చిరు ధాన్యాలు కాదు..సిరి ధాన్యాలు
చిరు ధాన్యాలు ఎక్కువ ఉష్ణోగ్రతలను, బెట్టను తట్టుకొనే పంటలు కనుక కరువు పీడిత ప్రాంతాలలో కూడా పండిరచటానికి వీలుంటుంది. చిరుధాన్యాలలో పీచు పదార్థం, ఇనుము, కాల్షియం, విటమిన్లు అధికంగా ఉండటం వల్ల ఇవి ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. గడిచిన మూడు నాలుగు దశాబ్థాల కాలంలో జీవన శైలిలో వచ్చిన మార్పులు వల్ల మన ఆహార విధానంలోనూ మార్పులు వచ్చాయి. తద్వారా ప్రబలుతున్న దీర్ఘకాలిక వ్యాధుల ద ృష్ట్యా తిరిగి చిరుధాన్యాల వాడకంపై ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో వ్యవసాయాభివ ృద్ధికి తోడ్పడే గ ృహవిజ్ఞాన విభాగం నుంచి చిరుధాన్యాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించే ప్రచారం పెరిగింది. ఇందులో భాగంగా గ ృహవిజ్ఞానంలో పరిశోధకురాలిగా ఉన్న డాక్టర్ కీర్తి చిరుధాన్యాల ప్రాముఖ్యత, వాటితో చేసుకోదగిన వంటల గురించి వివరిస్తున్నారు.- కె.కీర్తి
చిరుధాన్యాలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల చిరుధాన్యాల వాడకం పెరుగుతుంది. తద్వారా రైతులు అధికంగా చిరుధాన్యాలను పండిరచడానికి మొగ్గు చూపుతారు. దీనితోపాటు రైతులకు అధిక ఆదాయం పెరిగే చిన్న కుటీర పరిశ్రమలనూ అభివ ృద్ధి చేసుకోవచ్చు. అయితే ప్రస్తుత ఆధునిక యుగంలో ఫాస్ట్ఫుడ్స్ వాడకం మూలంగా మార్కెట్లో చిరుధాన్యాలు లభించినప్పటికి చాలా మందికి వాటిని ఎలావినియోగించాలో తెలియక చిరుధాన్యాల వాడకాన్ని తగ్గించారు. చిరు ధాన్యాల పోషక విలువలను, చిరుధాన్యాలతో వివిధఆహార పదార్థాలను త్వరితగతిని చేసుకునే పద్ధతులపై అవగాహన పెంచడానికి కృషి చేస్తున్నారు గృహ విజ్ఞాన పరిశోధకులు. ఈప్రయత్నంలో భాగంగా చిరుధాన్యాలతో పౌష్టిక విలువలతో కూడిన సంప్రదాయ వంటలు ఎలా చేసుకోవాలో తెలియ జేస్తున్నారు.
చిరుధాన్యాలతో ఆరోగ్యం
మనం రోజూ తీసుకునే వరిఅన్నం, గోధుమల కంటే చిరు ధాన్యాలలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. రోజుతీసుకునే ఆహారంలో చిరుధాన్యాలను కూడా చేర్చడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు. చిరుధాన్యాల సాగుతో వీటి వినియోగ సామర్థాన్ని పెంచడానికి వీలుకలుగుతుంది. చిరుధాన్యాలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల పిల్లల్లో, మహిళల్లో ఎముకల పుష్టికి అవకాశం ఏర్పడుతుంది. చిరుధాన్యాలలో పీచుపదార్థం,మాసంకృత్తులు, అమైనోయాసిడ్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి కనుక సులభంగా, నెమ్మదిగా జీర్ణం అవుతాయి. అంతేకాదు చిరుధాన్యాలను రోజువారి ఆహారంలో చేర్చ డం ద్వారా గుండె సమస్యలు, మధుమేహం, ఉబకాయం వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
రాగులు – ఆరోగ్య లాభాలు : రాగులు వాడితే ఎముకల పెరుగుదల, దృఢత్వం మెరుగవుతుంది. ఇవి అధిక బరువు నియంత్రణ, మధుమేహ వ్యాధి నియంత్రణ, రక్తహీనత నివారిస్తాయి. గ్లూటెన్ ఎలర్జీ, సీలియాక్ వ్యాధిగ్రస్తులకు రాగులు అనువైన ఆహారం. రాగిచేదు,కారం,వగరు, తీపిరుచులు కలిగి ఉంటుంది. రాగుల్లో ప్రోటీన్లు,అమినోయాసీడ్లు ఎక్కువగాఉంటాయి. లేలైన్,ధియోనైన్, ఐసో ల్యూసిన్, మిథియోనైన్, థైమీన్, ట్రిఫ్టోఫైన్ వంటి ముఖ్య అమినో యాసిడ్లు ఉండటం వల్ల కండరాలు పనిచేయటానికి, రక్తం ఏర్పడ టానికి, డిప్రెషన్‌లపై పోరాటానికి, శరీర పెరు గుదల హార్మోన్లు విడుదల అవ్వడానికి, మల బద్ధకం,ఊబకాయం, వ్రణాలకి మంచి ఆహా రం. ఇది జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. బాలిం త స్త్రీలలో పాలఉత్పత్తిని పెంచుతుంది. చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. పేగుక్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి ఇది చక్కని ఆహారం. రాగికి చలవ చేసే గుణం ఉండటంవల్ల వేసవి కాలంలో ఎండతాపాన్ని తట్టుకోవడానికి రాగిజావ, అంబరిని ఎక్కువగా తీసుకుంటారు. విటమిన్-ఎ, బి-1,బి-2, ఇనుము, కాల్షియం వంటి ఖని జాలు అధికంగా ఉండటంవల్ల రాగులను ‘పోషక ధాన్యంగా’ పిలుస్తారు. ఈ రాగులతో రాగిజావ, సేమ్యా,ఇడ్లి,వడ,పుల్లటి పునుగు లు,చెక్కపకోడి, పూరి,బూంది, మురుకులు, పొగడాలు, మిక్స్డ్ అటుకులు,లడ్డు, సంకటి, బొబ్బట్లు వంటి సంప్ర దాయ వంటకాలు చేసుకోవచ్చు.
జొన్నలు-ఆరోగ్య లాభాలు: జొన్నలతో అధిక శక్తి, పెరుగుదల సాధ్యమవుతుంది. అంతేకాక మలబద్ధకం నియంత్రణ, మధుమేహ వ్యాధి నియంత్రణ, కొలెస్ట్రాల్ నియంత్రణతో పాటు గ్లూటెన్ ఎలర్జీ, సీలియాక్ వ్యాధిగ్రస్తులకు అను వైన ఆహారం. జొన్నలు ఆరోగ్యవంతమైన జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు అధికంగాఉంటాయి. ఇది రక్తహీనతకు, మలబద్ధకానికి చక్కని ఆహారం. కండపుష్ఠికి,ఎముకల పటుత్వాన్ని పెంచు తుంది.కాల్షియం స్థాయిలను క్రమ బద్ధీకరిస్తుంది.రోగనిరోధక వ్యవస్థను పెం పొందిస్తుంది.ఇందులో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. క్యాన్సర్ బారినపడ కుండా కాపాడుతుంది. ఇది గ్లూటెన్ లేని ఆహారం. ధయామిన్, రైబోప్లేరిన్ పుష్కలంగా ఉండటంతో నరాల బలహీనతలు, మానసిక రుగ్మతలు, కాళ్లు చేతులు మంటలు, నోటి పుండ్లు, వార్థక్య రుగ్మతల నుంచి కాపాడతాయి. ఇలాంటి జొన్నలతో స్వీట్ దోశ, హాట్‌బాల్స్, జొన్న పాయసం, జొన్నబజ్జీ, జొన్నసేమ్యా, పాల తాలికలు, ఉప్మా, పొంగలి, జొన్న రవ్వ బిర్యాని, జొన్నరవ్వ, కిచిడి, బూంది, జొన్న వడ, అరటికాయ బజ్జీ, చెక్కలు, జంతి కలు, చెక్క పకోడి, జొన్న అటుకులతో చుడువా, మురిపి, గవ్వలు,లడ్డు, బర్ఫీ, అటుకుల పాయసం, వడియాలు మొదలైన వంటకాలు చేసుకోవచ్చు.
సజ్జలు-ఆరోగ్య లాభాలు: సజ్జలు అధిక శక్తి, శరీర పెరుగుదలకు తోడ్పడతాయి. ఇవి మల బద్ధకాన్ని నియంత్రిస్తాయి. రక్తహీనత నివారణ, కడుపులో పుళ్లను (అల్సర్) తగ్గించడం, గ్లూటెన్ ఎలర్జీ, సిలియాక్ వ్యాధిగ్రస్తులకు అనువైన ఆహారం. సజ్జలు వగరు, తీపి రుచులు కలిగి ఉంటాయి. సజ్జలలో పిండి పదార్థం అధికం, వీటిలో ప్రోటీన్లు, పీచు పదార్థం అధికంగా ఉంటాయి. సజ్జలలో ఉండే అమినోయాసిడ్లు గోధుమలో ఉండే అమినో యాసిడ్లు కంటే తేలికగా జీర్ణమవుతాయి. బి-కాంప్లెక్స్ మిటమిన్లు (నియాసిన్, మిథియోనైన్, థయామిన్, రైబోప్లైవిన్, ఫోలిక్ యాసిడ్, లెసిథిన్) పోటాషియం, మాంగనీస్, జింక్ వంటి అవసరమైన అనేక పాత్రలను సమర్థవంతంగా నిర్వర్తిస్తుంది. నియాసిన్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. సజ్జలలో అధికంగా ఉండే భాస్వరం శరీరకణ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషి స్తుంది. జెనిటిక్ కోడ్ నిర్మాణంలో ముఖ్యమైన న్యూక్లిక్ యాసిడ్స్‌లో ఫాస్పరస్ ముఖ్యభాగం. కణాల పొరలు, నరాల నిర్మాణంలో పాత్ర పోషించే లిపిడ్స్‌లో కూడా భాస్వరం ఒక భాగం. సజ్జలతో తయారుచేసిన ఆహారాన్ని ప్రతిరోజు తీసుకుంటే స్త్రీలకు మూత్రపిండాలలో ఏర్పడే రాళ్ల సమస్య ఉండదు. శరీరంలో ట్రైగ్లీనరైడ్స్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజు సజ్జ ఆహరాన్ని తీసుకోవటం వల్ల స్త్రీలలో రొమ్ము క్యాన్సర్, పిల్లలో ఆస్తమా సమస్యలు తగ్గుతాయి. సజ్జలలో ఉండే అవసరమైన పోషకం లగ్నిన్ శరీరానికి చాలా ప్రయోజనకారి. ఇది క్యాన్సర్, గుండె ఆగిపోవటం వంటి ప్రమాదాలను అరికడు తుంది. సజ్జల ఆహారం డయోబెటిక్ టైపు-2ను కూడా తగ్గిస్తుంది. సజ్జలతో మసాలా రొట్టె, అప్పాలు, స్వీట్ పూరి,సేమ్యా, బిర్యాని, బూంది, వాంగీబాత్, నమక్ ఏరా, సజ్జ పకోడి, చెక్క పకోడి, మంచూరియా, బూంది లడ్డు, బొబ్బట్లు, మిఠాయి, బాదుషా, లడ్డు.
కొర్రలు ఆరోగ్య లాభాలు : శరీర పెరుగుదల, శరీర నిర్మాణంలో కొర్రలు తోడ్పడతాయి. సిలియాక్ జబ్బుకు అనువైన ఆహారమిది. కొర్రలు తీపి, వగరు రుచులు కలిగి ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు, రక్త హీనత నివారణలో ఇది మంచి ఆహారం. శరీరంలో కొలస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొర్రలలో అధిక పీచుపదార్థం, మాంసక ృత్తులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్లు అధిక పాళ్లలో ఉంటాయి. కనుక చిన్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు మంచి ఆహారం. ఇవి ఉదర సంబంధ వ్యాధులకు మంచి ఉపశమనం కలిగిస్తాయి. కడుపు నొప్పి, మూత్రం పొసేటప్పుడు మంటగా ఉండటం, ఆకలిమాంద్యం, అతిసారం మొదలగు వ్యాధులకు ఔషధాహారం. మాంసకృత్తులు, ఇనుము ఆధికంగా ఉండటం వల్ల రక్తహీనత నివారణకు చక్కటి ఔషదం. పీచు పదార్థం అధికంగా ఉండటంవల్ల మలబద్ధకాన్ని అరికడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో జ్వరం వచ్చినప్పుడు కొర్ర గంజి తాగి దుప్పటి కప్పుకుని పడుకుంటే జ్వరం తగ్గిపోతుందని పెద్దల అనుభవం చెబుతుంది. గుండె జబ్బులు, రక్తహీనత, ఊబకాయం, కీళ్లవాతం, రక్తస్రావం, కాలిన గాయాలు త్వరగా తగ్గుటకు కొర్రలు తినడం మంచిది. కొర్రలతో కొర్ర పాయసం, కొర్ర లడ్డు చేసుకోవచ్చు.
సామాలు-ఆరోగ్య సూత్రాలు : సామాలతో అధిక శక్తి, శరీర పెరుగుదల ఉంటుంది. రక్తహీనత నివారణ, మలబద్ధకం నియంత్రణలో సహకరిస్తుంది. గ్లూటెన్ ఎలర్జీ వారికి, సీలియాక్ వ్యాధిగ్రస్తులకు అనువైన ఆహారం.
వరి గడలు-ఆరోగ్య సూత్రాలు : వీటితో మధుమేహ వ్యాధి, కొలెస్ట్రాల్, మలబద్ధకం నియంత్రణలో ఉంటాయి. గ్లూటెన్ ఎలర్జీ వారికి, సిలియాక్ వ్యాధిగ్రస్తులకు అనువైన ఆహారం.
అరికలు-ఆరోగ్య సూత్రాలు : అరికలు అధిక శక్తి, శరీర పెరుగుదలను ఇస్తాయి. వీటితో మధుమేహ వ్యాధి, మలబద్ధకం నియంత్రణలో ఉంటాయి. ఇవి అధిక బరువును నియంత్రి స్తాయి. ప్రస్తుతం అన్ని వయసుల వారిలోనూ ఆరోగ్య స్ప ృహ పెరుగుతోంది. అందుకు తగినట్టుగానే ఆహారంలోనూ మార్పులు వస్తున్నాయి. ఎలాంటి పురుగు మందులు, రసాయనాలు వేయకుండా, సేంద్రీయ పద్ధతిలో పండిరచిన పంటలతో చేసిన వంటలనే కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, బియ్యం, గోధుమలు, అపరాలు వంటి ఆహారోత్పత్తులకు నగరంలో ఏటేటా అనూహ్య ఆదరణ లభిస్తోంది. ఆహార ప్రియుల ‘స్వచ్ఛమైన’ అభిరుచికి అనుగుణంగానే వందల కొద్దీ చిన్న, పెద్ద సంస్థలు, కార్పొరేట్ దిగ్గజాలు, రైతు సహకార సంఘాలు సైతం మార్కెట్లో పోటీ పడుతున్నాయి. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల ఆర్గానిక్ ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతుండగా, ఒక్క హైదరాబాద్‌లోనే సుమారు రూ.80 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. ఒక అంచనా మేరకు సుమారు 70 వేల కుటుంబాలు నిత్యం సహజంగా పండిన ఆహార పదార్థాలను తీసుకుంటుండగా, మరో 20 వేల కుటుంబాలు ఆర్గానిక్ రుచులను మాత్రమే ఆస్వాధిస్తున్నాయి. ఏటా ‘ఆర్గానిక్’ ఆహార ప్రియుల సంఖ్య పెరుగుతోంది. నగర జీవనంలో పెరుగుతున్న ఒత్తిళ్లు, రకరకాల అనారోగ్య సమస్యల నుంచి శాశ్వత విముక్తిని, ఊరట పొందాలంటే అత్యధికంగా పిండిపదార్థాలు ఉండే బియ్యం కంటే.. పోషక విలువలు, పీచు పదార్థాలు సమ ృద్ధిగా ఉండే మిల్లెట్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు.
పాత వైపు కొత్త చూపు..
ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివళ్లు, నోరూరించే రకరకాల వంటకాలు, బిరియానీ ఘుమఘు మలు, వెరైటీ వెజ్, నాన్ వెజ్‌తో రోజూ పసందైన విందు భోజనాలు ఆరగించే నగర వాసులు ఇప్పుడు ‘పాత’ తరానికి పయనమవు తున్నారు. అలనాటి ఆహార పదార్థాల వైపు దృష్టి సారించారు. జీవనశైలి వ్యాధులకు దూరంగా, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా బతికిన నిన్నటి తరం ఆహారపు అలవాట్లను నేటి తరం ఎంతో ఆసక్తిగా పరిశీస్తోంది. ఒకప్పుడు ప్రధాన ఆహారంగా ఉన్న సజ్జలు, కొర్రలు, కొర్రలు, వరిగెలు, ఊదలు, సామలు, జొన్నలు, రాగులు, వరిగెలు వంటి చిరు ధాన్యాలకు అనూహ్యమైన డిమాండ్ పెరిగింది. కాల్షియం బాగా ఉండి అనేక రకాల జీవన శైలి వ్యాధుల నుంచి విముక్తి కల్పిండంలో దోహదం చేసే రాగులకు, స్థూలకాయాన్ని అదుపులో ఉంచే కొర్రలకు నగరవాసులు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇంటికి.. వంటికీ కూడా..
సహజమైన జీవన విధానంలో కేవలం ఆహార పదార్థాలే కాకుండా కూరగాయలు, ఆకు కూరలు, సబ్బులు, షాంపూలు, వంట నూనెలు, కాస్మోటిక్స్ కూడా చేరాయి. మొరార్కో, ఫ్యాబ్ ఇండియా, 24 లెటర్ మంత్ర, ఈకోఫుడ్స్, కాన్షియస్ ఫుడ్, నేచర్ బాస్కెట్ వంటి వ్యాపార దిగ్గజాలు నగరవాసుల అభిరుచికి తగ్గట్టుగా ఆర్గానిక్ ఉత్పత్తులను అందజేస్తున్నాయి. ఇక దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, రైతునేస్తం, సహజ ఆహారం, ధరణి నేచురల్స్, గ్రామీణ్ మాల్ వంటి సంస్థలు, రైతు సహకార సంఘాలు సేంద్రియ ఎరువులతో పడిరచిన పంటలతో మహానగరానికి పల్లెకు మధ్య బాటలు వేశాయి. సూపర్మార్కెట్లలో ఇప్పుడు బ్రౌన్‌రైస్, జొన్నలు, రాగులు తప్పనిసరి విక్రయ వస్తువులయ్యాయి. ఆన్లైన్ అమ్మకాలు సైతం జోరందుకున్నాయి.
సహజ ఆహారమే ఎందుకు..
ప్రస్తుతం కాలంలో బియ్యం నుంచి పప్పులు, వంట నూనెల వరకు అన్నింటా కల్తీయే రాజ్యమేలుతోంది. 34 ఏళ్ల క్రితమే నిషేధించిన ఇతియాన్, డీడీటీ, బీహెచ్‌సీ వంటి ప్రమాద కరమైన పురుగుమందుల అవశేషాలు ఇప్పటికీ బయటపడుతున్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం వంటి వ్యాధులకు రాజధానిగా మారిన హైదరాబాద్‌లో ఇలాంటి కల్తీ ఆహారాలు ప్రజలను మరింత అనారోగ్యం బారిన పడేస్తున్నాయి. చిన్న వయసులోనే అనేక రోగాలు దరిచేరుతున్నాయి. ఎదుగుతున్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి క్షీణిస్తోంది. కల్తీ ఆహారం మేధో వికాసానికి సైతం బ్రేకులు వేస్తోంది. వైద్యనిపుణుల అంచనా మేరకు నగరంలో సుమారు 20 లక్షల మంది మధు మేహంతో బాధపడుతుండగా..మరో 25 లక్షల మందికి పైగా అధికరక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అనర్థాల నుంచి బయటపడేందుకు ప్రజలు ఇప్పుడు ఆర్గానిక్, మిల్లెట్స్ ఆహారాన్ని కోరుకుంటున్నారు. వ్యాధులకు గురై, రకరకాల మందులు మింగుతూ రోగులుగా బతకడం కంటే..సహజ ఆహారంతో అసలు వ్యాధులే రాకుండా ఉంటా యనే నమ్మకం ప్రజల్లో బాగా పెరిగింది. ఒకప్పుడు ముడి బియ్యం అన్నమంటే చాలా మందికి తెలిసేది కాదు. పుష్కలమైన పీచు పదార్థాలు, పోషక విలువలు ఉన్న ముడి బియ్యం తీసుకొనే వారి సంఖ్య ఇటీవల అధికమైంది. ఇదొక్కటే కాదు.. అన్ని ఆహార ఉత్పత్తులూ రైతు క్షేత్రాల నుంచి నేరుగా నగరానికి వస్తున్నాయి. మహారాష్ట్ర లోని వార్ధా నుంచి సహజమైన గోధుమలు, యావత్మాల్ నుంచి సోయాబీన్స్, తమిళనాడు నుంచి స్వచ్ఛమైన నువ్వులు, నువ్వుల నూనె, కేరళ నుంచి సహజమైన సుగంధ ద్రవ్యాలు సైతం ప్రస్తుతం నగర మార్కెట్లో విక్రయిస్తున్నారు. ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండడంతో చాలామంది అటువైపే చూస్తున్నారు.- రిసెర్చ్ అసోసియేట్,
గృహ విజ్ఞాన విభాగం, కృషి విజ్ఞాన కేంద్రం గరికపాడు, కృష్ణాజిల్లా.