చెట్లు కూలితున్న దృశ్యం
తెలుగు కథావనంలో గిరిజన కథాసుమాలు…
అడవి బిడ్డలు అంటే అందమైన అడవుల్లో నివసిస్తూ స్వచ్ఛమైన జీవనం సాగిస్తూ శ్రమైక జీవన సౌందర్యంతో జీవిస్తూ అమూల్యమైన సంస్కృతిని అత్యంత విలువైన అటవీ సంప దను సంరక్షించు కుంటారు అని అందరం భావిస్తాం.. కానీ, ఇది నాణానికి ఒకవైపు మాత్రమే! మరోవైపు నిత్యం జీవన్మరణ సమస్య తమ ప్రాంతంలోనే తాము పరాయి తనం అను భవిస్తూ దుర్భర జీవితం గడుపు తున్న దౌర్భాగ్యం వారిది.
ఇక గిరిజన కథలు ప్రారంభంలో వారి యొక్క జీవన్మరణ పోరాటం గురించిన నేపథ్యం తో రాగా ఇటీవలవారి వికాసం సంస్కృతి సాంప్రదాయాల నేపథ్యంతో కథలు వెలువడు తున్నాయి. ఈరెండు విభాగాల కథలను గురిం చిన అభిప్రాయాలు విభేదాలు ఎలాఉన్నా వేటి అవసరం వాటికి ఉంది. అలాగే ఈరెండు రకాల కథలను గిరిజన కథ సామ్రాజ్యంలో చేర్చాల్సిన అవసరం కూడా ఉంది. అందులో భాగంగానే గిరిజనకథల ప్రారంభ దశకు చెం దిన కథ ‘‘చెట్లు కూలుతున్న దృశ్యం’’ గురించిన విశ్లేషణలోకి వెళదాం.
రచయిత డాక్టర్ దిలావర్ అవిభక్త వరంగల్ జిల్లా ఇల్లందు తాలూకాలోని మారు మూల గ్రామం పాత కమలాపురంలో జన్మిం చినఉద్యోగరీత్యా 25సంవత్సరాలపాటు సంపూర్ణ గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయు డుగా తెలుగు ఉపన్యాసకునిగా సేవలు అంది స్తూనే తనకుగల పర్యటన అభిరుచి మేరకు అరకులోయ నుంచి ఆదిలాబాద్ వరకు అనేక గిరిజన ప్రాంతాలు పర్యటించి ఆయా ప్రాంతా లలోని విభిన్న పద్ధతుల్లో జీవిస్తున్న గిరిజనుల స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించి, తెచ్చు కున్న అనుభూతితో వారి జీవన్మరణ సమస్య లను చూస్తూ రాయకుండా ఉండలేను అన్న తపనతో అచ్చంగా అడవిబిడ్డల వ్యధలతో కూడిన 12కథలు రాసి 2014సంవత్సరంలో వాటిని ‘కొండా కోనల్లో’ పేరుతో సంపు టిగా ప్రచురించార్ను ఈడజనుకథల్లో మేటిగా నలుగురితో మెచ్చ బడిన కథే ‘‘చెట్లు కూలు తున్న దృశ్యం’’ పేరులోనే రచయితలోని కవి తొంగి చూస్తాడు, ఇక కథ నిండా అవసరం మేరకు రచయిత తన అడవి అనుభూతులను అందంగా కవితాత్మకంగా చెబుతూ స్థానిక సామెతలు,జాతీయాలు,ఉపయోగిస్తూ, కథా వస్తువుకు చేటు రానీయకుండా కథను చది వింపచేసే ప్రయత్నంలో రచయిత సఫలీకృ తులయ్యారు అనవచ్చు. ఇక కథ విషయానికొస్తే ‘‘జోజి’’ అని గిరిజన యువకుడు చదువుకుని అటవీ శాఖలో బీట్ అధికారికి సహాయకునిగా ఉండే ప్రభుత్వ ఉద్యోగం పొందుతాడు. అది తనకు తన కుటుంబానికి భరోసా కానీ తన యావత్ గిరిజన జాతి అభివృద్ధి తన అభివృద్ధి గా భావించే సామాజిక స్పృహ గల యువ కుడు’’జోజి’’. అందులో భాగంగానే తన జాతి మనుగడ కోసం చేయాల్సిన పోరాటాల గురించి చైతన్యపరిచే సభ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో జరుగుతుందన్న ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళిన ‘‘జోజి’’కి కలిగిన తన జాతి జీవన స్థితిగతులకు చెందిన ఆలోచనలు రూపమే ఈకథ. నిత్యం అడవుల్లో తిరిగే గిరిజ నులకు అక్కడ ఉండే క్రూరమృగాల బారినుంచి ఎలా తప్పించుకోవాలో బాగా తెలుసు, కానీ మానవత్వం లేని ఆధునిక మనుషులు అధి కారుల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలి యక నానా అవస్థలు పడుతున్న అడవిబిడ్డల స్థితిని రచయిత ‘‘డిలావర్’’ కళ్లకు కట్టినట్లు అక్షరీకరించారు. అది కూడా జోజి పనిచేసే అటవీశాఖ అధి కారులు తమ గిరిజనులను పెడుతున్న హింసకు తోటి ఉద్యోగి అయ్యికూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి అతనిది, సాధా రణ అవసరాలు తీర్చుకోవ డానికి కూడా తనతల్లి లాంటి అడవి మీద ఆధా రపడ కూడదు అన్న అటవీ అధికారుల అనాలోచిత ఆంక్షలతో అడవిబిడ్డల ఆవేదన అంతా ఇంతా కాకుండా పోతుంది. ఒకరోజు తెల్లవారుజామున తన గూడెం ఆడపిల్లలు ఇప్పపువ్వు ఏరడానికి సమీపంలోని అడవికి వెళ్లగా అదును చూసి ఆ గిరిజన యువతులను అనుభవించిన అటవీ అధికారులు అకృత్యం చెవులారా విన్న జోజి హతా శుడై నివురుగప్పిన నిప్పులా మారిన సంఘటనను కూడా చాలా అందంగా ఆసక్తికరంగా కథనాత్మక గా అక్షరీకరించడంలో దిలావార్ సాబ్ మస్తు నైపుణ్యం కనబరిచాడు. అడవిలో ఉండే ప్రజలను జంతువులను రక్షించాల్సిన అటవీ అధికారులు, పోలీసు ఆఫీసర్లు, వారికి వాటికి ఎలా శత్రువులుగా తయారై హింసి స్తున్నారో ప్రత్యక్షంగా అనుభవైక్యం పొందిన రచయిత తనదైన ధర్మాగ్రహ రూపంలో పరిస్థితులను ‘‘అక్షర చిత్రీకరణ’’ చేసి భావితరాలకు అందించే ప్రయత్నం చేశారు అనిపిస్తుంది ఈ కథ చదువుతుంటే!!!
‘‘కంచే చేను మేసిన వైనంగ’’ అటవీ అధికారుల చర్యలను ఈ కథలో వివరించే ప్రయత్నాలు అనేక సంఘటనల సాయంగ జరిగింది,
ఒకరోజు తెల్లవారుజామున తన విధుల్లో భాగం గా అధికారులతో కలిసి అడవి లో తిరుగుతున్న‘‘జోజి’’కి చిత్రమైన సంఘటన అనుభవమవుతుంది, కరెంట్ తీగల ద్వారా అడవి జంతువులను ఎలా వేటాడుతున్నారు దానికి అటవీ అధికారుల సహకారం ఎంత చిత్రంగా అందుతుం దో తెలుసుకున్న జోజి మనసు మొద్దు బారిపోతుంది, అప్పటివరకు కేవలం అడవి బిడ్డలే వారి అమానుష త్వానికి బలవుతున్నారు అనుకున్న జోజి ఆలోచన లకు కొత్త సమస్య వచ్చి చేరింది. అభం శుభం తెలియని మూగజీవాలు సైతం ఈ మృగాళ్ల బారిన పడి ఎలా జీవితాలు జీవనాలు కోల్పోతున్నారో తెలిసింది. కానీ ఈ సమస్యకు పరిష్కారం ఎలా? అదే జోజి మనసులో చెలరేగుతున్న హిమజ్వాల!! తలవని తలంపుగా ఆ రాత్రి రేంజ్ ఆఫీసర్ ఇంట్లో జరిగే పార్టీకి రావాలని జ్యోతికి ఆహ్వానం అందిం ది. రాత్రి ఎనిమిదింటికల్లా చెప్పిన చోటికి చేరుకు న్నాడు జోజి అధికారుల మాట సమయపాలన పాటించే చిరుద్యోగిల అక్కడ ఏర్పాట్లు చూసిన జోజి మనసు ఏదో కీడు శంకించింది. మళ్లీ ఏదో చూడకూడని దృశ్యం ఏదో చూడాల్సి వస్తుందని ఆందోళనతో అటుగా వెళ్లి సిద్ధంగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. అన్నట్టుగానే ఆధునిక మత్తుపానీ యాలు సిద్ధం చేయబడి ఉన్నాయి జోలికి కూడా అవకాశం కల్పించారు అధికారులు, తనకు అల వాటు లేదన్న విషయం చెప్పి వాళ్లతో హేళన చేయబడ్డాడు చివరికి దుప్పి మాంసం వేపుడన్నా మాతో కలిసి చేయమని ఆజ్ఞాపించిన తనపై అధి కారుల ఆదేశాలతో నివ్వెర పోవడమేకాదు పొద్దున అడవిలో కరెంటు తీగెల ఉచ్చులద్వారా వేటాడిన దుప్పి దృశ్యం కళ్ళముందునిలవడంతో ‘‘జోజి’’ మనసు కాకా వికలమై గుండెలు అలసిపోయి మూగ జీవాల ఆవేదన దీనంగా కళ్లముందు కదలాడిరది. అభయారణ్యాలు రక్షించేందుకు గాను ప్రభుత్వాలు వీరికి జీతభత్యాలు ఇస్తుంటే వీళ్ళు చేస్తున్న పని ఏమిటి?అంటూ అతని మనసు మూగగా రోది స్తుంది. అదే సమయంలో అక్కడ టీవీలో వస్తున్న పర్యావరణ సంబంధిత కార్యక్రమం పట్టు బట్టి మరీ చూస్తాడు జోజి. అది అక్కడ మత్తులో జోగు తున్న అటవీ అధికారులకు ససేమిరా నచ్చదు అయి నా జోజిమీద సానుభూతి చూపిస్తూ ఆ కార్య క్రమం చూసే అవకాశం కల్పిస్తారు. తన వృత్తి ధర్మంగా పర్యావరణ సంరక్షణ కార్యక్రమం అబ్బు రంగా ఆసాంతంచూస్తాడు. మర్నాడు జోజి తన పైఅధికారులతో కలిసి ఉద్యోగ ధర్మంలో భాగంగా చేస్తున్న క్షేత్ర పర్యటనలో మరో అనుభవం కలుగు తుంది. అధికారుల అండదండలతో కలప రవాణా చేస్తున్న లారీలను,ముఠా నాయకులను, ధైర్యంచేసి అడ్డగించి పట్టుకుని తనవృత్తి ధర్మంలో విజయం సాధించానని,న్యాయం చేస్తున్నానని సంబర పడ తాడు. కానీ అది క్షణకాలమేఅని అతని పై అధికా రుల ఆదేశాల ఫోన్ సమాచారంతో తెలుసుకుని చేసేదేమీలేక అధికారలేమి తో నిస్సహాయంగా ఉండిపోతాడు జోజి. ఈసంఘటనలు అన్నీ ఒక్కొ క్కటిగా కళ్ళముందు తిరుగుతూ జ్ఞాపకాలుగా గుర్తు చేసుకున్న జోజి అనబడే గిరిజన అటవీ ఉద్యోగి పాత్ర కేంద్రంగా ఈ కథ నడుస్తుంది.
కథ ఆసాంతం అడవులు, అడవిబిడ్డల దీనస్థితి,అడవి జంతువుల మూగ రోదన,కేంద్ర బిందువుగా అచ్చమైన స్వచ్ఛమైన అడవిఅందాల వాతావరణం,అడవిబిడ్డల వేషభాషలు, సంభాషణ ముచ్చట్లు,సాయంతో కొనసాగిన ‘‘చెట్లు కూలుతు న్నదృశ్యం’’ కథద్వారా రచయిత ఏమి చెప్పాలను కున్నాడు? ఎవరికి చెప్పాలను కున్నాడు?? చివరికి ఆయన అందించే సందేశం ఏమై ఉంటుంది?? అన్న ప్రశ్నలు అన్ని ప్రశ్నలు గానే మిగిలి పోతాయి. రచయిత భావన ప్రకారం తాను ప్రత్యక్షంగా గమ నించిన విషయాలను తన శైలిలో అక్షరీకరిం చారు ఏమిటి ?ఏమి చేయాలి?? అన్నది పాఠకుల ఇష్టానికే సొంతం చేసినట్టు అర్థమవుతుంది. రచ యిత కూడా అదే నిర్ధారణ చేశారు.
ఇక్కడ కథలోని జోజి ఒక్కడి ఆవేదనే అందరి ఆవేదనై మార్పుకోసం ఆచరణాత్మకంగా కృషి చేసిన నాడు మనం కోరుకున్న పర్యావరణ సమతుల్యత చేకూరి పుడమితల్లి పచ్చని అడవులతో అందరి పాలిట ఆరోగ్య దేవతగ నడయాడటం తథ్యం అనిపిస్తుంది.
- డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు , ఫోను: 77298 83223