దేశ చరిత్రలోనే తొలిసారిగా..

చరిత్రలోనే తొలిసారి పేదలకు 31.19 లక్షల ఇంటి స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ అందజేస్తున్నాం.58 నెలల్లో ప్రతి అడుగు పేదల అభ్యున్నతి కోసమే..ఎన్నికలకు మనం సిద్ధం అంటే..కుప్పంలో ప్రజలు బాబుకి బైబై అంటున్నారు.మన ప్రభుత్వంలో పెత్తందారు లకు కాదు పేదలకే పదవులు ఒంగోలు మున్సి పల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 20,840 ఇళ్ల స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ పంపిణీ ప్రారంభ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 20,840 మంది పేద అక్కచెల్లెమ్మలకు సర్వ హక్కులతో రిజిస్టర్‌ చేసిన ఇంటి స్థలం భూ బదిలీ పత్రం, కట్టుకోడానికి ఇళ్లు కూడా మంజూరు చేసి, ఆ పత్రాలు కూడా పంపిణీని సీఎం జగన్‌ ప్రారంభించారు. దీంతో పాటు ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కింద రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేసిన 31.19 లక్షల ఇళ్ల స్థలాలను ఆ పేద అక్కచెల్లెమ్మల పేరు మీదుగానే సంపూర్ణ హక్కులు కల్పిస్తూ, రిజిస్ట్రేషన్‌ కూడా చేసి కన్వేయన్స్‌ డీడ్స్‌ అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ఒంగోలు వేదికగా లాంఛనంగా ప్రారంభించారు. అర్హులైన 20,840 మంది పేద అక్కచెల్లె మ్మలకు ఇంటి స్థలాల కోసం ప్రభుత్వం మల్లేశ్వరపురం,అగ్రహారం,యరజర్ల, వెంగ ముక్కల పాలెం గ్రామాల్లో 536.11ఎకరా లను భూసేకరణ ద్వారా సమీకరించి రిజిస్టర్‌ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్‌ డీడ్స్‌ అందజేసి నట్లు సీఎం జగన్‌ వివరించారు. భూమి కొను గోలు,జగనన్న టౌన్‌ షిప్‌ల అభివృద్ధికి రూ.210 కోట్లు..లే అవుట్ల అభివృద్ధికి రూ. 21.33 కోట్లు కేటాయించినట్లు వివరించారు.
మన ప్రభుత్వంలో పెత్తందారులకు కాదు పేదలకే పదవులు
గతంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్‌ పదవులు ఉండేవని, మన ప్రభుత్వంలో బలహీన వర్గాలకు పదవులు ఇచ్చామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. పెత్తందారులతో జరిగే ఈ యద్ధంలో ప్రజలు గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించాలని విజ్ణప్తి చేశారు.పేదల ఆత్మ గౌరవం గురించి గతంలో ఏప్రభుత్వం ఆలో చన చేయలేదన్నారు. అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు తెచ్చామని, మన ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగిందని సీఎం జగన్‌ పేర్కొన్నారు.ప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్‌.అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని సీఎం జగన్‌ ప్రారంభించారు. అంతకు ముందు ఒంగోలు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ మన ప్రభుత్వంలో పేద మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఆర్థిక అంత రాలు తొలగించామన్నారు. రిజిస్ట్రేషన్‌ పట్టా లు ఇవ్వడం వల్ల అక్క చెల్లెమ్మలకు ఆస్తి మీద పూర్తి హక్కులు లభించాయని, భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్‌ చేసే అవకాశం ఎవరికీ ఉండక పోవడంతో పాటు రిజిస్ట్రేషన్‌ పట్టాలు ఉండడం వల్ల కబ్జాలకు చెక్‌ పడుతుం దన్నారు. ఈ మేరకు ఇళ్ల పట్టాలకు సంబంధించి గ్రామ సచివాలయాల నుంచి సర్టిఫైడ్‌ కాపీలు అందిస్తున్నట్లు సీఎం జగన్‌ వివరించారు.పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశామని, ఇంటింటికీ తలుపు వద్దే ప్రభుత్వ సేవలు అందిస్తున్నా మన్నారు.
నాడు నేడుతో విద్య, వైద్య ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
నాడు నేడుతో విద్య,వైద్య ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు సీఎం జగన్‌ తెలిపారు. పేదలకు కార్పొరేట్‌ వైద్యం అంది స్తుండటంతో పాటు చికిత్స కోసం వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తూ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు పెంచి నట్లు వివరించారు.ఎక్కువ వ్యాధులను ఆరోగ్య శ్రీ కింద కవర్‌ అయ్యేలా ప్రొసీజర్స్‌ను 3,300 కు పెంచామన్నారు. పేదల ఇంటి వద్దకే ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలు చేస్తూ రోగులు కోలుకునేంత వరకు ప్రభుత్వమే ఆసరా అందిస్తుందన్నారు. పోటీ ప్రపంచంలో నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశ్యంతో ఆంగ్ల విద్యను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇంగ్లీష్‌, తెలుగు మీడియాల్లో పుస్తకాలు అందిస్తూనే ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్‌ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ బడుల్లో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.
ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు
ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ చంద్రబాబు ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా పుట్టాలను కుంటారా అని అన్యాయమైన స్టేట్‌ మెంట్‌ ఇచ్చి, ఎస్సీలంతా గుణపాఠం చెబుతారనే భయం లేకుండా, బాబు రాజకీయంగా బరితెగించి ఉండగలుగుతున్నాడంటే ఇంతక న్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా?అని సీఎం జగన్‌ ప్రశ్నించారు.బీసీల తోకలు కత్తిరిస్తా, ఖబడ్దార్‌ అని కూడా బాబు ఈ రాష్ట్ర రాజకీయాల్లో బీసీలంతా తనకు గుణపాఠం చెబుతారన్న విషయం చంద్రబాబు అర్ధం కావడం లేదా అన్నారు. పేద వర్గాలకు ఇళ్ల నిర్మాణం చేయకపోయినా, రైతులకు బేషరతుగా పూర్తిగా రుణమాఫీ చేస్తానని మోసం చేసిన ఈ మాయలోడు ఏ జంకూ గొంకూ లేకుండా ఇప్పటికీ ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండటం కంటే దారుణం మరొకటి ఉండదన్నారు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మొదటి సంతకంతోనే రుణాలుమాఫీ చేస్తానని ఒక్క రూపాయి కూడా మాఫీ చేయని చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో 650 వాగ్దానాలిచ్చి మేనిఫెస్టోగా చూపించి ప్రతి సామాజికవర్గానికి అది చేస్తా ఇది చేస్తానని 10శాతం కూడా అమలు చేయకపోయినా, ప్రజలు తనను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మడం లేదని తెలిసినా, నిస్సిగ్గుగా మళ్లీ ఎన్నికలొచ్చేసరికి కొత్త మేనిఫెస్టో తెచ్చి ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్‌ కారు కొనిస్తానంటూ చంద్రబాబు ప్రజ లను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
మనం సిద్ధం అంటే.. కుప్పంలో ప్రజలు బాబుకి బైబై అంటున్నారు.
చంద్రబాబు తన 14ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామ గ్రామానికీ ఈ మంచి జరిగిందని సమాధానం చెప్పలేరని సీఎం జగన్‌ విమర్శించారు. పేదలకు జగన్‌ మాదిరిగా బటన్‌ నొక్కాను 2.55 లక్షల కోట్లు పేదల ఖాతాల్లోకి జమ చేశాను అని ఈ పెద్దమనిషి నోట్లో నుంచి మాటలు రావన్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితుల్లతో మనం సిద్ధం అంటుంటే.. మరోవంక బాబు భార్య మా అయన సిద్ధంగా లేడు అంటోందని చామత్కరించారు. ఏకంగా కుప్పంలో బైబై బాబు అంటూ ఆయన అర్ధాంగి నోటే పంచ్‌ డైలాగులు వస్తున్నా యన్నారు. ఇలాంటి బాబును ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదని కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థిం చలేదని సీఎం జగన్‌ విమర్శించారు. ఏనాడూ ఏపీలో లేని వారు, ఏపీకి రాని వారు,సొంత ఊరు ఏదంటే తెలియని వారు,వారికి మన రాష్ట్రంలో ఓటే లేని వారు,ఇక్కడ దోచుకో వడం,దోచుకున్నది పంచుకోవడానికి అల వాటైన వారే అలాంటి నాన్‌ రెసిడెంట్‌ ఆంధ్రాస్‌ మాత్రమే చంద్రబాబును సమర్థి స్తారని అన్నారు. మీ బిడ్డగా అందరితో కోరేది ఒక్కటే. మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడి స్టార్‌ క్యాంపెయినర్లుగా ఉండాలన్నారు.పేద అక్కచెల్లమ్మల సొంతింటి కలను సాకారం చేస్తూ..రికార్డు స్థాయిలో 31 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు అందించడమే గాక దేశంలోనే తొలిసారిగా లబ్ధిదారులకు ఆ స్థలా లపై సర్వహక్కులు కల్పిస్తూ వారి పేరు మీదనే ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి కన్వేయన్స్‌ డీడ్స్‌ అందించిన సీఎం జగన్‌ ప్రభుత్వం….
రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ ద్వారా కలిగే ప్రయోజనాలు ఇవీ.
పదేళ్ల తర్వాత ఇంటి స్థలంపై అన్ని హక్కులు ఉండేలా లబ్ధిదారుల పేరిట గ్రామ/వార్డు సచివాలయాల్లోనే, ఇప్పుడే ఉచితంగా స్థలాల రిజిస్ట్రేషన్‌ చేసి కన్వేయన్స్‌ డీడ్స్‌ కూడా అందజేత చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపట్టారు. ఇప్పటికే దాదాపు 15 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తి.. శరవేగంగా మిగిలిన రిజిస్ట్రేషన్ల కార్యక్రమం కొనసాగిస్తారు.గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉన్న జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ (జెఎస్‌ఆర్వో) డేటాబేస్లో వివరాలన్నీ పదిలం..ఎప్పుడైనా ఈ జెఎస్‌ఆర్వోలలో సర్టిఫైడ్‌ కాపీ పొందే అవకాశం..ఫోర్జరీ గానీ,ట్యాంపర్‌ చేయడానికి గానీ ఆస్కారమే ఉండదు.పదేళ్ల తర్వాత ఆటోమేటిక్‌గా క్రయ, విక్రయ,దాన,వారసత్వ హక్కులతో సహా పూర్తి హక్కులు..అత్యవసర సమయాల్లో ఇంటిని అమ్ముకునే వీలు..అమ్ము కునే సమయంలో ఎన్వోసీ కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.ఎలాంటి లింకు డాక్యుమెంట్ల అవసరం లేకుండానే నేరుగా రిజిస్ట్రేషన్‌. పేదలకు పక్కా గృహాల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది.
అక్కచెల్లెమ్మలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా 71,811ఎకరాల్లో 31.19లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఉచితంగా ఇళ్ల పట్టాల పంపిణీ.
ఒక్కోప్లాట్‌ విలువ ప్రాంతాన్ని బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా పలుకు తున్న నేపథ్యంలో ఆ కనీస విలువ రూ.2.5 లక్షల చొప్పున లెక్కించినా ఇళ్ల పట్టాల విలువ రూ.76,000 కోట్లు. దీంతోపాటు సుమారు రూ.60,000 కోట్ల వ్యయంతో 22 లక్షల ఇళ్ల నిర్మాణం. ఇందులో ఇప్పటికే 8.9లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందిం చింది. జగనన్న ప్రభుత్వం.రాష్ట్ర వ్యాప్తంగా 17,005 జగనన్న లేఅవుట్లలో రూ.32,909 కోట్ల వ్యయంతో నీటి సరఫరా,విద్యుత్‌, డ్రైనేజీ, సీవరేజ్‌, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పన. ఇంటి స్థలం ఉచితంగా ఇవ్వడమే కాకుండా యూనిట్‌ కు రూ.1.80 లక్షల చొప్పున ఇంటి నిర్మాణానికి అందిస్తూనే.. మరోవైపు పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం.. దీంతో పాటు ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సిమెంట్‌, స్టీల్‌, మెటల్‌ ఫ్రేమ్స్‌, ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించడంతో ఇంకో రూ.40 వేల మేర లబ్ధి..మొత్తంగా ఒక్కో లబ్ధిదారునికి రూ. 2.70 లక్షల మేర లబ్ధి చేకూరుస్తున్న జగనన్న ప్రభుత్వం.. మౌలిక వసతుల కల్పనతో ప్రతి ఇంటికి సగటున మరో రూ. 1 లక్ష లబ్ధి. తద్వారా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు ప్రాంతాన్ని బట్టి ఆ ఇంటి విలువ రూపేణా కనీసం రూ. 6 లక్షల నుండి రూ.20లక్షల వరకు లబ్ధి.. రాష్ట్ర వ్యాప్తంగా పేద అక్కచెల్లెమ్మల చేతుల్లో కనీసం రూ.2లక్షల కోట్ల నుండి రూ.3 లక్షల కోట్ల సంపద. అడ్డంకులను అధిగమిస్తూ రాష్ట్రంలో శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్య సాధన దశగా గత ఐదేళ్ల పాలనలో ప్రజలు సుభిక్షాన్ని కోరుకుంది. -జిఎన్‌వి సతీష్‌