చిన్న జిల్లాలు సామాజిక పరివర్తన సాధనాలు
‘‘స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్’’ అని ఎప్పుడో అన్నాడు సుప్రసిద్ధ ఆంగ్ల కవి ఇయఫ్.స్కుమాచెర్. అఅనుభూతి ఆచరణలోకి వచ్చింది తెలంగాణాలో అదీ దశరా పర్వదినాన. ఇరవైనొక్క కొత్త జిల్లాల ఆవిర్భావంతో వాడవాడలా,పల్లె పల్లెన,పట్టణాల్లో వెల్లివిరిసిన ఆనందోత్సవాలు చూసి తరించాల్సిందే తప్ప వర్ణశక్యం కాదు.అదిలాబాద్, మెదక్ వంటి పెద్ద జిల్లాల్లో-వైశాల్యం దృష్ట్యా-జిల్లా అధికారిగా పనిచేసిన అనుభవంతో ఈపరిణామాన్ని ఆహ్వా నించే వాళ్ళలో నేనొకడిని. మారుమూల ప్రాం తాలైన బెజ్జూరు,దహెగాం,తిర్యాణి మండలాల నుండి జిల్లాకేంద్రమైన అదిలాబాద్ చేరుకోవా లన్నా, అలాగే జగదేవ్‌పూర్,దుబ్బాక నుండి సంగా రెడ్డి (మెదక్ జిల్లా కేంద్రం) రావాలన్నా సామాన్య ప్రజానీకం పడే బాధలు అనుభవిస్తే తప్ప అర్థం కావు. అవి అలివి కాని ఇక్కట్లు. అందుకే అనుకుం టాను నానివాసం (క్యాంపు ఆఫీసు) ముందు ప్రొద్దు న్నే ధరఖాస్తుదార్లు వేచివుండడం చూసి మనసు కరిగి పోయేది. అంతకు క్రితం రోజంతా బస్సులో ప్రయాణించి, దూరా భారాలు ఓర్చి,రాత్రికి కలెక్టరేటు ఆరు బయట ప్రదేశంలో తలదాచు కుని ప్రొద్దున్నే జిల్లాఅధికార్ల సందర్శనార్థం ఎదురుచూసే ఈ అభాగ్య జీవులకష్టాలు ఎపుడు గట్టెక్కుతాయా అని ఆక్రోశించేవాణ్ణి. అయినాపని పూర్తవుతుందన్న నమ్మకం లేదు. పదిగంటలు దాటిందంటే దౌరా (టూరు)కు పోవటమో, మీటింగుల్లో మునిగి పోవ టమో జరిగితే, అధికార్లు అందుబాటులో లేకపోతే, మరొకరోజు జిల్లాహెడ్ క్వార్టరులోఉండాల్సి వచ్చే ది. అదృష్టవశాత్తు పెద్దగా రద్దీలేని సంగారెడ్డి, అదిలాబాద్ లాంటి పట్టణాల్లో, ఆఫీసుల ఆవరణ లోనే మకాం. వీళ్ల కోసం దేవాలయ ప్రాంగణాల్లో వున్నట్లు సత్రాలు ఏర్పటు చేస్తే బాగుం టుదేమో అన్న ఆలోచన కూడా మెదిలేది. ప్రత్యామ్నా యంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళ ఆవరణలో వాళ్ళకు ఆశ్రయం కల్పించేవిధంగా చర్యలు తీసుకోవడం జరిగేది. ఇప్పుడు ఆబాధలు తప్పినట్లే.
చిన్న జిల్లాల ఏర్పాటుతో తెలంగాణా ప్రభుత్వం ప్రజానీకానికి ఎంతో వెసులుబాటు కల్పిం చింది. దూరాలు దగ్గరయ్యాయి కదా అని అలస త్వంతో జిల్లా అధికార్లు ప్రజానీకానికి అందుబాటు లో లేకపోయినా,వారి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేసినా,హెడ్ క్వార్టర్ లో మకాం లేకపోయి నా,చిన్నజిల్లాలకు,పెద్దజిల్లాలకు అట్టే తేడా వుండ దు. సగటు మనిషి ఆశలు ఆడియాసలు కాకుండా చూసుకోవడం అధికార్ల బాధ్యత.
జాతీయ సగటుకు మూడు రెట్లు విస్తీర్ణం
జాతీయ స్థాయిలో జిల్లాల సగటు విస్తీర్ణం4000 చదరపుకిలోమీటర్లు వుంటే తెలంగాణలో 11,000 చ.కి.మీ.వుండేది గతంలో.జనాభా రీత్యా చూసినా, జాతీయ సగటుకు రెట్టింపు జనసాంద్రత వుండేది. తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణంలో నలభైశాతం వున్న పంజాబు,హర్యానా,రాష్ట్రాల్లో నలభై, యాభై జిల్లాలు ఉండడం ఈదిశగా గమనార్హం.చిన్నజిల్లాల సంఖ్యా పరంగా చూస్తే, జాతీయ స్థాయిలో తెలంగాణాది 9వ స్థానం.జనాభా రీత్యా,12వ స్థానంలో వుంది. ఈ లెక్కన చూస్తే, 31జిల్లాల తెలంగాణ రాష్ట్రం సముచితమే అనిపిస్తుంది. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా కూడా. ఎన్ని జిల్లాలు వుండాలి? ఆ జిల్లా ప్రధాన కార్యాలయాలు ఎక్కడ పెట్టాలి? రెవెన్యూ డివిజన్లు, మండలాలుఎన్ని?అన్న విశ్లేషణ ఎడ తెగని తర్కం.అదినిరంతర ప్రక్రియ.విధాన నిర్ణ యాల్ని పాలకులవిజ్ఞతకు వదిలేసి,అధికార్లు, ఉద్యోగులు జిల్లాల పునర్విభజానంతరం ఉద్యమ స్ఫూర్తితో,ఈ మార్పులు చేర్పులు ప్రజోపయోగం కోసమే కానీతమకోసం కాదన్న వాస్తవాన్ని గ్రహించి, చిన్న జిల్లాల ఏర్పాటు ఉద్దేశ్యం నెరవేరేలాగున పని చేయటం తక్షణ కర్తవ్యం.
బూజుపట్టిన బ్రిటిష్ కాలంనాటి వ్యవస్థ
ప్రస్తుతం మనదేశంలో వేళ్ళూనుకున్న పాలనా వ్యవస్థ బ్రిటీషు వారి కాలంలో రూపొందింది. ఒకవిధంగా చెప్పాలంటే శిస్తువసూలు వ్యవస్థ అది .దానికి కాల దోషం పట్టటం సహజం. 1984లో మొదలైన గ్రామ పరిపాలనా, మండలీకరణ వంటి విప్లవాత్మక నిర్ణయాలు నేటికి చిన్నజిల్లాల ఏర్పాటు తో రూపాంతరం చెందటం ఆహ్వానించదగ్గ పరిణా మం.ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పునర్వ వ్యస్థీకరణ పాలన. గ్రామాలు పాలనా వ్యవస్థ ఆయు వుపట్టులు. పునాది రాళ్ళ. గ్రామపాలన ప్రాచీన కాలం నుండి గ్రామాధికారులు చూస్తుండేవారు. వంశపారంపర్య గ్రామాధి కార్ల వ్యవస్థ రద్దై ముప్పై ఏళ్ళుదాటినా,పటిష్టమైన, ప్రత్యా మ్నాయ గ్రామపా లనాయంత్రాంగం లేదు. ఉదా హరణకు మాలీ పటేళ్ళ వ్యవస్థ. మద్రాసు ప్రెసిడెన్సీ పాలనకు భిన్నంగా,తెలంగాణా ప్రాంతంలో పోలీస్ పటేల్ (గ్రామమునసబ్),పట్వారీ(గ్రామకరణం), మాలీ పటేల్ గ్రామాధికార్లుగా వుండేవారు. మాలీ పటేళ్ళ అజమాయిషీలో గ్రామీణ సాగు నీటి వనరులుగ్రా మస్థులు సమష్టి కృషితో నిర్వహింపబడేవి.
సుపరిపాలన దృష్ట్యా వ్యవస్థలో మార్పులు
సుపరిపాలన దృష్ట్యా, ఇప్పటివరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు, మండల వ్యవస్థలో మార్పులు చోటుచేసుకున్నాయి,కానీ గ్రామాల పునర్వ వ్యవస్థీకరణ అలాగే వుండిపోయింది. ఇప్పటికీ ఎంతో పెద్ద రెవెన్యూ గ్రామాలు, వాటికి అనుబం ధంగా మజరాలు (హమ్లెట్లు) డిపాపులేటెడ్ మరి యు ఫారెస్టు గ్రామాల శివార్లు అలాగే వుండిపో యాయి. భూకమతాల సంఖ్య, విస్తీర్ణం దృష్ట్యా, పట్టేదార్ల వారిగా చిన్న చిన్న రెవెన్యూ గ్రామాలుగా విడగొడితే పాలనా సౌలభ్యం, పర్యవేక్షణ పటిష్టం కావటానికి వీలుపడుతుంది. గ్రామస్థాయిలో సర్వే సిబ్బంది నియామకం తెలంగాణా జిల్లాలో తక్షణా వసరం. మరీ ముఖ్యంగా రెవెన్యూ, ఫారెస్టు తగా దాల దృష్ట్యా. మజల్ని ప్రత్యేక రెవెన్యూ గ్రామాలుగా నోటిఫై చేయాల్సిన అవసరం పరిశీలనా యోగ్యం, సమాంతరంగా (పంచాయితీలవిభజన కూడా సబబుగా వుంటుంది. మేజర్,మైనర్,నోటిఫైడ్ అన్న బేధంలేకుండా,పరిపాలనకు అనువుగాచిన్న పంచా యితీల్ని ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసి, వాటికి మిగులు నిధులు,విధులు,తగినంత మంది సిబ్బం దిని సమకూరుస్తే సమగ్ర గ్రామీణాభివృద్ధి చేకూరు తుంది. జనాభా సాంధ్రత, పంచాయితీ విస్తీర్ణం ప్రామాణీకలుగా,చిన్న చిన్న పరిపాలనా సౌలభ్య యూనిట్లు ఈ దిశలో ఎంతో అవసరం. షెడ్యూలు కులాలు,తెగలు అవాసముంటున్న పల్లెల్ని, తండా ల్ని ప్రత్యేక గ్రామపంచాయితీలుగా ప్రకటిస్తే, పంక్తి లో చివరి వ్యక్తి వరకూ అభివృద్ధి ఫలాలు చేరాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లే. ఇప్పటికే ఈదిశలో తెలంగాణా ప్రభుత్వం చొరవతీసికోవటం ఆహ్వా నించదగ్గ పరిణామం.
అట్టడుగు ప్రజల అభివృద్ధికి వీలు
చిన్న జిల్లాలు సామాజిక పరివర్తనకు సాధనాలు కావాలి. గతంలో తెలంగాణా ప్రాంతంలో నెల కొన్న అనిశ్చిత,సాంఘిక,ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, చిన్న జిల్లాలు బడుగు, బలహీన వర్గాల ప్రయో జనాలు కాపాడటంలో అట్టడుగు ప్రజల బాగోగుల పట్ల శ్రద్ద వహించటానికి వీలవుతుంది కూడా. తనను కాపాడే ప్రభుత్వ యంత్రాంగం తన చెంతనే వుందన్న భరోసా సామాన్యుడికి ఎంతో ఊరట నిస్తుంది.అదే వరవడిని జిల్లాలో కొనసాగిస్తే మం చిది. అలాగే జిల్లా అధికార్లందరూ కేంద్ర కార్యాల యాల్లో వుండే పని చేయాల్సిన అగత్యమూ లేదు. వారి పర్యవేక్షణ, నిపుణత ఏఏమండలాల్లో కావల్సి వస్తుందో, ఆ సామీప్యంలోనే వారి హెడ్‌క్వార్టర్ వుంటే మంచిది. ప్రయాస, దుబారా ఖర్చులు వుం డవు. అవసరమైతే రెండు మూడు జిల్లాలకు కలిపి ఒకే అధికారిని నియమించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తే బాగు. క్షేత్రస్థాయి అనుభవం బట్టి, నేను జిల్లా అధికారిగావున్న రోజుల్లో కొన్ని శాఖల జిల్లా అధికార్ల ముఖాలు కూడా చూసివుండను. ఉదాహ రణకు, కమర్షియల్ ట్యాక్స్,రిజిస్ట్రేషన్, మైనింగ్, జియాలజి,దేవాదాయశాఖ,నీటివనరులశాఖ ప్రత్యేక డివిజన్ల అధికార్ల వునికే జనానికి ఎరుకే వుండదు.
మెరికల్లాంటి గ్రూప్1,2 అధికారులు
సిబ్బంది కొరత,నిపుణత లోపించటం వంటి పలు కులు పాలనావ్యవస్థలోపరిపాటి.ఎప్పుడూ వుండేదే. అవసరం వున్న శాఖల్లో సిబ్బంది కరువు. అవగా హన లేని సంస్థల్లో పనిలేక యాతన పడేవాళ్ళు ఎందరో.మరీ ముఖ్యంగా జిల్లా, డివిజన్ల స్థాయిల్లో, పబ్లిక్ సర్వీసు కమీషన్‌ద్వారానియామకమైన సిబ్బం ది, అధికార్లు మెరికల్లాంటివారు. అఖిల భారతీయ సర్వీసు అధికార్లకు ఏమాత్రం తీసిపోరు కొన్ని సంద ర్భాల్లో.మరీ ముఖ్యంగా గ్రూప్-1,2సర్వీసు అధి కార్లు. రిక్రూట్ అయినప్పటినుండి అదేశాఖలో మగ్గిపోవాల్సినదుస్థితి.అలాగాకుండా ఓపదేళ్ళు ఆయాశాఖల్లో పనిచేసి నిపుణతను సంతరించుకున్న తరువాత జనరల్ పూల్‌లోకి లాక్కొని వారి సేవలు అన్ని శాఖలకు విస్తరింపచేస్తే మంచిది. ఆ క్రమంలోనే స్టేట్ ఆడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకు చెందిన వారిగా పరిగణించి (గతంలో హైద్రాబాద్ సివిల్ సర్వీసు, ఆంధ్రప్రదేశ్ ఆడ్మినిస్ట్రేటివ్ సర్వీసు ల్లాగా), వాళ్ళ నుండే ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్ వంటి అఖిల భారతీయ సర్వీసులోకి ఎంపిక జరిగేలా చూడాలి. దీంతో ఒక సర్వీసు గొప్పది. మరొక సర్వీసు చిన్నది అన్న భావన తాజాగా పోతుంది.
పాలనా పద్ధతులు మారాలి
చిన్న జిల్లాల ఏర్పాటుతో పాటు పాలనా పరమైన పద్ధతులు, సంప్రదాయాలు, మ్యాన్యువల్స్ మార్చా ల్సిన అవసరం ప్రభుత్వం ఈపాటికే గుర్తించి వుం టుంది. ఏప్రతిపాదనలు వచ్చినా,ఏదరఖాస్తు వచ్చినా రొటీన్ గా ‘తగుచర్య నిమిత్తం’, పరిశీల నార్థం (ప్లీజ్ ఎగ్జామిన్) అని అంటూ విలువైన సమయాన్ని,శక్తి యుక్తుల్ని వృధా చేయరాదు. అలాగే కిందిస్థాయి నుండి నివేదికలు కోరటం కూడా తప్పే. ఉదాహరణకు ఏదరఖాస్తు దారుడైనా క్రింది స్థాయిలో పని కావటం లేదని ఫిర్యాదు చేస్తే, నా పైనా,నాపని తీరు పట్లపై అధికార్లకు కంప్లైంట్ చేస్తావా అని కక్షకట్టిన సందర్భాలు ఎవరివల్ల తన పని కావటం లేదో,అదే అధికారికి ఆపిర్యాదును తగు చర్య నిమిత్తం పంపటమో, నివేదిక కోరటం లో ఔన్నత్యం లేదు. ఇలాంటి సందర్భాల్లో దరఖాస్తు దారు సంబంధిత అధికార్లను సంప్ర దించినపుడు, ‘‘నన్ను కాదని పై అధికార్ల దగ్గరికి పోయావు కదా! అక్కడే నీ పని చేయించుకోపో’’ అంటూ వ్యంగంగా వ్యవహరించటం కూడా కద్దు. ఈఅడ్మినిస్ట్రేటివ్ పద్ధతులు అవమానీయం.ఆక్షేపణీయం.
విప్లవాత్మక సంస్థాగత మార్పులు అవసరం
తెలంగాణాలో పట్టణాల సంఖ్య అతి తక్కువ అని మనకు తెలిసిందే. ఇప్పటికే నలభై శాతం జనాభా పట్టణాల్లో నగరాల్లో నివాసమున్నట్లుగా గణాం కాలు సూచిస్తున్నాయి. రాబోయే పది సంవత్సరాల్లో జనసాంధ్రత యాభైశాతానికి మించిపోయే అంచ నాలు. ఉదాహరణకు 38ఏళ్ళ క్రితం(1978)లో ఏర్పాటైన కొత్త జిల్లా రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్ మహానగరం చుట్టూ వలయంగా, నాడు 6లక్షల జనాభాతో,6అసెంబ్లీ నియోజక వర్గాలతో ప్రారం భమైన జిల్లానేడు 14అసెంబ్లీ నియోజక వర్గాలతో 52లక్షలజనాభాతో మరో మహనగరానికి తెరలే పింది. అలాగే ఇప్పుడు ఏర్పాటైన కొత్త మండల, డివిజన్,జిల్లాకేంద్రాలురాబోయే రోజుల్లో పట్టణా కృతుల్ని సంతరించుకునే అవకాశం వుంది.
ఈ గ్రోత్ సెంటర్ల క్రమబద్దీకరణకు ఇప్పటి నుండే పునాదులు వెయ్యాలి. ప్రణాళికలు తయారు చేసు కోవాలి. ఈ దిశలో టౌన్ మరియు కంట్రీ ప్లానింగు శాఖను అన్ని గ్రామ,మండల,జిల్లా కేంద్రాల పరిధి లో విస్తరించాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈశాఖ రియల్ ఎస్టేటు, డెవల పర్లకే కాకుండ, సామాన్యప్రజానీకానికి ఉపయోగ పడేలా రూపాం తరం చెందాలి. ఈశాఖ ఆధ్వ ర్యంలో ప్రణాళిక బద్దమైన నమూనాలకు లోబడి, గ్రామ, మునిసిపల్, పట్టణాభివృద్ధి సంస్థలు మాస్టర్ ప్లాన్లు సవరించు కోవవాలి. గతంలో ఈ నమూ నాలు కాగితాలకే పరిమితం కావటం కద్దు. ఈది శలో విప్లవాత్మ కమైన సంస్థాగత మార్పులు అవ సరం. లేదంటే భవిష్యత్తులో వగచాల్సి వస్తుంది. ఇపుడు జంటనగ రాలు ఎదుర్కొంటున్న రుగ్మతులు అధిగమించాల్సిన అవసరం పట్టణీకరణ దిశలో ఎంతైనా వుంది.
తెలంగాణ జిల్లాలు పసికూనలు
రెండున్నర ఏళ్ళు కూడా నిండని పసికూనలు తెలం గాణా కొత్త జిల్లాలు. ముప్పై ఒక్క చేతులతో (జిల్లాల సంఖ్యాపరంగా) పొదివి పట్టుకొని, ఉద్యమ స్ఫూర్తి తో సాధించుకున్న రాష్ట్రాన్ని, సవరించుకుని సాదు కోవాల్సిన తరుణమిది అంటూ ప్రభుత్వాది నేత పలు సందర్భాల్లో గుర్తు చేయటం గమనార్హం. ఇటీవలే సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) వెల్లడిరచిన మానవ వనరుల అభివృద్ధి సూచికలు (హెచ్.డి.ఐ)గుర్తించి రాష్ట్రప్రభుత్వ పని తీరును మెరుగు పర్చాల్సి వుంటుంది. గతంలో వున్న పదిజిల్లాలో,ఏడు జిల్లాలు పారిశ్ర మీకరణలో శరవేగంగా ముందుకు దూసుకుపోతు న్నాయి. వ్యవసాయపరంగా మూడుజిల్లాలు ముందుడగులో వున్నాయి. అక్షరాస్యత,అరోగ్య పోషణాపరంగా ఇంకా సాధించాల్సింది ఎంతైనా వుంది.
ఐటీ చిరునామా రంగారెడ్డి జిల్లా
విభజించిన జిల్లాలపరంగా చూస్తే, ఐ.టి.రంగా నికి రంగారెడ్డి జిల్లా చిరునామా. పారిశ్రామికంగా మేడ్చెల్, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాలకు పెద్దపీట వేయాల్సి వుంటుంది. విత్తన క్షేత్రంగా కరీంనగర్, సాగునీటిపరంగా ఖమ్మం నేతన్నల జిల్లాగా సిరి సిల్ల,అడవుల జిల్లాగా అదిలాబాద్,సాంస్కృతిక వార సత్వ జిల్లాలుగా వరంగల్,యాదాద్రి,భద్రాద్రి, జగి త్యాల జిల్లాలు మచ్చుకుకొన్ని. సాంస్కృతిక వారసత్వ పరంగా కూడా తెలంగాణాకు ప్రత్యేకం కృష్ణా, గోదావరి లాంటి పవిత్ర నదీమ తల్లుల నట్టనడుమ మైదాన ప్రాంతంగా ఆవరించిన గడ్డ, పాలపిట్ట, తంగేడు చెట్టు జింక ప్రభుత్వ చిహ్నలు ఈ ప్రాంతపు ఆచార, వ్యవహారాలకు ప్రతిబింబం. బతుకునే దేవతగా చేసి పూజించే పుణ్య భూమి. అదే బతు కమ్మ వేడుక.తెలంగాణాకే ప్రత్యేక ఆకర్షణ.
రచయిత: – డా.దాసరి శ్రీనివాసులు ఐ.ఎ.యస్., సంచారి ఉద్యమ కార్యకర్త.