చిరు సేధ్యం..ఆరోగ్య భాగ్యం
మారుతున్న ఆధునిక పోకడలు.. నిత్యం పని ఒత్తిడిలో పడ ఆరోగ్యాన్ని ఆశ్రద్ద చేయడం.. తీరిక లేకుండా బిజీగా గడుపుతూ దొరికిన జంక్‌ఫుడ్ తినడానికి నగర ప్రజలు అలవాటు పడిపోతున్నారు.దీంతో కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలుఉన్న తిండి తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. చిరుధాన్యాల్లో మంచి పోషక విలువలు ఉంటున్నాయి. వీటిని సాగు చేస్తున్న రైతులకు సైతం సిరులు కురిపిస్తు న్నాయి. అంతేకాకుండా వీటి సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మద్దతు ధరను కూడా ప్రకటించింది.రైతులు పండిరచిన దిగుబడులను పౌరసరఫరాశాఖ ద్వారా కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేసింది. దీంతో చాలా మంది రైతుల చిరుధాన్యాల సాగుకు ఆసక్తి చూపుతున్నారు.
నేటి పోటీ ప్రపంచంలో అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయనిక ఎరువులు,పురుగు మందుల వినియోగం పెరిగిపోయింది. ఫలితంగా భూమిలో రసాయన అవశేషాలు నిండి ఏటికేడాది పంట దిగుబడులు పడిపోతున్నాయి.ఇలా సాగు చేసిన ఆహారం పంటల్లో కూడా రసాయనాల అవశేషాలు ఎక్కువ ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫలితంగా జనాల్లో వ్యాధుల సంఖ్య ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది.వీటికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.చాలా మంది ఇప్పుడు చిరుధాన్యాలను ఇష్టపడుతున్నారు. ఇప్పటికే చాలా ఏళ్ల నుంచి నగరంలోని రైతు బజార్లులో ప్రత్యేక కౌంటర్ల పెట్టి విక్రయాలు సాగిస్తున్నారు.నగర ప్రజలపై అవగాహన కల్పించేందుకు గత రెండేళ్ల నుంచి కొన్ని స్వచ్చంధ సంస్థలు కలసి చిరుదాన్యాల జాతర కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజలను అవగాహన కల్పిస్తున్నారు.ఇందుకు సంబంధించి ఇటీవలే ఐక్యరాజ్యాసమితి కూడా 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించింది. దీనికి అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం సాగును ప్రొత్సహించేంఉదకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో సదస్సులను నిర్వహిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తోంది.
మినుకు మినుకు..
వర్షాధార,సారవంతం కాని భూముల్లో ఆహార పంటలుగా చెలామణి అవుతున్న వరి,గోధుమ,మొక్కజొన్న లాంటివి పండిరచలేము. దాంతో ఆయా భూముల్లో ఇప్పటికీ మిల్లెట్స్ సాగు మినుకు మినుకు మంటోంది. అంటే పాక్షిక ఉష్ణమండల ప్రాంతాలలో సాగు చేస్తున్నారు. ప్రధాన ఆహార ధాన్యాలలో కంటే వీటిలో పోషకాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఆరోగ్య భద్రతనిస్తాయి. అంతేకాక తీవ్రమైన వాతావరణ అననుకూల పరిస్థితులను తట్టుకునే శక్తి ఈ మిల్లెట్స్‌కు ఉంది. పర్యావరణ అభివృద్ధికి తోడ్పడతాయి.
2023 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం..
చిరుధాన్యాలు..సిరిధాన్యాలుగా పిలువబడే మిల్లెట్స్ పూర్వకాలం నుంచి మన దేశంలో ప్రధాన ఆహారపంటగా ఉండేది. ప్రస్తుతం వరి, గోధుమ, ఇతర ఫాస్ట్ఫుడ్స్ జనజీవన సరళితో మమేకమయ్యాయి. కంటికింపుగా పిల్లలను, పెద్దలను ఆకర్షిస్తున్న ఫాస్ట్ఫుడ్స్ లాంటి ఆహార పదార్ధాలు జిహ్వచాపల్యాన్ని తీర్చడం తప్ప ఆరోగ్యహేతువులు కావు. కోవిడ్‌లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి రోగ నిరోధక శక్తి అవసరం. అన్ని తరగతుల ప్రజలకు పౌష్టికాహారం అందించాల్సిన అగత్యం ఏర్పడిరది. వీటన్నింటి దృష్ట్యా మన ప్రభుత్వం 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదించింది.
రిఫైన్డ్ డైట్ కల్చర్‌కు ప్రత్యామ్నాయంగా..
మారిన జీవనశైలితో ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పుడిప్పుడే ప్రజల్లో చైతన్యం పెరిగి,‘రిఫైన్డ్ డైట్ కల్చర్’కు ప్రత్యామ్నాయంగా పోషకాలు అధికంగా ఉండే మిల్లెట్స్‌ను స్వీకరించే స్థితిలో ఆలోచిస్తున్నారు. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రజలు రోగనిరోధక శక్తిని పెంపొందించు కోవడానికి మిల్లెట్స్ వినియోగంపై దృష్టి పెడుతున్నారు. ప్రకృతి ప్రేమికులు ప్రజల్లో మీడియా ద్వారా వీటిపై అవగాహన కల్పిస్తున్నారు.
పోషకాలు మెండు..
మిల్లెట్ల ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో కేంద్రప్రభుత్వం2018 ఏప్రిల్‌లో మినుములను న్యూట్రి-తణధాన్యాలుగా ప్రకటించింది.వాటిలోజొన్న (జోవర్),పెరల్ మిల్లెట్ (బజ్రా),ఫింగర్ మిల్లెట్ (రాగి/మాండువా) మైనర్ మిల్లెట్‌బీ ఫాక్స్‌టైల్ మిల్లెట్ (కంగని/కాకున్),ప్రోసో మిల్లెట్ (చీనా),కోడోమిల్లెట్ (కోడో),బార్న్యార్డ్ మిల్లెట్(సావా/సన్వా/జంగోరా),లిటిల్ మిల్లెట్ (కుట్కి)లు కూడా ఉన్నాయి.గ్రామీణస్థాయిలో వ్యవసాయం,చిన్నతరహా,కుటీర పరిశ్రమలు, హస్తకళలు,ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో జాతీయ అభివద్ధి బ్యాంకుగా బాధ్యత వహించే నాబార్డ్ కూడా ఈ థీమ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించింది.
చిరుసేధ్యం కేరాఫ్ ఏజెన్సీ ప్రాంతం..
చిరుధాన్యాలు ఒకప్పుడు పేదలు,మధ్య తరగతి ప్రజల ప్రధాన ఆహారం.మూడు,నాలుగు దశాబ్దాల క్రితం వరకూ వీటి వినియోగం అధికంగానే ఉండేది.ముఖ్యంగా ఉమ్మడి జిల్లా ఏజెన్సీ ప్రాంతాలైన 11మండలాలల్లో చిరు సేధ్యం ఉత్పత్తులు అధికంగా ఉండేవి.వీటికి రసాయనిక ఎరువులు,పురుగుమందులు వాడకుండా పశువుల ఎరువు, చెరువు మట్టి,సేంద్రియ ఎరువులతో పండిరచే వాళ్లు. పలితంగా వీటిని వాడే ప్రజల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉండేది. అనంతరం వచ్చిన మార్పులతో ఏడాదికేడాది చిరుధాన్యాల సాగు తగ్గుతూ వచ్చింది.చాలా మంది రైతున్నలు అధిక ఆదాయం కోసం వరి,పత్తి,మిరప,ఉల్లి వంటి పంటల సాగుపై ఆసక్తిని కనబరచ డంవల్ల చిరుధాన్యాల సాగు కనుమరుగువుతూ వచ్చింది.వీటితోపాటు అధిక దిగుబడులను సాధించాలనే పోటీతత్వంతో రైతులు విచక్షణా రహితంగా ఎరువులు,పురుగు మందులు వాడటం మొదటు పెట్టారు. ఫలితంగా సాగు ఖర్చులు పెరిగి పంట దిగుబడులు తగ్గాయి. భూమి కూడా విషతుల్యంగా మారుతోంది. దీనిని తగ్గించేందకు రాష్ట్ర ప్రభుత్వం చిరుధాన్యాల సాగును ప్రొత్సహిస్తోంది. ఇందులో భాగంగా జొన్నలు,రాగి పంటలకు మద్దతు ధరను ప్రకటించింది.
ఈ ఏడాది 9.85 వేల హెక్టార్ల సాగు లక్ష్యంగా…
ఉమ్మడి జిల్లా అనకాపల్లి,అల్లూరి సీతారామ రాజు,విశాఖపట్నం జిల్లాలో మిల్టెట్స్ సాగను ప్రొత్సహించే లక్ష్యంలో భాగంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 9.85 హెక్టార్లలో సాగు చేసేందుకు వ్యవసాయ అధికారులు ప్రణాళికలను సిద్దం చేశారు. అందులో 2664 హెక్టారులో జొన్న,2050 హెక్టార్లలో సజ్జలు,2010హెక్టాలో రాగి,1872 హెక్టారలలో కొర్రలు సాగు లక్ష్యంగా నిర్ధేశించారు. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) పరిధిలో మిల్లెట్స్,క్లస్టర్స్ ఏర్పాటు చేసి ప్రతి నెలా మొదటి శుక్రవారం వ్యవసాయ అధికారులతో రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ సాగను ప్రొత్సహిస్తున్నారు.
మద్దతు ధరలు ఇలా..
రాష్ట్ర ప్రభుత్వం మిల్లెట్స్ సాగు ప్రొత్సహించే కార్యక్రమంలో భాగంగా జొన్న,రాగులకు మద్దతు ధరలను కూడా ప్రకటించింది. హైబ్రీడ్ జొన్నలకు క్వింటా రూ.3,180కాగా సాధారణ జొన్నకు క్వింటా 3225,అలాగే రాగులకు క్వింటాకు రూ.3846గా ప్రకటించింది. రైతులు పండిరచిన పంటలకు మద్దతు ధరను కల్పించి పౌరసరఫరాశాఖ తరుపున కొనుగోలు చేయనుంది.చిరుధాన్యాలు.. సిరి ధాన్యాలుగా పిలువబడే మిల్లెట్స్ పూర్వకాలం నుంచి మన దేశంలో ప్రధాన ఆహారపంటగా ఉండేది. ప్రస్తుతం వరి, గోధుమ, ఇతర ఫాస్ట్ఫుడ్స్ జనజీవన సరళితో మమేకమయ్యాయి. కంటికింపుగా పిల్లలను, పెద్దలను ఆకర్షిస్తున్న ఫాస్ట్ఫుడ్స్ లాంటి ఆహార పదార్ధాలు జిహ్వచాపల్యాన్ని తీర్చడం తప్ప ఆరోగ్యహే తువులు కావు. కోవిడ్‌లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి రోగ నిరోధక శక్తి అవసరం. అన్ని తరగతుల ప్రజలకు పౌష్టికాహారం అందించాల్సిన అగత్యం ఏర్పడిరది. వీటన్నింటి దృష్ట్యా మన ప్రభుత్వం 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదించింది. ఐదు వేల సంవత్సరాల క్రితం నుంచి భారత ఉపఖండంలో చిరుధాన్యాలు పండిరచబడుతున్నాయని సూచించడానికి పాలియోం టలాజికల్ ఆధారాలున్నాయి. గడ్డి కుటుంబానికి చెందినవి చిరుధాన్యాలు. ఏడాదంతా ఉష్ణమండల వాతావరణంలో పెరిగే తృణధాన్యాలు. తక్కువ నీటి సౌకర్యంతో,అతి తక్కువ కాలంలోనే పంట కోతకు వచ్చి, దిగుబడిని ఇస్తాయి. సైజులో చిన్నవే కానీ పోషకాలు మెండుగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫైబర్, అమైనో ఆమ్లాలు,వివిధ రకాల ఖనిజాలను కలిగి ఉం టాయి. రాగులు (ఫింగర్ మిల్లెట్),జొన్నలు (జోవర్),బజ్రా (పెర్ల్ మిల్లెట్),ఊదలు, కొర్రలు, అండుకొర్రలు, ప్రోసో (చీనా),కోడో (కొడ్రా, అరికెలు), ఫాక్స్ టెయిల్ (కంగ్ని/కొర్ర), బార్న్యార్డ్ (వరై, సావా), లిటిల్ మిల్లెట్ (కుట్కి) మనదేశంలో పండిరచే మిల్లెట్లు.
ఆకుపచ్చ విప్లవం..
ఎమ్ఎస్ స్వామినాథన్ ఆధ్వర్యంలో (1960) వచ్చిన గ్రీన్ రివల్యూషన్ దశాబ్ద కాలం మనగ లిగింది. తద్వారా భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి లాంటి రకరకాల విత్తనాలు వ్యవసాయంలో ప్రాధాన్యతను సంతరించు కున్నాయి. గ్రీన్ రివల్యూషన్ నేపథ్యంలో యాంత్రిక వ్యవసాయ ఉపకరణాలు, నీటి సౌకర్యం, పురుగుమందులు, ఎరువులు అభివృద్ధి రూపంలో వినియోగంలోకి వచ్చాయి. వ్యవసాయం ఆధునిక పారిశ్రామిక వ్యవస్థగా మారింది. ఆహారధాన్యాల ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగింది. వాణిజ్య, వ్యాపార ధోరణిలో క్రమంగా వరి, గోధుమ ప్రాముఖ్యత పెరిగి, మిల్లెట్స్ ఉనికి మరుగున పడిపోయింది.
నాబార్డ్ ప్రమేయం..
గ్రామీణస్థాయిలో వ్యవసాయం, చిన్న తరహా, కుటీర పరిశ్రమలు, హస్తకళలు, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో జాతీయ అభివద్ధి బ్యాంకుగా బాధ్యత వహించే నాబార్డ్ కూడా ఈ థీమ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించింది.-(జి.ఎ.సునీల్ కుమార్)