంది బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అంటే 56శాతం వారికే అవకాశమిచ్చారు.2022 ఏప్రిల్ 11న మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో ఈశాతాన్ని ఏకంగా 70కిపెంచారు. కేబినెట్ నుంచే సామాజిక న్యాయాన్ని మొదలు పెట్టారు.అటు రాజ్యసభకు 8సీట్లలో నాలుగింటిని బీసీలకే ఇచ్చారు. నాలుగేళ్లన్నర పాలనలో సీఎంజగన్ ఏపీలో చాలా సమస్యలకు పరిష్కారం చూపారం టున్నారు. నిషేధిత జాబితా భూముల సమస్యను సులువుగా పరిష్కరించారు.3లక్షల ఎకరాలను ఆజాబితాను తొలగించారు.చుక్కల భూములు,షరతులుగల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారుజగన్. పారిశ్రామికంగానూ ముందడుగు వేశామని వైసీపీ నేతలు అంటు న్నారు.ఇందుకు నిదర్శనం కొత్తగా 4పోర్టులు, 10ఫిషింగ్‌హార్బర్లు,6 ఫిషింగ్ ల్యాండ్‌లు, 3ఎయిర్‌పోర్టుల నిర్మాణం చేపట్టామని గుర్తు చేస్తున్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌తో పెట్టుబడులను ఆకర్షించగలిగారు. పౌర సేవల్ని ఏఊరికి ఆ ఊళ్లోనే అందించడానికి 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయి.వీటిలో 1.34లక్షల మంది యువత ప్రభుత్వోద్యోగులుగా చేరారు. ప్రభుత్వ సేవల్ని ఇంటింటికీ నేరుగా అందించడానికి 2.65లక్షల మందితో వాలంటీర్లను ఏర్పాటు చేశారు.10,592 గ్రామ,పట్టణ హెల్త్ క్లినిక్‌లు పెట్టించారు. పేదలకు రేషన్ సరుకులు ఇంటి ముందుకే వస్తున్నాయి.దీనికోసం 9,260 డెలివరీ వ్యాన్‌లు పనిచేస్తున్నాయి.ఏపీ మోడల్ అన్న చర్చ తీసుకురావడానికి కారణం పాలనలో సీఎం తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలే. సచివాలయ వ్యవస్థ నుంచి ఆర్‌బీకే,రేషన్ డోర్‌డెలివరీ,వాలంటీర్ వ్యవస్థ..ఇలా అన్నిటినీ కొన్ని రాష్ట్రాలు స్టడీ చేశాయి. 2014ఎన్నికల్లో అధికారంలోకి వస్తారని ఆశించినా..అప్పుడు అపోజిషన్ కే పరిమితం అయ్యారు జగన్. ఓ వైపు కోర్టు కేసులు, మరోవైపు సుదీర్ఘ పాదయాత్ర ఇలా చాలా ఆటుపోట్ల తర్వాత 2019లో ప్రజావిశ్వాసం పొందారు. ప్రజల నమ్మకం పొందడమే రాజకీయ నాయకులకు ముఖ్యం. ముఖ్యంగా అధికారంలో ఉన్న వారికి అదో జడ్జిమెంట్‌గా మారుతుంది. నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు జగన్. పేదలందరికి ఇళ్లు,అమ్మఒడి,పెన్షన్లపెంపు,ఫీజురీఇంబర్స్ మెంట్స్, వైఎస్‌ఆర్ చేయూత,వైఎస్‌ఆర్ రైతు భరోసా, వైఎస్‌ఆర్ ఆసరా వంటి పలు హామీలను ఎన్నికల సమయంలో ఇచ్చిన జగన్..అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని అమలు చేసే ప్రయ త్నం చేశారు. ఇప్పటి వరకు సంక్షేమ పథకాలద్వారా దాదాపు రెండులక్షల పదివేలకోట్ల రూపాయలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ విధానం ద్వారా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే సర్కార్ జమచేసింది. ఇదే అంశాన్ని వచ్చే ఎన్నికల్లో వైసీపీ తమ అస్త్రంగా వినియోగించుకోనుంది.
2019 మేలో జగన్ అధికారం చేపట్టగా.. ఏడాదిలోపే 2020 మార్చ్ నుంచి కరోనా ప్రపంచంపై తీవ్రమైన ఎఫెక్ట్ చూపించింది. అది ఏపీ ఆర్థిక, ఆరోగ్య రంగాలపై ప్రభావం చూపింది. ఒకదశలో ఏపీనుంచి హైదరా బాద్‌కు రోగులు క్యూ కట్టారు.అప్పుడు రాక పోకలు నిలిచిపోవడంతో చాలాఇబ్బందులు ఎదురయ్యాయి.అలాంటి పరిస్థితులనుంచి ఏపీని ఆరోగ్యరంగంలో ముందుకెళ్లే దిశగా సీఎం చర్యలు చేపట్టారు. ఒకదశలో దేశంలోనే ఎక్కువ కరోనా టెస్టులు చేసిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వసతి కల్పించారు. జిల్లాకు ఒకమె డికల్ కాలేజీ నిర్మించాలని నిర్ణయిం చారు.ఇప్పుడు ఉన్న మెడికల్ కాలేజీలకు అదనంగా 17మెడికల్ కాలేజీల ఏర్పాటు చేయలని జగన్ డిసైడ్ అయ్యారు. వీటిలో కొన్నింటికి కేంద్రం నుంచి అనుమతులు రాగా కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను సైతం తీసుకొచ్చారు జగన్. ఫ్యామిలీ ఫిజీషియన్ డాక్టర్ విధానంలో డయాబెటిక్, హైపర్ టెన్షన్‌తో పాటు పలు అసాంక్రమిక వ్యాధులను గుర్తించి వైద్యం చేస్తున్నారు. ప్రతి పీహెచ్సీకి ఇద్దరు డాక్టర్లను నియమించారు. మండలానికో 104,108 వాహనాలను పెట్టిం చారు. దేశంలోనే ఏరాష్ట్రంలోనూ అమలుచేయని విధంగా గ్రామ/వార్డు సచివాలయవ్యవస్థ ద్వారా సేవల్లో కొత్తపంథా తెరపైకి వచ్చింది. సామాన్య జనానికి సులువుగా సేవలు అందే పరిస్థితి వచ్చింది. సంక్షేమం,అభివృద్ధి రెండు కళ్ల మాదిరిగా పాలన సాగుతోంది. ప్రతి తల్లీ తన బిడ్డను బడికి పంపితే అమ్మఒడి కింద 15వేల రూపాయలు అందిస్తున్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్,వసతి దీవెనకు నేరుగా సొమ్ములిస్తున్నారు. విదేశీ విద్యాదీవెన ద్వారా విద్యార్థులకు చేయూత అందిస్తున్నారు. అటు రైతులకూ వైఎస్‌ఆర్ రైతు భరోసా, వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా పథకం,వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు,ఇన్ పుట్ సబ్సిడీ, డ్రిప్,స్ప్రింక్లర్ల అందజేత,విత్తన సబ్సిడీ ఇవన్నీ అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలను నగదు బదిలీ ప్రక్రియ ద్వారా అమలు చేయడంవల్ల అవినీతికి,అక్రమాలకు తావు లేకుండా పోయిందని,రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే సహాయం ప్రజానీకానికి ఇంత సాఫీగా అందడం ఇదే సర్కార్ హయాంలో తొలిసారి అని అంటున్నారు.
వైద్యవిద్యలో నవశకం..
రాష్ట్ర చరిత్రలోతొలిసారిగా 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం జగన్ ప్రారం భించారు. విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని తన చేతుల మీదుగా ప్రారంభించిన సీఎం..అనంతరం వర్చువల్ విధానంలో రాజమహేంద్రవరం,ఏలూరు,మచిలీపట్నం, నంద్యాలలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. అంతేకాకుండా విజయనగరం మెడికల్ కాలేజీలో ఫొటో ఎగ్జిబిషన్‌నుతిలకించారు. కాలేజీ భవనంలోని వివిధ విభాగాలకు సంబంధించిన గదులను పరిశీలించి ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు.
17మెడికల్ కాలేజీల కోసం రూ.8,480కోట్లు
స్వాతంత్య్రం వచ్చాక మన ఏపీలో కేవలం 11మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, ఈ నాలుగున్నరేళ్లలో మన ప్రభుత్వం 17మెడకల్ కాలేజీలు ప్రారంభించేందుకు ప్రణాళిక చేశామని,అందుకోసం రూ.8,480 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు.అందులో భాగంగా ఐదు కాలేజీలు ప్రారంభించటం సంతోషంగా ఉందని, వచ్చే ఏడాది మరో 5కాలేజీలను ప్రారంభిస్తామని,ఆమరుసటి ఏడాది మరో 7కాలేజీలు ప్రారంభించడానికి సీఎం ప్రతిసాదించారు. ఇప్పటి వరకు ఉన్న మెడికల్ కాలేజీలలో 2,185 సిట్లు కేటాయించగా, కొత్త కాలేజీల రాకతో 4,735కి సీట్ల సంఖ్య చేరింది. అంతేకా కుండా మలో18 నర్సింగ్ కాలేజీలను కూడా అందుబాటుకి తీసుకువస్తున్నట్లు సీఎం వెల్లడిరచారు. అంతేకాకుండా ఈకాలేజీల ద్వారా పీజీ మెడికల్ సీట్ల సంఖ్యను నాలుగేళ్లలో 966 నుంచి 1,767కి పెంచను న్నారు. మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను మెరుగుపరిచేందుకే పని చేస్తున్నామని ప్రతి విద్యార్ధి ఈ ఆవకాశాన్ని ఉపయోగించుకుని ఈ సమాజంలో ఒక మంచి డాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకుని సేవ చేయా లనదే సీఎం జగన్ ఆకాంక్ష!
వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు
నాలుగేళ్లలో ఏకంగా దాదాపు 53వేలకు పైగా వైద్య పోస్టుల భర్తీ చేశారు.ఎప్పటి ఖాళీలు అప్పుడే యుద్ధప్రాతిపదికన నియామకాలు కోసం ప్రత్యేకంగా రిక్రూట్ మెంట్ బోర్డ్ కూడా ఏర్పాటు చేశారు. రూ.16,852 కోట్లతో 17కొత్త వైద్య కళాశా లలు,వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతో పాటు నాడు-నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రులకు జవసత్వాలు చేశారు. గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు చేశామని, 12రకాల వైద్య సేవలు,14రకాలపరీక్షలు,105రకాల మందు లతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్‌కాన్సెప్ట్ అమలు చేస్తున్న ప్రభుత్వం మనదే!. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్‌సీ వైద్యులు వెళ్తారని దీని ద్వారా రానున్న 6నెలల్లో పేదలకు మంచి వైద్యం అందించి ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మారనునా గ్రామస్థాయిలో ఆశా వర్కర్ల ద్వారా సేవలు అందిస్తున్నామని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా సరఫరా చేస్తున్నారు.వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి ఏకంగా3,257కి పెంచారు.40లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కోసం రూ.8వేలకోట్ల వెచ్చించామని చెప్పారు.తాజాగాఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి పేద వాడికి రూ.1ఖర్చు లేకుండా పరీక్షలు చేసి చికిత్స అందిస్తుండటం విశేషం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భృతి చెల్లిస్తున్నారు. ఇప్పటివరకూ 17.25లక్షల మందికి రూ.1,074.69 కోట్లు ప్రభుత్వం అందించింది.108,104 వాహనాలు సంఖ్యను కూడా పెంచారు.
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
నాలున్నర ఏళ్లలో విద్యారంగంలో అనేక రకాల విప్లవాత్మకమైన మార్పులు తీసుకొ చ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్‌గా తీర్చిది ద్దేందుకు సీఎం వైయస్ జగన్ మరిన్ని చర్యలు ప్రారంభించారు. ప్రపంచస్థాయిలో పోటీని తట్టుకునేలా,మారు తున్న టెక్నాలజీరంగంలో విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్దేలా మరో అడుగు ముందుకేశారు. భవిష్యత్తు టెక్నాలజీ రంగానికి అవసరమయ్యే నైపుణ్యాలతో ప్రభుత్వవిద్యార్థులను తీర్చిదిద్ది వారికి హైఎండ్ టెక్నాలజీ రంగంలో ఉన్నత ఉద్యో గాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
ఈతరం పిల్లలకు గ్లోబల్ చదువులు
దీనికోసం ప్రభుత్వంలోని ఉన్నతాధికారు లు,గ్లోబల్‌టెక్ కంపెనీల ప్రతినిధులతో ఉన్నత స్థాయి వర్కింగ్ గ్రూపును ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులను తీసుకు వచ్చారు. అమ్మఒడి,విద్యాకానుక, వసతిదీవెన, విద్యా దీవెన లాంటి పథకాలను అమలు చేయడమే కాకుండా పాఠ్యప్రణాళిక పరంగా,మౌలిక సదుపాయాల పరంగా ఎన్నెన్నో మార్పులు తీసుకువస్తున్నారు.
నవశకంలో తెచ్చిన మార్పులివే..
దీంట్లో భాగంగా 2019-20 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోని 41 లక్షలమంది విద్యార్థులకు ఇంగ్లిషు మీడియం చదువులు అందుతు న్నాయి. జాతీయస్థాయి, ప్రపంచస్థాయి విద్యా ర్థులతో పోటీపడేలా అన్ని ప్రభుత్వ పాఠశా లలకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్ వచ్చేలా 2022-23లో ప్రభుత్వం చర్యలు ప్రారం భించింది. ప్రపంచస్థాయిలో ప్రభుత్వ పాఠశా లల విద్యార్థులు పోటీపడాలంటే ఇంగ్లిషులో ప్రావీణ్యం చాలా కీలకం.పాఠ్య ప్రణాళిక, మౌలిక సదుపాయాలు,మాన వవన రులు, లెర్నింగ్ కంటెంట్,ల్యాబులు తదితర అంశాలు పాఠశాలల్లో ఎలా ఉండా లన్న దానిపై ఈ వర్కింగ్ గ్రూపు ఖరారు చేయనుంది.
‘అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారతే ధ్యేయంగా..ఖాతాల్లోకి రూ.1,353.76 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ అందజేసింది.నిజమైన వ్యాపార వేత్తలుగా మార్చాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం అమలు విజయవంతంగా సాగుతోంది. మన ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలు వారి కాళ్ళ మీద వారు నిలబడేలా,వారి జీవనోపాధి మెరుగుపరుస్తూ..బహుళ జాతి,దిగ్గజ కంపెనీలు,బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ వంటి పథకాలతో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధికి సీఎం జగన్ బాటలు వేశారు.ఈప్రభుత్వం చొరవతో బ్యాంకుల లోవడ్డీ రేట్లు తగ్గింపజేయడంతో అక్కచెల్లె మ్మలపై ఏకంగా రూ.1,224కోట్ల మేర వడ్డీ భారం తగ్గింది. ప్రభుత్వ సహకారంతో పశువుల కొనుగోలు,కిరాణా దుకాణాలు,వస్త్ర వ్యాపారాల వంటి వివిధ వ్యాపారాలు చేసుకుంటున్న 16,44,029 మంది అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.7వేల నుంచి 10వేల వరకు అదనపు ఆదాయం పెరిగింది. అమూల్‌తో ఒప్పందం కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి లీటర్ పాలపై రూ.20వరకు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. – గునపర్తి సైమన్