డెల్టాన్ దాటి దుసుకుపోతున్న‌ ఒమిక్రాన్

రాష్ట్రంలో ఒమిక్రాన్‌ వ్యాప్తిపై జనాల్లో ముమ్మరంగా చర్చలు కొనసాగుతున్నాయి.డెల్టా కంటే ఒమిక్రాన్‌ వేరియంట్‌ నాలుగైదు రెట్లు స్పీడ్‌గా స్ప్రెడ్‌ అవుతోందని డబ్ల్యూ హెచ్‌వో దగ్గర్నుంచి రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ వరకూ అందరూ చెప్తున్నప్పటికీ, మన రాష్ట్రంలో మాత్రం అలాంటి సూచనలే కనిపించట్లేదు. కెన్యాలో, సోమాలియాలో ఒమిక్రాన్‌ బారినపడి ఇక్కడికి వచ్చినోళ్లు వందల మందిని కాంటాక్ట్‌ అయినప్పటికీ అందులో ఒక్కరికే కొత్త వేరియంట్‌ అంటుకుంది. యూకే నుంచి హన్మకొండకు వచ్చిన మహిళకు ఒమిక్రాన్‌ పాజిటివ్‌ వచ్చింది. ఆమెతో కలిసి ఇంట్లోనే ఉన్న ఆమె భర్తకు, బిడ్డకు వైరస్‌ అంటలేదు. ఆమెను కలిసిన 30 మంది ప్రైమరీ కాంటా క్టులలో కనీసం ఒక్కరికీ వైరస్‌ సోకలేదు. జూబ్లీహిల్స్‌లో ఒమిక్రాన్‌ పేషెంట్‌కు 3రోజుల పాటు ఫుడ్‌ సర్వ్‌ చేసిన హోటల్‌ సిబ్బంది లోనూ ఎవరికీ ఈ వేరియంట్‌ అంటలేదు. ఇలా చెప్తూపోతే చాలా ఎగ్జాంపుల్సే ఉన్నయి. సౌత్‌ ఆఫ్రికా, యూకే, అమెరికా తదితర దేశాల్లో పరిస్థితి చూస్తే డబ్ల్యూహెచ్‌వో చెబుతున్నట్టు ఒమిక్రాన్‌కు స్పీడ్‌ ఎక్కువేనన్న విషయం స్పష్టం అవుతోంది. కానీ,మన దగ్గరకు వచ్చేసరికి ఒమిక్రాన్‌ స్పీడ్‌ తగ్గిపోయిన సూచ నలు కన్పిస్తున్నయి.హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ చెబు తున్న లెక్క ప్రకారం ఆదివారం నాటికి రాష్ట్రంలో ఇప్పటి వరకు 44 ఒమిక్రాన్‌ కేసులు నమోద య్యాయి. ఇందులో 40 మంది విదే శాల నుంచి వచ్చినవాళ్లు అని, ఇంకో ఇద్దరికి లోకల్‌గా స్ప్రెడ్‌ అయిందని ప్రకటించారు. ఈ ఇద్దరికీ తప్ప లోకల్‌?గా ఇంకెవరికీ స్ప్రెడ్‌ కాలే దని చెప్తోంది.

టీకాలు, ఇమ్యూనిటీ వల్లే కావొచ్చు: హెల్త్‌ డైరెక్టర్‌
‘‘ఒమిక్రాన్‌ పేషెంట్ల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులలో 1200 మందికి టెస్ట్‌ చేశాం. అందులో ఇద్దరికే సోకింది. మిగతావాళ్లంతా విదేశాల నుంచి వచ్చినోళ్లే. వ్యాక్సినేషన్‌, డెల్టా వేరియంట్‌ సోకడం వల్ల వచ్చిన ఇమ్యూనిటీ కారణంగా ఒమిక్రాన్‌ సోకట్లేదని అనుకుం టున్నామని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు పేర్కొ న్నారు. అందరూ మాస్క్‌ వాడుతుండడం కూడా ఓకారణం కావచ్చు. థర్డ్‌ వేవ్‌ వస్తుందని మా అంచనా. డెల్టా తరహాలో సీరియస్‌గా మాత్రం ఉండదు. నార్మల్‌ సింప్టమ్స్‌తో వచ్చి పోతుంది’’ అని పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు అన్నారు.

చాపకింద నీరులా వ్యాప్తి
‘‘వ్యాక్సిన్‌ వేసుకుంటేనో, ఇదివరకే వైరస్‌ బారిన పడడం వల్లనో ఒమిక్రాన్‌ సోకట్లేదనుకోవడం కరెక్ట్‌ కాదు. వందల మంది కాంటాక్ట్స్‌లో ఒకరి ద్దరికే సోకిందంటే నమ్మేలా లేదు. ఇప్పటికే చాలా మందికి వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తుండొచ్చు. టెస్టులు, సీక్వెన్సింగ్‌ ఎక్కువగా చేసినప్పుడు అసలు విషయం బయటపడు తుంది.’’ అని రంగారెడ్డి వివరించారు.
ఇప్పుడే కన్‌క్లూజన్‌కు రాలేం: సీసీఎంబీ డైరెక్టర్‌ వినయ్‌
‘‘ఇండియాలో ఒమిక్రాన్‌ వ్యాప్తిపై ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుంది. మరో 10రోజుల్లో వైరస్‌ ఎఫెక్ట్‌ పై క్లారిటీ రావొచ్చు. ఇది డెల్టా కంటే ఎక్కువ స్పీడ్‌ అనే విషయం స్పష్టమైంది’’ అని సీసీఎంబీ డైరెక్టర్‌ వినయ్‌ తెలిపారు. మాస్కులు, సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తూనే,పరిస్థితిని ఎదుర్కొవాలని సూచిం చారు.

పెద్దగా భయంలేదు
‘‘బ్రిటన్‌ నుంచి వచ్చిన హనుమకొండ మహిళకు ఒమిక్రాన్‌ కన్ఫామ్‌ అయింది. ట్రీట్‌మెంట్‌ జరగు తోంది. ఆమెతోపాటు కుటుంబ సభ్యులకు ఎలాంటి సింప్టమ్స్‌ లేవు. ఆమె ప్రైమరీ కాంటా క్టులు 30 మందికి టెస్టులు చేయగా..నెగెటివ్‌ వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఒమిక్రాన్‌తో పెద్దగా భయం లేదనిపిస్తోంది’’ అని హన్మకొండ జిల్లా సర్వీలెన్స్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీకృష్ణారావు చెప్పారు.
ఏపీలో ఒమిక్రాన్‌ అలర్ట్‌.. అధికారులకు సీఎం జగన్‌ కీలక ఆదేశాలు.. వాటికి గ్రీన్‌ సిగ్నల్‌..

కోవిడ్‌-19 వల్ల ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కోవడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండా లని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశిం చారు. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులు,నివార ణపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ పరిస్థి తులకు ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్క్రెవేటు రంగంలోని ఆస్పత్రులుకూడా దీనికి సిద్ధంగా ఉండాలనని ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ మరింత ఉధృతం చేయాలని ఆదేశించారు. ఫీవర్‌ సర్వే చేసే సమయంలోనే వ్యాక్సినేషన్‌ చేయించు కోనివారు ఎవరైనా ఉంటే..వారికి టీకాలు వేయాలన్నారు. 13 జిల్లాల్లో 98.96శాతం మొదటి డోస్‌, 71.76శాతం రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ పూర్తైనట్లు ఆరోగ్య శాఖ అధికా రులు సీఎంకు వివరించారు. నెల్లూరు, విజయ నగరం,ప్రకాశం,అనంతపురం,ప.గో, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో నూటికి నూరుశాతం మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌ పూరరైందని..కడపలో 98.93,విశాఖపట్నం 98.04,గుంటూరు 97.58, తూ.గో 97.43, కృష్ణా 97.12, శ్రీకా కుళంలో 96.70శాతం మేర మొదటి డోస్‌ వేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం బూస్టర్‌ డోస్‌ ప్రకటన నేపథ్యంలో అన్నిరకాలుగా సిద్ధం కావాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌ తోపాటు దీర్ఘకాలిక వ్యాధులున్నవారిపైన, వృద్ధులపైన బూస్టర్‌ డోస్‌లో ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. 15 నుంచి 18ఏళ్లవారితో కలుపుకుని దాదాపు 75 లక్షల మందికి బూస్టర్‌ డోస్‌ అవసరమని ప్రాథమిక అంచనావేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఇక కరోనా పాజిటివ్‌ కేసులు ఒమిక్రాన్‌ వ్యాప్తిపై సమావేశంలో చర్చ జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6ఒమిక్రాన్‌ కేసులున్నాయని తెలిపిన అధికారులు..వీరిలో ఎవ్వరూ కూడా ఆస్పత్రిపాలు కాలేదన్నారు. అదికారులు ఇచ్చిన వివరాల ప్రకారం ప్రస్తు తానికి భయాందోళనల అవసరం లేదని.. అదే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండా లని సీఎం జగన్‌ ఆదేశించారు. రాష్ట్రంలో కేసులు తక్కువగా ఉన్నా.. ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు కొనసాగుతున్నందున పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ చర్యలు తీసుకోవాలని సూచించారు.

టెస్ట్‌ ఎర్లీ, ట్రేస్‌ఎర్లీ, ట్రీట్‌ ఎర్లీ
క్రమం తప్పకుండా ఇంటింటికీ ఫీవర్‌ సర్వే తప్పనిసరిగా జరగాలని సీఎం స్పష్టం చేశారు. కొవిడ్‌ నివారణలో టెస్ట్‌ ఎర్లీ, ట్రేస్‌ఎర్లీ, ట్రీట్‌ ఎర్లీ పద్ధతులలో పోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, పరిశీలన పటిష్టంగా కొనసా గాలని.., సచివాలయం స్థాయి నుంచి డేటాను తెప్పించుకోవాలన్నారు. విదేశాలనుంచి వచ్చే వారికి పరీక్షలు నిర్వహించడంతో పాటు వారిని ట్రేస్‌ చేయాలన్న సీఎం..ఆర్టీపీసీఆర్‌ పద్ధతిలోనే పరీక్షలు చేయాలన్నారు. విదేశీ ప్రయాణికులకు పాజిటివ్‌ అని తేలితే ప్క్రెమరీ కాంటాక్ట్స్‌కు కూడా వెంటనే టెస్టులు చేయాలన్నారు.

డెల్టా ను దాటి…దూసుకుపోతున్న ఒమిక్రాన్‌
దక్షిణాఫ్రికా, బ్రిటన్‌, యూరోపియన్‌ యూనియన్‌, అమెరికా దేశాల్లో ప్రస్తుతం వ్యాపిస్తున్న కోవిడ్ష్‌19 కేసుల్లో, డెల్టా తరహా వైరస్‌ ను వేగంగా దాటేసి ఒమిక్రాన్‌ తరహా వైరస్‌ ముందుకొచ్చేసింది. సార్స్‌-కో.వి-2 (దీనినే మనం కరోనా అంటున్నాం) వైరస్‌ నిత్యం మ్యుటేట్‌ అవుతూ మార్పులకు లోనవుతోంది. అలా వివిధ రకాల కరోనా వైరస్‌ లు వచ్చాయి. వాటిలో రెండో దశ చివరికొచ్చేసరికి అన్నింటికన్నా డెల్టా తరహా వైరస్‌ ముందుండేది.తాజాగా దాన్ని శరవేగంగా దాటేసి ఒమిక్రాన్‌ తరహా వైరస్‌ ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపిస్తోంది. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించు కున్నవారికి కూడా ఈ ఒమిక్రాన్‌ సోకుతున్న వైనం ఆందోళన కలిగించే అంశం. ఇప్పటి వరకు అందిన ల్యాబ్‌ పరీక్షల ఫలితాలను బట్టి ఈ విషయం నిర్ధారించవచ్చు. ఐతే ఇంకా పూర్తి వివరాలు రావాల్సి వుంది. ఇక్కడ కాస్త సంతోషించదగ్గ విషయం ఏమంటే (సంతోషి ద్దామా), వ్యాక్సిన్‌ రెండు డోసులూ వేయించు కున్నవారికి ఒమిక్రాన్‌ సోకినా వారి ఆరోగ్యం సంక్లిష్టం కావడం లేదు. అంటే మన శరీరాలు తమ రోగ నిరోధక శక్తిని కరోనాను తట్టుకు నేటట్టు పెంపొందించుకోవడం, దానికి వ్యాక్సి నేషన్‌ దోహదపడడం జరిగిందన్నమాట. దక్షిణాఫ్రికా నుండి విస్తరించడం ప్రారంభించిన ఒమిక్రాన్‌ కేసులు ఇప్పుడు ఆ దేశంలో ఉచ్ఛదశ నుండి తగ్గుముఖం పడుతున్నాయి. అత్యధికంగా రోజుకు 27,000 కేసులు ఇదివరకు నమోదైతే, ఇప్పుడు రోజుకు 21 వేల కేసులకు తగ్గాయి. అదే బ్రిటన్‌ లో ఇంకా కేసులు పెరుగుతూనే వున్నాయి. చాలా ఇతర దేశాల్లో కూడా ఒమి క్రాన్‌ కేసులు మొదలై, క్రమంగా పెరుగుతూనే వున్నాయి. తక్కిన కరోనా వైరస్‌ల కన్నా ఈ ఒమిక్రాన్‌ తరహా కరోనా వైరస్‌ ఎక్కువగా ప్రభావం కలిగించగలుగుతోంది. కేసులు తగ్గుముఖం పట్టడం ఇంకా కనిపించడంలేదు.

ఇది మనకు నీరసాన్ని తెప్పించే విషయమే అయినా, కాస్త సానుకూలమైన విషయం కూడా ఉంది. మన శరీరాలకు ఇప్పుడు ఈ కరోనా వైరస్‌ గురించి తెలుసు. కరోనా సోకినందు వలన గాని, వ్యాక్సిన్‌ వేయించు కున్నందువలన గాని,మన శరీరాలలో స్వతహాగా ఉండే రోగ నిరోధక వ్యవస్థకు ఇప్పుడు కరోనా గురించిన సమాచారం తెలుసు. ఈ రోగనిరోధక వ్యవస్థ లోని మొదటివరుస ఆత్మరక్షణ వ్యవస్థ (దీనినే యాంటీబాడీస్‌ అంటారు) ప్రసుత్తం ఈ ఒమి క్రాన్‌ ను అడ్డుకోలేకపోతున్నది. ఐతే ఇంకా అనేక దశల రక్షణ వ్యవస్థ మన దేహంలో ఉంది. అటువంటి దశల్లో ట్షిసెల్స్‌ అనేవి ఒకటి. మామూలుగా వైరస్‌ మన దేహంలోకి ప్రవేశిం చాక అది మన జీవ కణాల వ్యవస్థను తన స్వాధీనం చేసుకుని తనవంటి వైరస్‌లనే అధిక సంఖ్యలో ఉత్పత్తి చేస్తుంది. దాంతో మన దేహంలో ఇన్‌ఫెక్షన్‌ పెరుగుతుంది. ఈట్షిసెల్స్‌ అలా ఇన్‌ ఫెక్ట్‌ అయిన జీవకణాలని చంపే స్తాయి. తద్వారా ఇన్‌ఫెక్షన్‌ దేహంలో వ్యాపించ కుండా నిరోధిస్తాయి. మనం తీసుకున్న రెండు డోసుల వ్యాక్సిన్‌ ఒమిక్రాన్‌ను నిరోధించే విధంగా మన ఇమ్యూనిటీని (రోగనిరోధక శక్తిని) పెంచలేకపోవచ్చుగాని అది మన దేహాన్ని ఇన్‌ ఫెక్ట్‌ చేసి ఆరోగ్యాన్ని ఆందోళనకర దశకు తీసుకుపోయే వీలు లేకుండా వైరస్‌ను అడ్డుకునే శక్తిని పెంచింది. ఇప్పటివరకూ అందిన సమా చారం బట్టి డెల్టా తరహా కరోనా సోకితే వచ్చినన్ని సీరియస్‌ కేసులు ఒమిక్రాన్‌ సోకితే రావడం లేదు. ఒమిక్రాన్‌ స్వభావ రీత్యా వ్యాధిని తక్కువ తీవ్రతతో కలిగించడం జరుగుతూ వుండొచ్చు. లేదా ఒమిక్రాన్‌ సోకు తున్నవారిలో ఇప్పటికే ఇమ్యూనిటీ పెరిగివుం డడం కారణం కావొచ్చు. లేదా,ఈ రెండు కారణాల కలయిక వల్లనూ కావొచ్చు. చాలా మందికి కోవిడ సోకినా వ్యాధి లక్షణాలు బైటపడకపోయి వుండొచ్చని మనకు ఇదివరకే తెలుసు. కాని వారందరికీ ఇమ్యూనిటీ పెరిగి వుంటుంది. ఇప్పుడ ఒమిక్రాన్‌ సోకుతున్న వారిలో అటువంటివారు చాలామంది ఉండొచ్చు. వారికి ఇప్పుడు ఒమిక్రాన్‌ కార ణంగా వ్యాధి లక్షణాలు కనిపించినా, ఇప్పటికే కొంత ఇమ్యూనిటీ ఉన్నందున వ్యాధి ముదర కుండానే వారు కోలుకుంటున్నారు. వ్యాక్సిన్‌లు వ్యాధిని నిరోధించలేవని, వ్యాధిని తట్టుకునే శక్తిని మాత్రం పెంచుతాయని నిపుణులు ఇదివరకే చెప్పారని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు లండన్‌ లోని ఆస్పత్రుల నుండి వస్తున్న సమాచారం బట్టి అక్కడ సీరియస్‌ అవుతున్న కేసులన్నీ ఇంతవరకూ వ్యాక్సినేషన్‌ వేయించు కోనివారివే. ఇప్పటికి లండన్‌ జనాభాలో 70 శాతం రెండు డోసుల వ్యాక్సిన్‌ను వేయించు కున్నారు. దీనిని బట్టి ఒమిక్రాన్‌ తక్కువ ప్రమాదకారి అని నిర్ధారించుకోవడం కన్నా వ్యాక్సిన్‌ వేయించుకున్నవారిలో ఒమిక్రాన్‌ వ్యాధిని తీవ్ర దశ వరకూ తీసుకుపోలేకపో తోందని నిర్ధారించడం సరైనది. వ్యాధి ఎక్కువమంది జనాభాకు విస్తరించినప్పుడు మన ఆస్పత్రుల వ్యవస్థ ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఏ విధంగా కుప్పకూలిందో మనం చూశాం. కాబట్టి ఇప్పుడ ఒమిక్రాన్‌ను కాసుకోడానికి వ్యాక్సిన్‌ మీద ఆధారపడడమే మేలు.ఒమిక్రాన్‌ విస్తరించకుండా, సోకినా, ముదిరిపోకుండా కాసుకోడానికి, జనం ఆస్పత్రుల పాలవకుండా నిరోధించడానికి వ్యాక్సిన్‌ వేయించుకోవడం కీలకం. ఐతే కోవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకిన తర్వాత ఇన్‌ఫెక్షన్‌ ను అదుపు చేయడానికి ఉపయోగించే ఔషధాల సంగతేమిటి? ఐవర్‌మెక్టిన్‌, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, ప్లాస్మా కణాల మార్పిడి వంటివి కోవిడ్‌-19 ట్రీట్‌మెంట్‌లో నిరుపయోగం అయ్యాయని ఇప్పటికే నిర్ధారణ అయిపోయింది. ఊపిరితిత్తుల వాపును నిరోధించే కార్టికోస్టి రాయిడ్స్‌, రెమ్‌డెసివిర్‌, మోనోక్లోనల్‌ యాంటీ బాడీస్‌ కోవిడ్‌ దేహంలో వేగంగా విస్తరించకుండా అడ్డుకోడానికి తోడ్పడ్డాయి. ఐతే తాజా సమాచారం (ఇది దుర్వార్తే) ప్రకారం కొత్తగా పెంపొందించిన మోనోక్లోనల్‌ యాంటీబాడీ ట్రీట్‌మెంట్‌ (ఇది అచ్చంగా కోవిడ్‌-19 కోసమే పెంపొందించారు) పని చేయడం లేదు.

ఇంకోవైపు మంచివార్త ఏమంటే మాల్యుపిరావిర్‌, పాక్స్‌లోవిడ్‌ వంటి ఔషధాలు, నిర్మాట్రెల్విర్‌, ఇటోనావిర్‌ వంటి యాంటీ వైరల్స్‌ కాంబినేషన్‌ ఔషధం-ఇవి కూడా రెమ్‌డెసివిర్‌ మాదిరిగానే దేహంలో వైరస్‌ పునరుత్పత్తి కాకుండా నిరోధించడంలో తోడ్పడుతున్నాయి. దానివలన మన దేహపు ఇమ్యూనిటీ వ్యవస్థకు ఈ పోరాటంలో ఊపిరి పీల్చుకోడానికి తగిన వ్యవధి లభిస్తుంది. పైగా వీటిలో కొన్ని రెమ్‌డెసివిర్‌ కన్నా శక్తివంతంగా పని చేస్తున్నాయి.ఈ యాంటీ వైరల్స్‌ అన్నీ చిన్న చిన్న కణాలతో (మాలిక్యూల్స్‌) నిర్మితం అయివుం టాయి. కనుక వీటిని ఏ ఔషధ కంపెనీ అయినా తేలికగా ఉత్పత్తి చేయగలుగుతుంది. పైగా భారీ మోతాదుల్లో ఉత్పత్తి చేయగలుగుతుంది. వీటి ఉత్పత్తికి సంబంధించిన పరిజ్ఞానాన్ని మూడవ ప్రపంచ దేశాలకు వెంటవెంటనే అందించి కావలసిన మోతాదుల్లో ఉత్పత్తి చేసుకునేటట్టు చేయడం తేలిక. ప్రపంచంలో శాస్త్రవేత్తలు శర వేగంగా కోవిడ్‌ ను నియంత్రించే వ్యాక్సిన్‌లను, ఔషధాలను కనుగొన్నారు. ఐనా, ఇప్పటికీ మనం ప్రపంచ జనాభా మొత్తానికి వ్యాక్సిన్‌ ఇప్పటి వరకూ ఎందుకు అందించలేకపోయాం. అన్నదే కీలక ప్రశ్న. ఎందుకు ఔషధాలను తగినంతగా ఉత్పత్తి చేయలేకపోయాం ఎందుకు అవసరమైన దానికన్నా అధిక సంఖ్యలో సంపన్న దేశాలలో వ్యాక్సిన్‌ల నిల్వలు పేరుకుపోగా,పేద దేశా లలో చాలా తక్కువ మోతాదులో మాత్రమే వ్యాక్సిన్‌ వేయించడం జరిగింది. వ్యాక్సిన్‌లపై, యాంటీ వైరల్స్‌పై పేటెంట్లను రద్దు చేసి ఆ పరి జ్ఞానాన్ని అందరికీ అందుబాటు లోకి తేవాలని అందరమూ కలిసి గట్టిగా ఆ సంపన్న దేశాలపై ఒత్తిడి తేలేకపోతున్నాం. ప్రపంచ వాణిజ్య సంస్థ ఇటువంటి అసాధారణ పరిస్థితుల్లో పేటెంటు చట్టాలను పక్కన పెట్టవచ్చునని చెప్పినా, ఎందుకు ఆ విధంగా జరగడం లేదు ? సంపన్న దేశాల ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్త మహమ్మారిని అరికట్టాలని ప్రయత్నించే బదులు కేవలం తమ దేశాల జనాభాని కాపాడు కోడానికే ఎందుకు ప్రాధాన్యతనిస్తున్నాయి. తక్కిన ప్రపంచం కరోనాతో కునారిల్లుతున్నా ఎందుకు పట్టించుకోడం లేదు? సమాధానం స్పష్టమే. తమ ఫార్మా కంపెనీలకు వచ్చే భారీ లాభాలపైన మాత్రమే ఆసంపన్న దేశాలు దృష్టి సారిస్తున్నాయి. ఆ లాభాలు కొనసాగాలంటే కరోనా మహమ్మారి కొనసాగుతూనే వుండాలి. ఈ మహమ్మారి కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతూ, మరోవైపు సంపన్న దేశాల ప్రజలు నిరంతరం వ్యాక్సిన్‌ లపై, ఔషధాలపై ఆధారపడుతూ వుండాలి. ఇక పేద దేశాలు సామూహిక నిరోధక శక్తి పెంపొందేవరకూ పదే పదే ఈ కరోనా బారిన పడుతూనే వుండాలి. ఇక పేద దేశాలలోని సంపన్నుల పరిస్థితి అటూ ఇటూ కాకుండా మధ్యస్థంగా ఉంటుంది. అత్యధిక ధరలకు మాత్రమే వారు వ్యాక్సిన్‌ను గాని, ఔషధాలను గాని పొందగలిగే స్థితి ఉంటుంది. ఐతే ఇప్పుడు ఒమిక్రాన్‌ ఆ విధమైన స్థితిని యూథాతథంగా ఉంచేట్టు లేదు. ప్రపంచ మంతటా అందరికీ కరోనా రాకుండా ఆపనైనా ఆపాలి, లేదా అందరూ ప్రమాదానికైనా సిద్ధ పడాలి. అదీ ఒమిక్రాన్‌ విస్తరిస్తున్న తీరు సూచిస్తున్న పర్యవసానం. వ్యాక్సిన్‌ వివక్ష విధానం- ప్రస్తుతం నడుస్తున్నది ఇదే- ఇక ముందు పని చేయదు. ఇంకా ఇంకా కొత్త కొత్త తరహాల వైరస్‌ లు పుట్టుకొస్తూనే వుంటాయి. ఒక శతాబ్దం వెనక ప్రజావైద్య రంగంలోని నిపుణులు ఆనాటి అనుభవాల నుండి నేర్చుకున్న విషయంఇదే. ఇప్పటికీ అదే సత్యం. మహా కోటీ శ్వరుల లాభాల కోసం మాత్రమే పని చేసే నయా ఉదారవాద విధానాలు ప్రజా వైద్య వ్యవస్థను కుప్పకూల్చాయి. దాని స్థానంలో కొత్తగా పేటెంట్‌ వ్యవస్థను తెచ్చాయి. ఇప్పుడు మనం ఎదిరించి పోరాడాల్సినది దీనినే. ప్రపంచానికే ఔషధ ప్రదాత అని మన దేశం గురించి ఒకప్పుడు గర్వంగా చెప్పుకున్నాం. కాని ఇప్పుడు చూస్తే మన దేశ ప్రజలకే ఇప్పటిదాకా అందరికీ వ్యాక్సిన్‌లను అందించలేక పోతు న్నాం. ఎందుకు ఈ విధంగా జరిగింది? ప్రభు త్వాన్ని నిగ్గదీయాలి. దేశంలోని వయోజనులలో 56 శాతం మాత్రమే ఇప్పటిదాకా రెండు డోసుల వ్యాక్సిన్‌ ను పొందగలిగారు. పశ్చిమ దేశాలలో ఉన్నంత తీవ్రంగా మన దేశ ప్రజలలో వ్యాక్సిన్‌ వేయించుకోవడం పట్ల విముఖత ఏమీ లేదు. ఇప్పుడు చైనా అదే విధంగా చేసింది.ఐనప్పటికీ మన ప్రభుత్వం ఇంకా మార్కెట్ల దయామయ స్వభావాన్నే నమ్ముకుని వున్నాయి. డెల్టా ను దాటి… దూసుకుపోతున్న ఒమిక్రాన్‌.`(స్వేచ్ఛానుసరణ )-ప్రబీర్‌ పురకాయస్థ