ద‌ఢ పుట్టిస్తున్న ఒమిక్రాన్‌-వ‌ణికుతున్న ప్ర‌పంచ‌దేశాలు

కరోనా వేరియంట్లు వస్తూనే ఉన్నాయి. మొన్నటి వరకు డెల్టా వేరియంట్‌ అన్నారు. ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కొత్తగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ అంటు న్నారు. మరి ఇంది ప్రాణాం తకమా? కాదా?..అంటే కాదు అంటు న్నారు సౌత్‌ ఆఫ్రికన్‌ డాక్టర్‌. ఒమిక్రాన్‌ గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేసిన సౌత్‌ ఆఫ్రికన్‌ డాక్టర్‌ ఏంజెలిక్‌ కొయెట్జి తన దగ్గరకి ట్రీట్మెంట్‌కి వచ్చిన పేషెంట్స్‌ త్వరగా కోలుకున్నారు అని చెప్పారు. గత కొద్ది రోజులుగా దాదాపు 30 పేషెంట్స్‌ను చూడగా వారిలో తీవ్రమైన కోవిడ్‌ లక్షణాలు ఏమి కనిపించ లేదన్నారు. వీరెవరూ హాస్పిటల్‌?లో చేరకుండానే డిశ్చార్జ్‌ అయినట్లు తెలిపారు.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ లక్షణాలు
అందరు యువకులు అయినా బాగా అలసట కనిపించిందని ఏంజెలిక్‌ కొయెట్జి చెప్పారు. దానితో పాటు కొంచెం గొంతులో గరగర, పొడి దగ్గు, కండరాల నొప్పులతో తన దగ్గరకు వచ్చారని వివరించారు. ఎక్కువ మంది పేషెంట్లలో స్మెల్‌ రుచి పోలేదని అన్నారు. కొద్ది మందిలోనే హై టెంపరేచర్‌ కనిపించిందని పేర్కొన్నారు. తీవ్రమైన లక్షణాలు చూపించే ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇవి చాలా తక్కువ అని ఏంజెలిక్‌ కొయెట్జి వెల్లడిరచారు.

వాక్సిన్‌ అవ్వనివారు కూడా సేఫ్‌!
ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన వారు ఎక్కువ మంది 40ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నారు. అందులో ఎక్కువగా మగవారు ఉండగా.. సగానికన్నా తక్కువ మందికి మాత్రమే వ్యాక్సి నేషన్‌ అయిందని చెప్పారు. ఇంతవరకు చాలా మంది వాక్సిన్‌ లేనివారు కూడా డిశ్చార్జ్‌ అయ్యా రని చెప్పుకొచ్చారు. గత కొన్ని రోజులుగా వస్తున్న కేసుల్లో మూడు వంతులు ఇదే వేరి యంట్‌ వి అని తెలిపారు. ఎక్కువమందికి పూర్తిగా వాక్సిన్‌ అందకపోయినా మరి ఇంత వరకు హాస్పిటల్స్‌ ఎందుకు నిండిపోవట్లేదు అని ప్రశ్నించారు.

అతిగా ఆందోళన
మొదటి ఏడుగురు పేషెంట్లనీ చూసాక ‘డెల్టా కంటే భిన్నంగా’ ఉందని ఆరోగ్య అధికారులను అలెర్ట్‌ చేసినట్లు ఏంజెలిక్‌ కొయెట్జి తెలిపారు. అప్పటికే దానిని గుర్తించిన సైంటిస్టులు దానికి దీ1.1.529 అనే పేరు కూడా పెట్టి నవంబర్‌ 25 న అనౌన్స్‌ చేసినట్లు చెప్పారు. దీనితో సౌత్‌ ఆఫ్రికా మీద ట్రావెల్‌ బ్యాన్‌ వేయటం నుండి దాన్ని భయంకరమైన వేరియంట్‌గా చిత్రీకరిం చటం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అది ఎంత డేంజరస్‌ అనేది తెలియక మునుపే దాన్ని అతి తీవ్రం అని నిర్ధారించారని అన్నారు. అసలు వ్యాక్సిన్లు పనిచేస్తాయా లేదా అనేది తేలాల్సి ఉందన్నారు. ఈపాటికే యూరోప్‌లో ఎంతోమంది దీని బారినపడి ఉండచ్చన్నారు.

టూ ఎర్లీ టు సే అంటున్న సైంటిస్ట్స్‌
తీవ్రమైన రోగంగా మారదు అనటానికి ఇది సరైన సమయం కాదని కొందరు సైంటిస్టులు అంటున్నారు. ఇప్పటిదాకా ఈ వేరియంట్‌ ఎక్కువశాతం యువకుల్లోనే కనిపించటం వలన ఎక్కువ ప్రభావం ఉండకపోవచ్చు అని చెబుతు న్నారు. సౌత్‌ ఆఫ్రికాలో కాలేజీలు, యూనివర్సి టీలు, వీటిల్లోనే అధిక శాతం కేసులు వచ్చాయని పేర్కొంటున్నారు. మిగతా జనాభాలోకి వైరస్‌ వెళ్తే సీన్‌ మారచ్చని అంటున్నారు. కేసులు రెండు వారాల నుండే పెరుగుతోందని.. మరికొన్ని రోజుల్లో తీవ్రంగా మారే అవకాశముందని తెలిపారు.

నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
‘’ఒమిక్రాన్‌ వేరియంట్‌ గురించి ఎన్నో విషయాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ వాటి పట్ల ఒక నిర్ధిష్ట నిర్ధారణకు రావాలంటే వాటిని శాస్త్రీయ ప్రాతిపదికన పరీక్షించాల్సిన అవసరం ఉంది’’ అని ఢల్లీి ఎయిమ్స్‌ ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అన్నారు.‘’ఒమిక్రాన్‌ లో 30కంటే ఎక్కువ మ్యుటేషన్లు ఉన్నాయి. వైరస్‌ స్పైక్‌ ప్రోటీన్‌లో ఈ మ్యుటేషన్లు ఏర్ప డ్డాయి’’ అని పీటీఐ వార్తా సంస్థకు ఆయన చెప్పారు.‘’వైరస్‌ స్పైక్‌ ప్రోటీన్‌లో మ్యుటేషన్‌ కారణంగా ఈ వేరియంట్‌ రోగనిరోధక శక్తిని ఎదురించగల సామర్థ్యాన్ని అభివృద్ధి చేసు కుంటుంది. టీకాలవల్ల శరీరంలో ఏర్పడిన రోగ నిరోధక శక్తి లేదా మరే ఇతర ఇమ్యూనిటీ కూడా ఈ వైరస్‌ను ప్రభావితం చేయలేదు’’ ‘’అటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలోని అన్ని కోవిడ్‌ వ్యాక్సీన్లను సమీక్షించాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా వ్యాక్సీన్లు, వైరస్‌ స్పైక్‌ ప్రోటీన్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలను అభివృద్ధి చేస్తాయి. దీని ఆధారంగానే వైరస్‌ పనిచేస్తుంది’’ అని ఆయన చెప్పారు.‘’ఇప్పుడు ఒమిక్రాన్‌ ఈ స్పైక్‌ ప్రోటీన్‌ ప్రాంతంలోనే మ్యుటేషన్‌ చెందుతోంది. అంటే దీనిపై వ్యాక్సీన్లు మరీ అంత సమర్థంగా పనిచేయకపోవచ్చు’’ అని గులేరియా అభిప్రాయపడ్డారు.

‘’చాలా స్వల్ప లక్షణాలు’’
దక్షిణాఫ్రికాలో ఈ నెలలోనే ఒమిక్రాన్‌ వేరియంట్‌ను కనుగొన్నారు. తర్వాత దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ వో)కు సమాచారమిచ్చారు. నవంబర్‌ 24న ఈ కొత్త వేరియంట్‌ను ధ్రువీకరించిన డబ్ల్యూహెచ్‌ వో ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది.ఈ వేరియంట్‌లో చాలా మ్యుటేషన్లు ఉన్నాయని, ప్రాథమిక లక్షణంగా రీఇన్‌ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉన్నట్లు ఒక ప్రకటనలో డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఒమిక్రాన్‌తో రిస్క్‌ ఎక్కువే, తీవ్ర పరిణామాలు తప్పవని తాజాగా డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. తొలుత ఈ కొత్త వేరియంట్‌ను దక్షిణాఫ్రికా డాక్టర్‌ ఏంజెలిక్‌ కోట్జీ గుర్తించారు. ఇప్పటివరకు ఈ వేరియంట్‌ బారిన పడిన ప్రజల్లో ‘’చాలా స్వల్ప స్థాయిలో కోవిడ్‌ లక్షణాలు’’ కనబడ్డాయని ఆమెచెప్పారు. ‘’చాలా మంది రోగులు ఒళ్లు నొప్పులు, విపరీతమైన అలసటతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. అంటే నేను ఇక్కడ యువత గురించే మాట్లాడుతున్నా. ఆసుపత్రిలో చేరిన వారి గురించి చెప్పడం లేదు’’ ‘’ప్రమాదంలో ఉన్న వ్యక్తులపై కొత్త వేరియంట్‌ ప్రభావం తీవ్రతను అంచనా వేయడానికి ఇంకా సమయం పడుతుంది’’ అని ఆమె చెప్పుకొచ్చారు.

శాస్త్రవేత్తలకు షాక్‌
ఈ కొత్త వేరియంట్‌ దక్షిణాఫ్రికా నుంచి చాలా దేశాలకు వ్యాపించింది. అమెరికా, బెల్జియం, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌, జర్మనీ, బ్రిటన్‌, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా ఈ వైరస్‌ను గుర్తించారు. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి భారత్‌ వచ్చిన కొందరికి కూడా కరోనా సోకినట్లు తేలింది. అయితే, వారికి సోకింది ఒమిక్రాన్‌ వేరియంటా కాదా అన్నది తెలుసుకునేందుకు జీనోమ్‌ సీక్వెన్స్‌ కోసం శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. ‘’మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌ చాలా భిన్నమైనది. ఇది అసాధారమైన మ్యుటేషన్ల సమూహాన్ని కలిగి ఉంటుంది’’ అని దక్షిణా ఫ్రికాలోని సెంటర్‌ ఫర్‌ ఎపిడెమిక్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ డైరెక్టర్‌, ప్రొఫెసర్‌ టులియో డి ఓలివెరా వివరించారు. ‘’ఈ వేరియంట్‌ మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. సాధారణంగా వైరస్‌లో వచ్చే మార్పుల ప్రకారం,మేం ఊహి స్తున్న దాని ప్రకారం చూస్తే ఇది చాలా వేగంగా రూపాంతరం చెందుతోంది’’ అని ఆయన చెప్పారు. ఒమిక్రాన్‌లో మొత్తం 50 మ్యుటేషన్లు ఉన్నాయి. ఇందులో 30 మ్యుటేషన్లు స్పైక్‌ ప్రోటీన్‌లో సంభవించాయి’’ ‘’మన శరీరంలోని కణాలతో ఈ వైరస్‌ సంబంధం ఏర్పరచుకునే అంశం గురించి మాట్లాడాలంటే ఇది10 మ్యుటే షన్లను ఉపయోగించుకుంటుంది. డెల్టా వైరస్‌ లోని 2 మ్యుటేషన్లే ప్రపంచవ్యాప్తంగా వినాశ నానికి కారణమయ్యాయి’’ అని ఆయన వివరిం చారు.‘’కొత్త వేరియంట్లు కనుగొన్నా రంటూ వచ్చిన వార్తలు ప్రమాదాన్ని సూచిం చాయి. కానీ వ్యాధి తీవ్రతను, కోవిడ్‌ వ్యాక్సీన్లు నిరోధించ గలవు’’ అని అమెరికాలోని అంటు రోగాల ఆసుపత్రి చీఫ్‌, డాక్టర్‌ ఆంథోని ఫౌచీ అన్నారు. ‘’ఒక సరైన పరీక్ష ఉంటే తప్ప, అది వైరస్‌ నుంచి మనల్ని రక్షించే యాంటీబాడీలపై ప్రభావం చూపుతుందో లేదో మనకు తెలియదు’’ అని ఆయన సీఎన్‌ఎన్‌తో చెప్పారు.

మ్యుటేషన్‌ ఎంత తీవ్రంగా ఉంది?
అన్ని మ్యుటేషన్లు ప్రమాదకరమైనవి కావు. కానీ వైరస్‌లో ఎలాంటి మ్యుటేషన్లు సంభవించాయో తెలుసుకోవడం ముఖ్యం.చైనాలోని వూహాన్‌కు చెందిన వైరస్‌ కన్నా తాజా వైరస్‌ భిన్నంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అంటే వూహాన్‌ వైరస్‌ను దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన వ్యాక్సీలన్నీ ఈ వైరస్‌పై సమర్థంగా పనిచేయకపోవచ్చు. ఇతర వేరియంట్లలో కూడా కొన్ని మ్యుటేషన్లను కనుగొన్నారు. ఆ వేరి యంట్‌లో తమ పాత్రకు సంబంధించిన సమా చారాన్ని ఆ మ్యుటేషన్లు అందించాయి.ఉదాహ రణకు ఎన్‌501వై అనే మ్యుటేషన్‌ సులువుగా కరోనావైరస్‌ వ్యాప్తి చెందేలా చేస్తుంది. మరికొన్ని మ్యుటేషన్లు, శరీరంలో వైరస్‌ను గుర్తించడంలో యాంటీబాడీల పనిని కష్టతరం చేస్తాయి. వ్యాక్సీన్ల ప్రభావాన్ని తగ్గిస్తాయి. కొన్ని మ్యుటేషన్లు మరింత భిన్నంగా ప్రవర్తిస్తాయి.‘’ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వైరస్‌ వ్యాపించే సామర్థ్యాన్ని ఈ వేరియంట్‌ పెంచుతుందేమో అని మాకు ఆందోళనగా ఉంది. రోగనిరోధక వ్యవస్థ నుంచి కూడా తప్పించుకోవచ్చు’’ అని దక్షిణాఫ్రికాలోని క్వాజులు-నటాల్‌ యూని వర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ రిచర్డ్‌ లెసెల్స్‌ అన్నారు. అత్యంత ప్రమాదకరంగా కనిపించే కొన్ని వేరియంట్లు నిజానికి అంత ప్రభావం చూపలేవు అని చెప్పడానికి కూడా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఏడాది ప్రారం భంలో బీటా వేరియంట్‌ గురించి కూడా ఇలాగే ఆందోళన చెందాం. బీటా వేరియంట్‌, రోగని రోధక వ్యవస్థ నుంచి తప్పించుకోవడంలో మరింత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుండటంతో దానిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆతర్వాత డెల్టా వేరియంట్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి, చాలా సమస్యలను తెచ్చిపెట్టింది. ‘’బీటా వేరి యంట్‌ రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించు కోగలదు. కానీ డెల్టా వేరియంట్‌ వైరస్‌ను వేగంగా వ్యాప్తి చేయగలదు. కానీ రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే దీనికి సామర్థ్యం తక్కువగా ఉంటుంది’’ అని కేంబ్రిడ్జ్‌ యూని వర్సిటీ ప్రొఫెసర్‌ రవి గుప్తా చెప్పారు.(బీబీసీ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ కరెస్పాండెంట్‌ విశ్లేషణ`సౌజన్యంతో)– జేమ్స్‌ గళ్లఘర్‌