దాడి

ప్రముఖ పరిశోధక రచయిత, విశ్లేషకుడు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు థింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్న ఈ నెల సంచికలో కథా విశ్లేషణ ‘‘దాడి’’- `సంపాద‌కులు

తరాలు మారుతున్న కొద్దీ గిరిజను ఆలోచనా విధానాల్లో మార్పు రావడం అది తమ సొంతజాతి విచ్ఛిన్నతకి ఎలాకారణం అవుతుందో రచయిత తనదైన ధర్మాగ్రహశైలిలో చెప్పడం జరిగింది. గొత్తికోయ దీనస్థితి ఈకథలో కళ్ళకు కట్టబడిరది. ఛత్తీస్‌ఘడ్‌లోపోలీసు తమ స్వార్థంకోసం ఏర్పాటుచేసుకున్న సల్వాజుడుం రక్షక దళాల‌ హింస పడలేక అక్కడ నుంచి తొగు రాష్ట్రాకు తరలివచ్చిన గొత్తికోయ పరిస్థితి ‘‘పెనంమీద నుండి పొయ్యిలో‘‘పడ్డట్టు అయింది. ఇక్కడి ఫారెస్ట్‌-పోలీస్‌ అధికాయి సంయుక్తంగా చేస్తున్న హింసాత్మక దాడుకు స్థానికంగా ఉండే గిరిజనును పావుగా వాడుకోవడం ఈకథలో రచయిత చూపించిన కొత్త కోణం. ప్వాంచకు చెందిన కవి,కథకుడు ‘‘ విద్యాసాగర్‌’’ తన యొక్క పర్యటన ‌,పరిశీల‌న ద్వారా అందివచ్చిన అనుభవం కొద్ది వ్రాసినకథ ‘‘దాడి’’ దీని రచనాకాం నవంబర్‌ 2000.

మానవ జాతిలోనే ఒకవిశేషమైనజాతిగా చెప్పబడే ‘‘గిరిజనజాతి’’ సంస్కృతిపరంగానేకాక వారి జీవన విధానం ద్వారాకూడా భిన్నత్వం రంగరించుగకుని ఒక్క ప్రత్యేకతను అందిపుచ్చుకుంది. అందుకే అందరూ వారిని గురించి ఆసక్తి చూపిస్తుంటారు.సాధారణంగా కంటికి కనిపించే విషయం గాక అసాధారణంగా ఉండే అంశాన్ని తీసుకుని దాన్నికథగా చెప్పడం ఉత్తమకథా క్షణాల్లో ఒకటి. అలాంటి ప్రయత్నంలో భాగంగానే ప్వాంచకు చెందిన కవి,కథకుడు ‘‘ప్లొు విద్యాసాగర్‌’’ తన యొక్క పర్యటను,పరిశీన ద్వారా అందివచ్చిన అనుభవం కొద్ది వ్రాసినకథ ‘‘దాడి’’ దీని రచనాకాం నవంబర్‌ 2000.
ఆధునిక కాంలో గిరిజను జీవనవిధానం అనుకరణలోపడి తమదైన స్వచ్ఛ తత్వానికి స్వార్ధపు మరకు ఎలా అంటించుకుంటున్నారో చెప్పేప్రయత్నమే ఈ‘‘దాడి’’కథ ప్రధాన క్ష్యంగ కనిపిస్తుంది. తరాు మారుతున్న కొద్దీ గిరిజను ఆలోచనా విధానాల్లో మార్పు రావడం అది తమ సొంతజాతి విచ్ఛిన్నతకి ఎలాకారణం అవుతుందో రచయిత తనదైన ధర్మాగ్రహశైలిలో చెప్పడం జరిగింది.
ఇక కథ విషయానికొస్తే తమతల్లి లాంటి అడవిలోనే తాము పరాయివాళ్ళు అయ్యి స్వార్థపు శక్తు చేస్తున్నఎత్తుగడు వ్యూహాలో చిక్కుకొని నిువ నీడలేక నిత్య సంచార జీవనం గడుపుతున్న గొత్తికోయ దీనస్థితి ఈకథలో కళ్ళకుకట్టబడిరది.ఛత్తీస్‌ఘడ్‌లోపోలీసు తమ స్వార్థంకోసం ఏర్పాటుచేసుకున్న సల్వాజుడుం రక్షకదళా హింస పడలేక అక్కడ నుంచి తొగు రాష్ట్రాకు తరలివచ్చిన గొత్తికోయ పరిస్థితి ‘‘పెనంమీద నుండి పొయ్యిలో‘‘పడ్డట్టు అయింది. ఇక్కడి ఫారెస్ట్‌-పోలీస్‌ అధికాయి సంయుక్తంగా చేస్తున్న హింసాత్మక దాడుకు స్థానికంగా ఉండే గిరిజనును పావుగా వాడుకోవడం ఈకథలో రచయిత చూపించిన కొత్త కోణం.
ఒకరోజు ‘‘మడకంసిరమప్ప’’అనే స్థానిక గిరిజనుడు తమగూడెం సమీపంలో కొత్తగా ఏర్పాటు చేయబడ్డ గొత్తికోయగూడెంకు వెళ్లడం అక్కడ ఆగూడెం దొర అనబడే పెద్దమనిషి‘‘దాదా’’ను కవడం అక్కడి వారిజీవనంచూసి ఆశ్చర్య పోవడం జరుగుతుంది. చిత్రమైన వారి జీవన ఏర్పాట్లు,అంతకు ముందుదాకా అక్కడగ అడవి,చెట్లు, అదృశ్యమయ్యి వాటిస్థానంలో పంటకు పనికొచ్చే పోడుభూమి కనబడటంతో సిరమప్పలో ఆశ్చర్యంతో నిండిన ఈర్ష్య కరుగుతాయి. గొత్తికోయు తమ పోడువ్యవసాయంకు వర్షపు నీరును ఎలాన్వి చేస్తారో నివాసం మొదు వ్యవసాయంవరకు కావసిన ప్రతిఉపకరణను,అటవీ కప నుండి గొత్తికోయు ఎలా తయారు చేసుకుంటారో రచయిత తాను ప్రత్యక్షంగా చూసిన అనుభవా అనుభూతు నుండి అందంగా ఆవిష్కరించారు.సిరమప్ప దాదాను సాధారణపకరింపులోభాగంగా ఇక్కడకుఫారెస్ట్‌ వాళ్ళుకానీ పోలీసుగాని వచ్చారా?అని అడగటంతో దాదాలోఒక్కసారిగా తనకు తెలియని భయం మొదలై గతంలోతాము నివసించే ఛత్తీస్‌ఘడ్‌లో ‘‘సల్వాజుడుం’’మూకు తమనివాసాపై సృష్టించిన బీభత్సం గుర్తుకొచ్చి గతం తాూకు విషాదం కన్నీళ్ళ రూపంలో తన్నుకొస్తుంది. ఎదురుగా ఇళ్ల తగబెట్టినపట్టి మంటు కనిపిస్తాయి. అలా నివా సాు కోల్పోయి బ్రతికిబట్ట కట్టి రోజుకు రోజు ు కాలినడకనమిగిలిన పిల్లాపాపతో కలిసి నడిచి వచ్చి ఇక్కడ ఇలావ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుబండ్లు లాక్కుంటూ ఉంటే ఇప్పుడు సిరమప్ప నోట పోలీసు ఫారెస్ట్‌ వాళ్ళమాట వినగానే దాదా మనసు మళ్ళీ కీడు తుస్తుంది జరగబోయే ఘోరం కళ్ల ముందు కదుతోంది. మళ్లీ ఇక్కడ నుంచి కూడా పారిపోవాలా? అని’’దాదా’’కు లాలో చను మొదవుతాయి. గొత్తికోయ గూడెం నుంచి ఇు్ల చేరిన సిరమప్ప అనుకున్నట్టుగానే ఫారెస్ట్‌ రేంజర్‌ వెంకయ్య పోలీస్‌ ఎస్‌ఐ ప్రభాకర్‌ వచ్చి ఉంటారు. ఇద్దరిలో ఒకరిని మించిన ఆందోళన మరొకరిది. అది వారి వారి కొువు కాపాడుకునే స్వార్థంతోనే తప్ప మరొకటి కాదు గొత్తికోయువ్ల ఫారెస్ట్‌ వారికి గ ఏకైక ఇబ్బంది అడవును నరికి పోడు భూము. నివాసాుగా చేసుకుంటు అడవును అంతం చేస్తారని, పోలీసు వారికి ఏమో నక్సలైట్లకు వాళ్లు భోజనాు పెట్టి వారికి సహాయ సహకారాు అందిస్తారని అనుమానం, వీటివల్లే పోలీసు ఫారె స్ట్‌ వారికి గొత్తికోయు శత్రువు అయ్యారు. గొత్తి కోయను తరిమికొట్టే పనిలో భాగంగా ఈ పోలీసు ఫారెస్టు అధికాయి వాళ్లు కష్టపడకుండా స్థానిక గిరిజనుతోనే వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టడం ఈకథలో కొత్తముగింపు. ఆపథకం తోనే అక్కడకు వచ్చిన ఫారెస్ట్‌ వెంకయ్య పోలీస్‌ ప్రభాకర్‌ు స్థానిక గిరిజన నాయకుడైన ‘మడకంసిరమప్ప’ను ప్రభావి తం చేస్తారు, కానీ సొంత సామాజిక వర్గం అయిన గొత్తికోయు మీద తనకు తెలియకుండానే సిరిమప్పలో జాలి కలిగి ‘కష్టపడి పోడుకొట్టుకు న్నారుగా ఇంకేం చేస్తాం బతకనివ్వండి పాపం’అన్న అతడి మాటతో వెంక య్య-ప్రభాకర్‌ వ్యూహం తప్పి పోతుందని ఆందో ళన మొదలై ఇక ఆఖరి అస్త్రం బయటపెడతారు. ఎప్పటినుండో ఇక్కడే ఉంటున్న మీకు చెందాల్సిన ఈ భూము ఎక్కడి నుంచో వచ్చిన గుత్తికోయు అనుభవించడం ఏమిటి మీరు ఇలాజాలిపడి చూస్తుంటే రేపు మీ ప్లికు సెంటుభూమి కూడా మిగదు అన్న పోలీస్‌ ప్రభాకర్‌ మాట బాణాు గురి తప్పలేదు సిరమప్పలో ఆలోచన మొదవు తుంది. ఆదివా సులో ఉండే సహజగుణం మెదిలిఅయిన ఈప నుకు మమ్మల్ని ఎందుకుగుంజుతారు. మీరు మీరు త్చేుకోండి అనిఅసహనంగాఅన్న అతడి మాటతో అతడి మొండితనం గమనించినవాళ్ళు ‘‘మ్లును మ్లుతోనే తీయాలి’’అనే సూత్రం గుర్తుతెచ్చుకొని కొత్త వ్యూహంతో అక్కడినుండి వెళ్ళిపోతారు. పోలీస్‌ప్రభాకర్‌కు వచ్చిన ఆలోచన ప్రకారంగొత్తి కోయకు నక్సల్స్‌తో సంబం ధాున్నాయనే నెపం తో అక్కడినుంచి తరిమి వేయా న్న పౌరహక్కు నేతతోకష్టం, ఒకవేళ అలా చేయకపోతే ఆప్రాంతం నిజంగానే నక్సల్స్‌ అడ్డాగా మరే ప్రమాదముంది. అలా ఆలోచనతో వెళుతున్న వెంకయ్య ప్రభాకర్‌ కు దారిలో పెద్దఆవుగుంపు ఒకటి గొత్తికో యు ఉంటున్న గుట్టవైపు మేతకు వెళ్లడంవారి కంట పడుతుంది, పోలీస్‌ ప్రభాకర్‌ కు మెరుపు లాంటి ఆలోచన వస్తుంది. ‘‘వెంకయ్య గొత్తికోయ ను తరిమేయాలి అంతేనా? అయితే నేను చెప్పిన ట్టు చెయ్యి మూడో కంటికి తెలియకుండా తేడావస్తే బాగోదు’’అంటూ తన పోలీసు వ్యూహపు ఆలోచ నతో ఆదేశిస్తాడు ప్రభాకర్‌. కొద్దిరోజు గడిచాక ఒకరోజు మడకం వారి గుంపంతా సిరమప్ప ఇంటికి చేరుతుంది అందరిదీ ఒకటే ఆందోళన గతకొంత కాంగా అడవికి మేతకు వెళ్ళిన ఆవు ఒక్కొ క్కటిగా కనప డటం లేదు నెరోజుల్లో10ఆవు మాయ మయ్యాయి అక్కడకు చేరిన వాళ్ళంతా రకరకాుగా మాట్లాడుతున్నారు.అడవిలో కొత్త మనుషు కనిపిం చలేదు పులిజాడ కూడా లేదు మరి ఆవు ఎలామాయం అవుతున్నాయి? సిర మప్పకు అంతు పట్టలేదు రేపు పొద్దున్నే అడవికి పోయి మొత్తంగాలిద్దాం అందరూసిద్ధంగా ఉండం డి అంటూ తనగూడెం వాళ్లను ఆదేశిస్తాడు, సాధా రణంగా గిరిజనుల్లో ప్రతిపని సమిష్టిగా చేసే అ వాటు ఉంటుంది. మర్నాడు మడకంవారి గుంపు గిరిజ నుంతా అడవికి బయు దేరుతారు అడవిలో ప్రతిచోట వెతుకుతారు ఎక్కడాతప్పి పోయిన తమ ఆవు ఆచూకీ కనిపించలేదు. చివరి ప్రయత్నంగా గొత్తికోయు నివాసం ఉండి సాగు చేస్తున్న నాుగు గుట్టుచుట్టు గాలిస్తారు పోడు భూమికి పడమర దిక్కు వెళ్లగా అక్కడకొండగడ్డి దట్టంగా పెరిగి ఉంటుంది అక్కడికి గొత్తికోయ గుడిసొ కనిపిస్తు న్నాయి ఆ గడ్డి తొక్కుకుంటూ నడుస్తున్న సిరమప్పకు అక్కడ కనిపించిన దృశ్యంతో ఒళ్ళు జదరిస్తుంది. ఎముక కుప్పను చూసిన మిగతా జనాకు ఆవేశం తన్నుకొస్తోంది సిరమ ప్పకు నోట మాట రాలేదు. ఇది గొత్తికోయ పనే అని అందరూ అనుకుంటారు గొత్తికోయ గుడిసె వైపు ఆవేశాగ్ని గిరిజను రూపంలో వెళుతుంది క్షణాల్లో గొత్తి కోయ గుడిసొ అగ్గి మంటల్లో కాలి బూడిద అయిపోతాయి మంటల్లో కాగా మిగిలిన గొత్తి కోయు నెత్తురోడుతున్న శరీరాతో చెట్టుకొకరు పుట్టకొకరుగా పారిపోతారు ఆమంటల్ని చూస్తూ గొత్తికోయ పెద్దదిక్కు దాదా మొదు నరికిన చెట్టులా కూలిపోతాడు. ఇదంతా ముందే తెలిసిన సిరప్ప గొత్తికోయు వదిలివెళ్లిన బంగారం లాంటి పాతిక ఎకరా పోడుభూమికి హక్కుదారుని అయ్యానని ఆనందంతో చిద్విలాసంగా నవ్వుతూ ఉండటం తో కథ ముగుస్తుంది.ఈ‘దాడి’కథ ద్వారా రచయిత విద్యాసాగర్‌ గొత్తికోయ పక్షమా! స్వార్థంతో గిరిజనేతర అధికాయి గిరిజను మధ్య ఎలాచిచ్చు పెడుతున్నారో చెప్పే ప్రయత్నమా ?లేక ఆధునికఅరాచకాకు అమాయకపు ఆది వాసు ఎలా సమిధవుతున్నారో చెప్పే క్ష్యమా ?అన్న ప్రశ్ను పాఠకుకు వస్తాయి కానీకథ చర మాంకంలో సిరమప్ప మానసిక స్థితిని రచయిత ఆవిష్కరించిన తీరు ఇలా ఉంటుంది. ఇలాంటివి ధ్వంసం చేస్తే పాతిక ఎకరా పోడుభూమితనకు దక్కుతుందని ఫారెస్ట్‌ అధికారి వెంకయ్య చెప్పిన మాటు సిరమప్పకు గుర్తుకు రావడం ఆవును చంపింది గొత్తికోయు కాదని ఫారెస్టరే వాటిని చంపించాడని పాతిక ఎకరా భూమిని ఆశచూపి తనను ఈ విధ్వంసానికి పావుగా వాడుకున్నాడని సిరమప్ప అంతరాత్మకు తొసు.
అలాచీర ముక్కు గిరిజనేతరు స్వార్థబుద్ధి సోకి అతనిలో ఒక ఫారెస్ట్‌ వెంకయ్య ఒక పోలీస్‌ ప్రభాకర్‌ ఒక సల్వాజుడుం సభ్యుడు అగుపిస్తున్నాయి కొత్తరూపం ఎత్తిన గిరిజ నేతరు ఉన్నాడు అంటూ స్వార్ధపు సహజగుణం గ గిరి జనుల్లో ఎలాంటి స్వార్థం దాడి చేస్తుందో చెబు తూ ప్రస్తుతం గిరిజనజాతి చాలావరకు ఈఅను కరణ ప్రవాహంలో పడి పోయిందని భవిష్యత్తులో మరింతగా కూరుకుపోయే ప్రమాదంఉందని భవి ష్యత్తును ఊహించి ఆశించే రచయితగా తనదైన హెచ్చరికతో కూడిన ధర్మాగ్రహం వ్యక్తం చేశారు రచయిత విద్యాసాగర్‌. ఇలాంటి స్వార్థపు దాడుల్లో ఎలాంటి అడవిబిడ్డు బలికావద్దనే విస్తృత ఆలోచ ను ఆచరణదిశగా అందరిలోరావాలి అప్పుడే మన దేశ మూవాసు అనిచెప్పబడుతున్న ఆది వాసు జాతి చరిత్రలో సుస్థిరంగ నిుస్తారు.