జలమే జనానికి అమూల్య సంపద
‘‘జనాల జీవితమంతా జలంతోనే ముడి పడి ఉంటుంది.నిత్యం దాని చుట్టూనే తిరుగుతుంది.నీరు లేనిదే ఏపనీ ముందుకు సాగదు.ఎండా కాలంలో నైతే బోలెడు కష్టాలెదుర్కొవాలి.చెరువులు, కుం టలు, నీటి వనరులు లేని ఊళ్లు పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊరి చెంతనే నది పరుగులిడితే కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు.రైతులకు పంటలు,పండిస్తుంది. చేపలు పట్టే వారికి ఉపానిస్తుంది.ఎన్నో పనులకు భరోసాగా ఉంటుంది.ఆ జీవనదిలో ఉన్న అనుబంధాల్ని మరిచపో వద్దని తమ బిడ్డలకు ఆతల్లి పేరునే పెట్టుకుంటారు. గోదావరికి ఒడ్డునే ఉన్న పలు గ్రామాలకు వెళ్తే అక్కడి వారికి నది ఎంత మేలు చేస్తుందో తెలుస్తుంది’’
మనం నివసించే భూగోళంలో 70 శాతానికిపైగా నీరే.ఇందులో శుభ్రమైన నీరు చాలా స్వల్ప భాగం మాత్రమే.మొత్తం భూగోళంలోని నీటి లో దాదాపు 2.7శాతం మాత్రమే శుభ్రమైన నీరు కాగా,ఇందులోనూ75.2శాతం ధృవప్రాంతాలలో మంచు రూపంలో ఘనీభవించివుంటే,మరో 22.6 శాతంనీరు భూగర్భంలో వుంది.మిగతా నీరు సరస్సులు,నదులు,వాతావరణం,గాలిలోని తేమ, భూమిలోని చెమ్మ,చెట్టు చేమలలో వుంటుంది. ఇంతేకాదు,సరస్సులు,నదులు, భూగర్భ జలాలలో కూడా మానవ వినియోగానికి, ఇతర అవసరాలకు చక్కగా ఉపయోగ పడగలిగిన నీరు చాలా కొద్ది పరిమాణం మాత్రమే. ప్రపంచం మొత్తంలో లభ్యమయ్యే,పరిశుభ్రమైన నీటిలో,1శాతం కంటెకూడా తక్కువ పరిమా ణంలో, (లేదా,భూమిపై లభించే మొత్తంనీటిలో దాదాపు 0.00శాతం మాత్రమే) నీరు మానవ విని యోగానికి నేరుగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ, మనకు కనీసం 30-50 లీటర్ల పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు అవసరం.కాని, ఇప్పటికీ, 88.4కోట్ల మంది( 884 మిలియన్ల మంది)ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదు.ప్రపంచవ్యాప్తంగా,ప్రతి ఏటా,1,500ఘనకిలోమీటర్ల పరిమాణంలో,వ్యర్ధ మైన నీరు వస్తుంటుంది.వ్యర్ధ పదార్ధాలను,వ్యర్ధ మైన నీటిని పునర్వినియోగ ప్రక్రియద్వారా, ఇంధనో త్పత్తికి,వ్యవసాయ అవసరాలకు వినియోగించ వచ్చు.కాని,సాధారణంగా, అలా జరగడం లేదు. అభివృద్ధిచెందుతున్న దేశాలలో, తగిన నిబంధనలు, వనరులు లేనికారణంగా,80శాతం వ్యర్ధాలను పున ర్వినియోగ ప్రక్రియకు మళ్ళించకుండానే పారవేస్తు న్నారు.పెరుగుతున్న జనాభా,పారిశ్రామిక ప్రగతి కూడా,కొత్తరకాల కాలుష్యానికి మూలమవుతు న్నాయి.ఇదే దామాషాలో,పరిశుభ్రమైన నీటి అవస రం పెరుగుతున్నది.ఈకారణంగా,ఇటు వర్త మానంలోను,అటు భవిష్యత్తులోను మానవ ఆరో గ్యానికి,పర్యావరణ స్వచ్ఛతకు ముప్పుపొంచి వుంది.వేసవి వస్తోందంటేనే భయమేస్తోంది. నీటి కొరత దడ పుట్టిస్తుంది.బిందెలతో బారులు తీరే జనాలు కనిపిస్తారు.మరి నీటి సమస్య అంత విస్తృతమైనది. నీరు లభించని ప్రాంతాలలో ఎదుర య్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. నేల తల్లి నెర్రె లిచ్చి నీటిచుక్కకోసం ఆబగా ఎదురుచూస్తుంటే ఇక మానవమాత్రులెంత! గొంతు తడుపుకునే చుక్క నీటికోసం మైళ్లకు మైళ్లు నడిచిపోవాల్సిన పరిస్థితి. పరిశుభ్రమైన నీళ్లు దొరక్క కుంటల్లో, గుంటల్లో అడుగుబొడుగు మురికి నీటినే తాగాల్సిన దుస్థితి. భూమండలంమీద లభించే నీటిలో ఉప్పు సుమద్రా ల వాటా 97శాతం. మిగిలిన దానిలో 69 శాతం హిమపాతం, మంచుగడ్డలే. భూమి మీద లభించే నీటిలో0.008శాతం మాత్రమే స్వచ్ఛమైన నీరు.క్రీశ 2025 నాటికి 48దేశాల్లో తీవ్రమైన నీటికొరత వస్తుందని చికాగోలోని జాన్ హాప్కిన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హెచ్చరించింది.3.575 మిలియన్ల మంది ప్రతి సంవత్సరం నీటికి సంబం ధించిన వ్యాధులతో మరణిస్తున్నారు.నీటిమూలంగా సంభవించిన 43శాతం మరణాలకు అతిసార వ్యాధే కారణం.పైన పేర్కొన్న మరణాలలో 84 శాతంమంది 14ఏళ్ల లోపువారే.98 శాతం మర ణాలు అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే సంభవి స్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులలో చికిత్సపొందుతున్న రోగులలో సగం మంది నీటి సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారే. భూమి మీదున్న నీటిలో ఒక్క శాతానికంటే తక్కువ మొత్తం నీళ్లు మాత్రమే మానవాళి వెనువెంటనే వాడుకు నేలా వున్నాయి.అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మురికి వాడల్లో నివసించే ఒకవ్యక్తి రోజు మొత్తం మీద ఉపయోగించే నీరు ఒక అమెరికన్ స్నానానికి వాడే నీటితో సమానం.లీటరు నీటికి మురికివాడల్లో నివ సించే పేదలు, అదే నగంలోని ధనికులకంటే 5-10రెట్లు అధికధర చెల్లిస్తున్నారు. ఆహారం లేకుండా మనిషి కొన్ని వారాలపాటు వుండగలడు. కానీ నీరు లేకుండా కొద్దిరోజులు మాత్రమే వుండగలడు. ప్రతి 15సెకన్లకు ఒక చిన్నారి నీటి సంబంధ వ్యాధి తో చనిపోతోంది.లక్షలాది మంది మహిళలు, పిల్ల లు రోజుమొత్తం మీద అనేక గంటల సమయాన్ని సుదూర ప్రాంతాల నుంచి నీళ్లు తేవడం కోసం వెచ్చిస్తారు.రోగాల నివారణలో దివ్య ఔషధం నీరు వాతావరణంలోని హైడ్రోజన్, ఆక్సిజన్‌ల కలయిక వల్ల నీరు ఏర్పడు తుంది.ఈ రెండు వాయు పదా ర్ధాలు కలిస్తే ద్రవ రూపమైన నీరు ఏర్పడును. నిత్యజీవితంలో నీటిని అనేక రకాలుగా ఉపయో గిస్తాం.నీటిని ఉపయోగించి అనేక వ్యాధులను తగ్గిం చే అవకాశం ఉంది. నీరు లేని భూమిని ఒకసారి ఊహించుకోండి.పచ్చనిచెట్లు,పారే నదులు, జీవులు, మహా సముద్రాలు ఏమీ ఉండవు. ఇవేవీ లేకుండా ఎండిపోయిన మట్టి గడ్డలా ఉంటుంది భూమి. అంతటి అమూల్యమైన నీటి విలువను తెలుసు కోడానికి, దానిని వృథా చేయకుండా అవగాహన కల్పించడానికి ఈ రోజును కేటాయించారు. ఐక్య రాజ్య సమితి 1993 నుంచి ప్రతి ఏడాది మార్చి 22ను అంతర్జాతీయ జలదినోత్సవంగా గుర్తిం చాలని నిర్ణయించింది. మన భూమ్మీద నీటి గురిం చి కొన్ని నిజాలు తెలుసుకుంటే అదెంత విలువ్కెనదో అర్థం అవుతుంది. భూమి ఏర్పడినప్పుడు ఎంత నీరు ఉందో ఇప్పుడూ అంతే ఉంది.పెరగడం కానీ తరగడం కానీ కాలేదు. కానీ ఆ నీటిని వాడుకునే వారి జనాభా మాత్రం విపరీతంగా పెరిగి పోయిం ది. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నీటి కోసం కటకటలాడుతున్నారు.భూమ్మీద ఉన్న నీరు ఎండకు ఆవిరవుతూ,మేఘాలుగా మారు తూ,వర్షంగా కురుస్తూ, భూమిలో ఇంకుతూ, సముద్రంలో కలుస్తూ వేర్వేరు రూపాల్లోకి మారుతూ ఉంటుంది.భూమ్మీద మూడొంతులు నీరే ఉంది. కానీ అందులో 97శాతం ఉప్పునీరే.కేవలం 3 శాతమే మంచి నీరు. ఇందులో కూడా 2 శాతం మంచురూపంలోఉంది.మిగతా ఒక శాతం నీరులో 0.59శాతం భూగర్భంలో ఉంటే, మిగతాది నదు లు,సరస్సుల్లో ప్రవహిస్తోంది.ఉన్న మంచి నీటిని మనం పొదుపుగా వాడకపోగా కలుషితం కూడా చేస్తున్నాం. ప్రపంచంలో 500కు పైగా మంచినీటి నదులు కలుషితమైపోయాయి. ప్రపంచంలో భారీ యుద్ధాల్లో చనిపోయిన వారి కన్నా, కలుషిత నీటి వల్ల మరణించినవారే ఎక్కువ. ఏడాదికి 40 లక్షల మంది కలుషిత నీరు తాగి చనిపోతున్నారు. అమెరి కాలో ఒక వ్యక్తి తన అవసరాలకి రోజుకి 500 లీటర్ల నీటిని ఉపయోగిస్తుంటే,ఆఫ్రికాలోని గాంబి యా దేశంలో ఒకవ్యక్తి రోజుకి కేవలం 4.5 లీటర్ల నీటిని మాత్రమే వినియోగిస్తున్నాడు. గాంబియా లాంటి చాలాదేశాల్లో తాగేందుకు కూడా నీరు దొరకడం లేదు.మనమేం చేయాలి?ఎక్కడ్కెనా కొళా యిల్లోంచి నీరువృధాగా పోతున్నట్టు కనిపిస్తే వెం టనే కట్టేయండి.షవర్‌తో స్నానం చేయడం మానేసి, బకెట్ నీళ్లతో చేయండి.దీనివల్ల రోజులో150 లీటర్ల నీటిని కాపాడవచ్చు.పళ్లుతోముకున్నంత సేపూ సింక్‌లోని కొళాయిని వదిలి ఉంచకండి. ఇలా చేయడంవల్ల నెలకి 200 లీటర్ల నీరు వృథా అవుతుంది. టాయిలెట్ ఫ్లష్‌లో సుమారు 8లీటర్ల నీరు పడుతుంది.లీటర్ నీరుపట్టే రెండు బాటిళ్లు తీసుకుని దానిలో ఇసుక లేదా చిన్నచిన్నరాళ్లు నింపి, టాయ్‌లెట్ ఫ్లష్‌లో పెట్టేయండి. దీనివల్ల ఒకసారి వాడే నీటిలో రెండులీటర్ల నీళ్లు ఆదా అవుతాయి. అక్వేరియంలోని నీళ్లు పారేయకుండా మొక్కలకి పోయండి.కొళాయిలకి లీకేజీలుఉంటే దానిని అరిక ట్టండి.దీనివల్ల నెలలో 300గ్యాలన్ల నీరుఆదా అవు తాయి.ఒక వార్తాపత్రికలో వాడే కాగితం తయారీకి 300లీటర్ల నీరుఖర్చవుతుంది.గాలితరువాత జీవ రాశికి నీరుచాలా ముఖ్యం.అందువల్ల నీటి వనరు లను పొదుపుగా ఉపయోగించుకోవాలి.ఈ నీరు భూఉపరితలములో నదులు,కాలువలు, చెరువులు, కుంటలు, సరస్సులు మరియు భూగర్భజల రూపం లో ఉన్నది.
అడవుల నరికివేత వలన వర్షపాతం కూడా తగ్గిపోయింది. భారతదేశంలో సగటున ప్రతి మనిషి అన్ని అవసరాలకి కలిపి 680 క్యూబిక్ మీటర్ల నీటిని వాడుతున్నారు. 6గురు ఉండే ఇంటికి 250 లీ నీరు అవసరమవుతుంది మన దేశంలో నదుల్లో ప్రవహించే మూడవ వంతు నీళ్ళు సము ద్రాల్లోకి నష్టపోతున్నాం.భూగర్భ, భూఉపరితల జలాలు రెండూ కలిపి దేశంలో వాడే మొత్తం నీటిలో 84శాతంవ్యవసాయానికి,12శాతం పరిశ్ర మలకి వాడుతున్నాం.ఇంతటి విలువైన నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత నేటి యువతరం పై ఉంది. ప్రస్తుతం ఉన్న వర్షా భావ పరిస్థితుల్లో ప్రతి నీటిచుక్కను ఒడిసి పట్టుకొని నిల్వ చేసుకో వాల్సిన అవసరం ఉంది. నానాటికి ఇంకిపోతున్న భూగర్భ జలాల సంరక్షణ పై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడిరది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యువత నేటితరం కోసం భావితరాల కోసం కొన్ని బాధ్యతలను విధిగా నిర్వర్తించాల్సి వుంది.నీటి సం రక్షణలో మొదటగా చేయాల్సింది నీటి వృధా అరిక ట్టడం.దైనందిన జీవితంలో మనం చాలా నీటిని వృధా చేస్తూఉంటాం.ముందుగా ప్రతి వ్యక్తి నీటి వృధాను అరికట్టే ప్రయత్నం చేయాలి.ప్రతి నీటి చుక్కా అమూల్యమైందే. మంచినీటిని పొదుపుగా వినియోగించాల్సిన అవసరం అందరిపై ఉంది. రోజువారీ అవసరాల్లో మనకు తెలియకుండానే నీటిని వృథా చేస్తుంటాం. నీటి వనరుల పర్యవేక్షణ లో యువత తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.
మరికొన్ని బాధ్యతలు :-
చెట్ల పెంపకం కార్యక్రమంపై యువత దృష్టి సారించాలి.
బీడు బావులను, జలశయాలను పునద్ధరించే చర్యలు చేపట్టడం.
ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టుకునేలా, నిల్వ చేసుకునేలా,భూగర్భ జలాలు పెంపొం దించేందుకు సాధ్యమైన చర్యలన్నింటినీ చేపట్టడం.
ఉపాధి పథకంలో భాగంగా కందకాల నిర్మా మం బండరాళ్ళ తొలగింపు,భూఉపరితల నీటి గుంటల నిర్మామంపట్ల దృష్టిసారించాలి.
నీటి వినియోగంపట్ల ప్రజల్లోఅవగాహన కలి గించేలా గ్రామగ్రామాన సదస్సులు నిర్వహిం చాలి.
సేద్యపు బావుల్లో పూడికతీత,కొత్తగా సేద్యపు బావుల తవ్వకం,ఎండిన బావులకు పునరు జ్జీవం కల్పించడం,చెక్ డ్యాంలలో పూడికతీత, చిన్న నీటి పారుదల చెరువుల చుట్టూ కందకా లు తీయడం తదితర చర్యలను చేపట్టాలి.
ఇళ్ళలో,కాలనీలలో,పాఠశాలలో,ప్రభుత్వ కార్యాలయాలలో వాననీటిని సేకరించి, దాచు కునే వ్యవస్థలను నెలకొల్పడం.
ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని వాతా వరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి.ఎల్‌నినో ప్రభావం సన్నగిల్లుతుందని,వర్షాతిరేకంవెల్లి విరుస్తుందన్న అంచనాల నేపథ్యంలో రాష్ట్రం లో చెరువులు,కుంటల సముద్ధరణ,సంరక్షణ పై తక్షణం దృష్టి సారించాల్సి ఉంది. ఊరూ రా చెరువులు,కుంటల సంరక్షణచర్యలు చేపడి తే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందనడంలో సందేహం లేదు.జూన్-సెప్టెంబర్ మధ్య కాలంలో దేశంలో 89సెంటీమీటర్ల వర్ష పాతం కురుస్తుందని భారతవాతావరణ సంస్థ,అమెరికాలోని అంతర్జాతీయ వాతా వరణ పరిశోధన సంస్థ,దక్షిణ కొరియా సంస్థ ఏపీఈసీ వాతావరణ కేంద్రం, ‘స్కయిమెట్ వెదర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థలన్నీ శుభం పలుకుతున్నాయి.
ప్రతి బోరు యజమాని కనీసం 2ఎకరాల క్యాచ్‌మెంట్ కుంటలు,ఫారం ఫాండ్స్ నిర్మిం చాలి.
పూర్వం కాకతీయ రాజులు, నిజం నవాబులు, కృష్ణదేవరాయలు వంటి పాలకులు తక్కువ శ్రమశక్తితోనే చెరువులు, కుంటలు తవ్వు కోగలిగారు. అప్పట్లోనే రాజులు లోత్కెన చెరు వులు తవ్వి భావితరాలకుగొప్ప మేలుచేశారు. కానీ నేడు ఇంత జనాభా,ఆధునిక యంత్రాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉండి కూడా ఆచెరువుల్లో కనీసం పూడిక తీసుకోలేని దురవస్థలో నేటి ప్రభుత్వాలున్నాయి. అయి దారు వందల ఏళ్ల కిందట గానుగ సున్నంతో నిర్మించిన తూములు ఇప్పటికీ చెక్కుచెదర కుండా నిలిచి ఉండగా,నేడు అత్యాధునిక పరిజ్ఞానంతో,సాధనాలతో,సిమెంట్ కాంక్రీటు లతో నిర్మించే నిర్మాణాలు మూణ్నాళ్ల ముచ్చ టగా మిగులుతున్నాయి.లోపం ఎక్కడ జరుగుతోందో పసిగట్టి పరిహరించాల్సిన పాలక గణం కేవలం పదవులను నిలబెట్టుకు నేందుకే ప్రాధాన్యమిచ్చి మిన్నకుండటం దుర దృష్టకరం.నేటి పాలకుల నిర్లక్ష్య ధోరణి పట్ల యువత తమ నిరసనను తెలియజేయాలి. ప్రభుత్వ పనితీరును ప్రశ్నించాలి.
సోషల్ మీడియా,పత్రికలు-టివీఛానల్స్ ద్వారా కూడా యువత నీటి వనరుల పరిరక్షణ పట్ల ప్రజలలో అవగాహన పెంపొందించే ప్రయ త్నం చేయాలి.
వ్యవసాయశాఖ అధికారులు కూడా క్షేత్ర స్థాయి సందర్శనలకువెళ్ళి పంటల పై, నీటి వినియోగ తీరుతెన్నుల పై రైతులకు అవగా హన కలుగజేసే ప్రయత్నం చేయాలి.
వాన నీరువృథా కాకుండా తక్కువ పెట్టు బడితో ఎక్కువ ప్రయోజనం పొందే పద్ధతిది. వర్షపు నీరు ఎండిన బావి వైపు వచ్చేలా కాల్వలు తవ్వుకోవాలి.ఈ కాల్వలో మట్టి వడపోసి కేవలం నీరు మాత్రమే వచ్చే ఏర్పాటు చేయాలి. నాలుగు అంగుళాల వ్యాసం ఉన్న పైపు ద్వారా బావిలోకి నీరు చేర్చాలి.ఎండిన బావిని వర్షపు నీటితో నింప డంతో బోరు బావుల్లోకి నీరు వస్తుంది. బావి వెడల్పు తక్కువ గనుక ఎండకు ఆవిరై పోవడం అంతగా ఉండదు.
పట్టణ ప్రాంతాలలో బోరు బావులు, కుళా యిలు పక్కన నేల నీటిని గ్రహించడానికి వీలుగారాళ్ళు,కంకర,దొడ్డు ఇసుకతో ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేయాలి. పట్టమాలు, నగరాల్లో డాబాలపై కురిసిన వర్షపు నీరు వృథా పోకుండా ఈ గుంతలలో చేర్చడం వల్ల భూగర్భ జలమట్టం పెరుగుతుంది.
భూమి ఎత్తు కన్నా కొంచెం తక్కువ ఎత్తులో ఉండేలా పొలాల్లో గుంతలు తవ్వాలి. పొలంలోపడ్డ వర్షపు నీరు ఈగుంతల్లోకి చేరుతుంది.చిన్న పొలాలకయితే ఆ నీరు ప్రాణాధారంగా ఉపయోగపడుతుంది. పశు వులకు తాగు నీరుగా వాడుకోవచ్చు. గుంత పరిధి,వైసాల్యం చిన్నది కావడంవల్ల ఎక్కువ నీరు ఆవిరి రూపంలో వృథాగా పోకుండా ఉంటుంది.ఇలా చేయడంవల్ల భూగర్భ జల మట్టం పెరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నీరు-చెట్టు అనే పథ కాన్ని ప్రవేశపెట్టింది.ఈ పథకంలో చెరువుల్లో మట్టి పూడిక తీయడం,చెట్లు నాటడం లాంటి పనులు చేయాలి.దీనివల్ల వర్షపు నీటిని సంరక్షించుకో వచ్చు నని ప్రభుత్వ ఉద్దేశ్యం.కానీ ఈకార్యక్రమం సవ్యంగా జరిగిన దాఖలాలు లేవు.నీటి సంరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. విజ్ఞత గల పౌరులందరూ ఈవిషయంపైదృష్టి సారించాల్సిన అవసరం, ఆవశ్యకతఉంది. నేడు ప్రపంచంలో చాలా దేశాల లోను,మరి ముఖ్యంగా భారతదేశంలో చాలా రాష్ట్రాలలోను నీటి కొరత సమస్య అధికంగా ఉం ది.నీటి వనరుల పర్యవేక్షణ లో ప్రజలు-ప్రభు త్వాలు సమిష్టిగా చర్యలుతీసుకొని ముందుకు సాగా లి. లేనియెడల ఈసమస్య మరెంత జఠిలమై మాన వ జీవనమే ప్రశ్నార్ధకమై పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది.చైతన్యవంతమైన యువత బాద్య తగా వ్యవహించి ఈసమస్య పరిష్కార మార్గా లను అన్వేషించే ప్రయత్నం చేయాలి. ‘‘జలో రక్షితి రక్షతః – జలంతోనే జగతి’’.- (యం.రాంప్రదీప్)