చిన్నారుల చిదిమేసిన కలుషిత ఆహారం

అనాథాశ్రమంలో ఫుడ్‌పాయిజన్.. ముగ్గురు చిన్నారులు మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన పాఠశాల విద్యార్థుల్లో ముగ్గురు మృతి చెందారు. రెండు రోజుల క్రితం అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథాశ్రయంలో సమోసా తిన్న విద్యార్థులంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చిన్నారులను వెంటనే ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందజేస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో సోమవారం ఉదయం ముగ్గురు చిన్నారు చనిపోయారని తెలిసింది.. మృతి చెందిన విద్యార్థులు భవాని,జాషువా, శ్రద్ధగా గుర్తించారు. మృతులు ముగ్గురు కొయ్యూరు మండలానికి చెందిన వారు. జరిగిన ఘటనపై డిప్యూటీ డీఈఓ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. చిన్నారులను వెంటనే ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందజేస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో సోమవారం ఉదయం ముగ్గురు చిన్నారు చనిపోయారని తెలిసింది.. మృతి చెందిన విద్యార్థులు భవాని, జాషువా, శ్రద్ధగా గుర్తించారు. మృతులు ముగ్గురు కొయ్యూరు మండలానికి చెందిన వారు. జరిగిన ఘటనపై డిప్యూటీ డీఈఓ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శ.
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందు తున్న చిన్నారులను రాష్ట్ర హోం మంత్రి వంగల పూడి అనిత, స్థానిక ఎంపీ శ్రీభరత్, ఉత్తర ఎమ్మెల్సీ విష్ణుకుమార్ రాజు,తెదేపా జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ,భాజపా నేత మాధవ్ ఇతర నేతలు, అధికారు లతో కలిసి పరామర్శించారు.వారి ఆరోగ్య పరిస్థి తిని తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి వారి లో మనోధైర్యం నింపారు.ఆమె వెంట జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, కేజీహెచ్ సూపరెం టెండెంట్ కె.శివానంద,ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ ఇతర అధికారులు.అస్వస్థతకుగురైన పిల్లలకు కేజీ హెచ్లో మెరుగైన వైద్యం బాధితులను జిల్లాకలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పరామర్శించించారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్నం అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన చిన్నారులకు కేజీహెచ్లో మెరుగై న వైద్యం అందుతోందని, వైద్యులు అన్ని రకాలుగా పర్యవేక్షిస్తున్నారని విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. అనకాపల్లి ఏరియా ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం చిన్నారులను కేజీహెచ్‌కు తీసు కురాగా కలెక్టర్ వెళ్లి పరామర్శించారు.చిన్నా రులతో,వారి తల్లిదం డ్రులతో మాట్లాడారు. వారి లో మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. మొ త్తం14మంది పిల్లలు అనకాపల్లి నుంచి వచ్చారని వారందరికీ ప్రస్తుతం పిల్లల వార్డులో వైద్య నిపు ణుల పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందుతోం దని పేర్కొన్నారు.అందరి పరిస్థితీ బాగానే ఉందని భయపడాల్సిన పని లేదని అన్నారు.
ఆదమరిస్తే ఆహారమే విషం..
అభం..శుభం తెలియని ముగ్గురు గిరిజన బిడ్డలు కలుషిత ఆహారం తిని ప్రాణాలు పొగొట్టుకున్నారు. మరో 35మందికి పైగా పిల్లలు త్రీవ అస్వస్థతకు గురై ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసప ట్నంలో ఇటీవల జరిగిన ఈవిషాద ఘటన రాష్ట్రం లో కలకలం రేపుతోంది.ఈనేపథ్యంలో సంబంధిత యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.అయితే కేవలం వసతి గృహాల్లోనే కాదు.. నగరంలోని చాలా హోటళ్లు,బేకరీలు,ఇతర ఫాస్టు ఫడ్ సెంట్రల్లో కలుషిత ఆహారాలు,తినబండారాలు యధ్ఛేగా విక్రయాలు సాగుతున్నాయి.దీనిపై ఫుడ్ సెప్టీ యంత్రాంగం తూతూ మంత్రంగా చోదాలు చేస్తూ చోధ్యం చేస్తోంది.
ఆకలి రుచి ఎరగదు..నిద్ర సుఖమెరగ దంటారు పెద్దలు.మహానగరంలోని సిటిజన్ల ఉరకులు పరు గుల జీవితంలో సమయానికి దొరికింది.ఏది పడితే అదితినేస్తున్నారు.వాటిలో ఫాస్ట్ ఫుడ్‌తోపాటు అనేక రకాల ఆహార పదార్ధాలు ఉంటున్నాయి.అయితే కొన్ని ఆహారపు అలవాట్లవల్ల కొన్నిసార్లు అనా రోగ్యం బారిన పడే అవకాశం లేకపోలేదు. శరీరా నికి పడని ఆహారం తీసుకోవడం వల్ల ఫుడ్ పాయి జనింగ్ అయ్యే ప్రమాదం ఉంది.ఈ క్రమంలో వాంతులు,విరేచనాలు,కడుపునొప్పి,మంట, గ్యాస్ట్రి క్ సమస్యలు లాంటివి తలెత్తుతున్నాయి. అంతే కాకుండా కొన్ని సమయాల్లో ప్రాణా పయస్థితికి తీసుకువస్తూన్నాయి.
ఆకర్షణ వెనుక..విషాదం..
నగరంలో నోరూరించే వాసన,ఆకర్షించే రంగులు. ఇంకేముంది చికెన్,మటన్,చేపలు కనిపిస్తే చాలు లొట్టలేసుకుంటూ తింటాం.బిర్యానీ ప్రేమికులు ఇంకాస్త ఎక్కువగా ఆరగిస్తున్నారు.కానీ హోటల్ ల్లో తిన్నపాపానికి పొద్దున్నే ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది.రోజురొజుకూ నగరంలో ఫుడ్ పాయిజి నింగ్(విషాహారం)కేసులు నమోదువుతూనే ఉన్నా యి. కానీ కొన్ని భయటపడుతున్నాయి. మరి కొన్ని మామూళ్లు చాటును దాగిపోతున్నాయి. హోటళ్ల లో వాడుతున్న నాసిరకం ఆహారం పదార్ధాల ముడి సరుకులు,అపరిశుభ్ర వాతావరణం,సరైన నీళ్లు వాడకపోవడం,ఎక్కువరోజులు నిల్వ ఉంచిన పదార్ధాలు వండటం వంటి కారణాలతో ఫుడ్ పాయిజనింగ్ కేసులు తీవ్రమవుతున్నాయి.
విషాహారానికి ప్రధాన కారణాలు ఇవే..
ఆహార పదార్ధాలను సరిగా శుభ్రం చేయకుండా వినియోగించడం.సరైన మోతాదులో ఉడికించక పోవడం.మాసాహారాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం,వాడిన నూనెలు మళ్లీమళ్లీ వినియోగిం చడం,ఆకర్షణకోసం రకరకాలరంగులు వేసి వడ్డిం చడం,బాగాచల్లారిపోయిన పదార్ధాలను వడ్డిం చడం,ఎక్కువ రోజులునిల్వ ఉంచిన చీజ్, బటర్ లలో బ్యాక్టీరియా ఉండటం,కలుషిత నీళ్లు వాడడం ద్వారా ఎక్కువ బ్యాక్టీరియావచ్చే అవకాశం ఉంది.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…
మాంసాహారం గానీ,కూరగాయలుగానీ ఎక్కువ సేపు ఉడికించి తినాలి.వీలైనంత వరకూ నిల్వ ఉంచకుండా ఏరోజు ఆహారం ఆరోజే తినాలి.కాచి చల్లార్చిని నీళ్లును తాగడం మంచిది.ఒకసారి వేడిచేసిన నూనెను మళ్లీమళ్లీ వాడకుండా చూసు కోవాలి.ప్రధానంగా మాంసాహారం అప్పటికప్పుడు తినడం మంచిది.పురుగు మందుల వాడకం ఎక్కువైన నేపథ్యంలో ఆకుకూరలుగానీ, కూరగా యలు గానీ వేడినీటిలో ఉప్పువేసి ఆరగంట సేపు నానబెట్టాక వండటం మంచిది.వాంతులు, విరేచ నాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించగానే ఓఆర్‌ఎస్(ఓరల్ రీ హైడ్రేషన్ సొల్యూషన్)ఫౌడర్ నీళ్లలో కలిపి తాగాలి.కాచి చల్లార్చిన నీళ్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం,కొబ్బరినీళ్లు,మజ్జిగ వంటివి తీసుకోవాలి.
నియంణ్ర ఎక్కడా..?
స్ట్రీట్ ఫుడ్,బీచ్ రోడ్డు ఫుడ్.. హోటళ్ల లో వండుతున్న ఆహారంపై నియంత్రణే లేదు. ప్రధానంగా మాసాహారం,చికెన్,మటన్,చేపలు, రొయ్యలు వంటి పదార్ధాలు నాలుగైదు రోజులు కూడా నిల్వ ఉంచి వినియోగదారులకు పెడుతు న్నారు.దీనివల్ల వినియోగదారుడు త్రీవంగా నష్టపో తున్నారు.చిన్నచిన్న బడ్డీకొట్టు అటుంచితే ఓ మోస్తరు మెస్‌లు,రెస్టారెంట్‌లకు కూడా లైసెన్సులు లేని పరిస్థితి.ఏళ్లతరబడి ఇన్‌స్పెక్టర్లు చూసీ చూడ నట్లు వెళుతున్నారు.ఫిర్యాదులు వచ్చినా పట్టించు కోలేదు.ఇక రోడ్లమీద,బీచ్‌లుఎదురుగా అమ్మే ఆహారం కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది.గతేడాది అక్టో బర్‌లో మూలగాఢ గ్రామానికి చెందిన 13మంది యవకులు గాజువాక సమీపంలో ఓహోట్‌లో మండీ బిర్యానీ తిని ఫుడ్ పాయిజన్‌కు గురై తీవ్ర అస్వస్థతకు గురైనఘటన అప్పట్లో కలకలం రేపింది.ఎక్కడో ఒకదిక్కున ఫుడ్ పాయిజనింగ్ కేసులు బయట పడితేనే తప్పా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్,ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తూన్నారే తప్పా.క్రమంగా తనిఖీలు చేసిన దాఖలాలు కన్పించలేదనే విమర్శలు వినిపి స్తున్నాయి.
నగర హోటళ్లుల్లో దారుణాలు..
కైలాసపట్నం ఫుడ్ పాయిజనింగ్ ఘటనతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్,ఫుడ్ సేఫ్టీ అధికార యంత్రాంగం నగరంలో చేపడుతున్న మెరుపు దాడుల్లో దిగ్భ్రాంతి కలిగించే అంశాలు వెలుగు లోకి వచ్చాయి.ఆర్కే బీచ్‌లోని మత్స్యదర్శినివద్ద ఉన్న ఓహోటల్‌లో నాణ్యత లేని ఆహారం విని యోగదారులకు రోజుల తరబడి నిల్వ ఉంచిన బిర్యానీ,చికెన్,మటన్,చేప కూరలు నిల్వ ఉంచిన ఆహార పదార్ధాలను వడ్డిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.డాబాగార్డెన్స్ దగ్గర ఉన్న ఓమెస్‌లో చికెన్,ఫిష్‌కర్రీతో పాటు వెజ్ కర్రీలు కూడా రెండు, మూడు రోజుల కిందట వండి ఫ్రీజర్లు,ఫ్రిజ్‌లో నిల్వ ఉంచినట్లు గుర్తించారు.అంతేకాదు ముందు రోజు వండిన అన్నాన్ని వినియోగదారు లకువడ్డిం చేందుకు రెడీచేసే సమయంలో తనిఖీలు చేప ట్టారు. ఈపదార్థాలు రంగు,రుచి కోసం కూరల్లో కొన్నిరకాల పౌడర్లను కలుపుతున్నట్లు గుర్తించారు. ఇలా పాడైపోయిన పదార్థాలను విక్రయిస్తున్నం దుకు హోటల్‌కురూ.పది వేలు జరిమానా విధిం చారు.- (జి.ఎ.సునీల్ కుమార్)