జమిలి ఎన్నికలు

కేంద్ర,రాష్ట్రచట్టసభలకు,ఇంకా అవస రమైతే స్థానిక సంస్థలకు జమిలి ఎన్నికలు నిర్వహిం చాలన్న ఆలోచన పైకి మంచిగానే కనబడుతున్న ప్పటికీ, లోతుగా విశ్లేషిస్తే, ప్రజాస్వామ్య విలువలు, సమాఖ్యస్ఫూర్తికి పమాదం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు పలువురు రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.‘ఐదేండ్ల కాలానికి ఎన్నికైన ఏదైనా ప్రభుత్వం మధ్యలో కూలిపోతే ఏమిటి చేయడం? అక్కడ మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే కొత్త ప్రభుత్వం ఐదేండ్ల కాలానికి అధికారం చేపడుతుంది. అప్పుడు ఉమ్మడి ఎన్నికల వ్యవస్థ (జమిలి) లక్ష్యం దెబ్బతిం టుంది.ఇలా జరుగకుండా ఉండాలంటే, కొత్త ప్రభుత్వం కాల పరిమితిని కుదించాల్సి ఉంటుంది. ఇది పజాతీర్పుకు, సమాఖ్యస్ఫూర్తికి, ప్రజా స్వామ్య విలువలకు గొడ్డలి పెట్టులాంటిదే’ అని వాళ్లు వాదిస్తున్నారు.
లా కమిషన్‌ సిఫారసు అలా..
రాజ్యాంగంలో అవిశ్వాస తీర్మానం ప్రస్తావన కచ్చితత్వంతో లేదు. లోక్‌సభ విధివిధా నాల్లోని198వ నిబంధనలో మాత్రమే దాన్ని ప్రస్తావించారు. 50 లేదా అంతకంటే ఎక్కువమంది చట్టసభ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్ట వచ్చని నిబంధనలు చెబుతున్నాయి.అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం గద్దె దిగాల్సిఉంటుంది. ఏ వర్గమూ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థితిలో లేన ప్పుడు సభను రద్దుచేసి మధ్యంతర ఎన్నికలు జరు పడమే మార్గం. మరి అలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఏంచేయాలి? దీనిపై 1999లో లా కమిషన్‌ ఓ సిఫారసు చేసింది. ఈ మేరకు జర్మనీ రాజ్యాంగాన్ని ఉదహరించింది. దాని ప్రకారం.. జర్మనీలో అవిశ్వాస తీర్మానంతో పాటు విశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెడతారు. అంటే, ప్రభుత్వం పై అవిశ్వాసం ప్రకటించేవారు ఎవరు నెగ్గుతారో కూడా చెప్పాలి.ఈరెండు తీర్మానాలను సభ ఆమో దించిన తర్వాత అధ్యక్షుడు కొత్త చాన్సలర్‌ను నియ మిస్తారు. ప్రభుత్వాలు మారినా ఐదేండ్లపాటు సభ కొనసాగుతుంది. అయితే, జర్మనీలో అధ్యక్ష పాలన అమల్లో ఉన్నది.మనది ప్రజాస్వామ్య దేశం. దీంతో ఈ సిఫారసును పక్కనబెట్టారు. అవిశ్వాస తీర్మానం తో రాష్ట్రప్రభుత్వాలు కూలిపోతే, జమిలి ఎన్నికల నెపంతో రాష్ట్రపతి పాలన విధించే అవకాశమూలేక పోలేదని..పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఏకకాలంలో ఎలక్షన్స్‌ నిర్వహించాలంటే ఏయే ప్రొసీడిరగ్స్‌ అనుసరించాలి..?
జమిలి ఎన్నికల అంశాన్ని మోదీ సర్కారు విడిచిపెట్టడం లేదు. లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిం చాలని బీజేపీ ఏండ్లుగా ప్రతిపాదిస్తూనే ఉన్నది. అయితే, ఇప్పటికే రెండు మూడుసార్లు దీనికి సంబం ధించి ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ, కార్య రూపం మాత్రం దాల్చలేదు. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ (జమిలి ఎన్నికలు)సాధ్యాసాధ్యాల పరిశీలన నిమిత్తం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఓకమిటీని ఏర్పాటు చేయడం గమనా ర్హం. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు సాధ్యమా? ఒకవేళ ఈ ఎన్నికలు నిర్వహించాలంటే ఏయే ప్రొసీడిరగ్స్‌ను అనుసరించాల్సి ఉంటుందన్న దానిపై పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది.
ఏమిటీ జమిలి ఎన్నికలు?
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ లకు, లోక్‌ సభకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించ డమే జమిలి ఎన్నికల ప్రధాన ఉద్దేశం.
గతంలో జరిగినా.. ఆ తర్వాత వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్ని కల నిర్వహణ కొత్తదేమీ కాదు.1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని,1967 వరకు లోక్‌సభకు,రాష్ట్రాల అసెంబ్లీలకు చాలావరకు ఒకే సారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలం లో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్రాల శాసనసభలను బర్తరఫ్‌ చేయడం తదితర కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరుపడం మొదలైంది.
ప్రక్రియ చాలా పెద్దదే
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలంటే చాలా రాష్ట్రాల చట్టసభలను గడువు కంటే ముందే రద్దుచేయాల్సి ఉంటుంది. మరికొన్నింటి కాలవ్యవధిని పొడగిం చాల్సిన అవసరమూ ఉండొచ్చు. కాబట్టి, జమిలి ఎన్నికలను నిర్వహించాలంటే దానికి సంబంధిం చిన బిల్లు తొలుత పార్లమెంట్‌ ఆమోదం పొందాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలు జరుగాలంటే దాదా పు ఐదు రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని 2018లో లా కమిషన్‌ అభిప్రాయపడిరది. ఆర్టికల్‌ 356,ఆర్టికల్‌324,ఆర్టికల్‌ 83(2),ఆర్టికల్‌ 172 (1),ఆర్టికల్‌ 83కు సంబంధించి పలు సవరణలకు సూచించింది.
ఆమోదం లభించడం సులభమేమీ కాదు
జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లును పార్లమెంట్‌ ఉభయ సభలు కనీసం 67శాతం సానుకూల ఓట్ల తో ఆమోదించాల్సి ఉంటుంది. అంతే కాకుండా.. ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యం లో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోద ముద్రవేయాలి. అంటే 543 స్థానాలున్న లోక్‌సభలో కనీసం 67శాతం (362 ఎంపీలు) మంది ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. దీంతోపాటు రాజ్యసభలో 245 సీట్లలో 67శాతం (164 ఎంపీలు) ఈ బిల్లును సమర్థిం చాలి. దీనికి తోడు కనీసం 14రాష్ట్ర అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉన్నది.
ఏ ఆర్టికల్‌/నిబంధన ఏం చెబుతున్నది?
ఆర్టికల్‌ 356: రాష్ట్రాల అసెంబ్లీలను రద్దుచేసే అధికారం కేంద్రానికి ఉన్నది. రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధ యంత్రాంగం విఫలమైనప్పుడు మాత్రమే ఈ ఆర్టికల్‌ను ఉపయోగించి కేంద్రం ఈ చర్యకు దిగాల్సి ఉంటుంది.ఒకవేళ, వేరే సందర్భంలో చట్ట సభ రద్దుకు నిర్ణయిస్తే,అది రాజ్యాంగ విరుద్ధమే అనిపించుకొంటుంది.
ఆర్టికల్‌ 172 (1): అసెంబ్లీ కాలవ్యవధి ఐదేండ్లుగా కొనసాగుతుంది. అత్యయిక స్థితిలో తప్పించి అసెంబ్లీ కాలవ్యవధిని మరే ఇతర సందర్భాల్లో పొడిగించకూడదు. సభ తొలిసారిగా సమావేశమైన నాటినుంచి కాలపరిమితి మొదలౌతుంది.
ఆర్టికల్‌ 324: రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి,లోక్‌సభ, రాజ్యసభ,శాసనసభ,శాసనమండలి ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతాయి. సమ యానుసారం,రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఈ ఎన్నికలు జరుగుతాయి.పార్లమెంట్‌,శాసనసభ ఎన్ని కలు ఒకేసారి నిర్వహించాలంటే చట్టసభ కాల వ్యవధిని సహేతుక కారణాలతో సవరించాల్సి ఉంటుంది.
ఆర్టికల్‌ 83(2): ప్రజాతీర్పుతో కొలువుదీరిన లోక్‌ సభ కాలవ్యవధి ఐదేండ్లు. ప్రత్యేక సందర్భాల్లో మినహాయించి దిగువ సభను రద్దు చేయడానికి వీలులేదు.
ఆర్టికల్‌ 83: పెద్దల సభ కాలపరిమితికి సంబం ధించి ఆర్టికల్‌ 83 సూచిస్తుంది. దీంతో పాటు రాజ్యాంగంలోని 2,3చాప్టర్స్‌, పార్ట్‌-15లోని పలు అంశాలను, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని కొన్ని నిబంధనలను జమిలి బిల్లు కోసం సవరించాల్సి ఉంటుంది.
దేశంలో జమిలి ఎన్నికలు సాగాయిలా..
2019 15 శాతం
1967 67 శాతం
1951-52 90 శాతం
1957 76 శాతం
ఉభయ సభల్లో ఎన్డీయే బలాబలాలు
ó లోక్‌సభలో ఎన్డీయే బలం 61శాతం
ó జమిలి బిల్లు ఆమోదానికి కావాల్సిన బలం 67 శాతం
ó రాజ్యసభలో ఎన్డీయే బలం 38శాతం
ó జమిలి బిల్లు ఆమోదానికి కావాల్సిన బలం 67 శాతం
ó ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాలు 16శాతం
ó బిల్లు ఆమోదానికి ఎన్ని రాష్ట్రాల ఆమోదం అవసరం 14శాతం
సమైక్య వ్యూహంతో ‘ఇండియా’- జమిలి ఆత్రంలో మోడీ
బిజెపి మత రాజకీయాలనూ కేంద్రం నిరంకుశత్వాన్ని ఓడిరచడానికి మరింత సమిష్టి గానూ సమర్థంగానూ సత్వర వ్యూహాలు రూపొం దించుకోవాలని ప్రతిపక్షాల నాయకులు గుర్తిం చారు. కీలక నేతలందరూ హాజరైనారు కూడా. దేశంలోని 450నియోజక వర్గాలలో బిజెపికి వ్యతి రేకంగా ఒకేఅభ్యర్థిని నిలబెట్టి ఓడిరచాలని అందుకే తొలి అంశంగా నిర్ణయించుకున్నారు. అయితే ఇది విశాల ప్రతిపక్ష వేదిక మాత్రమే గనక వీలైనంత వరకూ కలసి పోటీ చేస్తామని ప్రకటించాయి. అందుకే జాతీయస్థాయి సమావేశంలో గాక రాష్ట్రా ల స్థాయిలోనే సమన్వయ కమిటీల ద్వారా ఎవరు ఎలా పోటీ చేయాలన్నది ఖరారు చేయాలని నిర్ణయించారు.ఆనిర్ణయం వాస్తవికతను ప్రతిబింబి స్తుంది.
కోవింద్‌ కమిటీ గురించి ప్రహ్లాద్‌ చెప్ప డమే గాని ఇంతవరకూ అధికారిక ప్రకటన వెలువ రించలేదు. పైగా రాజ్యాంగం గురించిన చర్చను అనధికార కమిటీ ఎలా చేస్తుంది? ఆ అధికారం పార్లమెంటుకు మాత్రమే వుంది.గతంలో వాజ్‌పేయి హయాంలోనూ రాజ్యాంగ సంస్కర ణలకై జస్టిస్‌ వెంకటాచలయ్య కమిటీని ఇలాగే ఏర్పాటు చేసి తర్వాత… సూచనల కోసం అని వెనక్కు తగ్గారు. ఇప్పుడైనా ఏకపక్షంగా రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేయడం చెల్లదు.
2023 జులైలో బెంగళూరులో ప్రతి పక్షాల కూటమి సమావేశమై ‘ఇండియా’గా ముందు కు వస్తున్న తరుణంలోనే కేంద్ర పాలక పక్షమైన బిజెపి హడావుడిగా ఎన్‌డిఎను పునరుద్ధరించి విస్తరించి ఢల్లీిలో సమావేశపర్చింది.26 పార్టీలు ఇక్కడ కలుస్తుంటే అక్కడ ఏకంగా 38పార్టీలు హాజ రైనాయి గాని వాటి సీట్లబలం నామకార్థమని మీడి యా విశ్లేషించింది. తాజాగా ముంబయిలో ఇండి యా సమావేశమవుతుందంటే ఎన్‌డిఎ సమావేశం కాకుండా ఏకంగా పార్లమెంటు ప్రత్యేక సమావే శాలనే పిలవాలని మోడీ ప్రభుత్వం నిర్ణయిం చింది.లౌకిక ప్రతిపక్షాల ఐక్యవేదిక ఏర్పాటు పట్ల ప్రధాని మోడీ ఎంతగా ఉలిక్కిపడుతున్నారో దీన్ని బట్టే చెప్పొచ్చు. నవంబరు, డిసెంబరులో అయిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలలో తన పరిస్థితి ప్రతికూలంగా వుంటుందని భయపడుతున్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం ముందస్తు ఎన్నికలకు వెళ్ల వచ్చుననే సంకేతాలు గతం నుంచి వున్నాయి. కానీ ముంబయి సమావేశ సన్నాహాలు, ప్రతిపక్షాల వ్యూ హాల ఉధృతి చూసిన తర్వాత కేంద్రం దాదాపు ముందస్తును మరింత ముందుకు జరపాలని నిర్ణయించుకోవలసి వచ్చిందని ఇప్పుడు అందరూ భావిస్తున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకూ లోక్‌సభ అమృతోత్సవ్‌ ప్రత్యేక సమావేశాలు జరిపి కీలకమైన బిల్లులు, సవరణలు ఆమోదింప చేసు కోవాలని మోడీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు జాతీయ మీడియా ఏకకంఠంతో చెబుతున్నది. ఇందుకు తగినట్టే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నాయకత్వంలో జమిలి ఎన్నికల గురించి అధ్యయ నం చేసేందుకు ఒక కమిటీనే నియమించారు. 2018లో కోవింద్‌ ఆపదవిలో వున్నప్పుడు ఉభ య సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో లోక్‌ సభకూ శాసనసభలకూ ఒకేసారి ఎన్నికలు జరిగితే మంచిదన్న సూచన చేశారు. అంటే కేంద్రం ఆలోచ నను వినిపించారు. ఆయన నాయకత్వంలో కమిటీ ఇక ఏమి చెబుతుందో ఊహించడం కష్టమేమీ కాదు. అసలు రాజ్యాంగ అధినేతగా పనిచేసిన ఒక మాజీ రాష్ట్రపతికి ఈ విధంగా రాజకీయ బాధ్యత అప్పగించడం దేశ రాజకీయాలలో ఇదే తొలిసారి కావచ్చు.
కోవింద్‌ కమిటీ, కోటి కౌటిల్యాలు
ఏమైనా ఈ సమావేశ ప్రభావం అప్పుడే బిజెపిపై పడిరదని సీతారాం ఏచూరి చేసిన వ్యాఖ్య అర్థవంతమైంది. ముంబయి సమావేశం ఒకవైపున ఇంకా జరుగుతుండగానే ఏకకాల ఎన్నికల ముచ్చట ఊపందుకోవడంలో అది కనిపిస్తుంది. పార్లమెం టరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ను కలిశారు. ‘ఇండియా’ అనే పేరు మార్చి భారత్‌నే వాడాలని భగవత్‌ రెండు చోట్ల వేర్వేరు సమావేశాల్లో ప్రవచించారు. ఈ దేశం హిందూ రాష్ట్రమేనని, భారతీయు లందరూ హిందువులేనని మత భాష్యాన్ని మరింత తీవ్రంగా వినిపించారు. రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా కొంత కాలం కిందట భగవత్‌తో సమావేశమైనారని ఇక్కడ గుర్తు చేయాలి. అంటే మోడీ అమిత్‌ షా ఒకవైపు ఎన్‌డిఎ విస్తరణ కోసం తంటాలు పడు తుంటే మరోవైపు మోహన్‌ భగవత్‌ హిందూత్వ మతతత్వ సిద్ధాంతం వ్యాప్తి బీజాలు వేస్తున్నారన్న మాట. కోవింద్‌ కమిటీ గురించి ప్రహ్లాద్‌ చెప్పడమే గాని ఇంతవరకూ అధికారిక ప్రకటన వెలువరించ లేదు. పైగా రాజ్యాంగం గురించిన చర్చను అనధి కార కమిటీ ఎలా చేస్తుంది? ఆ అధికారం పార్ల మెంటుకు మాత్రమే వుంది. గతంలో వాజ్‌పేయి హయాంలోనూ రాజ్యాంగ సంస్కరణలకై జస్టిస్‌ వెంకటాచలయ్య కమిటీని ఇలాగే ఏర్పాటు చేసి తర్వాత…సూచనల కోసం అని వెనక్కు తగ్గారు. ఇప్పుడైనా ఏకపక్షంగా రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేయడం చెల్లదు. ఆ అంశాన్ని తెరపైకి తేవడం, ప్రజల్లో అనుకూలత పెంచడం లక్ష్యంగా పెట్టుకు న్నట్టు కనిపిస్తుంది. పార్టీలు, వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలతో ఈ కమిటీ సంప్రదిస్తుందంటున్నారు. కానీ ఇతర పార్టీలు, ప్రభుత్వాలు ఒక అనధికార కమిటీకి సహకరిస్తాయని చెప్పడం కష్టం. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా పదవీ విరమణ తర్వాత మామూలు పౌరుడేనని ఇటీవల జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ స్పష్టంగా చెప్పారు. అధికార లాంఛనాలు కొన్ని వుండవచ్చు గాని మాజీ రాష్ట్రపతి అయినా ప్రత్యేక రాజ్యాంగ ప్రతిపత్తి ఏమీ వుండదు. ఈ కమిటీ సిఫార్సులు చేసినా వాటిని కేంద్ర క్యాబినెట్‌ తీర్మానం ముందుకు తెస్తారన్న మాట. ఎన్నికల సంఘం కూడా కేంద్రం ఒత్తిడితో గతంలోనే దీనిపై స్పందించింది. ఒకేసారి ఎన్నిక లు జరపగల సత్తావుందని, కాకపోతే అదనంగా సహాయం అవసరమని వెల్లడిరచింది.తన వంతుగా అయిదు సూచనలు చేసింది.1.కొత్త లోక్‌సభ ప్రారంభానికి తేదీ నిర్ణయించాలి.2.అవిశ్వాస తీర్మానం తెచ్చేవారు ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి నాయకత్వం వహించే వ్యక్తి పేరు అందులో సూచించాలి. 3.పదవీ కాలం కొద్దిగానే మిగిలి వుండగా ప్రభుత్వం పడిపోతే రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఎక్కువ వుంటేనే ఎన్నికలు. 4.శాసనసభల విషయంలోనూ ఇదే జరగాలి.5.లేదంటే అన్ని ఎన్నికలకూ నిర్ణీత తేదీలలో జరిగేలా నిర్ణయిం చాలి.
రాజ్యాంగానికే ఎసరు, దేశానికే ప్రమాదం
భారత రాజ్యాంగం ఏకకాల ఎన్నికలు జరగాలని చెప్పడం లేదు. లోక్‌సభ, శాసనసభల నియమ నిబంధనలు కాలపరిమితి అన్నీ వేర్వేరుగా వున్నాయి. మొదటి మూడు ఎన్నికలు కలిసే జరిగా యంటే కాంగ్రెస్‌ గుత్తాధిపత్యమే కారణం, 1967 నుంచి క్రమంగా ఈ పరిస్థితి మారుతూ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడం, రద్దు చేయడం, పడిపోవడం చాలా చూశాం. కేంద్రంలోనూ కనీసం మూడు సార్లు ప్రభుత్వాలు ముందే పడిపోయాయి. వాటిపై ఏవో కొత్త షరతులు రుద్దాలనేది ఇక్కడ ఆంతర్యం. అంటే పదవీ కాలం ముగిసినా కొనసా గించడం లేక ఇంకా వున్నా ఎన్నికలకు వెళ్లకుండా పరోక్ష పాలన సాగించడం వంటివి రాజ్యాంగ నిర్దేశానికి విరుద్ధం. అప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అనే మౌలిక సూత్రమే మంటగలిసి పోతుంది. ఎమర్జన్సీలో రాష్ట్రాల శాసనసభల కాల పరిమితిని ఆరేళ్లకు పెంచితే తర్వాత కత్తిరించాల్సి వచ్చింది. వాస్తవానికి శ్రీలంక, బంగ్లాదేశ్‌ వంటి చోట్ల కూడా గతంలో నిరంకుశ ప్రభుత్వాలు పాలనా వ్యవస్థను ఇష్టానుసారం మార్చినా తర్వాత అవి నిలబడలేదు. వి.పి.సింగ్‌ ప్రభుత్వ కూల్చివేత తర్వాత అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్‌ జాతీయ ప్రభుత్వం అంటూ ఒక ప్రహసనం నడిపించి వెనక్కు తగ్గాల్సి వచ్చింది. బిజెపి ఎప్పుడూ అధ్యక్ష తరహా పాలన కోరుకుంటుంది. దేశంలో రాజకీయ సామాజిక బహుళత్వం కారణంగా అది చేయలేక పోయింది. మోడీ హయాంలో దాదాపు ప్రధాని కేంద్రంగా చేయడం అధ్యక్ష తరహా ప్రతిబింబమే. నోట్ల రద్దుతో సహా కీలక నిర్ణయాలు మోడీ ఒక్కరే తీసుకున్నారు. ఆర్టికల్‌ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటి వాటిని కూడా ఎవరితో చర్చించలేదు. ఈ నిర్ణయాలు సుప్రీం కోర్టు సమీక్షలో వుండటమే గాక తీవ్ర ప్రశ్నలకు కారణమవుతున్నాయి. లోక్‌సభ పదవీ కాలానికి సంబంధించిన 83వ అధికరణం రద్దుకు సంబంధించిన 85 అధికరణం, అసెంబ్లీల పదవీ కాలానికి సంబంధించిన 172 రద్దు పైన 174,రాష్ట్రపతి పాలనపై 356 అయిదు రాజ్యాం గ సవరణలు చేయవలసి వుంటుంది. శాశ్వత మార్పులైతే సగం శాసనసభల ఆమోదం కూడా అవసరమవుతుంది.లక్షల కోట్లు బడాబాబుల పరం చేయడమే గాక రాయితీల రూపంలో మరిన్ని లక్షల కోట్లు కట్టబెడుతున్న ఈసర్కారు ఎన్నికల ఖర్చు తగ్గించాలని పొదుపు కబుర్లు చెప్పడం హాస్యా స్పదం. ఇది వాస్తవానికి అధికార దాహం, అప్రజా స్వామిక రాజ్యాంగ కుట్ర. మోహన్‌ భగవత్‌, మోడీల మాటల వెనక వున్న రాజకీయ దురుద్దే శాలు, మతతత్వ వ్యూహాల పట్ల ప్రజల అప్రమత్తత చాలా అవసరం. దురదృష్టమేమంటే తెలుగు రాష్ట్రాలలో రెండు పాలక పార్టీలైన వైసిపి, బిఆర్‌ ఎస్‌, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఏవీ ఈ పోరాటం లో పాలుపంచుకోవడం లేదు, బిజెపికి వత్తాసుగా నిలవడానికే పోటీ పడుతున్నాయి. ‘ఇండియా’ ఈ నిరంకుశత్వాన్ని నిలవరించేందుకు పోరాడటమే గాక ఎన్నికలలోనూ బిజెపి కూటమిని ఓడిరచడం ద్వారా ఆకుటిల ప్రయత్నాలు శాశ్వతంగా అడ్డు కోవడం మరింత ముఖ్యం.
(వ్యాసకర్త : సీనియర్‌ పాత్రికేయులు,న్యూఢల్లీి)-(ఢల్లీి నుంచి ప్రకాశ్‌ యాదవ్‌)