దేశంలో జమిలి ఎన్నికల సంకేతాలు

జమిలి ఎన్నికల విషయంలో మరో అడుగు పడిరది. ఈ మధ్యనే, సార్వత్రక ఎన్నికలకు కాస్తంత ముందు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన నివేదికను కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. లోక్‌సభలో సొంతబలం గట్టిగా ఉన్న తొలి రెండు పర్యా యాల్లో ఈదిశగా సాగించిన ప్రయత్నా లను, ఇప్పుడు సరిపడా స్వశక్తి లేని దశలో కూడా ముందుకు తీసుకుపోవాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. జమిలితో దేశా నికి ఎంతో మంచిది అంటూ బీజేపీ పెద్దలు పట్టువీడ కుండా పోరాడుతున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
దేశంలో జమిలి ఎన్నికల సంకే తాల సందడి మరోసారి బలంగా తెరపైకి వచ్చింది.అకస్మాత్తుగా పార్లమెంట్‌ ప్రత్యేక సమా వేశాల ప్రకటన, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో జమిలీ ఎన్నికల సాధ్యా సాధ్యాలపై కమిటీ వేశారన్న సమాచారంతో.. ఎక్కడ చూసినా ఇదే విషయంపై చర్చ సాగు తోంది. ఇప్పటికే తెలంగాణపై కర్ణాటకలో కాం గ్రెస్‌ గెలుపు ప్రభావం ఉంది. వచ్చే ఎన్నికలో మధ్యప్రదేశ్‌,రాజస్థాన్‌,ఛత్తీస్‌గఢ్‌, తెలం గాణలో కాంగ్రెస్‌ గెలిస్తే మరింత ప్రభావం చూపే అవ కాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ లు, దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు తగిన సిఫారసులు చేయాలంటూ గత మోదీ ప్రభుత్వం కోవింద్‌ కమిటీని కోరింది.ఈ నేపథ్యంలో చర్చలు నిర్వహించిన కమిటీ.. తన సిఫారసు లను గత లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది.తొలుత లోక్‌సభ, అసెంబ్లీలకు ఒక విడుతలో ఎన్నికలు నిర్వహించడం,తదుపరి వంద రోజులలోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా జమిలి సాధ్యపడుతుందని కోవింద్‌ కమిటీ పేర్కొన్నది.జమిలి ఎన్నికలు నిర్వహిం చాలంటే రాజ్యాంగంలో పలు కీలక సవరణలు చేయాల్సి ఉంటుంది.తొలివిడుతలో లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించ డానికి రాజ్యాంగ సవరణలు అవసరమైనప్పటికీ.. పార్లమెంటు ఆమోదం పొందితే రాష్ట్రాల ర్యాటి ఫికేషన్‌ అవసరం ఉండదు. అయితే..వంద రోజు ల తర్వాత నిర్వహించే స్థానిక ఎన్నికలకు మాత్రం కనీసం సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
ఏమిటీ జమిలి ఎన్నికలు?
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు,లోక్‌ సభకు,స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వ హించడమే జమిలి ఎన్నికలప్రధాన ఉద్దేశం. గతం లో జరిగినా..ఆ తర్వాత వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తదేమీ కాదు.1952 లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని, 1967 వరకు లోక్‌సభకు,రాష్ట్రాల అసెంబ్లీలకు చాలా వరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడక పోవడం,గడువుకు ముందే పలురాష్ట్రాల శాసన సభలను బర్తరఫ్‌ చేయడం తదితర కారణాల తో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్‌సభ,అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరు పడం మొదలైంది.
ప్రక్రియ పెద్దదే
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే చాలా రాష్ట్రాలు చట్టసభలను గడువు కంటే ముందే రద్దు చేయాల్సి ఉంటుంది. మరికొన్నింటి కాలవ్య వధిని పొడిగించాల్సిన అవసరమూ ఉండొచ్చు. కాబట్టి, జమిలి ఎన్నికలను నిర్వహించాలంటే దానికి సంబంధించిన బిల్లు తొలుత పార్లమెంట్‌ ఆమోదం పొందాల్సి ఉంటుంది. జమిలి ఎన్నిక లు జరుగాలంటే దాదాపు 18రాజ్యాంగ సవర ణలు,ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని కోవింద్‌ కమిటీ తాజా నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356,ఆర్టికల్‌ 324, ఆర్టికల్‌ 83(2),ఆర్టికల్‌172(1),ఆర్టికల్‌ 83కు సంబంధించి పలు సవరణలు అవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడు తు న్నారు.
రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ సిఫార్సులు
జమిలి ఎన్నికల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నాయక త్వంలో ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ 18 వేల పేజీల నివేదికను రాష్ట్రపతికి సమర్పిం చింది.దేశంలో47రాజకీయ పార్టీలలో 32 పార్టీలు జమిలి ఎన్నికలకు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.ఈకమిటీ 2029నాటికి రాజ్యాం గంలో 5ఆర్టికల్స్‌ సవరణ చేసి జమిలి ఎన్నికలు నిర్వ హించవచ్చని తెలిపింది.7దేశాలలో జమిలి ఎన్ని కల గురించి అధ్యయనం చేశామని పేర్కొంది. కానీ స్వీడన్‌,జర్మనీ,బెల్జియం వంటి దేశాలలో అమ లులో ఉన్న నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం గురించి కమిటీ పేర్కొనలేదు.కోవింద్‌ కమిటీ 10కీలక సిఫా ర్సులు చేసింది.తొలి దశలో లోక్‌సభ, శాసన సభలకు ఒకేసారిఎన్నికలు నిర్వహించాలని, రెండో దశలో కార్పొరేషన్లకు, మునిసిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు,పంచాయతీరాజ్‌ సంస్థలకు ఎన్ని కలు నిర్వహించాలని పేర్కొంది.స్థానిక సంస్థల ఎన్నికలు లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 100రోజుల్లోగా పూర్తి చేయాలని చెప్పింది. జాతీ య ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘాలతో కలిసి ఒకే ఫొటో గుర్తింపు కార్డును జారీ చేయాలని పేర్కొంది.
రాజ్యాంగ సవరణలు
జమిలి ఎన్నికలు అమలులోకి రావటానికి కనీసం 6 రాజ్యాంగ సవరణలు చేయవలసి ఉంటుందని రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ పేర్కొన్నది. దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు, మార్గద ర్శకాలను నిర్దేశించిన 1951ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయడంతో పాటు కనీసం 6కీలక రాజ్యాంగ సవరణలు చేయవలసి ఉం టుంది.లోక్‌సభ,రాజ్యసభ కాలపరిమితిని నిర్ణ యించే 83వఆర్టికల్‌,రాష్ట్రాల శాసనసభల కాల పరిమితిని నిర్ణయించే 172వ ఆర్టికల్‌,ఎన్నికల కమిషన్‌ అధికారాలకు సంబంధించిన 324వ ఆర్టికల్‌ సవరణ చేయాలి.వీటితో పాటు స్థానిక సంస్థలకు సంబంధించిన ఆర్టికల్‌243-కె, 243-జడ్‌.ఏలను కూడా సవరించవలసి ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే రాజ్యాంగ సవరణలను రాజ్య సభ, లోక్‌సభ లలో 2 బై 3వ వంతు మెజారిటీతో ఆమోదించాలి. ప్రస్తుతం రెండు సభలలో బిజెపికి ఉన్న బలంతో అది సాధ్యం కాదు. ఇతర పార్టీల మద్దతు కూడగట్టవలసి ఉంటుంది. దీనితో పాటు స్థానిక సంస్థల రాజ్యాంగ సవరణలకు సగం రాష్ట్రాల శాసనసభలు కూడా ఆమోదించాలి. బిజెపి మిత్రపక్షాలు అంగీకరిస్తేనే ఇది సాధ్యమౌ తుంది. – (కె.యస్‌.లక్ష్మణరావు)