తెలంగాణ గిరిజన పవిత్ర స్థలాలు జాతరలు

మామానవ జాతికి మూలంగా చెప్పబడుతున్న గిరిజనులు దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో విస్తరించి ఉన్నారు ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో అందున తెలంగాణ రాష్ట్రంలో గిరిజ న జనాభా10శాతం విస్తరించి ఉన్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తుంది.12రకాల గిరిజన తెగలు గోదావరి కృష్ణ నదుల పరివా హక ప్రాంత కొండలు,కోనలు,అడవులు, మైదానాలలో నివసిస్తున్నారు.నమ్మకానికి సంస్కృతి పరిరక్షణకు ప్రతిరూపా లైన ఈఅడవి బిడ్డలు నివసించే ప్రాంతాలలోని ఆధ్యాత్మిక క్షేత్రాల గురించిన పూర్తి పరిశోధక పుస్తకం ‘తెలంగాణ గిరిజన పవిత్ర స్థలాలు జాతరలు’ రచయిత డాక్టర్‌ ద్యావనపల్లి సత్యనారాయణ. వీరు నిత్య సంచార పరిశోధకులు16 డిగ్రీలు పూర్తి చేసిన బహుముఖ విద్యావేత్త. గిరిజనా భివృద్ధి సంస్థ హైదరాబాదులో ఉన్నత ఉద్యో గ సేవలు అందిస్తున్న ఆయన వ్రాసిన ఈపుస్తకంలో అనేక ప్రామాణిక అంశాలు పొందుపరిచారు. గిరిజన కళాసంస్కృతి మొదలు గోదావరి లోయలో గిరిజన క్షేత్రాలు అనే తొమ్మిది విభాగాలుగా ఈ ప్రామాణిక పుస్తకం పొందుపరిచారు, అను బంధంగా తెలంగాణలోని అసెంబ్లీ స్థానాల వారీగా లంబాడ గిరిజన జనాభా వివరాలు అందించారు.ఈ పుస్తక రచన తెలంగాణ ప్రాంతంలోగల వివిధ జాతుల గిరిజనులు వారు పూజించే దైవాలు చేసేజాతరలు కేంద్రంగా కొనసాగి నేటితరం వారికి తెలి యని అనేక విలువైన చారిత్రక ఆధ్యాత్మిక విషయాలు విశేషాలు తెలియజేసింది. గిరిజన కళా సంస్కృతి అనే మొదటి విభాగంలో వివిధ గిరిజన తెగలు,కళలు, సంగీతం,నాట్యం,సాహిత్యం,చిత్రలేఖనం,కర్ర శిల్పం,అల్లికలు,గురించి సవివరంగా వివరి స్తూనే ప్రపంచీకరణ ప్రభావంతో అవి అంత రించిపోతున్న వైనం తెలిపి జాగృతం చేశారు.
ముఖ్యంగా లంబాడీల జీవన సంస్కృతి గురించి చాలా లోతైన అంశాలు వెల్లడిరచారు వంశాల వారీగా కొలిచే దేవతలు వాటి ప్రతిరూపాలుగా పూజించే చెట్ల వివరాలు లంబాడి సమాజం కుటుంబం కట్టుబాట్లు వివాహ విధానాలతో పాటు రాజస్థాన్లోని అబు పర్వతంపై బ్రాహ్మ ణులు చేసిన యజ్ఞం నుంచి ఉద్భవించిన రాజులు ఆ వంశం నుంచి అవతరించిన లంబడా తెగల వివరణ ఆసక్తికరంగా వివరిం చారు రచయిత సత్యనారాయణ. లంబాడీల ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ పూజా విధానం గురించి అనేక చారిత్రక అంశాలు జోడిరచి వివరించబడిరది.
కోయదొరలు పూజించే మేడారం సమ్మక్క సారక్క జాతర గురించి చారిత్రక జానపద అంశాలు జత చేసి అందించిన విభాగంలో సమ్మక్క సారక్క ప్రతాపరుద్రుని సేనలతో పోరాడి మరణించినట్టు ప్రజలను రక్షించే నేపథ్యంలో యుద్ధంలో మరణించిన వారి స్ఫూర్తి కోసం ‘‘వీరగల్‌ శిల్పాలు’’ చెక్కించటం నాటి ఆనవాయితీ, ప్రస్తుతం మేడారం దగ్గర జంపన్న వాగుపై వంతెన నిర్మాణ తవ్వకాల్లో స్త్రీ మూర్తి,పురుషమూర్తి,విగ్రహాలు బయట పడ్డట్టు అవి సమ్మక్క జంపన్న లవి అయిఉంటాయి అనే స్వీయ భావం రచయిత వ్యక్తపరిచారు. కాని ఆవివరాలు ఏవి ప్రస్తుతం మేడారంలోగానీ మ్యూజియంలోగాని లేకపోవడం కాస్త సందిగ్ధకరం. ఇక ఆదిలాబాద్‌ లోని కేస్లాపూర్‌లో గల గోండుల ఆరాధ్య దైవం‘‘నాగోబా’’గురించి కూడా అనేక చారిత్రక విషయాలతో సుదీర్ఘ అంశాలు, జాతర నేపథ్యం తీరుతెన్నుల గురించి కూలంకషంగా చర్చించారు.అలాగే గుండులు అమ్మ తల్లిగా పూజించే జంగు భాయ్‌ జాతర గురించి,కొమరం భీమ్‌ స్మారకం జోడెన్‌ ఘాట్‌ గురించిన వివరణలు ఇందులో చదవవచ్చు.
తెలంగాణలో గల ప్రధాన కోటలు వరంగల్‌, భువనగిరి,కోటలకన్నా అతి ప్రాచీనమైన గాంధారి కోట,గురించి అక్కడి పద్మనాయకపు గిరిజనులు ప్రతి ఏటా ఫిబ్రవరి మాసంలో జరుపుకునే మైసమ్మ జాతర గురించి జాతర ప్రారంభం నుంచి ముగింపు వరకు చేసే తంతులు గురించి సవివరంగా రాయడంలో రచయిత స్వీయ క్షేత్ర పర్యటనా నుభవం ప్రతి అక్షరంలో అగుపిస్తుంది.
ఆదిలాబాద్‌లోనే గల మరో అరుదైన పెద్దయ్య గుట్ట,గురించి కూడా మార్గ నిర్దేశం చేస్తూ వివరించారు,అలాగే కరీంనగర్‌ ప్రాంతంలో గల చిన్నయ్య గుట్ట యొక్క మొక్కుల గురించి కూడా తెలిపారు,
భద్రాచలం సమీపంలోని చర్ల దగ్గర పూజారి గూడెంలోని నాయకపోడు గిరిజనులు చేసే ‘‘సోముల దేవమ్మ కొలుపు’’ గురించి ఆసక్తిక రంగా తెలుపుతూ ఆధునికులు చేసే యజ్ఞ యాగాదుల ద్వారా వర్షాలు కురుస్తాయి. అనడంలో ఎలాంటి శాస్త్రీయత ఉందో, గిరిజనులు చేసుకునే జాతర్లు,కొలుపులలో కూడా అంతే శాస్త్రీయత ఉంది అంటూ రచయిత సహేతుకంగా చెప్పారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం లోని నల్లముడి గ్రామం శివారులోని అడవుల్లో గల ‘‘అక్షరాలలొద్ధి’’లో గల ఆదివాసి చిత్రలేఖనం గురించి రచయిత సత్యనారాయణ గారే మొదట వెలుగులోకి తెచ్చిన విషయం వివరించారు.
పాండవులు అరణ్య అజ్ఞాతవాస సమయంలో దక్షిణభారతంలోని దండకారణంలో గడిపినట్టు తద్వారా ఈ ప్రాంత అటవి పుత్రులకు పాండవులకు కలిగిన సంబంధ బాంధవ్యాలకు సంబంధించి నేటికీ ఇక్కడ గిరిజనులు భీముడు మొదలైన వారిని పూజిస్తూ సంబరాలు జాతరలు చేస్తుంటారు అని అనేక ఉదాహ రణలతో రచయిత చెప్పారు.
నల్లమల ప్రాంత గిరిజనులు తమ జాతి ఆడపడుచు చెంచులక్ష్మినిమను వాడిన శివుని తమ అల్లునిగా భావించి,పూజిస్తారని,ఇక్కడ జరిగే సలేశ్వరం లింగమయ్య జాతర,లొద్ది మల్లయ్య జాతర,భవరాపూర్‌ శివరాత్రి జాతర, గురించి చాలా క్షుణ్ణంగా రచయిత వివరించారు.
అదేవిధంగా గోదావరి లోయలోగల గిరిజన క్షేత్రాలు గురించిన అనేక ఆసక్తికరమైన విషయాలు విశేషాలు తెలియజేస్తూ… పాఠకులకు ఆసక్తిని కలిగిస్తూ అనేక విలువైన గిరిజన చారిత్రక సాంస్కృతిక విషయాలు తెలియజేశారు.
ఇందులోని ప్రతి విషయం కూడా ప్రామాణికంగా పరిశోధనకు చేయూతనిచ్చే దారి దీపం వంటిది ఈ పుస్తకం.
ఇప్పటివరకు వచ్చిన అనేక గిరిజన సాంప్రదాయ పుస్తకాలకు ఇది భిన్నమైనది ప్రతి పరిశోధక విద్యార్థి ఉత్తమ పాఠకులు తప్పనిసరిగా చదివి తీరాల్సిన ప్రామాణిక పుస్తకం ఇది.

పుస్తకం పేరు తెలంగాణ గిరిజన పవిత్ర స్థలాలు జాతరలు
రచన డా.ద్యావనపల్లి సత్యనారాయణ పుటలు 116 పేజీలు వెల అమూల్యం ప్రతులకు సంత్‌ శ్రీ సేవాలాల్‌ స్వచ్ఛంద సంస్థ,టేకులపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సెల్‌ 9703085458. – డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)