తగ్గుతున్న విద్యా ప్రమాణాలు
దేశంలో విద్యావ్యవస్థను సంస్కరించి నూతన విద్యావిధానాన్ని రూపొందించి అందరికీ నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గత రెండు మూడు దశాబ్దాలుగా పాలకులు, న్యాయస్థానాలు, మేధావ్ఞలు, పదేపదే చెపుతున్నా.. ఆచరణకు వచ్చేసరికి అవి మాటలకే పరిమితమవు తున్నాయి. ముఖ్యంగా పడిపోతున్న నాణ్యతగూర్చి న్యాయస్థానాలు ఎన్నోసార్లు ఎత్తిచూపాయి. చివరకు ప్రభుత్వం నుండి జీతభత్యాలు తీసుకుంటున్నవారుకూడా సర్కారు పాఠశాలల్లో తమ పిల్లలను చదివించకపోవడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలంటూ అలహాబాద్‌కు చెందిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్ అగర్వాల్ 2015 ఆగస్టు 18న తీర్పు ఇచ్చారు. సర్కారు బడుల్లో ఉపాధ్యాయులను నియమిస్తున్నవారు తమ పిల్లలను మాత్రం వాటిల్లో చదివించకపోవడాన్ని ఆయన ఆనాడే తప్పుపట్టారు.ప్రైవేట్ విద్యా వ్యాపారం పెరిగిపోతున్నా నాణ్యత విషయంలోమాత్రం అంతంతమాత్రంగానే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశా లల్లో ప్రధమ్ సంస్థ నిర్వహించిన సర్వేలోని అంశాలను మంగళవారం వెల్లడిరచింది. భారతదేశంలోని 596 జిల్లాల పరిధిలో మూడు నుంచి పదహారేళ్ల వయస్సుఉన్న దాదాపు ఐదున్నర లక్షల మందికిపైగా విద్యార్థులపై ఈ సర్వే నిర్వహించగా బడిలో చేరని పిల్లల సంఖ్య 2007తో పోలిస్తే మూడు శాతం తగ్గినట్లు వెలుగుచూసింది. ప్రాథమిక స్థాయి నుంచే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్చేందుకోసమే మొగ్గు చూపుతున్నారు. పై తరగతులకు వెళ్లేకొద్దీ క్రమేణా చదువ్ఞ మానేసేవారి సంఖ్య పెరిగి పోతున్నది. 2018లో ప్రైవేట్ పాఠశాలల్లో రెండో తరగతి చదువ్ఞతున్న విద్యార్థులు 54.4 శాతం ఉంటే ఎనిమిదో తరగతి విద్యార్థులు 25 శాతంలోపే ఉన్నారు. ఇక పదాలు, వాక్యాలు చదవగలిగే వారి సంఖ్య గతంలో కంటే మరింత తగ్గిందని యాన్యూవల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ బయటపెట్టింది.ప్రైవేట్ పాఠశా లల్లో కూడా ప్రమాణాలు భారీగానే పడిపోతున్నట్లు చెప్పింది. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో మూడోతరగతిలో కూడా తీసివేతలు రాని విద్యార్థుల సంఖ్య పెరిగిందని 2016లో తీసివేత చేయగలిగిన విద్యార్థులు 4.2శాతం ఉంటే ఇప్పుడు వారి సంఖ్య ముప్పై నాలున్నర శాతానికి పడిపోయింది. గణాంకాలు చేయలేని విద్యార్థులు ఐదో తరగతిలో 2016లో 30.4శాతం ఉంటే, ఇప్పుడువారి శాతం 27.3 శాతానికి తగ్గింది.ఇక ప్రైవేట్ పాఠశాలల్లో ఎనిమిదో తరగతిలో లెక్కలు చేయగలిగిన విద్యార్థు లు 2016లో 54.9 శాతం ఉంటే ఇప్పు డు అది 48.7 శాతానికి తగ్గిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రమా ణాలు పడిపోతున్నాయని ఈ సర్వే స్పష్టం చేస్తున్నది. గ్రామీణ ప్రాంతంలోని ప్రైవేట్ పాఠశాలల పరిస్థితి కూడా ఆందోళన కరంగానే ఉంది. ఫీజులు వసూలు చేయడంలో ఉన్న ధ్యాస%ౌౌ% న్యాణమైన విద్య అందించడంలో విఫలమవ్ఞతున్నారు. వాస్తవంగా చూస్తే.. ఒకనాడు ప్రభుత్వ పాఠశాలలే కానీ ప్రైవేట్ బడులు లేవ్ఞ. ఎక్కడో పట్టణాల్లో, నగరాల్లో అక్కడక్కడా ప్రైవేట్ బడులు నడిచేవి. వాటిల్లో కూడా వ్యాపార ధోరణులు కన్పించేవి కాదు. లాభనష్టాలతో సంబంధం లేకుండా కేవలం సేవా దృక్పథంతో ఆవిద్యా సంస్థలు ప్రజలకు సేవలు అందించేవి. నిర్వాహకులు సామాజిక బాధ్యతగా భావించి బడులు నడిపేవారు. అందువల్ల ఆనాడు వాటిని అరికట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. అందుకే ప్రైవేట్ విద్యను అరికట్టేందుకు ఆనాడు చట్టాల అవసరం తలెత్తలేదు. కానీ ఇప్పుడు అవి పూర్తిగా వ్యాపార సంస్థలుగా రూపాంతరం చెందాయి. లాభసాటిగా ఉన్న ఈ వ్యాపా రంలో రాజకీయ నాయకులు, కాంట్రా క్టర్లు, ఒకరేమిటి వ్యాపారాలు చేయాలను కున్నవారంతా ఈ విద్యా వ్యాపారంలో దిగుతున్నారు. దీనికి తోడు ఇంగ్లీషు చదువ్ఞలపై మోజు పెరగడంతో దాన్ని ఆసరాగా తీసుకుని విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చివేశారు. బీదా,బిక్కీ జనం కూడా ప్రైవేట్ విద్యకోసం ఆరాట పడుతున్నారు. ఏమాత్రం ఆర్థికవసతి లేక, మరోదారి లేనివారే విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల బాటపడుతున్నారు. ఇంతకాలం గ్రామాలకు ప్రైవేట్ వ్యాపారం సోకకపోవడంతో పట్టణాలకు పంపించి చదివించే ఆర్థిక స్థోమత లేని మధ్యతరగతి వారుసైతం తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వ విద్యపై ఆధారపడ్డారు. ఇప్పుడు మండల కేంద్రాలు, చివరకు మారుమూల గ్రామాలకుసైతం ఈ విద్యావ్యాపారం వ్యాపించిపోయింది.ఇక రానురానూ ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా కన్పిస్తోంది. ఎందుకు ఈ పరిస్థితి దాపురిస్తున్నది? కారుకులు ఎవరు? కారణాలు ఏమిటి? అనేది పాలకులకు తెలియంది కాదు. అందరికీ తెలుసు. అయినా ఈ దుర్మార్గపు వ్యాపారానికి అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. పాలకులు ఘోరంగా విఫలమవ్ఞతున్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీచేయడం లేదని చెప్పడం లేదు. ప్రభుత్వ పథకాలు, ఆశయాలు కాగితాల వరకు బాగానే ఉంటాయి.
కానీ ఆచరణ విషయం వచ్చేటప్పటికీ అసలు సమస్య మొదలవ్ఞతుంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలి. బాలబాలికలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన విద్యావ్యవస్థను ఇంతటి దారుణ పరిస్థితుల్లోకి నెట్టడం దురదృష్టకరం. మారిన పరిస్థితులకు అనుగుణంగా జీవనోపాధికి ఉపయోగ పడేలా విద్యావిధానాన్ని సంస్కరించాల్సిన అవశ్యకత ఉంది. కోట్లకొద్దిడబ్బు, ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా పాఠశాల విద్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. ఈమధ్యనే ప్రథం సంస్థ విడుదల చేసిన సర్వే(అసెర్) వివరాలు విద్యా ప్రమాణాలు దిగజారిన విషయాన్ని తేటతెల్లం చేసింది. 2005-2014 వరకు ఆ సంస్థ సర్వే నిర్వహించింది. ప్రతి సంవత్సరం ప్రథం సంస ్థసర్వే నిర్వహి స్తుంది. ఈ సర్వేలో మన ప్రభు త్వాలు విద్య కోసం చేస్తున్న కార్యక్రమాలు ఎంత వరకు ఫలితాన్ని స్తున్నయో తెలియజేసింది. విద్యా ప్రమ ణాలు పెంచడంలో విద్యావ్యవస్థ విఫల మవుతున్నదని చెప్పడానికి ఈ సర్వే గణాంకాలే నిదర్శనం. ఈసర్వే ప్రకారం 5వ తరగతి చదివే విద్యార్థికి 2వతరగతి స్థాయి భాష, గణితసామర్థ్యాలు లేవని తేల్చిచెప్పింది. వివిధ కార్యక్రమాల రూపకల్పన ద్వారా పాఠశాలలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డా, విద్యా ప్రమాణాలు మాత్రం మెరుగుపడకపోగా ఇంకా తగ్గిపోయాయి. ఈసర్వే వివరాల ప్రకారం రెండవ తరగతి పిల్లల్లో 19.5శాతం పిల్లలు 0 నుంచి 9 అంకెలను గుర్తించలేకపోతున్నారు. ఇది ఇదివరకు 17.6శాతంగా వుండేది. దీన్నిబట్టి చూస్తే విద్యార్థుల విద్యాప్రమాణాలు మెరుగుపడటం అటుంచి అవి మరింత దిగజారిపో తున్నాయి. విద్యా పమాణాల దిగజార డానికి కారణాలు అనేకం. అందులో ముఖ్యమైనది ఉపాధ్యాయుని పనితీరు, హాజరు. చాలవరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నా, ఉన్న ఉపాధ్యాయుల్లో ఎంతమంది అంకిత భావంతో పనిచేస్తున్నారనేది ప్రశ్న? బోధన నిరంతరం జరుగుతున్నది కానీ అభ్యసన ఎంతమేరకు జరిగింది అన్నది ముఖ్యం. అందుకే ఇటీవల మోదీ విదేశీ తరగతి గదుల్లో అభ్యసన మాత్రమే జరుగుతున్నది, కానీ మనతరగతి గదుల్లో బోధన జరుగుతున్నది అన్నారు. మారుతున్న పరిస్థితులకు కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయ విద్యలో మార్పులు ఉండటం లేదు.భావి ఉపాధ్యాయులను తయారుచేసే సంస్థల పనిత నం, వారు పాటిస్తున్న నిబంధనలు ఉపాధ్యాయుల ప్రమాణాలు పెంచేందుకు కృషి చేయాలి.ఉపాధ్యా యుల్లో లోపించిన జవాబుదారీతనం, అంకితభావానికి ఉపాధ్యాయ విద్యే బాధ్యత వహించాలి. పాఠశాలలకు ప్రభుత్వం రూపొందిస్తున్న వివిధ కార్యక్రమాలు ఎంతవరకు వాటి సామర్థ్యం మేర పనిచేస్తున్నాయనేది పర్యవేక్షకుల పనితీరు పైనే ఆధారపడి వుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తున్నా వాటిని పర్యవేక్షించే అధికారుల లోటును భర్తీచేయలేకపోతున్నది. పర్యవేక్షక అధికారుల పనితీరు, ఉపాధ్యాయ ఖాళీలు ఇవన్నీ సర్కారీ బడులన్నీ ఖాళీ అవుతున్నాయి. గ్రంథాలయపుస్తకాలు, ప్రయోగపరికరాలు సరఫరా చేసినా వాటిని వినియోగిస్తున్న దాఖలాలు లేవు. ూూA, RవీూA లద్వారా అందచేస్తున్న శిక్షణలు, వసతులపై పర్యవేక్షణ లోపాలున్నాయి.
విద్యాప్రమాణాలు మెరుగుపడాలంటే ఉపాధ్యాయ విద్యను పరిపుష్టం చేయాలి. ఉపాధ్యాయ విద్య ఎంత పటిష్టంగా వుంటే విద్యావ్యవస్థ అంతపటిష్టంగా ఉంటుంది. విద్యాప్రమాణాల పెరగడానికి దోహదం చేస్తుంది. పర్యవేక్షకుల నియామకం చేపట్టి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యా యుల పనితీరు మెరుగు పర్చవచ్చు. వీటన్నిటితో పాటు సంస్థలు, వ్యక్తుల మధ్య సమన్వయం అనేది విద్యాప్రమాణాల పెరుగుదలకు చాలా అవసరం. ఉపాధ్యాయ విద్య, పాఠశాల విద్యల మధ్య సమన్వయం విద్యా ప్రమణాల పెరుగుదలకు దోహదపడుతుంది. తద్వార విద్యా ప్రమాణాలు మెరుగుపడి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వపాఠశాలలపై నమ్మకం కలుగుతుంది. ప్రభుత్వాలు వీటన్నింటిపైదష్టి సారించాల్సిన అవసరంఎంతైనా వున్నది.- జి.ఎన్.వి.సతీష్