దేశంలో మొబైల్ లేని గ్రామాలెన్నో..?
దేశం డిజిటల్ ఇండియా అంటూ టెక్నాలజీ రంగంలో అమితవేగంతో దూసుకుపోతుంటే ఇంకా పల్లెల్లో మొబైల్ సౌక ర్యాలు లేవంటే ఎవరైనా నమ్మగలరా..ఇది నిజం. దాదాపు దేశంలోని 60వేలకు అటుఇటుగా గ్రామాల్లో ఫోన్ అంటేనే తెలియదని కేంద్రప్రభుత్వం వెల్లడిరచింది. లోక్‌సభలో ప్రశ్నోతర్తాల సమయంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖా మంత్రి రవిశంకర ప్రసాద్ ఓప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు. మార్చి23న పార్లమెంట్లో అందించిన కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం,ఆంధ్రప్రదేశ్‌లోని1,787గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ లేదు. గతకొన్ని దశాబ్దాలుగా డిజిటల్‌విప్లవంలో పెద్ద ఎత్తున దూసుకుపోతున్నప్పటికీ,ఇలాంటి గ్రామాలకు సాంకేతిక రంగం దూరంగా ఉండటంతో అక్కడ ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, వైద్యరంగాలకు దూరవమతుండటం శోచనీయం.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లాలో అరకు,చింతపల్లి,డుంబ్రిగూడ,జీకేవీధి,ముంచింగిపుట్టు,పెదబయలు,అనంతగిరి తదితర గిరిజన మండలాల్లోని పదుల సంఖ్యలో గ్రామాలు సామాజికంగా,భౌగోళికంగా బయటి ప్రపంచానికి దూరమంగా ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోంది.మొబైల్ మరియు ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవడం ఈ కుగ్రామాలలో ఆర్థిక మరియు సామాజిక అసమానతలను మరింత తీవ్రతరం చేస్తోంది. ఇవిరోడ్లు,ఆరోగ్య సౌకర్యాల వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల కోసం కూడా చాలా కాలంగా పోరాడుతున్నాయి. మొబైల్ నెట్వర్క్ ఉన్న గ్రామాలలో కూడా సిగ్నల్ నాణ్యత తక్కువగా ఉంటుంది. మరో విచిత్రమేమిటంటే..ఎక్కడో మారుమూల ప్రాంతాలకు మొబైల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదంటే కాస్తా ఆలోచించ వచ్చు.కానీ విశాఖ మహానగరానికి అతిచేరవలో ఉన్న సింహాచలం దేవస్థానానికి సమీపంలో గల దబ్బంద పరిసర గ్రామాలకు మొబైల్,ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవడం విచారకరం.ఈ చుట్టుపక్కల సుమారు ఎనిమిది గ్రామాలకు సాంకేతికత దూరమైంది.వీరంతా నెట్వర్క్ కవరేజీకోసం వారిఇళ్ల నుండి సుదూర ప్రాంతాలకు కాల్ చేయడానికి/స్వీకరించడానికి పరుగులు తీస్తున్నారు.
ఇటీవలి కోవిడ్-19మహమ్మారి,తదుపరి లాక్డౌన్ కూడా కోవిడ్-19పరీక్ష,చికిత్స,టీకాలను యాక్సెస్ చేయడంలో గిరిజన ప్రాంతాలలోఈ డిజిటల్ విభజనను హైలైట్ చేసింది.కోవిడ్-19 మొదటి ఒకసంవత్సరంలో రిమోట్ టీచింగ్ లెర్నింగ్‌పై దాని ప్రభావం చూపించింది.విశాఖపట్నం గిరిజనప్రాంతంలో దాదాపు3వేలగ్రామాలు ఉన్నాయి.డోర్-టు డోర్ సర్వీస్ డెలివరీ మరియు ప్రభుత్వ కార్యక్రమాలను మెరుగ్గా అందజేయడం కోసం ప్రవేశపెట్టబడిన అనేక గ్రామ సచివాలయాలు కూడా మొబైల్,ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవడంవల్ల వాటి లక్ష్యాలను చేరుకోలేకపోయాయి. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేబినెట్ కమిటీ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసారశాఖమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడిరచిన వివరాలు మేరకు దేశంలోని ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర,ఒడిశాల్లోని దాదాపు 44జిల్లాల్లో ఇప్పటివరకూ సెల్‌సౌకర్యం అందుబాటులోలేని గ్రామాలను గుర్తించారు.ఏపీ విశాఖజిల్లాలో1,054, విజయ నగరంలో154, కడప జిల్లాలో10 గ్రామాల్లో మొబ్కెల్ సేవలవిస్తరణకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని తెలిపారు. మొత్తంగా18నెలల్లో పనులుపూర్తి చేస్తామన్నారు. సాధ్యసాధ్యాలు పరిగణనలోకి తీసుకొని పరిగణలోకి తీసుకొని సాధ్యమైనంత ఎక్కువగా సోలర్ పవర్ బ్యాటరీలుద్వారా టెలికాం టవర్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడుజిల్లాల్లో 1,218 గ్రామాలు సహా దేశవ్యాప్తంగా 44ఆకాంక్ష (యాస్పిరేషనల్) జిల్లాల్లోని 7,287 గ్రామాలకు 4జీ సేవలు అందించడంలో భాగంగా యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఓఎఫ్) పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.ఈ ప్రాజెక్టు కోసం యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్‌ఫండ్ (యూఎస్ఓఎఫ్)నిధులతో మొత్తం రూ.6,466కోట్ల అంచనావ్యయంతో ప్రతిపాదించారు. ఇప్పటికైనా మారుమూల గ్రామాలకు మొబైల్,ఇంటర్నెట్ కనెక్టివిటీ సేవలు తక్షణమే విస్తరించి ప్రజలందరికి రాష్ట్ర,కేంద్రప్రభుత్వాల సంక్షేమ ఫలాలు అందేల చర్యలు తీసుకోవాల్సిన ఆశ్యకత ఉంది! – రెబ్బాప్రగడ రవి,ఎడిటర్