చిత్తడి నేలలు ప్రకృతి పరిరక్షణకు నెలవులు

సముద్రం,నది ఇతర నీటి వనరులు కలిగిన తీర పాంతాల్లో తక్కువ లోతు ఉండి ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండే భూములను చిత్తడి నేలలు అంటారు. పెద్దనదులు లేదా సరస్సుల వెంబడి మంచినీటి చిత్తడి నేలలు ఏర్పడతాయి.. అతిపెద్ద సరస్సుగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సును చిత్తడి నేలలు కలిగిన భూమిగా గుర్తించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోక పోతే భావితరాలకు చిత్తడి నేలలు ఉండవు. ఇప్పటికే పలురకాల పక్షులు,జంతువులు, జీవ జాతులు అంతరించిపోతున్నాయి. కొన్నిరకాల జంతువులు, పక్షులు చూడా లంటే జూపార్కు లోనో, ఛానల్స్‌లోనే చూడవలసి వస్తుందని, ఇదే పరిస్ధితి కొన సాగితే భవిష్యత్తులో చిత్తడినేలలు కనుమరు గవు తాయని పర్యావరణ నిపు ణులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. మానవాళి మను గడకు చిత్తడి నేలలు ఎంతో దోహద పడతాయి. సృష్టిలో సహజసిద్ధంగా ఏర్పడిన వనరులను కాపాడుకుంటే భావితరాల ప్రజలకు వాటి ఆవశ్య కత, స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించ గలుగు తాం. సృష్టిలో ఉన్న అనంతకోటి జీవరాశుల్లో 40 శాతం చిత్తడి నేలల్లోనే ఉంటాయి. పక్షులకు ఈ నెలల్లో ఆహారం సమృద్ధిగా లభిస్తుంది. వీటి ప్రాముఖ్యతను గుర్తించి వివిధ దేశాలు ‘ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం’ నిర్వహిస్తున్నాయి.
భూగోళంపై జీవరాశి మనుగడకు చిత్తడి నేలలు అత్యంత కీలకం. భూమికి ఊపిరితిత్తులుగా పని చేస్తూ ప్రకృతి సమతుల్యతకు ఇవి ఎంతగానో దోహదపడతాయి.దురదృష్టవశాత్తు చిత్తడి నేలల ప్రాధాన్యాన్ని శతాబ్దాలుగా గుర్తించకపోవడం వల్ల, అవి శరవేగంగా అంతరించి పోతున్నాయి. జీవుల మనుగడకు, పర్యావరణ సమతుల్యతకు చిత్తడి నేలలు ఎంతో అవసరం. ప్రపంచవ్యాప్తంగా గడచిన వందేళ్లలో ఇవి64శాతంమేర అంత రించి పోయాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.చిత్తడి నేలల ప్రాధాన్యాన్ని గుర్తించడంతో పాటు వాటి పరిరక్షణ,అభివృద్ధి కోసం కృషి చేయాలని ఇరా న్లోని రామ్సార్లో 1971లో ప్రపంచ దేశాల మధ్య ఒప్పందం కుదిరి ఆతరవాత నుంచి ఏటా ఫిబ్రవరి రెండో తేదీన చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. మానవాళికి చిత్తడి నేలల వల్ల కలిగే ప్రయోజనాల పట్ల అవగాహన కల్పించడం ఈఏడాది లక్ష్యం.
ఎన్నో ప్రయోజనాలు..
సముద్ర,నదీతీర ప్రాంతాల్లో ఏడాది పొడవునా నీటి వనరులతో నిండి ఉండే ప్రదేశాలను చిత్తడి నేలలుగా పరిగణిస్తారు. మంచినీటితో పాటు ఉప్పు నీటి సరస్సులు,తంపర,బీల భూములు,పగడపు దిబ్బలు, మడ అడవులు తదితర 19రకాల ప్రాంతాలు చిత్తడి నేలల కిందకు వస్తాయి. నదీ తీరాల్లోని చిత్తడి నేలలు ప్రవాహ ఉద్ధృతిని,అలల తాకిడిని అడ్డుకుని తుపానులు, వరదల ప్రభావాని తగ్గిస్తాయి. పర్యావరణ మార్పుల కారణంగా వాయు దుష్ప్రభావాలను గణనీయంగా నియం త్రిస్తాయి.అరుదైన మత్స్య,వృక్షజాతుల జీవనానికి దోహదపడటంతోపాటు దేశ,విదేశీ వలస పక్షులకు ఆశ్రయమిస్తాయి.ఈ నేలలు పరిసర ప్రాంతాల్లోని నీటి నాణ్యతను పెంచడమే కాదు,కాలుష్య తీవ్రత ను తగ్గించడంలోనూ కీలకమవుతున్నాయి.చిత్తడి నేలలు సాగు,తాగునీరు అందిస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది ఆహార భద్రతకు భరోసా కల్పిస్తున్నాయి.ఈ నేలల్లో లభించే చేపల్లో పోష కాలు అధికంగా ఉంటున్నాయని పలు పరిశోధ నలు తేల్చాయి.చూపరులను విశేషంగా ఆకట్టు కుంటున్న చిత్తడి నేలలు-పర్యటక ఆదా యాన్ని గణనీయంగా పెంచుతున్నాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,400 ప్రదేశాలను రామ్సార్ ప్రమాణాల ప్రకారం చిత్తడి నేలలుగా గుర్తించారు.వీటిలో అత్యధికంగా 175 వరకు యూకేలోనే ఉన్నాయి.142 ప్రదేశాలతో మెక్సికో రెండో స్థానాన్ని ఆక్రమించింది.భారత్ 1982లో రామ్సార్ ఒప్పందంలో చేరి చిత్తడి నేల గుర్తింపును మొదలుపెట్టింది.1982-2013 మధ్య కాలంలో 26ప్రదేశాలను,2014-23 మధ్య మరో 49 క్షేత్రాలను చిత్తడి నేలలుగా గుర్తించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 75 చోట్ల13.30లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రామ్సార్ గుర్తింపు పొందిన చిత్తడి నేలలు విస్తరించి ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు,పులికాట్ సరస్సులు ఇలా గుర్తింపు పొంది నవే.రామ్సార్ ఒప్పంద ప్రమాణాలకు అను గుణంగా ఉన్నప్పటికీ,దేశంలోని అనేక చిత్తడి నేలలను గుర్తించడంలో తీవ్రతాత్సారం జరుగు తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోయంబత్తూరుకు చెందిన సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ, నేచురల్ హిస్టరీ (సాకాన్) సంస్థ రెండు దశాబ్దాల క్రితమే దేశంలోని 700 ప్రదేశా లకు చిత్తడి నేలలుగా గుర్తింపునిచ్చి పరిరక్షించా లని సూచించింది.వాటిలో 200 ప్రాంతాలను రామ్సార్ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ జాబితాలో చేర్చాలని సిఫార్సు చేసింది. కోరింగ అభయారణ్యం, పాకాల చెరువు, కృష్ణా నదీ పరీ వాహక ప్రాంతాలను ఆ జాబితాలో చేర్చాల్సినవి గా సాకాన్ పేర్కొంది.సోంపేట,నౌపడ, వాకల పూడి బద్వేలు,కంభం,విశాఖపట్నం జిల్లాలోని కొండక్లర్ల్ ఆవ,తిమ్మరాజు చెరువు ప్రాంతాలు చిత్తడి నేలలేనని,వాటి పరిరక్షణకు చర్యలు అత్యవసరమని సూచించింది.కొల్లేరు,కొండకర్ల ఆవతో పాటు మరికొన్ని ప్రదేశాలను అటవీశాఖ చిత్తడి నేలలుగా గుర్తించినప్పటికీ,వాటి సంరక్ష ణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడంలేదు. ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సుగా గుర్తిం పు పొందిన కొల్లేరు పరిధిలో వేల ఎకరాల చిత్తడి నేలలు ఆక్రమణలకు,విధ్వంసానికి గురయ్యాయి. దాన్ని అడ్డుకుని,అక్కడి నేలలను పునరు ద్ధరించ డంలో ప్రభుత్వ వ్యవస్థలు ఘోరంగా విఫలమవుతు న్నాయి.సుప్రీంకోర్టు ఇటీవలే నాగ్పుర్లోని ఫుటాలా సరస్సు చుట్టూ కార్యకలాపాలను నిలిపివేసింది. చిత్తడి నేలగా గుర్తించిన ఈ ప్రదేశాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం మానవ నిర్మితంగా పేర్కొన్నప్పటికీ, ప్రకృతి వ్యవస్థల వాస్తవరూపాన్ని మార్చవద్దంటూ సర్వోన్నత న్యాయస్థానం వారించింది.జాతీయ హరిత ట్రైబ్యునల్,కాగ్ వంటివి సైతం చిత్తడి నేలల విధ్వంసాన్ని నిలువరించాలని గతంలో సూచించాయి.జాతీయ అటవీ కమిషన్ 2006 లోనే చిత్తడి నేలల పరిరక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని కేంద్రానికి నివేదించింది. సుమారు దశాబ్ద కాలం తరవాత కేంద్రం 2017 లో చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణకు మార్గదర్శ కాలను తీసుకువచ్చినప్పటికీ, అవేమీ క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కావడంలేదన్న విమర్శలు న్నాయి.
బహుముఖ చర్యలు కీలకం…
కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్రప్రభు త్వాలు గుర్తింపు పొందిన చిత్తడి నేలల సమాచా రాన్ని పౌరులకు అందుబాటులో ఉంచాలి. పర్యా వరణ,అటవీ, వన్యప్రాణి, కోస్తా నియంత్రణ చట్టాలను వర్తింపజేయడంతో పాటు వ్యర్థ రసాయనాలు, విషపూరిత జలాలను చిత్తడి నేలల్లో పారబోయకుండా నిఘాను తీవ్రతరం చేయాలి. కఠిన శిక్షలు,భారీ జరిమానాలు విధించడం ద్వారా ఈ నేలల ఆక్రమణలను, విధ్వంసాన్ని అడ్డుకోవాలి.చిత్తడి నేలల పరిరక్షణ కోసం నిరుడు కేంద్రం ప్రకటించిన ‘అమృత్ ధరోహర్’ పథకాన్ని రామ్సార్ గుర్తింపు ఉన్న ప్రదేశాలకే పరిమితం చేశారు.మిగతా చిత్తడి నేలలకూ వర్తింపజేయాలి. పర్యాటక, అటవీ, పర్యావరణ శాఖలు సంయు క్తంగా చిత్తడి నేలల పరిరక్షణకు జిల్లాస్థాయి ప్రణాళికలను రూపొందించి స్థానిక సమూహాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో సమర్థంగా అమలుపరచాలి. ఇటువంటి చర్యలు కొరవడితే-చిత్తడి నేలల విధ్వంసం నిరాటం కంగా సాగు తూనే ఉంటుంది!
కొరవడిన సంకల్పం
చిత్తడి నేలల విధ్వంసం మూలంగా పర్యావరణ మార్పుల దుష్పరిణామాలు అధికమవుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వీటి పరి రక్షణకు పటిష్ఠ కార్యాచరణను రూపొందించి అమలుపరచాలని కోపెన్హాగెన్ వంటి ప్రపంచ స్థాయి సమావేశాలెన్నో తీర్మానాలు చేశాయి. అందుకు గట్టి సంకల్పం కొరవడటం దుర దృష్టకరం.జనాభా పెరుగుదలకు తోడు పారిశ్రా మిక అవసరాల కోసం చిత్తడి నేలలను మట్టితో కప్పి ఆక్రమించేస్తున్నారు పంటల సాగు కోసం రసాయన ఎరువులు,పురుగు మందులను విచ్చల విడిగా వినియోగిస్తున్నారు.ఆ ప్రభావంవల్ల చిత్తడి నేలలు సహజ స్వభావాన్ని కోల్పోతున్నాయి.
జల,వృక్ష సంపదకు కొల్లేరు ఆలవాలం
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొల్లేరు సరస్సు చిత్తడి నేలలకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇటువంటి నేలను, ప్రకృతిని కాపాడితే అది భవి ష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తుందని కొంతమంది గుర్తించలేకపోతున్నారు.సృష్టిలో సహజసిద్ధంగా మానవాళి మనుగడ కోసం ఏర్పడిన సంపదను విస్మరిస్తున్నారు.ప్రపంచ దేశాలుసైతం పర్యావరణాన్ని పరిరక్షించండి, ప్రకృతిని కాపాడడండి అంటూ పదేపదే హెచ్చరి స్తున్నా వాటి వినాశనానికి చేసే వికృతి చేష్టలు తగ్గలేదు.సహజసిద్ధంగా ఏర్పడిన సంపదను రక్షించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రతి ఏడాది ఫిబ్రవరి రెండో తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని (వరల్డ్ వెట్‌ల్యాండ్స్‌డే) జరుపుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపు పొందిన ఏకైక చిత్తడి నేలలు ఏలూరు జిల్లాలో విస్తరించిన 77,136 ఎకరాలు కొల్లేరు సరస్సు మాత్రమే. ఈచిత్తడి నేలలు అనేక జీవరాశులకు, పక్షులకు ఎంతో మేలు చేస్తుంటాయి. అందువల్లే ప్రపం చంలోని అనేక దేశాలకు చెందిన పక్షులు వలస వస్తున్నాయి. చిత్తడినేలలపై 1971సంవత్సరంలో ఫిబ్రవరి 2న ఇరాన్ దేశంలో రామ్‌సర్ నగరంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు.అప్పుడు సదస్సులో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రపం చంలోని 164దేశాలు చిత్తడినేలల పరిరక్షణకు ఒప్పంద సంతకాలు చేశాయి.వీటిలో భారతదేశం కూడా ఒకటిగా ఉంది.2002 సంవత్సరంలో కొల్లేరును రామ్‌సర్ సైట్‌లోనికి తీసుకున్నారు. భారతదేశంలో 21రాష్ట్రాల్లో 46 ప్రాంతాలను చిత్తడినేలలుగా గుర్తించారు.
చిత్తడి నేలల ప్రాధాన్యం
అరుదైన మొక్కలు,పక్షులు,జంతువులు,చేపలు గుడ్లు పెట్టడానికి ఈ నేలలు చాలా అనుకూలం. నీటి నాణ్యతను పెంచడంలో,కాలుష్య కారకా లను గ్రహించడంలో ఈ చిత్తడినేలలు ప్రాధాన్యత పోషిస్తాయి. మానవ తప్పిదాలతో పర్యావరణానికి చాలాహాని జరుగుతుంది. ప్రజలు వ్యవసాయ, ఆక్వా అవసరాలకు ఈ భూములను ఆక్రమిం చుకుని రసాయన ఎరువులు వాడడంవల్ల నివాస యోగ్యానికి ఈ నేలలను పూడ్చడంతో చిత్తడి నేలలు విధ్వంసానికి గురవుతున్నాయి. ప్రపంచం పరిశ్రమల కోసం ఈచిత్తడి నేలలు కేటాయించ డంతో మరింత వినాశనానికి దారితీస్తున్నాయి.
భూమికి ఊపిరితిత్తులు!
6 వేలకు పైగా చిత్తడి నేలలు నమోదయ్యాయి
చిత్తడి నేలల సంరక్షణ కోసం వ్యవసాయం మరియు అటవీ మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నేచర్ కన్జర్వేషన్ అండ్ నేషనల్ పార్క్స్‌చే నిర్వహించబడుతున్న కార్యకలాపాల గురించి సమాచారాన్ని అందజేస్తూ, మంత్రి యు మాక్లీ చిత్తడి నేలల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు, ఇవి జీవశాస్త్రపరంగా అత్యంత ఉత్పాదక పర్యా వరణ వ్యవస్థలు. రెయిన్‌ఫారెస్ట్, పర్యావరణ సమతుల్యతను నిర్ధారించడం మరియు జీవ వైవి ధ్యాన్ని సంరక్షించడం రెండిరటిలోనూ దృష్టిని ఆకర్షిస్తూ,ఈ ప్రాంతాలు అనేక విధులను కలిగి ఉన్నాయని యుమాక్లే పేర్కొన్నారు.ఈ ప్రాంతాలు భూగర్భ జలాలను పోషించడం,భూగర్భ జలాలను సమతుల్యం చేయడం, వరద నీటిని నిల్వ చేయ డం, వరదలను నియంత్రించడం,తీర ప్రాంతాల్లో సముద్రపు నీరు ప్రవేశించకుండా నిరోధించడం ద్వారా ఈప్రాంతం నీటి పాలనను క్రమబద్ధీకరి స్తుంది.2002లో చేసిన శాసన పునర్విమర్శతో చిత్తడి నేలలను నింపడం మరియు ఎండబెట్టడం నిషేధించబడిరదని మంత్రి యుమాక్లే గుర్తు చేస్తూ, ‘‘అదే సంవత్సరంలో చిత్తడి నేలల రక్షణపై నియంత్రణ అమలులోకి వచ్చింది. చిత్తడి నేలల రక్షణపై నియంత్రణ,చిత్తడి నేలల రక్షణ,ఉపయో గం,సూత్రాలు,రక్షణ మండలాల నిర్ధారణ,అమలు సూత్రాలు,రామ్‌సార్ సైట్‌ల ప్రకటన ప్రక్రియ, జాతీయ చిత్తడి నేల కమిషన్ విధులు,పని విధానా లతో ఒక ముఖ్యమైన అడుగు తీసుకోబడిరది. నిర్ణయించబడ్డాయి.‘‘నియంత్రణ ద్వారా స్థాపించ బడిన నేషనల్ వెట్‌ల్యాండ్ కమిషన్,చిత్తడి నేలలపై మరియు ప్రకృతి పరిరక్షణ పేరుతో సంబంధిత సంస్థలను కలిగి ఉన్న మన దేశంలో మొదటి కమిషన్’’సమాచారం ఇచ్చాడు. టర్కీ లోని రామ్‌సర్ కన్వెన్షన్ ద్వారా రక్షించబడిన 14 ప్రాంతాలు కాకుండా,మొత్తం 59మిలియన్ 47 వేల1హెక్టార్ల విస్తీర్ణంలో161చిత్తడి నేలలు ఉన్నా యని, వీటిలో 205 జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలు మరియు వాటిలో 120 స్థానిక ప్రాముఖ్యత కలిగినవి అని యుమాక్లే పేర్కొంది. గత 5 సంవత్సరాలలో,జనరల్ డైరెక్ట రేట్ నిర్వ హించిన అధ్యయనాలతో జాతీయ చిత్తడి నేలల జాబితా పూర్తి దశకు చేరుకుందని నేషనల్ వెట్‌ల్యాండ్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పేర్కోంది.ఈ వ్యవస్థలో జాబితా మాత్రమే కాకుండా,చిత్తడి నేలల హోదాలో ఇవ్వబడిన చిత్తడి నేల కార్యకలాపాలకు అనుమతులు కూడా ఇక్కడ నిర్వహించబడతాయి.అదనంగా, మన ప్రజలు ఇ-గవర్నమెంట్ ద్వారా చిత్తడి నేలల కోసం సులభంగా దరఖాస్తులు చేసుకోవచ్చు. 1999 నుండి రామ్‌సర్ కన్వెన్షన్‘తడి నేలల హేతుబద్ధ వినియోగం’ సూత్రం పరిధిలో మా మంత్రిత్వ శాఖ చిత్తడి నేల నిర్వహణ ప్రణాళి కలను సిద్ధం చేసింది.చిత్తడి నేల నిర్వహణ ప్రణా ళిక ఆప్రాంతం సాధారణ రక్షణ వినియోగ సూత్రాలను నిర్ణయిస్తుంది. అదనంగా, ప్రణాళి కలు చిత్తడి నేలల సమస్యలను పరిష్కరించడానికి భాగస్వామ్య విధానం మరియు అన్ని ఆసక్తి సమూ హాలకు వివిధ బాధ్యతలను అందించే కార్యకలా పాలను కలిగి ఉంటాయి.1999 నుండి జనరల్ డైరెక్టరేట్ చే వెట్ ల్యాండ్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌లు తయారు చేయబడ్డాయి. -గునపర్తి సైమన్