జిల్లాల పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌- ప‌రిపాల‌న సౌల‌భ్యం

‘‘ రాష్ట్రంలో నవశకం ఆవిష్కృతమయ్యింది. ప్రజలకు పరిపాలన మరింత చేరువయ్యింది. పాలన వికేంద్రీకరణలో భాగంగా సత్వర, సమగ్ర, సమాన, సర్వజన సంపూర్ణాభివృద్ధి లక్ష్యంగా 13 కొత్త జిల్లాలు అవతరించాయి. దీంతో 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ సాక్షాత్కార మయ్యింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో రాష్ట్రమంతటా సంబరాలు మిన్నంటాయి. ప్రతిచోటా పండుగ వాతావరణం నెలకొంది. కలెక్టర్లు సహా, జిల్లాల ఉన్నతాధికారులు బాధ్యతలు చేపట్టడంతో కలెక్టరేట్లు సందడిగా మారాయి. కొత్త జిల్లాల ఏర్పాటువల్ల ప్రజలకు కలగబోయే లాభాల గురించి ప్రజలు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. గ్రామం నుంచి రాజధానుల వరకు..పరిపాలనకు సంబంధించి డీ సెంట్ర లైజేషన్‌ (వికేంద్రీకరణ) ప్రజలకు మంచి చేస్తుంది. అదే సరైన విధానం కాబట్టి గ్రామంతో మొదలు రాజధానుల వరకు ఇదే మా విధానమని మరొక్కసారి స్పష్టం చేస్తున్నా …!’’ – ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి
జగన్‌ సర్కార్‌ ఆంధ్రప్రదేశ్‌లో నవశకానికినాంది పలికింది. ఉమ్మడి రాష్ట్ర విభజనతర్వాత ఉన్న13 జిల్లాలకుతోడు కొత్తగామరో13జిల్లాలు ఏర్పాట య్యాయి. మొత్తం26 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్‌ ఏప్రిల్‌ 4నుంచి కొత్త రూపు దిద్దుకుంది. వై.ఎస్‌.జగన్‌ 2019ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.పాలన సామాన్య ప్రజలకు,బడుగు బలహీన వర్గాలకు చేరువగా ఉండాలని నవశకానికినాంది పలికారు. ఇప్పుడు మొత్తం26జిల్లాలకుకాగా..72 రెవెన్యూ డివిజన్ల ఏర్పాట య్యాయి.కొత్త జిల్లాల ఏర్పాటుతో..వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ప్రజలు ఎటూ వెళ్లాల్సిన అవసరం లేదు. కొత్త జిల్లాల్లో జిల్లా కలెక్టర్‌,జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలు..వారి క్యాంపు కార్యాలయాలు..అలాగే అన్ని ప్రభుత్వ శాఖల
కార్యాలయాలు ఒకేచోట ఉండేలా ఏర్పాట్లు చేశారు. ప్రతిజిల్లాలో కనీసం ఆరు నుంచి ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జనాభా విష యానికి వస్తే..ఒక్కో జిల్లాకు 18నుంచి23లక్షల వరకు ఉన్నారు. అంతేకాదు కొత్త జిల్లాల్లో సౌకర్యాలు, పరిపాలన సౌలభ్యం కోసం ప్రతి జిల్లాలో కనీసం రెండు నుంచి నాలుగు వరకు రెవెన్యూ డివిజన్లు ఉండేలా కసరత్తు చేశారు. అంతేకాదు కొత్త డివిజన్లతోకలిపి మొత్తం72 రెవె న్యూ డివిజన్లు ఏర్పాట య్యాయి.ప్రభుత్వం శాస్త్రీ యంగా అధ్యయనం చేసిన తర్వాత కొత్త జిల్లాల ప్రక్రియను చేసింది. జనవరి26న రిపబ్లిక్‌ డే రోజున గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి ప్రజల నుంచి అభ్యం తరాలు,సలహాలు,సూచనలు స్వీకరించింది. దాదా పుగా17,500సలహాలు,సూచనలు వచ్చాయి.. వాటిని జాగ్రత్తగా పరిశీలించారు.. అనంతరం అధ్యయనంచేసి జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్రంలో కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభమైంది.
కొత్త కళ..గడప వద్దకే పాలన-సిఎం జగన్‌
సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి గడప వద్దకే పాలన తీసుకువెళ్లామని, ఇందు లో భాగంగానే గ్రామ స్థాయి నుంచి రాజధానుల వరకు పరిపాలన వికేంద్రీకరణ చేపట్టామని ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పరి పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రా భివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. నూతన జిల్లాల ద్వారా కార్యాలయాల ఏర్పాటుతో పాటు వ్యాపార,ఉద్యోగ,ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయన్నారు.కొత్తజిల్లాలతో ప్రజలకు మరింత మెరుగైన పాలన, శాంతి భద్రతలు, పథ కాలు పారదర్శకంగా అందాలని ఆకాంక్షించారు. పాలన వికేంద్రీకరణలో భాగంగా కొత్తగా ఏర్పాటైన 13జిల్లాలను సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాల యం నుంచి వర్చువల్‌గా కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ప్రారంభించారు. తొలుత పార్వతీపురం మన్యం జిల్లాతో ఆరంభించి వరుసగా మిగతా జిల్లాలను సీఎం ప్రారంభించారు.26జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులనుద్దేశించి సీఎం జగన్‌ మాట్లాడారు.
గ్రామ స్థాయి నుంచి చూశాం..
పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా జరిగే మంచిని మనమంతా గ్రామస్థాయి నుంచి చూశాం. జిల్లా స్థ్ధాయిలో కూడా వికేంద్రీకరణ జరగడంతో రాష్ట్ర ప్రజలకు నేటి నుంచి మరింత మేలు జరుగు తుంది. ఇవాళ్టి నుంచి 26 జిల్లాలతో మన రాష్ట్రం రూపు మారుతోంది. కొత్తగా ఏర్పాటైన 13జిల్లాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగు లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
మహోన్నత వ్యక్తులు.. మనోభావాలు
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారా మరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్‌,పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి…ఇవీ కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలు. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవ సరంతో పాటు స్వాతంత్య్ర సమరయోధులు, గిరిజ న అక్కచెల్లెమ్మలు,అన్నదమ్ముల సెంటిమెంట్‌, మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వాగ్గేయకారులను దృష్టిలో ఉంచుకుని వీటి పేర్లను నిర్ణయించాం.
కొత్తవి ఏర్పాటు కాకపోవడంతో..
గతంలో ఉన్న జిల్లాలపేర్లు అలాగే ఉన్నాయి. భీమవరం,రాజమహేంద్రవరం గత జిల్లా
లకు ముఖ్య పట్టణాలుగా మారాయి. గతంలో ఉన్న జిల్లా కేంద్రాలను యథాతథంగా కొనసాగిస్తూ పార్లమెంట్‌ నియోజకవర్గానికి కనీసం ఒకటి చొప్పున మొత్తం 26 జిల్లాలు ఈరోజు నుంచి కొలువుదీరు తున్నాయి. 1970మార్చిలో ప్రకాశం జిల్లా ఆవిర్భ విస్తే చివరిగా 1979జూన్‌లో విజయనగరం జిల్లా ఏర్పాటైంది. తరువాత కొత్తజిల్లాలు ఏర్పాటు కాక పోవడంతో పరిపాలనసంస్కరణలు,వికేంద్రీ కరణ విషయంలోబాగా వెనుకబడిన రాష్ట్రంగా మిగిలి పోయాం.జిల్లాలసంఖ్య,రెవెన్యూ డివిజన్లు పెరగ డంవల్ల ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై పర్యవేక్షణ పెరిగి సమర్థంగా అమలవుతాయి.
అరుణాచల్‌లో 53 వేల మందికి జిల్లా
దేశంలో727జిల్లాలు ఉండగా యూపీ లో అత్యధికంగా75,అతి తక్కువగా గోవాలో రెండు జిల్లాలే ఉన్నాయి. దేశంలో ఏడో అతిపెద్ద రాష్ట్రమై న ఏపీలోమాత్రంనిన్నటివరకు13జిల్లాలే ఉన్నాయి. 1.38 కోట్ల జనాభా కలిగిన, అతి చిన్న రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్‌ప్రదేశ్‌లో కూడా ఏకంగా 25 జిల్లాలున్నాయి.2011 లెక్కలప్రకారం ఏపీలో 13 జిల్లాల్లో 4.90కోట్ల మంది జనాభా ఉండగా ప్రతి జిల్లాలో సగటున 38లక్షల మంది ఉన్నారు. దేశం లో ఏరాష్ట్రంలోనూ జిల్లాకు సగటున ఇంత జనాభాలేదు. మహారాష్ట్రలో ఒక్కో జిల్లాలో సగటున 31 లక్షలు, తెలంగాణాలో 10.06 లక్షల మంది చొప్పున నివసిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో 6లక్షల మందికి ఒకజిల్లా ఏర్పాటు కాగా మిజోరాంలో లక్ష మందికి, అరుణాచల్‌ప్రదేశ్‌లో కేవలం 53 వేల మందికి ఒక జిల్లా చొప్పున ఏర్పాటయ్యాయి. కర్ణాటకలో 20 లక్షల మందికి, యూపీలో 26.64 లక్షల మందికి జిల్లాలు ఏర్పాటు చేశారు.