జీవన విధానం మారితేనే మనుగడ..!

పరుగుతున్న జనాభా..అందుకు తగ్గట్టుగా రెట్టింపవుతున్న అవసరాలకు మొదట ప్రభావితమవుతున్నవి అడవులే. చెట్లను నరికి వ్యవసాయ భూములు,నివాస స్థలాలుగా మారుస్తున్నారు.ఫలితంగా అటవీ విస్తీర్ణం తగ్గి జీవవైవిధ్యం దెబ్బతింటోంది. అది పర్యావరణంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తోంది.చివరకు వర్షాభావ పరిస్థితులు,అధిక ఉష్ణోగ్రతలు,అతివృష్టి వంటి వైపరీత్యాలు ఎదురవుతున్నాయి. భూభాగంలో 33శాతం అటవీ విస్తీర్ణం ఉం డాల్సి ఉండగా..ఉభయ జిల్లాల్లో 22శాతం నమోదు కావడం ఆందోళనకడు ప్రభుత్వం తీసుకున్న హరితహారంతో కాస్త పచ్చదనం పెరిగింది.ప్రాణాధారమైన జలాన్ని సమర్థంగా వినియోగించు కోవడంలో మనిషి విఫలమవుతున్నాడు. ప్రధానంగా జలవనరుల ఆక్రమణతో నిల్వ సామర్థ్యాన్ని తగ్గించేయడం,నీటి ప్రవాహ మార్గాలైన కాలువలను మూసి వేయడం వంటి చర్యలతో వాటి ఉనికిని ప్రమాదంలోకి నెడుతున్నాడు. దీనికితోడు కలుషితం చేస్తున్నాడు. విష రసాయనాలు మిళితమైన పారిశ్రామిక, నివాసాల మురుగును కాలువల్లోకి వదులుతున్నారు.అవి నదులద్వారా సముద్రంలోకి చేరు తున్నాయి వ్యర్థ జలాలను శాస్త్రీయ పద్ధతిలో పునశుద్ధి చేసి జలవనరుల్లోకి వదిలితే మేలు.చర్యలతో పీల్చేగాలి నాణ్యత దెబ్బతింది.వాహనాలు,విద్యుత్తు అతి వినియోగం వల్ల వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయి.వ్యవసాయంలో ఉప యోగించే రసాయనిక ఎరువులు ప్రమాదకరంగా మారాయి. సాధ్యమైనంత వరకు తగ్గించడమే మనం ప్రకృతికి మేలు చేసే చర్యలు. ఎన్ని చట్టాలు రూపాంతరం చెందినా నిషేధిత ప్లాస్టిక్‌ ఉత్పత్తుల వినియోగం తగ్గడం లేదు.వాటిని శాస్త్రీయ పద్ధతిలో నిర్వీర్యం చేయకుండా బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారు.ఈవ్యర్థాలను కాల్చడం వాతావరణ కాలుష్యానికి కారణమవుతోంది.భూమి పొరల్లోకి ప్లాస్టిక్‌ చేరి వాన నీరు ఇంకకుండా నిలువరిస్తోంది.జల వనరుల్లోకి చేరి జలచరాల హననానికి కారణమవుతోంది. నదులు, కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డుగా మారుతోంది. ప్లాస్టిక్ను సాధ్యమైనంత వరకు దైనందిన జీవితం నుంచి నిషేధించాలి.
జీవ వైవిధ్యం..జాతుల కవచం
మనిషి విచక్షణారాహిత్యానికి అంతరించిపోతున్న జీవజాలం భూమి మీద 14మిలియన్ల జీవజాతులు పరిరక్షించుకోక పోతే ముప్పు తప్పదు.ప్రకృతిని కాపాడ డంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి.మనిషి విచక్షణారాహిత్యం వల్ల రోజురోజుకూ జీవవైవిధ్యం దెబ్బ తింటోంది.ప్రకృతి విధ్వంసకర పనులవల్ల జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది.నానాటికి కాలుష్యం పెరిగిపోవడం,విస్తరించాల్సిన జీవజా తుల శాతం తగ్గిపోవడం జీవ వైవిధ్యాన్ని ప్రమాదం లోకి నెట్టేస్తున్నాయి.ఈపరిస్థితి ఇలాగే కొనసాగితే మాన వాళికి భారీమూల్యం తప్పదని హెచ్చరిస్తు న్నాయి ప్రపంచ పర్యావరణ,జీవవైవిధ్య సదస్సుల నివేదికలు.
జీవవైవిధ్యం.. ఆవశ్యకత
అవనిపై జీవించే సకల జీవరాశిని కలిపి జీవవైవిధ్యం అంటున్నారు. సరళంగా చెప్పాలంటే వివిధ రకాల జీవజాతుల సముదాయాన్నే జీవ వైవిధ్యం అంటాం. సూక్ష్మరూపంలోని తొలిజీవి ప్లాజిల్ల్లెటా అనే ఏక కణజీవి ప్రీ బయాటిక్‌ సూప్‌ అనే సముద్ర అడుగు నీటిలో పుట్టిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. తొలుత వృక్షాలు,జంతుజాలం అవతరించాయి.క్రమక్ర మంగా ఉభయ చరాలు,పక్షులు పుట్టుకొచ్చాయి. ప్రస్తు తం నేలమీద ఎన్నో రకాల వృక్షాలు, పండ్లు, జంతు జాతులు మనుగడ సాగిస్తున్నాయి. సృష్టిలోని ఏజాతి ఉనికైనా జీవ వైవిధ్యం ఎంతో అవసరం. కుందేళ్లు, గేదేలు,జీబ్రాలు వంటివి పచ్చని గడ్డి తింటాయి. ఈ జంతువులను మాంసాహారులైన సింహం, పులి, చిరుతపులులు ఆరగిస్తాయి.గొల్లభామలు గడ్డిని తింటే వాటిని కప్పలు భక్షిస్తాయి. ఈ చక్రంలో ఒక బంధం తెగితే దాని ప్రభావం అనేక రూపాల్లో కనిపిస్తాయి. పాములు నాశనమైతే ఎలుకల సంతతి అనుహ్యంగా పెరిగిపోతుంది. దానితో ఎలుకలు పంటలపై పడి తిండి గింజలను తినేస్తాయి. మానవుడు తన మనుగడ కోసంచుట్టూ ఉన్న పరిసరాలపై ఆధారపడి జీవిస్తాడు. ఆహారం,గాలి,నీరురక్షణ,ఆశ్రయం నిత్యావసర వస్తువు లు అన్నీ ప్రకృతి ఉత్పత్తులే. కంటికి కనబడని ఎన్నో జీవులు సైతం పరోక్షంగా ఎంతో మేలు చేస్తాయి. ఇలా ఒకజీవి మనుగడ మరో జీవి మనుగడకు ప్రత్య క్షంగా లేదా పరోక్షంగా ఉపయోగ పడటం వల్లనే సకల జీవులు మానవాళిలో మనుగడ సాగిస్తున్నాయి.
జీవవైవిధ్యానికి ఏం చేయాలంటే ..
అడవులను రక్షించుకోవడం అందరి బాధ్యత కావాలి. ఇంటి వద్ద ముగ్గులు పిండితో వేయాలి. అప్పుడే పక్షు లు కీటకాలకు ఆహారంగా లభిస్తుంది.భవిష్యత్‌ తరాల కోసం చెట్లు, జలవనరులను పెంపొందించుకోవాలి. రసాయనాలకు బదులు సహజ ఎరువులు వాడాలి. ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించి భూగర్భ జలాల పెంపు నకు కృషి చేయాలి.ప్రతి ఒక్కరూ జీవవైవిధ్యం పెంపు నకు కృషి చేయాలి.పర్యావరణానికి మొక్కలు పెంచాలి2050 సంవత్సరం వరకు దేశ జనాభా 200కోట్లకు పెరిగే అవకాశం ఉంది. పర్యావరణ పరిరక్షణకు,జనాభా హితంకోసం మొక్కలను విరివిరి గా పెంచాలి. లేకుంటే మనిషి సృష్టిస్తున్న విపత్తు వల్ల జీవవైవిధ్యం అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉంది. 1972 నుంచి ఇప్పటివరకు 61 శాతం వన్యప్రాణులు అంతరించినట్లు వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఆఫ్‌ నేచర్‌ రిపోర్టు చెబుతుంది. దీంతో మనుగడ సాగించాల్సిన జీవజా తులు అంతరిస్తున్నాయి. ఇలా ఒక రకమైన జీవులు అంతరిస్తే వాటిమీద ఆధారపడే జీవులూ నశిస్తు న్నాయి.రాష్ట్రంలో జీవ వైవిధ్యానికి కేంద్రం లాంటిది. అనేక రకాల జంతు,పక్షి జాతులకు నెలవు.తెలం గాణ వ్యాప్తంగా 280రకాల మొక్కలజాతులు ఉన్నా యి. అందులో 1800రకాల జాతుల మొక్కలు ఔషద మొక్కలే. 900రకాల ఔషధ మొక్కలు హైదరాబాద్‌ కేంద్రంగా అందుబాటులో ఉన్నాయి. 108 జాతుల క్షీరదాలు,486 పక్షిజాతులు తెలంగాణలో మనుగడలో ఉన్నాయి. తెలంగాణ బయోడైవర్సిటీ రిపోర్టు ప్రకారం మన రాష్ట్రంలో అంతరించిపోయే దశలో ఉన్న వాటిలో అడవి కుక్క,ఉడుత,చిరుతపులి,హైనా, మౌస్‌డీర్‌, రాబందు,బాతు,హంస,మొసలి, మరిన్ని చేపజాతులు ఉన్నాయి. జీవవైవిధ్యాన్ని పరిరక్షించడా నికి తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు ఆధ్వర్యంలో జిల్లా,మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ఆయా పరిధిలోనే జీవవైవిధ్యాన్ని రక్షించడానికి ఈ బోర్డు కృషి చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా హెరిటేజ్‌ సైట్లను ఏర్పాటు చేయ డానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. అందులో భాగం గానే కూకట్‌పల్లి శివారులోని అమీన్‌పూర్‌ లేక్‌ను అభివృద్ధి చేసింది. 2016 నుంచి ఈ చెరువును వలస పక్షుల కోసం చుట్టు పక్కల జీవ వైవిధ్యాన్ని సంరక్షిం చడం కోసం ఉపయోగించుకుంటుంది. 93 ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువు పరిధిలో కొన్ని వందల స్థానిక పక్షులతోపాటు వలస పక్షులు ఆశ్రయం పొందుతు న్నాయి.ఇక ప్రభుత్వం మనుగడలో ఉన్న జీవులు, చెట్లను గుర్తించి రాష్ట్ర ఐకాన్‌లుగా ప్రకటించింది. అందులో రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, జంతువుగా జింక, రాష్ట్ర చెట్టుగా జమ్మిచెట్టు,రాష్ట్ర పువ్వుగా తంగేడు ఉన్నాయి.-(గునపర్తి సైమన్‌)