దేశ రక్షణ పోరాటంలో ఆదివాసీలు భాగం కావాలి
స్వాతంత్య్రానంతరం భారతదేశం నిర్మించుకున్న పరిశ్రమలు,ఆర్థిక సంస్థలైన ఇన్సూ రెన్స్, బ్యాంకులు, కోట్ల మంది ప్రయాణ సాధనమైన భారతీయ రైల్వేలు,పెట్రోలియం,గ్యాస్,విద్యుత్ ఇంధన సంస్థలు,విద్య,వైద్యంతో సహా సర్వమూ మోడీ ప్రభుత్వం దేశ,విదేశీ కార్పొరేట్లపరం చేస్తు న్నది. విదేశీ కార్పొరేట్ కంపెనీలతో కుమ్మక్కైన స్వదేశీ రిలయన్స్ వంటి కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వరంగాల్ని అప్పగిస్తున్నది.వ్యవసాయ రంగా న్ని దేశ, విదేశీ కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెట్టేం దుకు మూడు వ్యవసాయచట్టాలు చేసింది. కార్మి కులు, రైతులను కార్పొరేట్ కంపెనీలకు కట్టు బానిసలుగా మార్చే చట్టాలు చేసింది. నిరసన తెలియజేసే హక్కు లేకుండా బ్రిటిష్ ప్రభుత్వం కంటే ప్రమాదకర‘ఉపా’ చట్టాలు చేసింది. ప్రజాస్వా మిక పునాదులపై దాడికి దిగింది. అమా యకులైన ఆదివాసీల పక్షాన నిస్వార్ధంగా నిలుస్తున్న హక్కుల కార్యకర్తలను జైళ్ల పాల్జేస్తోంది. జీవిత మంతా గిరిజన హక్కుల కోసం పోరాడిన 80 ఏళ్ల ఫాదర్ స్టాన్స్వామిని జైల్లో పెట్టి చంపేసింది. రాజ్యాంగ హక్కులను ధ్వంసం చేస్తున్నది. పౌరుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలగడంతో ‘భారత దేశాన్ని రక్షించండి’ అంటూ కార్మికులు, రైతులు ఆగస్టు 9న ప్రభుత్వ ఆఫీసుల దిగ్భ్రందించారు. ఏజెన్సీ లోని విలువైన గనులు, ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం చేయని కుట్రల్లేవు. ఆ కుట్రలకు కళ్లెం వేసేందుకు, కార్పొరేట్ శక్తులు అడవిలో అడుగు మోపకుండా అడ్డుకొనేందుకు ఆదివాసీలూ దేశ రక్షణ పోరాటంలో భాగస్వాములు కావాలి.
అటవీ సంపద కార్పొరేట్ పరం
ఆదివాసీలు బతుకుతున్న అడవులను మైనింగ్ పేరుతో కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. అడవిపైవున్న హక్కును నిలబెట్టుకొనేందుకు పోరాడుతున్న గిరిజనులు, హక్కుల కార్యకర్తలపై బెయిల్ రాని భయంకరమైన ‘ఉపా’ చట్టం కింద కేసులు పెడుతోంది. బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్, అస్సాం,హర్యానా ప్రభుత్వాలు వేల మంది గిరిజను లను జైల్లో నిర్బంధించాయి. జార్ఖండ్లో 10 వేల మంది గిరిజనులపై గతంలో రాజద్రోహం నేరం కింద కేసు నమోదు చేసింది. ఆదివాసీలను ఉద్దరిస్తామని గద్దెనెక్కి ద్రోహానికి పాల్పడుతున్న పాలకవర్గ విధానాలను ప్రతిఘటించాలి. ఆది వాసీల హక్కులు దెబ్బ తీయబోమని, అటవీ సంప దను కార్పొరేట్లకు కట్టబెట్టబోమని, పెట్టిన కేసులు ఉపసంహరించుకుంటామని ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాలు ప్రకటించేలా ఆదివాసీలు గొంతు విన్పించాలి.
రిజర్వేషన్లు గల్లంతు
ఆదివాసీలకు, దళితులకు ఉద్యోగ భర్తీలో రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించింది. మోడీ ప్రభు త్వం వారికిప్పుడు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నది. జింక్, బాల్కో పరిశ్రమలను వాజ్పేయి ప్రభుత్వం దెబ్బ తీసింది. విశాఖ స్టీలుప్లాంట్ సహా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ అమ్మి తీరుతా మని మోడీ శపథం చేస్తున్నారు. 42 రక్షణ పరిశ్ర మలు అమ్మకానికి పెట్టారు. జీవిత బీమా(ఎల్ఐసి), జనరల్ ఇన్సూరెన్స్ రెండిరటినీ అంతం చేయ డానికి లోక్సభలో బిల్లుపెట్టారు. బ్యాంకులు కూడా ప్రైవేటుకు ఇచ్చేస్తామని నిర్ణయం చేశారు. విద్యుత్ పంపిణీ కూడా ప్రైవేటు వాళ్లకు ఇచ్చే చట్టం చేసింది. రైల్వేలో కొన్నిరూట్లు, కొన్ని స్టేషన్లు, రైల్ ఇంజన్లు, బోగీల నిర్మాణం ప్రైవేటుకు ఇచ్చే సింది. రైల్వేలో 3లక్షల ఉద్యోగులను తీసివేస్తామని ప్రకటిం చింది. రిజర్వేషన్లు అమలు చేయాల్సిన ప్రభుత్వ రంగం, ప్రభుత్వ సర్వీసులన్నింటినీ ప్రైవేటు పరం చేస్తే రిజర్వేషన్లు అమలు చేసేది ఎక్కడీ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు కానప్పుడు రిజర్వే షన్లకు విలువేం వుంటుంది? రిజర్వేషన్లు రాజ్యాం గంలో చెప్పుకోవడానికి ఉంటాయి తప్ప ఆచరణలో ఉండవు.
ప్రపంచబ్యాంకు బాటలో జగన్ ప్రభుత్వం
పాదయాత్ర, ఎన్నికల సందర్భంలో అధి కారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో 1.80లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి యువతకు న్యా యం చేస్తానని జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. మాట తప్పరు, మడమ తిప్పరని యువత నమ్మా రు. జాబ్ కేలండర్ విడుదలతో జగన్ ప్రభుత్వం అసలు నైజం బయటపడిరది. యువతలో ఆగ్రహం కల్గించింది. రాష్ట్రంలో 2.35లక్షలు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలున్నాయని ఆర్థికశాఖ నివేదిక ఇస్తే జగన్ 10వేలు ప్రకటించి యువత విశ్వాసంపై నీళ్లుజల్లారు. గ్రామ సచివాలయాల పోలీసు కానిస్టే బుళ్లతో లెక్క సరిపెట్టేశారు. టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సీ ఊసెత్తలేదు. టీచర్లు లేక జివికే స్కూళ్లు మూతపడ్డాయి.స్పెషల్ డిఎస్సీ వేయాలని డిమాండ్ చేస్తుంటే డిఎస్సీనే జగన్ లేపేశారు. మోడీ వలె ఉద్యోగులను తగ్గించే పనిలో జగన్ ఉన్నారు. ప్రపం చ బ్యాంకు చెప్పినట్లు రెగ్యులర్ ఉద్యోగులను తగ్గించి తక్కువ వేతనాలు, హక్కుల్లేని వారితో పనిచేయించు కోవాలని జగన్ ప్రభుత్వం చూస్తున్నది.
జీవో3రద్దు ఆదివాసీ రాజ్యాంగ హక్కును కాల రాయడమే
జీవో3 సుప్రీంకోర్టు రద్దు చేయడంతో 5వ షెడ్యూల్డ్ ఏరియాలో ఆదివాసీల రాజ్యాంగ హక్కు దెబ్బతిన్నది. ఏజన్సీలో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్ హక్కు పోయింది. కేంద్రంపై ఒత్తిడితెచ్చి రాష్ట్రపతి ఆర్డినెన్సు కోసం రాష్ట్ర ప్రభు త్వం ప్రయత్నించాలి. కానీ స్పందించలేదు. ఆ ప్రయత్నం చేయకపోగా ఒక పైపు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పు అమలుకు ఆదేశాలు ఇవ్వడం గిరిజనులను మోసం చేయడమే. సుప్రీం కోర్టు తీర్పునకు ముందు డిఎస్సీలో సెలెక్ట్ అయిన వారికి టీచర్ ఉద్యోగాలు ఇవ్వకపోవడం మరీ అన్యాయం. రిజర్వేషన్లు లేకుండా చేయాలనే బిజెపి వైఖరికి జగన్ ప్రభుత్వం బాసటగా నిలబడిరది.
షెడ్యూల్ ఏరియాలో అర్హత గల గ్రామాలను కలపాలి
యాభై శాతం పైన గిరిజనులు వుండి, 5వషెడ్యూల్డ్ ఏరియాకు ఆనుకొని వున్న గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో కలిపే ప్రయత్నం జగన్ ప్రభు త్వం చేయడంలేదు. రెండేళ్ల క్రితం గిరిజన సలహా మండలిలో కొన్ని గ్రామాలు షెడ్యూల్డ్ ఏరియాలో కలుపుతామని తీర్మానం చేసినట్లు ప్రకటించారు. అర్హత వున్న గ్రామాలన్నీ షెడ్యూల్డ్ ఏరియాలో కలపాలని డిమాండ్ చేయడంతో,సమగ్ర సర్వే జరిపి చేస్తామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి పష్ప శ్రీవాణి ప్రకటించారు. నిజంగానే చేస్తారని గిరిజనులు ఎదురు చూస్తున్నారు. భూమి, జనాభా రికార్డులన్నీ ప్రభుత్వం వద్దే ఉన్నాయి. వారం పది రోజుల్లో పూర్తి చేయాల్సిన సర్వేను ఏళ్లు గడుస్తున్నా చేయడంలేదంటే వైసిపి ప్రభుత్వంపై భూస్వాములు, గిరిజనేతర పెత్తందార్ల ఒత్తిడి వుందని అర్ధమ వుతుంది.
పోలవరం నిర్వాసితులనునిలువునా ముంచేశారు
గనులు తవ్వినా, ప్రాజెక్టులు కట్టినా, పరిశ్రమలు నిర్మించినా నిర్వాసితులు నిలువ నీడ లేకుండా పోతున్నారు. పోలవరంలో ముంచే యడం ఖాయమని తెలిసి, గ్రామ సభల్లో ప్రాజెక్టు వద్దని గిరిజనులు తీర్మానాలు చేశారు. గిరిజన గ్రామ సభలు ప్రాజెక్టు అంగీకరించినట్లు తీర్మానా లు తారుమారు చేసి రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. రోజూ పోలవరంపై సమీక్ష చేసిన చంద్రబాబు లక్ష గిరిజన కుటుంబాల పునరావాసం గురించి 5ఏళ్లలో ఒక్క రోజూ సమీ క్షించలేదు. మొత్తం పునరావాసానికి అయ్యే ఖర్చు రూ. 33 వేల కోట్లు ఇచ్చేది లేదని మోడీ ప్రభుత్వం తెగేసి చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. పునరావాసం పూర్తి చేయకుండా ప్రాజెక్టు నిర్మాణం చేయం అని వాగ్దానం చేసిన జగన్ గిరిజనులను ప్రాజెక్టులో నిలువునా ముంచేశారు. పోలవరం నిర్వాసితులను బిజెపి, టిడిపి, వైసిపి దారుణంగా మోసం చేశాయి. గిరిజనుల బతుకులు, వారి ప్రాణాలకు విలువ ఇవ్వడంలేదు.
కార్మిక, కర్షక ఉద్యమంలో భాగం కావాలి
మోసపు మాటలతో గిరిజనులకు నష్టం,కష్టం కలిగించడమే గాక దేశ, విదేశీ కార్పొ రేట్లకు ఆదివాసీలను బలిచ్చే చర్యలు మానుకోవాలి. ఆదివాసీల భూమిని కార్పొరేట్లుకు ఇవ్వరాదు. విద్య,వైద్యం,పరిశ్రమలు,రైలు,బ్యాంకులు,ఇన్సూరెన్స్, విద్యుత్,వ్యవసాయం కార్పొరేట్లకు ఇవ్వొద్దు … అని ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నినదిం చాలి. పోలవరం నిర్వాసితులకు పునరావాసం యుద్ధప్రాతిపదికన కల్పించాలి. జీవో 3పై రాష్ట్ర పతి ఆర్డినెన్సు తీసుకువచ్చి గిరిజ నుల రాజ్యాంగ హక్కును కాపాడాలి. 50 శాతానికి పైగా జనాభా వున్న గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చాలి.స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయా లి …అని దేశ రక్షణ కోసం ఆగస్టు 9న మండ లాఫీసు వద్ద జరిగే ధర్నాలో గిరిజనులంతా భాగస్వాములు కావాలి.
-ఎం.కృష్ణ మూర్తి