దళితులకు రక్షణ లేదా..ఎన్నాళ్లీ ఇలా?
దేశాన్ని కుల,మత జాఢ్యాలు ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. పెత్తందారీ కుల కాలనాగులు అవకాశమొచ్చినప్పుడల్లా అణగారిన ప్రజానీకాన్ని కాటేసి ప్రాణాలు తోడేస్తూనేవున్నాయి. కులం వద్దు..మతం వద్దు.. భారతీయులంతా స్వేచ్ఛా స్వతం త్రాలు అనుభవిద్దామంటూ చేసుకున్న ప్రతినలన్నీ వెక్కిరింతకు గురవుతూనే వున్నాయి. కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షంలో పెత్తందారీ గూండాల దాడిలో దళిత యువకుడు బలైపోవడం, మరో తొమ్మిది మంది దళితులు గాయపడటం సమాజంలో వేళ్లూనుకున్న పెత్తందారీ దురహంకారాన్ని మరోమారు బయటపెట్టింది. కొన్ని నెలల కిందటే అధికార పార్టీకి చెందిన ఒక ప్రజా ప్రతినిధి తన వద్దే డ్రైవర్‌గా పనిచేస్తున్న దళిత యువకుడిని హత్య చేసి..మృతదేహాన్ని సదరు ప్రజా ప్రతినిధే నేరుగా బాధితుడి ఇంటికి డోర్ డెలివరీ చేసిన దారుణ ఉదంతం నుంచి జిల్లా తేరుకోక మునుపై మరో ఘోరం చోటు చేసుకుంది. శృంగవృక్షమనేది కాకినాడ జిల్లాలో చిన్న గ్రామం. ప్రతి యేటా ఇక్కడ జరిగే నూకాలమ్మ జాతరలో అన్ని సామాజిక తరగతు లవారు పాల్గొనడం ఆనవాయితీ. అందరూ ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకో వడం..మొక్కులు తీర్చుకోవడం గత కొన్ని తరాలుగా అనుసరిస్తూ వస్తున్న ఆనవాయితీ. జనం రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు పరస్పరం కాళ్లూచేతులు రాసుకోవడం, ఒక్కో సందర్భంలో కిందామీదా పడటం సర్వసాధారణం. శృంగ వృక్షం జాతరలోనూ అదే జరి గింది. జనం రద్దీలో పెత్తందారీ కాలు..దళిత యువకుడి కాలు పరస్పరం రాసుకున్నాయి. ‘మన కులపోడి కాలు నెత్తిన తగిలినా బాధలేదయ్యా..దళితుడి కాలు సోకితే ఊరుకుంటామా?’ అంటూ కుగ్రా మమైన శృంగవృక్షంపై మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. జాతరలో కాలు రాసుకున్న నేరా నికి శృంగవృక్షం దళితపేటపై పెత్తందార్లు రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా మూకు మ్మడి దాడికి పాల్పడ్డారు. దొరికినవారిని దొరికినట్టు చితకబాదారు. ఈ దాడిలో తొం డంగి గ్రామానికి చెందిన నడిరపల్లి రాము అనే దళిత యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో తొమ్మిది మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఇంత దారుణంగా దాడికి పాల్పడినా.. పెత్తందార్ల జోలికి వెళ్లకుండా పోలీసులు మీనమేషాలు లెక్కిస్తూ ఉండిపో యారే తప్ప ఎలాంటి తక్షణ చర్యలకు ఉపక్ర మించకపోవడం పలు అనుమానాలకు తావి స్తోంది. తెల్లారితే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాల్సినవాళ్లం..కేసులుగీసులు ఎందుకయ్యా..సర్దుకుపోతే అందరికీ మంచి దంటూ దళితులకు మైండ్వాష్ చేసే పనిని ఖాకీలు భుజానికి ఎత్తుకోవడం దిగ్భ్రాంతి కరం.కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) వంటి ప్రజాసంఘాలు నిలదీ యకపోతే అస్సలు కేసు కూడా నమోదు చేసేవారు కాదేమో ! విజయవాడలో స్వరాజ్య మైదానంలో ఆకాశాన్నంటేలా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తున్నా మని, దళితులకు, అణగారిన ప్రజానీకానికి తాము పెద్ద పీట వేస్తున్నామని పాలకులు మాటలు చెబితే సరిపోదు. ‘దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటామా?’ అంటూ ప్రశ్నించే పెత్తందారీ ఆధిపత్య భావా జాలాన్ని పూర్తిగా విడనాడాలి. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితు లకు శిరోముండనాలు చేయించడం, అత్యా చారాలు, హత్యలు వంటివి తరచూ చోటుచేసు కోవడం దేనికి సంకేతం. దాడులు జరిగిన ప్పుడు ఒంటికాలిపై లేవడం.. అరకోపరకో పరిహారమిచ్చి చేతులు దులిపేసుకుంటే సరి పోతుందా? ఇలాంటి దాడులకు పాల్పడిన వారి పీచమణచాలి. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్దర వీడి దళితులు, ఆదివాసీలు, ఇతర అణగారిన ప్రజానీకం రక్షణకు గట్టి చర్యలు చేపట్టాలి. బాధిత దళితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.
ప్రభుత్వంలో దళితులకు స్థానంలేదన్న వాస్త వం!
వైసీపీ ప్రభుత్వంలో దళితలకు స్థానం లేదు అన్నది అక్షర సత్యం. ఆ సత్యాన్ని బహు జనులు, దళిత సంఘాలు ఎప్పుడో గుర్తిం చాయి. ఉత్తరాంధ్రాను మొదలుకొని రాయలసీమ వరకు నిత్యం దళితలపై జరుగుతున్న దాడులు, బెదిరింపుల అనేవి లెక్కకుమించినవి. ఇంత వివక్ష ఎందుకో అర్థకాదుకానీ ..స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటివరకు కూడా ఇంతలా దేశ వ్యాప్తంగా ఇటువంటి దాడులు ఏపీలో తప్ప ఎక్కడ చోటు చేసుకోకపోవడం గమనార్హం. దళిత ఓటు బ్యాంకుతో గద్దెనెక్కిన జగన్ కు ఈ దాడుల లెక్క పట్టదా అని దళిత మేథావులు ప్రశ్నిస్తున్నా .. దున్నపోతుమీద వాన చందమే. ప్రశ్నించిన తెలుగుదేశం నేతలపై అధికార పార్టీకి చెందిన దళిత నాయకులతో అసభ్య పదజాలంతో విరుకుపడేలా పురికొల్పు తున్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారంటే చాలు వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుపడటం, ఒప్పుకొకుంటే దాడులు చేయడం జగన్ రెడ్డి ప్రభుత్వంలో పరిపాటిగా మారింది. ఇందుకు ఉదాహరణే ఏపిలో మిగిలి ఉన్న స్థానిక సంస్థలకు జరగుతున్న ఎన్నికలే. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో నామినేషన్ వేసేందుకు వచ్చిన వెంకటేశ్ అనే దళితుడిపై 30 వైసీపీ కార్యకర్తలు ముకుంబడి చేసిన దాడి, గుంటూరు జిల్లా గురజాల మున్సిపల్ ఎన్నికలలో మైనారిటీ మహిళా సుందగిరి నజీమూన్ నామినేషన్ చింపి, ఆమెపై దాడి, తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం కాచవరం పంచాయితీ ఒకటో వార్డుకు నామినేషన్ వేసిన గిరిజన మహిళ శిరీష కు బెదింపులు వంటివి వైసీపీ ప్రభుత్వం పాల్పడు తున్న దమనకాండకు నిర్శనాలు కావా అని విమర్శలు వెల్లువెత్తున్నాయి. అంతిమంగా ప్రజాస్వామ్య పద్దతిలో పదవులకు పోటీ చేసే స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు దళితులకు లేదు అన్నది జరుగుతున్న ఘనటలకు సజీవ సాక్ష్యాలు.దళితుల సంక్షేమం మరిచారు .. దాడులే లక్ష్యంగా పెట్టుకున్నారు! ఉత్తరాం ధ్రాల్లో దళితులు ..బెదిరింపులు,దాడులు, శిరోముండనాలను చూస్తే ..రాయలసీమలో రక్తాలు కారేలా హింసిస్తున్నారు. వివక్షలు, చిన్నచూపు వంటివి పరిస్థితులను తరుచూ అక్కడ దళితులు ఎదుర్కొంటున్నారు. దాడులు, శిరోముండనాలు, ఎన్నికల్లో పోటీచేస్తే చంపే స్తాం అన్న అనాగరిక చర్యలు గతంలో ఎన్నడూ చూడలేదు. వైఎస్సార్సీపీ అధికారం లోకి వచ్చిన నాటినుంచి దళితలపై సాగిస్తున్న నరమేథం, ఊచకోతలు అన్నీఇన్నీకావు. చంద్ర బాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అధికారంలో వైకాపా చేస్తున్న పాపాలు అన్నీఇన్నీకావు.14వ వార్డు టీడీపీ ఎస్సీ అభ్యర్థి వెంకటేష్ పై దాడి, నామి నేషన్ పత్రాలు చించివేయడం వంటివి చూస్తే అక్కడి మున్సిపల్ ఎన్నికలు సాధరణ ఎన్నికలు తలపించేంతగా అధికార పార్టీ సృష్టించే సీన్ సర్వత్ర విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికే కుప్పంలో అధికారపార్టీ చేస్తున్న అకృత్యాలపై మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. వెంకటేశ్ ను 30 మందికి దాడికి దిగారని, ఆ దాడికి సంబం ధించి ఫోటోలను కూడా లేఖకు జతచేశారు. గడిచిన 30 నెలలో వైసీపీ ప్రభుత్వం చేతిలో చితికిన దళితుల గురించి వివరించాలంటే ఒక గ్రంథం రాయాలి. రెండు శిరోముండనాలతో దళితులపై దాడులు సెంచరీ దాటాయి. ఇదిలా ఉంటే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కిందా టీడీపీ హయంలో 2018 నుంచి 2020 వరకు రూ.24 వేల కోట్లును ఖర్చు చేస్తే ..వైఎస్సార్సీపీ ప్రభుత్వం 30 నెలల్లో కేవలం రూ.5వేల కోట్లు కూడా ఖర్చు చేయకా..ఆ నిధులను ఫిచన్లు, అమ్మఒడి, రైతు భరోసా పథకాలకు మరలించడం కడు విచారం. ఇదేక్కడి దౌర్భగ్యమోకానీ..టీడీపీ హయంలో దళితలకు భూమి కొనుగోలు పథకం కింద 5 వేల ఎకరాలు పంపిణీ చేస్తేఏపి ప్రభుత్వం జగనన్న ఇళ్ల పేరుతో 4 వేల ఎకరాల అసైన్ట్ భూములను లాక్కొంది.
స్వాతంత్య్రం వచ్చి 76 ఏండ్లు గడిచినా దళితులపై ఆగని దాష్టీకాలు.
దేశంలో దళితులకు వేధింపులు, ఛీత్కారాలు, వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. మధ్య ప్రదేశ్‌లో గ్రామపంచాయతీలో ఓదళి తుడు కుర్చీలో కూర్చున్నందుకు అగ్రకులస్థుడు అతడి తల పగలగొట్టడం.. ఉత్తరప్రదేశ్‌లోని ఔరియా జిల్లాలో తరగతి నోట్స్‌లో తప్పులు రాశాడని టీచర్ ఓ దళిత విద్యార్థిని చితకబాదడంతో మరణించడం.. ఇదే యూపీలోని లఖింపూర్ లో ఇద్దరు దళిత అక్కాచెలెళ్లను రేప్ చేసి హత్య చేయడం..రాజస్థాన్‌లో నీటి కుండను తాకాడని ఓదళిత విద్యార్థిని తీవ్రంగా కొట్టిన ఘటన.. ఇలా దళితులపై వివక్ష చూపేలా..వారిని వేధించేలా జరుగుతున్న ఘటనలు దేశంలో కొకొల్లలు. కేంద్రంలో, రాష్ట్రాల్లో బీజేపీ గద్దెనెక్కిన తర్వాత ఈ విష ధోరణి మరింత పెచ్చరిల్లుతున్నది. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దళితుల పరిస్థితి దయనీయంగా మారింది.
11 శాతం పెరిగిన దాడులు
2019 నుంచి 2021 వరకు దేశంలో దళితులపై దాడులు 11శాతం పెరిగాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్సీఆర్బీ) ప్రకారం..2019లో 45,961,2021లో 50,900 కేసులు నమోదయ్యాయి. దళితులపై జరుగుతున్న దాడుల్లో జాతీయ సగటు కంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అధికంగా ఉన్నది. మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, గోవా, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లో దళితులపై విచ్చలవిడిగా దాడులు జరుగు తున్నాయి. రాజస్థాన్, తమిళనాడు వంటి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో కూడా ఇది కని పిస్తున్నది. దళితులపై దాడుల ఘటనలకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నా.. వాటిపై ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం తగిన విధంగా స్పందించి, చర్యలు తీసుకుంటున్న సందర్భాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
లోపం చట్టాలదా? వ్యక్తులదా?
ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్లో 19ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం, హత్య ఆరోపణల వ్యవహారం మీడియాలో ప్రధానంగా కనిపించింది. ఈ ఘటన తర్వాత దళితులపై దాడులు, అణచివేతలపై మరోసారి ప్రశ్నలు మొదలయ్యాయి. స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలైన తరువాత కూడా దళితులు ఇంకా సమానత్వం కోసం పోరాడుతూనే ఉ న్నారు.దళితులపై హింసకు సంబంధించి అనేక సంఘటనలు ప్రతియేటా వినిపిస్తూనే ఉన్నాయి. 2015లో రాజస్థాన్ దంగవాస్ ఘటన, 2016లో రోహిత్ వేముల మరణం, తమిళనాడులో 17ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం, హత్య, 2017లో సహారాన్పూర్ హింస, 2018లో భీమా కోరేగావ్ ఘటన ఇలా ప్రతి సంవత్సరం సంచలనాత్మక కేసులు వస్తూనే ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, దళితులపై దాడులు,అత్యాచారాలు తగ్గక పోగా ఇంకా పెరిగాయి.2019 సంవత్సరం లో దళితులపై అత్యాచారాలు గతంకన్నా 7.3% ఎక్కువ కేసులు నమోదైనట్లు ఎన్సీఆర్బీ తెలిపింది. దళితులపై అఘాయిత్యాలకు సంబంధించి 2018లో 42,793 కేసులు నమోదు కాగా, 2019 సంవత్సరంలో 45, 935 కేసులు రికార్డయ్యాయి. ఇందులో సాధా రణ దాడుల కేసులు 13,273 కాగా, ఎస్సీ,ఎస్టీ (అత్యాచార నియంత్రణ) చట్టం కింద 4,129 కేసులు 3,486 అత్యాచారం కేసులు నమోద య్యాయి. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 2378 కేసులు నమోదు కాగా, మధ్యప్రదేశ్‌లో అత్య ల్పంగా రికార్డయ్యాయి. జమ్మూ-కశ్మీర్, మణి పూర్, మేఘాలయ,మిజోరం,నాగాలాండ్, త్రిపు రలలో ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఒక్క కేసు నమో దు కాలేదు. 2019 సంవత్సరంలో షెడ్యూల్డ్ తెగలవారిపై నేరాలు 26.5శాతం పెరిగాయి. 2018లో ఎస్టీలలపై దాడులకు సంబంధించిన 6,528 కేసులు, 2019లో 8,257 కేసులు నమో దయ్యాయి. భారతదేశంలోనే కాదు విదే శాలలో కూడా దళితులపట్ల వివక్ష, దాడులకు సంబం ధించిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూన్ 30న కాలిఫోర్నియాలోని సిస్కో సంస్థలో ఒక దళిత ఉద్యోగి కుల వివక్షను ఎదుర్కొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీని తర్వాత అమెరికా కేంద్రంగా పని చేస్తున్న అంబేద్కర్-కింగ్ స్టడీ సర్కిల్(ఏకేఎస్‌సీ) కులవివక్షను ఎదుర్కొన్న 60మంది భారతీయులకు సంబంధించిన ఘటనలను ప్రచురించింది.
అండగా చట్టాలు
భారతదేశంలో దళితుల రక్షణ కోసం షెడ్యూల్డ్ కులాలు/తెగల (అత్యాచారాల నివారణ)చట్టం-1989 అమలులో ఉంది. షెడ్యూల్డ్ కులాలు, తెగలపై జరిగే దాడులను ఈ చట్టం కింద విచారిస్తారు.ఈ చట్టం ప్రకారం నేరం తీవ్రతను బట్టి బాధితులకు సహాయం, పునరా వాసం, నిందితులకు శిక్షలు నిర్ణయిస్తారు. ఇలాంటి కేసులను త్వరగా పరిష్కరించడానికి ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేస్తారు. ఇది కాకుండా అంటరానితనాన్ని అరికట్టడానికి అస్పృశ్యత నివారణ చట్టం-1955 కూడా ఉంది. దీనిని తర్వాత పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా మార్చారు. ఈ చట్టం ప్రకారం అంటరానితనాన్ని పాటించడం, ప్రోత్సహిం చడం నేరం. అయితే చాలా కేసులు మీడి యాకు, రాజకీయ నాయకులకు కనిపించ కుండానే పోతాయని, ఫిర్యాదు దాకా కూడా రాని కేసులు చాలా ఉంటాయని నిపుణులు అంటున్నారు. మరి సమస్య ఎక్కడ ఉంది ? చట్టం బలహీనంగా ఉందా లేక దానిని అమలు చేసేవారికి సంకల్పం లేదా?
అవగాహన కల్పించకపోవడమే సమస్య
తమపై జరిగే హింసలో సామాజిక, రాజకీయ కారణాలే పెద్ద పాత్ర పోషిస్తున్నాయని దళితులు భావిస్తున్నారు. బాధిత వర్గంలో అవగాహన పెరగాలని దళిత మేధావి చంద్రభాన్ ప్రసాద్ అన్నారు. ‘‘అంతకు ముందు దళితులపై ఈ స్థాయిలో హింసాత్మక ఘటనలు జరగలేదు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని మూక దాడులు చేయడం, చంపడం వంటివి ఉండేవి కాదు. గత 10-15 సంవత్సరాలలో ఇవి బాగా పెరిగాయి. దళితులు అభివృద్ధి చెందుతున్న కొద్దీ వారిపై దాడులు పెరుగుతున్నాయి. ఇది చట్ట సమస్య కాదు, సామాజిక సమస్య’’ అన్నారు చంద్రభాన్ ప్రసాద్. ఒక దశలో అమెరికాలో నల్లజాతీయులపై రోడ్ల మీదనే దాడులు జరిగే వని చంద్రభాన్ ప్రసాద్ చెప్పారు.‘‘ జన వరి 1,1863న అబ్రహంలింకన్ బానిసత్వాన్ని రద్దు చేసినప్పటి నుంచి నల్లజాతీయులపై మూక హింసాత్మక దాడులు మొదలయ్యాయి. అంటే, నల్లజాతీయులు బానిసలుగా ఉన్నంత కాలం వారిని చంపాల్సిన అవసరం యజమానులకు రాలేదు. భారతదేశంలో గత76ఏళ్లుగా దళి తులు కూడా అందుకు మూల్యం చెల్లిస్తూనే ఉన్నారు’’ అని చంద్రభాన్ ప్రసాద్ వ్యాఖ్యా నించారు.‘‘కుల వివక్ష ఇంకా కొనసాగుతుందన్న విష యాన్ని అందరూ ఒప్పుకోవాలి. విద్యావం తులు కూడా దీనిని అంగీకరించడానికి సిద్ధంగా లేరు’’ దళిత నేత ఉదిత్‌రాజ్. ఆవేదన వ్యక్తం చేశారు.- (వి.నానిబాబు )