చింతిస్తున్న చింతపండు రైతులు
ఈ ఏడాది చింతపండు గురించి మరిచి పోవాల్సిందేనా? ఇదేపరిస్థితి కనిపిస్తే..ధరలు మరిం త ఏడిపించే అవకాశాలు కనిపిస్తు న్నాయి. చింత పండు సాగు కనుమరుగు అవు తుండడానికి కారణం ఏంటి?మద్దతుధర ఇస్తున్నా.. రైతులు ఎందుకు నో చెబుతున్నారు.
ప్రతి వంట గదిలో తప్పక ఉండా ల్సిన ఐటెమ్స్‌లో చింతపండు ఒకటి. అది లేనిదే రోజు వారీ ఏవంటా పూర్తి కాదు.. పప్పు నుంచి పులుసు వరకు.. పులిహార నుంచి కూడా వరకు అన్నింటిలోనూ చింతపండుతప్పని సరి.. దేనికైనా రుచిరావాలి అంటే చింతపండు పులుపు తగలా ల్సిందే?కానీ అలాంటి చింతపండు గురించి ఇక మరిచిపోవాల్సిందేనా?చింతపడు సాగు పూర్తిగాతగ్గిపోవడమే దానికి కారణమా..? మన్యంలో గిరిజనులకు ప్రధాన ఆదాయ వనరు చింతపండు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో కాపు లేదు.దీంతో నిరాశతప్పడం లేదు. చింత పువ్వు దశలోనే ఈదురుగాలులు,వర్షాలు అధికం గా కురవడంతో ఆ ప్రభావం పంటపై పడిరది. చాలాచోట్ల ఇదే పరిస్థితి..దీంతో సాగుపై గిరిజన రైతుల్లో ఆశలు సన్నగిల్లాయి. ఆశించిన స్థాయిలో జీడిపంట లేకపోగా,చింతదిగుబడి కూడా అం తంతమాత్రంగానే ఉంటోంది. అందుకే దాని మీద ఆధారపడిన వారికి ఈ ఏడాది నిరాశే తప్ప లేదు. వాస్తవంగా ఏటా జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం,సాలూరు,కొమరాడ,పాచిపెంట ప్రాం తాల్లో5 వేల క్వింటాళ్లు,సీతంపేట మన్యంలో ఏటా రెండు వేల క్వింటాళ్ల వరకు చింతపండు దిగుబడి వస్తుంది. సాధారణంగా మన్యంలో చింతపండుకు మంచి డిమాండ్ ఉంది. మైదాన ప్రాంత వాసులు కూడా భారీగా కొనుగోలు చేస్తుంటారు. జీసీసీకి కూడా ప్రధాన ఆదాయం చింతపండు కొనుగోలు ద్వారానే వస్తుంది. అయితే గత ఏడాది జీసీసీలో చింతపండు నిల్వలు ఎక్కువగా ఉండడంతో కొను గోలుకు మొగ్గు చూపలేదు. 2022లో కిలో చింత పండు మద్దతు ధర 36గా నిర్ణయించారు. గత ఏడాది నిల్వలు ఉండడంతో మద్దతు ధరను 32. 50కు తగ్గించారు. ఆ ధరకు కూడా గిరిజనుల నుంచి చింతపండును కొనుగోలు చేయలేదు. దీంతో గిరిజనులు మైదాన ప్రాంత వ్యాపారులకు కిలో 40 నుంచి 5కు పంటను అమ్ముకున్నారు.అయితే ఈ ఏడాది చింతపండు ధర మరింత ప్రియంగా ఉండే అవకాశం ఉంటుందని ఆశపడ్డారు. కానీ ఆశించిన స్థాయిలో దిగుబడి లేకపోవడంతో ఆర్థిక కష్టాల నుంచి ఎలా గట్టెక్కగలమని గుజ్జి, పెద్దూరు, కిరప,గాడిదపాయి, తాడిపాయి, కిల్లాడ గ్రామాలకు చెందిన గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకూ జీసీసీ చింత పండుకు మద్దతు ధర నిర్ణయించలేదు. ఏటా లానే ఈసారి కూడా బయట మార్కెట్ కంటే తక్కువగా ధర నిర్ణయిస్తే చింతపండును విక్రయిం చేదని లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఉన్న కాస్త పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా ఉన్న తాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఏడాది పెద్దఎత్తున చింతపండు కొనుగోలుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. గత ఏడాది 32.50 పైసలకు కొనుగోలు చేయగా, ఈ ఏడాది మద్దతు ధరను ఇంకా నిర్ణయించలేదంటున్నారు. గిరిజనుల నుంచి సేకరించిన చింతపండుకు గతంలో ఆన్లైన్ చెల్లింపులు జరిగేవని, ప్రస్తుతం కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని అంటున్నారు.
పూర్వ వైభవాన్ని కోల్పోతున్న గిరి బజార్లు
గిరిజన సహకార సంస్థ (జిసిసి) ఆధ్వ ర్యంలో నెల కొల్పిన గిరిబజార్లు(సూపర్ మార్కెట్లు) వెలవెలబోతున్నాయి.ఏజెన్సీలోని గిరిజనులు సేక రించిన అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆ ముడి సరుకుద్వారా వినియోగ వస్తువులను తయారు చేయడం,తేనె ఇతరత్రా వాటిని విక్ర యిండంతో పాటు సాధారణ సూపర్ మార్కెట్లో లభ్యమయ్యే అన్ని రకాల నిత్యావసరాలను అమ్మ కాలు సాగిస్తుంటారు.కానీ ప్రస్తుతం సాధారణ నిత్యావసర సరుకులు బయటి మార్కెట్ కంటే తక్కువ ధరలకే లభ్యమవుతున్నప్పటికీ గిరిజన ఉత్పత్తులు మాత్రం లేకుండా పోయాయి.
ఒకప్పుడు భద్రాచలం జిసిసి పాయిం ట్లో అన్నిరకాల అటవీ అత్పత్తులు లభ్యమయ్యేవి కానీ ఇప్పుడు ఒక్కటంటే ఒక్కఉత్పత్తి కూడా లేదు.ఎక్కడైతే ఐటిడిఎలు ఉంటాయో వాటికి అను సంధానంగా జిసిసి డివిజన్ కార్యాలయాలు ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో భద్రా చలం,ఏటూరునాగారం,ఉట్నూరులలోని ఐటిడిఎల కేంద్రంగా జిసిసి డివిజన్ కార్యాలయాలు కార్య కలాపాలు సాగిస్తున్నాయి. ఇంత వరకు బాగానే ఉంది. నిర్మల్ జిల్లా కేంద్రంగా తేనె, భద్రాచలం డివిజన్ కార్యాలయం కేంద్రంగా సబ్బులు, షాంపూలు, ఏటూరు నాగారం కేంద్రంగా వాషింగ్ సోప్ యూనిట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులు ప్రస్తుతం జిసిసి సూపర్ మార్కెట్లలో కానరావడం లేదు. ప్రధానంగా జిసిసి అటవీ ఉత్ప త్తులను చాలా మంది వాడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా సుమారు 142 జిసిసి సూపర్ మార్కెట్లు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అదే విధంగా అలోవీరా సబ్బులు,నీమూసబ్బులు,టర్మరిక్ సబ్బులు,తేనెతో తయారు సబ్బులు, బట్టలు ఉతికే సబ్బులు కూడా అందుబాటులో లేవు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్పుడు సూపర్ మార్కెట్లు కళకళాడేవి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇటీవలి కాలం వరకు పలు రకాల జిసిసి ఉత్పత్తులు నిత్యం అందుబాటులో ఉండేవి. షికాకాయి,కుంకుడుకాయిపౌడర్, షాంపులు,చీపర్లు,పెసర్లు,కందులు,చింతపండు, అలోవీరా సబ్బులు, మారేడు చెక్కరసం, ఉసిరికాయ పొడి, కరక్కాయలు, అరకు కాఫీ పౌడర్ తదితర ఉత్పత్తులు దొరికేవి. ఇప్పుడు అవి కంటికి కూడా కానరావడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చెందిన ఉత్పత్తులను ఇక్కడికి ఇవ్వడం లేదని, అందుకే షాపుల్లో పెట్టలేకపోతు న్నామని ఇక్కడి జిసిసి వర్గాలు చెబుతున్నాయి. కానీ మన దగ్గర తయారయ్యే తేనెను మాత్రం ఏపి జిసిసికి విక్రయి స్తున్నారు. అటు విక్రయించిన వారు ఇక్కడికి కొనేం దుకు ఎందుకు అశ్రద్ధ చూపుతున్నారో అర్ధం కావడం లేదని పలువురు అంటున్నారు.ఈ నేపథ్యంలో జిల్లాలో సహజ సిద్ధమైన అటవీ ఉత్పత్తులు అందుబాటులో లేక పోవడంతో పలు వురు వినియోగదారులు ఇబ్బందులు పడుతు న్నారు. ఇప్పుడు అవి కావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చింతూరుకు వెళ్లాల్సి వస్తోంది. దూరా భారం కావడంతో వినియోగదారులు మనస్సు మార్చుకుని వేరే ఉత్పత్తులు వాడుతున్నారు. జిసిసి సూపర్ మార్కెట్లో అటవీ అత్పత్తుల నిల్వ లేకున్న ప్పటికీ సంబంధిత అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల పలువురు వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ధరపైనే ‘చింత’
ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు గిరిజన సహకార సంస్థ (జిసిసి) రaలక్ ఇచ్చింది. జిల్లాలో కొనుగోలు చేసే అటవీ ఉత్పత్తుల్లో ప్రధాన మైన చింతపండుకు రివర్స్ గిట్టుబాటు ధర కల్పిం చింది. ఈ ఏడాది సీజన్లో కిలో చింతపండును 32.40రూపాయలకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.గత ఏడాదితో పోల్చుకుంటే నాలు గు రూపాయలు తగ్గించింది. ధర తగ్గింపుతో ఆగకుండా కొనుగోలుకు సంబంధించి సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. తాజా నిబం ధనల ప్రకారమైతే ఏగిరిజనుడూ జిసిసికి చింత పండు విక్రయించే అవకాశం లేదు. చింతపండు పొడిగా వుండాలని,తేమ శాతం అసలు వుండ రాదని,చింత బొట్టలను చేతులతో కొట్టాలని, కర్రలు వినియోగించరాదని మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే చింతపండు విక్రయించే గిరిజన రైతులకు నగదు చెల్లింపులు ఆన్లైన్లోనే జరుగుతాయని, ప్రతి గిరిజన రైతూ బ్యాంకు ఖాతా,ఆధార్ కార్డు జరాక్స్ కాపీలు అందజేయాలని నిర్దేశించింది. ఈ నిబంధనలపై జిసిసి సిబ్బంది ఇప్పటికే ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులకు అవగాహన కల్పించడానికి సదస్సులు నిర్వహిస్తున్నారు. సాలూరు మండలం లోని పట్టు చెన్నూరు, పగులచెన్నూరు, నేరళ్లవల సలో జిసిసి సిబ్బంది స్థానిక గిరిజన ప్రజాప్రతి నిధుల సమక్షంలో అవగాహన సదస్సులు నిర్వహిం చారు. జిల్లాలో జిసిసి కొనుగోలు చేసే అటవీ ఉత్పత్తుల్లో ప్రధానమైంది చింతపండే. దీన్ని జనవరి నుంచి ఏప్రిల్ వరకు సేకరించి విక్రయించుకోవడం ద్వారా వచ్చిన డబ్బుతో వారి కుటుంబ అవసరా లను తీర్చుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో జిసిసి చింతపండుకు కనీస మద్దతు ధర తగ్గించడం గిరిజ నులకు ఆశనిపాతంలా పరిణమించింది. గిరిజన సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న జిసిసి వారిని దూరం చేసే నిర్ణయాలు తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
గత రెండేళ్ల ధర కన్నా తక్కువ
గడిచిన రెండేళ్లలో జిసిసి నిర్ణయించిన చింతపండు ధర కన్నా ఈ ఏడాది తక్కువగా నిర్ణ యించింది. సాధారణంగా ఏటేటా అటవీ ఉత్పత్తుల ధరలు ఎంతో కొంత పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 2021-22లో కిలో చింతపండు రూ.32గా మొదట నిర్ణయించింది. అయితే ప్రయి వేటు వ్యాపారుల కన్నా ఈధర తక్కువ కావడంతో అప్పటి జిసిసి ఎమ్డీ మరో మూడు రూపాయలు పెంచి రూ.35గా నిర్ణయిం చారు. 2020-21సం వత్సరానికి కిలో చింత పండు ధర రూ.36గా జిసిసి ప్రకటించింది. ఈ ఏడాదిలో జిల్లాలో 780మెట్రిక్ టన్నుల చింత పండును కొనుగోలు చేసింది. గత ఏడాది కొను గోలు చేసిన చింతపండు పూర్తిగా అమ్మకం కాకపోవడం వల్లే ఈ ఏడాది చింతపండు ధరను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలు స్తోంది. గిరిజనుల నుంచి కొనుగోలు చేసిన చింత పండు లాభదాయకమైన ధరకు అమ్ముకో వాల్సిన బాధ్యత జిసిసి సంస్థ ఉన్నతాధికారులదే. పాత చింతపండు కోల్డ్ స్టోరేజ్‌లో మూలుగుతున్న దనే సాకు చూపి ఈ ఏడాది ధర తగ్గించడంపై గిరిజ నులు ఆందోళన చెందుతున్నారు.అసలే కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గిరిజన రైతులకు చింతపండు ధర పెంపు ద్వారా మేలు చేయాల్సిన ప్రభుత్వంరివర్స్ గేర్ లో వెళ్ళడం వివాదాస్పద మవుతోంది.
ప్రయివేటు వ్యాపారులదే హవా
ఈ ఏడాదిలో చింతపండు కొనుగో లుకు సంబంధించి ప్రయివేటు వ్యాపారుల హవా కనిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కనీస మద్దతు ధర తగ్గించడం,కొత్త మార్గదర్శకాలు విడుదల చేయడం,ఆన్ లైన్ చెల్లింపులు చేస్తా మన డం వంటి నిర్ణయాలు గిరిజనులను పూర్తిగా జిసిసికి దూరం చేసేలా ఉన్నాయనే వాదనలు వినిపిస్తు న్నాయి. చింతపండు కొనుగోలు సీజన్‌కు ముందే ప్రయివేటు వ్యాపారులు గిరిజన రైతులకు అడ్వాన్స్ రూపంలో డబ్బులు చెల్లిస్తారు. జిసిసి మెరుగైన ధర కల్పించినా కొంతమంది గిరిజనులు ప్రయివేటు వ్యాపారులకే చింతపండు విక్రయిస్తారు. తాజా నిబంధనల ప్రకారమైతే గిరిజనులంతా ప్రయివేటు వ్యాపారుల వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. చింతపండు కొనుగోలు బాధ్యతల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరను తగ్గించిందనే అనుమానాలు వ్యక్త మవుతు న్నాయి. దీనివల్ల జిల్లాలోని గుమ్మలక్ష్మీ పురం, కురుపాం, జియ్య మ్మవలస, పార్వతీపురం, కొమరాడ, సాలూరు, పాచిపెంట,మక్కువ, మెం టాడ,ఎస్.కోట మండ లాలకు చెందిన వేలాది మంది గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ ప్రాం తంలోని గిరిజనులకు చింత పండు సేకరణతో వచ్చిన ఆదాయమే ఏడాది పొడవునా వారి కుటుం బ పోషణకు వినియోగిస్తారు.
కాఫీ ధర పెంపు, చింతపండు ధర తగ్గింపు
అరకు ప్రాంతంలో పండిరచే కాఫీ, స్ట్రా బెర్రీ పండ్లుకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాఫీ,స్ట్రా బెర్రీ పండ్లుకు గిరాకీ ఉండడంతో ధరలను పెం చింది. చింతపండుకు డిమాండ్ ఉన్నప్పటికీ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విక్రయిం చడంలో జిసిసి అధికారులు విఫలమయ్యారు. వారి అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి చింతపండు ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంపట్ల అసంతప్తి వ్యక్తమవుతోంది.
సోమవారం రోజంటే ఎందుకంత భయం..
గిరిజనులు ఎక్కువగా అటవీ ఉత్ప త్తులపైనే ఆధారపడి జీవిస్తుంటారు..అక్కడ పండిర చే పంటలకు ఆర్గానిక్ అనే పేరు ఉండటంతో మార్కెట్లో కూడా మంచి డిమాండ్ వస్తుంది. అయి తే చింతపండు విషయంలో విశాఖపట్నం లోని ఏజెన్సీలో ఉన్న గిరిజనులకు మరింత ఆందోళన కలిగిస్తోంది. సోమవారం రోజున చింతపండు అమ్మాలంటే వారు భయపడి పోతున్నారు. ఎందు కంటే ఆరోజు చింతపండు ధర చాలా తగ్గిపో తుంది. మిగతా రోజుల్లో మాత్రం ధర అటు ఇటుగా ఉన్నా సోమవారం రోజు వస్తే వివిధ కారణాలతో చింతపండు ధర తగ్గిపోతోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణాలు కూడా చెబుతున్నారు.. గిరిజనుల దగ్గర వార సంతలు వారంలో రెండు సార్లు జరుగు తాయి. సోమవారం మరియు గురువారం.. కానీ గిరి పుత్రులకు సోమవారం రోజున చింతపండు అమ్మకాలు అసలు కలిసి రాదట. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడిరదనీ అంటున్నారు. సాధారణంగా చింతపండు మార్కెట్ విలువ పిక్క తీసింది అయితే 120 రూపాయలు కిలో.. పిక్క తీయనిది అయితే 80 రూపాయలకు కిలో. కానీ గిరిజనులు మాత్రం పిక్కతో ఉన్న దాన్ని కేజీ 40 మాత్రమే అమ్ముతున్నారు. అయితే చింతపండును గిరిజనుల నుంచి దళారులు కొనేసి ట్రాన్స్పోర్ట్ ప్యూరిఫైయర్ అనే పేరుతో రకరకాల ధరలు వేసి వినియోగదారుడికి వదిలేస్తున్నారు. దీంతో ధర బయటి మార్కెట్‌కి వచ్చేసరికి డబల్ అయి పోతుంది. కానీ గిరిజన ప్రాంతాల్లో గిరిపుత్రులు పండిరచిన చింతపండు మాత్రం అంత ధర రాదు. ఇందులోనూ సోమవారం చాలా సెంటిమెంట్ గా భావిస్తారు. గురువారం రోజున అమ్ముకుంటే వచ్చే లాభం సోమవారం రాదని అనుకుంటారు గిరి పుత్రుడు.అందుకే వారికి సోమవారం అంటే అంత భయం.-(కందుకూరి సతీష్ కుమార్)