దేశ చరిత్రను తిరగరాస్తున్న జన్యు శాస్త్రం

ఈ భూమి మీద ఆధునిక మాన వుడి కథ సుమారు రెండు లక్షల సంవత్స రాలకు ముందు ప్రారంభమైంది. చీకటి ఖండం అని పిలువబడ్డ ఆఫ్రికాలో తొలి మానవుడు వెలుగు చూశాడు. అక్కడి నుండి ప్రయాణమై ఆఫ్రికా ఖండం బయటికి వచ్చాడు. అక్కడ నియాండర్‌తల్‌ మ్యాన్‌ జాతితో లైంగిక సంపర్కం జరిగింది. సుమారు అరవై వేల ఏళ్ల క్రితం ఆఫ్రికా బయటి ప్రాంతాల నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. మొదట మిడిల్‌ ఈస్ట్‌ చేరుకున్న మానవ సమూహాలు తర్వాత మధ్య ఆసియా ప్రాంతం చేరాయి. క్రమంగా భారత ఉపఖండంలోకి ప్రవేశించాయి. ఒక అంచనా ప్రకారం ఈ మానవ సమూహాలు తొలిసారిగా సుమారు నలభై వేల ఏళ్ల క్రితం భారత భూభాగం చేరాయి. ఇవి రెండు శాఖలుగా విడిపోయాయి. ఉత్తర భారత దేశానికి పరిమితమైన వారు-ఉత్తర భారత పూర్వీకులు అయ్యారు. దక్షిణ భారత దేశానికి పరిమితమైన వారు-దక్షిణ భారత పూర్వీకులు అయ్యారు. దక్షిణ భారతదేశంతో పోలిస్తే ఉత్తర భారత దేశంలో వలసలు ఎక్కువగా జరిగాయి. దక్షిణాన మూడు వైపులా సముద్రం ఉండడం మూలాన అక్కడికి వలసలు తగ్గి ఉండొచ్చు. అందుకే దక్షిణ భారతీయులను మూల వాసులుగా పరిగణించారు. ఈ దేశంలో క్రీ.పూ 1500 నుంచి క్రీ.శ 200 మధ్య కాలంలో మనుస్మృతి కుల వ్యవస్థను ద ృఢ పరిచింది. అంతకు ముందు రెండు వేల మూడు వందల ఏళ్లు మిశ్రమ జనాభా కొనసాగిన తర్వాత, మనుస్మ ృతి ప్రభావంతో కులగోత్రాల ఆధారంగా పెళ్లిళ్లు జరుగుతూ వచ్చాయి. మనుస్మ ృతి ప్రకారం శూద్రులు, క్షత్రియులు అంతా సమానమే. కాని, సామాజికంగా బలవంతులైన క్షత్రియులు బ్రాహ్మణులకు గౌరవ స్థానాలిచ్చి రాజ్యాలేలారు. రాజ్యాలేలిన ఇతర కులాల వారు కూడా చేసిన పని అదే. కొలోనియల్‌ రూలర్స్‌ కూడా దేశంలోని కుల వ్యవస్థను దెబ్బ తీయకుండా తెలివిగా వారి పబ్బం గడుపుకున్నారు. భారతీయ సంప్రదాయ వాదులు చెప్పుకుంటున్నట్టు కులగోత్రాలకు ఆధారాలేవీ లేవు. అవిమధ్యలో కొన్ని సమూహాలు తమ ఆధిపత్యం నిలుపుకోవ డానికి కల్పించి ప్రచారం చేసినవే. వేల వేల ఏళ్లుగా దేశంలో ఒక మిశ్రమ జనాభా కొనసాగుతూ వచ్చిన విషయాన్ని వారు కప్పి పుచ్చారు. మరొక పరిశోధకుల బృందం చెపుతున్న దాని ప్రకారం-భారతేదశంలో మిశ్రమ జనాభా తయారు కావడానికి 65 వేల ఏళ్ళ క్రితమే బీజాలు పడ్డాయి. ఆఫ్రికా మూలాలున్న సమూహాలు కొన్ని ఇతర ప్రాంతాల గుండా భారత్‌లో ప్రవేశించాయి. క్రీ.పూ ఏడు వేల ఏళ్ల క్రితం జగ్రోసియన్‌ హెడ్డర్స్‌ బెలూచిస్థాన్‌ చేరి తొలి భారతీయులతో సంబంధాలు ఏర్పరచు కున్నారు. ఈ రెండూ కలిసి ఒక మిశ్రమ జాతిగా హరప్పా నాగరికతను ఏర్పరిచాయి. ఆ తర్వాత రెండు వేల ఏళ్లకు ఆర్యులు వలస వచ్చారు. అంటే ఇక్కడ జరిగిందేంటి? సంస్క ృతీ నాగరికతలు ఏక మార్గంగా అభివృద్ధి కాలేదు. బహు ముఖాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఇది వాస్తవం! అందుకే ఈ దేశంలో భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, మత విశ్వాసాలు ఒకదానికొకటి సమాంతరంగా విస్తరిస్తూ వచ్చాయి. ఇదే విషయం సమకాలీనంలో కూడా చూస్తున్నాం. మనమంతా భారతీయులమే అయితే ఎప్పుడో ఒకప్పుడు మన పూర్వీకుల పూర్వీకులు వలస వచ్చినవారే. అంటే మనమంతా వలస వచ్చిన వారికి వారసులమే. మనదంతా మిశ్రమ జనాభానే. ఏమయితేనేం మానవ జాతి అంతా ఒక్కటే. ఇందులో ఎక్కువ తక్కువలు. ఎగుడు దిగుళ్లూ లేవు. పవిత్రులమని, ఉన్నతులమని జబ్బలు చరుచుకునే వారు కూడా ఈ మిశ్రమ జనాభా నుంచి వచ్చినవారే…ఇంగితజ్ఞానం, వివేచన పెరిగినందు వల్లనే మనిషి పనిముట్లు, ఆయుధాలు తయారు చేసుకున్నాడు. దాని వల్లనే విజ్ఞాన శాస్త్రం పెరుగుతూ వచ్చింది. ఫలితంగా మనిషి జంతువుల నుంచి విడివడి పరిణామం చెందుతూ వచ్చాడు. ఏ మత విశ్వాసాల వల్లనో మనిషి మనిషిగా ఎదగలేదు. సైన్సు వల్లనే ఎదిగాడు. ఇప్పుడు మళ్లీ సైన్సు సహాయంతోనే తన గతాన్ని తవ్వి తీస్తున్నాడు. జర్మనీలో దొరికిన రెండు వందల వేల ఏళ్ల నాటి ఒక మానవుడి అస్థిపంజరం పరిశోధనలను ఆకాలానికి తీసుకుపోయి కొత్త సత్యాల్ని వెల్లడిరచింది.
లభించిన పురాతన డిఎన్‌ఎ ప్రకారం తెల్ల చర్మం వారు ఎక్కువని, నల్ల చర్మం వారు తక్కువని విదేశాలలో ఉన్న భావన తప్పు. ఒక కులం వాడు ఎక్కువనీ, మరో కులం వాడు తక్కువనే భారతీయుల భావనా తప్పే. ఓగోత్రం వాడు పవిత్రుడని మరో గోత్రం వాడు అపవిత్రుడని భావించే వారంతా మూరు?లు. కొంత సైన్సు, మరికొంత చరిత్ర తెలుసుకుంటే కళ్లకున్న అహంకారపు పొరలు తొలగి పోతాయి. తమని తాము మోసగించుకుంటూ, ఇతరులను మోసం చేసే వారికి జ్ఞానోదయం కావాలంటే మత గ్రంథాలు పక్కన పెట్టి వివేచనను నిద్ర లేపాలి. హేతుబద్ధంగా ఆలోచించగలిగే సామర్థ్యాన్ని సమకూర్చు కోవాలి. పరిణతి చెందని వారంతా పరిణామ దశలోని తొలి మానవుడి దశలో వున్నారన్నమాట! ఆకారాలు మారాయి కాని, వారి మెదళ్లు ఇంకా మూడు వేల ఏళ్ల కిందటి భావజాలంతోనే ఉన్నాయన్నది నిజం. బలవంతుడు నిర్బలుడికి సహాయపడ్డట్టు- మేధోపరంగా ఎదిగిన వారు, ఎదగని వారికి చెపుతూనే ఉండాలి. అందుకే సమాజంలో హేతుబద్ధంగా ఆలోచించే వారిపై ఎక్కువ బాధ్యత ఉంది. ఆలోచన లేనివాడు ఎలాగూ మూర?ంగా ప్రవర్తిస్తూ ఉంటాడన్నది తెలిసిన విషయమే. ఒకప్పుడు ఆర్కియాలజీ శాఖ వారి తవ్వకాల్లో బయటపడ్డ ఆధారాలతో చరిత్రకారులు చరిత్ర రాశారు. దానికి ఇప్పుడు ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం తోడయ్యింది. ఊహలకు, భావనలకు పరిమితం కాకుండా జన్యు శాస్త్రంతో మానవ పరిణామ చరిత్ర మరింత స్పష్టమౌతూ వుంది. దాంతో నేటి భారతీయ సంప్రదాయవాదులకు గుండెలు ఆగిపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఈ భారత ఖండంలోని గొప్ప సంస్కృతిలోని భాగంగా సంస్క ృత భాషని మన వాళ్లు నెత్తికెత్తుకొని ఊరేగారు. నిజానికి ఆ భాషకు మూలాలు మొదట సిరియాలో బయట పడ్డాయి. పురాతత్వ పరిశోధకులు, జీవ శాస్త్రవేత్తలు చేస్తున్న పని ఏమిటంటే-వారు ప్రస్తుతంలో నిలబడి గతంలోకి మెట్టు దిగుతున్నారు. పురాతన మానవ అస్థి పంజరాల నుంచి డిఎన్‌ఎ సేకరించి మరింత కచ్చితమైన సమాచారం అందిస్తున్నారు. నేటి పాకిస్తాన్‌ ప్రాంతంలో జరిపిన తవ్వకాల వల్ల ఐదు వేల ఏళ్ల నాటి నాగరికత బయటపడిరది. అలాగే ఉత్తర భారతం నుంచి దక్షిణాన మహారాష్ట్ర వరకు ఇండస్‌ వ్యాలీకి సంబంధించిన సమాచారం లభించింది. ఈ ప్రాంతమంతా వ్యాపించిన వారు హరప్పన్లు. నేడు మన హిందూ సంప్రదాయవాదులు వాదిస్తున్నట్టుగా వీరికీ వేద సంస్క ృతికీ సంబంధమే లేదు. ఆర్యులు ఎక్కడి నుంచో వలస రాలేదని, మొదటి నుంచీ వారు ఈ పావన భారతావని లోనే విరాజిల్లారని, వేదాలు ఇక్కడే ఉద్భవించాయని చెప్పే వాదనలను పరిశోధనలు ఏమాత్రం బలపరచలేదు. హార్యానాలోని రాఖిగర్హి తవ్వకాలలో లభించిన పురాతన డిఎన్‌ఎ, ఇండస్‌ వ్యాలీ గూర్చి స్పష్టమైన సమాచార మిచ్చింది. ఆర్యులు వలస రావడం నిజమేనని ధృవపర్చింది. పైగా దక్షిణాసియా మూల వాసులు-ఇరాన్‌ దేశపు వ్యవసాయదారుల కలయిక వల్లే హరప్పన్లు ఏర్పడ్డారని తెలిసింది. అంటే, వేల వేల ఏళ్ల క్రితమే మిశ్రమ మానవ జాతి ఏర్పడిరది. ఇంక పవిత్రులు, శుద్ధమైన వారు, సంకరజాతి లాంటి పదాలకు అర్థమే లేదు కదా! మిశ్రమ జాతి నిజమైనప్పుడు మధ్య ఏర్పరుచుకున్న కుల, గోత్రాలకు విలువ వుంటుందా? జాత్యహంకారానికి అర్థం ఉంటుందా? జీవశాస్త్ర ప్రకారం ప్రాణుల మధ్య లైంగిక సంపర్కం జరుగుతూ ఉందంటే అవి ఒకే జాతికి చెందిన ప్రాణులని అర్థం ఈ అత్యాధునిక కాలంలో కూడా అదే చూస్తున్నాం. కులాంతర, మతాంతర వివాహాలే కాదు, వివిధ దేశాల, వివిధ జాతుల ప్రజల మధ్య కూడా చూస్తున్నాం. అంటే మానవ జాతి అంతా ఒక్కటే అని అర్థం. – డా.దేవరాజు మహారాజు