జార్ఖండ్‌లో కొత్త ప్రభుత్వం

జార్ఖండ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేటితో ముగిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంపాయ్ సోరెన్ ఫిబ్రవరి 2న ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సిపి. రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలం, ఆర్‌జెడి ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తాలు మంత్రులుగా ప్రమాణం చేశారు. మనీలాండరింగ్ ఆరోపణలతో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఈడి బుధవారం రాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో 24 గంటలకుపైగా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై కొన్ని గంటల పాటు సందిగ్ధత నెలకొంది. చివరకు గురువారం అర్థరాత్రి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదించారు.హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రవాణా మంత్రిగా పనిచేసిన చంపాయ్ సోరెన్ శుక్రవారం నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.అయితే పదిరోజుల అనంతరం నిర్వహించే బలపరీక్షలో తన మెజారిటీని నిరూపించుకోవాల్సి వుంది. చంపాయ్ సోరెన్‌కు జార్ఖండ్‌ముక్తి మోర్చా-కాంగ్రెస్-రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) కూటమికి చెందిన 43 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారు. వీరిలో ఇద్దరు చంపాయ్‌తో పాటు నేడు ప్రమాణం చేశారు. 43మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతు తెలిపారని, ఈసంఖ్య 46-48కి చేరుకోవచ్చని చంపాయ్ పేర్కొన్నారు.తమ కూటమి బలంగా ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. బలపరీక్ష కోసం తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు సంకీర్ణ కూటమి సిద్ధమైంది. కొంతమంది ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించేందుకు సిద్ధమైంది.
సోరెన్‌కు ఐదురోజుల కస్టడీ
ఈడి అరెస్టును సవాలు చేస్తూ హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.’’మేం జోక్యం చేసుకోలేం’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టుకు వెళ్లాల్సిందిగా సూచించింది. కాగా,రాంచీలోని పిఎంఎల్‌ఎ కోర్టు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
చంపాయ్ సోరెన్ ఎవరు?
చంపాయ్ సోరెన్ సరైకెలా-ఖర్సవాన్ జిల్లాలోని జిలింగ్గోడా గ్రామానికి చెందిన రైతు సిమల్ సోరెన్ పెద్ద కుమారుడు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు విద్యనభ్యసించారు. చిన్న వయసులోనే వివాహం చేసుకున్న ఆయనకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 90వ దశకం చివర్లో శిబు సోరెన్ తో కలిసి జార?ండ్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న సోరెన్ అనతికాలంలోనే ‘జార్ఖండ్ టైగర్ ‘గా ఖ్యాతి గడిరచారు. సరైకెలా స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ద్వారా స్వతంత్ర ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.అర్జున్ ముండా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా కూడా కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. 2010 సెప్టెంబర్ 11 నుంచి 2013 జనవరి 18 వరకు మంత్రిగా పనిచేశారు. రాష్ట్రపతి పాలన తరువాత,హేమంత్ సోరెన్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, చంపాయ్ సోరెన్ ఆహార మరియు పౌర సరఫరాలు మరియు రవాణా మంత్రి అయ్యారు.
జార్ఖండ్‌్ టైగర్‌గా పేరు..
చంపాయ్ సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నుంచి సెరైకెలా అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కేబినెట్ మంత్రిగా హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో రవాణా, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాధ్యతలను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చంపై 1974లో జంషెడ్‌పూర్లోని రామకృష్ణ మిషన్ హైస్కూల్‌లో 10వ తరగతి వరకు చదివారు. బీహార్ నుంచి ప్రత్యేక జార?ండ్ రాష్ట్రం కోసం డిమాండ్ వచ్చిన సమయంలో చంపై పేరు వార్తల్లో నిలిచింది. శిబు సోరెన్‌తో పాటు చంపై సైతం ప్రత్యేక జార?ండ్ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రజలు ఆయనను ‘జార్ఖండ్ టైగర్’గా పిలుస్తూ వస్తున్నారు.
తొలిసారిగా 2005లో అసెంబ్లీకి..
చంపై తొలిసారిగా 2005లో జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లోనూ మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సెప్టెంబర్ 2010 నుంచి జనవరి 2013 వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ, లేబర్ హౌసింగ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. జూలై 2013 నుంచి డిసెంబర్ 2014 పౌర సరఫరాలు, రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. 2014లో మూడోసారి జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నిక య్యారు. 2019లో నాలుగోసారి ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో రవాణా, సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు.
భూకుంభకోణంలో ఇరుక్కోవడంతో..
హేమంత్ సోరెన్ భూ కుంభకోణంలో ఇరు క్కున్నారు. ఈ కుంభకోణంపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. పలుసార్లు ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేయగా.. విచారణకు గైర్హాజరయ్యారు. ఇంతకు ముందు ఒకసారి విచారించింది. మళ్లీ బుధవారం సైతం ఈడీ అధికారులు ఆయన నివాసానికి చేరుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. అరెస్టు చేసే అవకాశం ఉండడంతో జార్ఖండ్ సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. ఈ క్రమంలో జార్ఖండ్‌్ ముక్తి మోర్చా కాంగ్రెస్ కూటమి శాసనసభా పక్ష నేతగా చంపై సోరెన్‌ను ఎన్నుకున్నాయి. తొలుత కల్పనా సోరెన్‌ను సీఎం చేస్తారని చెప్పినా.. చివరకు చంపై సోరెన్‌కు అవకాశం దక్కింది.హేమంత్ సోరెన్‌కు అత్యంత దగ్గరి వ్యక్తుల్లో చంపై సోరెన్ ఒకరు. శిబు సోరెన్‌తో పాటు హేమంత్ సోరెన్‌తో చాలాకాలంగా పని చేస్తూ వస్తున్నారు.జార్ఖండ్‌లో గడిచిన కొన్ని గంటలుగా ప్రభుత్వ అస్థితరత లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని జార్ఖండ్ ముక్తీ మోర్చాసీనియర్ నేత చంపాయ్ సోరెన్ అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ సీపీ రాధా కృష్ణన్‌ను కోరుతూ ఆయన లేఖ రాశారు. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి సీఎం పదవి నుంచి వైదొలగడం, అవినీతి కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన తర్వాత సోరెన్ నిన్న జార్ఖండ్ ముక్తి మోర్చా శాసనసభా పక్ష నేతగా ఎంపికయ్యారు.81 మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజారిటీ జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికే ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. మొత్తంగా తమ బలం 47గా ఉన్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యేలు సంతకం చేసిన మద్దతు లేఖను గవర్నర్‌కు సమర్పించినట్లు గవర్నర్‌కు రాసిన లేఖలో తెలిపారు. ఎమ్మెల్యే లందరూ తనతో పాటు రాజ్‌భవన్‌కు వచ్చా రని, అయితే లోపలికి అనుమ తించలే దన్నారు. రాష్ట్ర తదుపరి ముఖ్య మంత్రిగా చంపాయ్ సోరెన్ ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఆయన ప్రస్తుత ప్రభు త్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు.
ఇదీ కేసు..
జార్ఖండ్‌లో భూకుంభకోణం ఆరోపణలపై హేమంత్ సోరెన్‌పై ఈడీ దర్యాప్తు జరుగు తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు దర్యాప్తు సంస్థతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని జేఎంఎం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సోరెన్ ఈడీ అధికారులపై కేసు పెట్టారు. -(బిర్సనాయక్ ముండా)