చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే జయంతి

ఆత్మగౌరవ చేతన సావిత్రిబాయి జీవిత చోదక శక్తి.కుల అస్తిత్వ చేతన స్త్రీ అస్తిత్వ చేతన రెండూ ఆమెలో సంపూర్ణ వికాసనం పొందాయి. ఈమె వివాహానంతరం ఇంట్లోనే విద్యాభ్యాసం ప్రారంభించారు.1847లో ఉపాధ్యాయురాలిగా శిక్షణ పొందారు.1848లో భర్త జ్యోతిరావు ఫూలేతో కలసి పూణేలో అణచివేతకు గురవుతున్న బాలికల కోసం పాఠశాలను ప్రారంభించారు. ఇది మొదట తొమ్మిది మంది బాలికలతో ప్రారంభ మైంది.తర్వాత పూణె,సతారా,అహ్మదానగర్‌లలో మరికొన్ని పాఠశాలలు స్థాపించారు.ఈమె పాఠ శాలకు వెళ్లేటప్పుడు సనాతన చాందసవాదుల కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆమెను మార్గ మధ్యలో ఆపి అసభ్యకరమైన పదజాలంతో దూషించి,రాళ్లతో దాడి చేసి,పేడ నీళ్ళు చల్లి అవమానించేవారు.అయినా సరే వెనుకడుగు వేయలేదు. తన సంచిలో అదనంగా మరో చీర పెట్టుకెళ్లి పాఠశాల దగ్గర మార్చుకు నేవారు.వారు మొక్కవోని దీక్షతో ఎంతో మంది మహిళలను విద్యావంతులుగా మార్చేందుకు శ్రీకారం చుట్టారు.బాల్య వివాహాలను వ్యతిరేకించారు.చిన్న వయసులో వివాహం చేయటం వలన ప్రసవించే శక్తి లేక అనేకమంది బాలికలు ప్రాణాలు కోల్పోతున్నారని,చిన్న వయసులో భర్తను కోల్పోయిన వాళ్ళు వితంతు వులుగా జీవితాన్ని గడపాల్సి వస్తుందనే వాదన దృఢంగా వినిపించారు.వితంతువులను హీనంగా చూస్తూ, గుండు గీయించి తెల్ల చీర కట్టించి, వారిని అశుభ సంకేతంగా చిత్రించేవారు.ఆ దురా చారాన్ని రూపుమాపేందుకు వితంతు పునర్వి వాహాల్ని ప్రోత్సహించడమే గాక,దగ్గరుండి చేయించారు.వితంతు గర్భిణీల కోసం 1853లో ఒక గృహాన్ని ఏర్పాటు చేసి వారి బాగోగులు దగ్గరుండి చూసేవారు. వితంతు మహిళలకు గుండు గీసే పద్ధతి పోయేందుకు కృషి చేశారు. వరకట్నాన్ని వ్యతిరేకించారు.కులాంతర వివా హాలను ప్రోత్సహించారు.1852లో మహిళా హక్కులను మహిళలకు తెలియజేసేందుకు, సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు ‘మహిళా సేవా మండల్’ ఏర్పాటు చేశారు. కార్మికులు,గ్రామీణ పేదలు కోసం జ్యోతిరావు ఫూలే 52 ఆహార కేంద్రాలను తెరిచారు. వీటన్నిం టిని ఆమె చూసుకునేవారు.వారిరువురూ ఏర్పా టు చేసిన బోర్డింగ్ పాఠశాలలను దగ్గరుండి చూసుకునే వారు.1863లో సంఘ బహిష్కృతులైన తల్లీపిల్లల కోసం శరణాలయం స్థాపించారు. ప్లేగు వ్యాధిగ్రస్తుల కోసం ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి వారికి సేవ చేసే వారు.జ్యోతిరావు ఫూలే స్థాపిం చిన సత్య శోధక్ సమాజ్‌ని ఆయన మరణా నంతరం ఈమె నడిపారు.ఈ రకంగా సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా నిలబడిన ధీర వనిత సావిత్రి బాయి ఫూలే. స్త్రీల అభివృద్ధి కోసం తెగువతో నిలబడిన వీర వనిత.ప్లేగు వ్యాధిగ్రస్తు లకు సేవ చేస్తూ తను కూడా ఆవ్యాధి బారినపడి 1897 మార్చి10న తుదిశ్వాశ విడిచారు సావిత్రి బాయి ఫూలే.భారత దేశ సంఘ సంస్కరణ ఉద్యమ చరిత్రలో రాజరామమోహన్‌రాయ్ ,ఈశ్వర చంద్ర విద్యా సాగర్,కందుకూరి వీరే శలింగం పంతులు వంటి వాళ్ళ పేర్లతోతో పాటు జ్యోతిరావ్ ఫూలే వినబ డటానికి,కనబడటానికి చాలా కాలమే పట్టింది.దానికి కారణం ఆయన కులం ఒక్కటే కాదు.కుల వ్యవస్థనే ప్రశ్నిస్తూ ఆయన చేపట్టిన సంస్కరణోద్యమ స్వభావం మౌలి కంగా భిన్నమైనది కావటం మరొక ముఖ్య కారణం. ఇక మహా పురు షుల భార్యలుగా స్త్రీలు ఎప్పుడూ చరిత్ర నీడలలో మిగిలిపోయే వాళ్ళే. జ్యోతిరావ్ ఫూలే భార్య సావిత్రి బాయి గురించి చాలాకాలం తెలియక పోవటానికి అది అదనపు కారణం.స్త్రీల దళిత బహుజనుల అస్తిత్వ ఉద్య మాలు ఊపందుకొన్న 1980ల నుండి సమాజపు చివరి అంచులకు నెట్టివేయబడిన వర్గాల ఆలో చనా విధానాలతో,ఆచరణ కార్యకలాపాలతో దేశీయ సామాజిక రాజకీయార్థిక చరిత్రను, సంస్కృతిని సమగ్రం చేయటం,సరిచేయటం అన్న లక్ష్యాలతో సాగుతున్న కృషిలో భాగంగానే గానే జ్యోతిరావ్ ఫూలే గురించి,ఆయన భార్య సావిత్రిబాయి ఫూలే గురించి మనకు తెలిసి వచ్చింది.సావిత్రిబాయి ఫూలే ది జ్యోతి రావ్ ఫూలే భార్యగా అతని సంస్కరణోద్యమ కార్యకలాపాలకు సహాయకారి పాత్ర మాత్రమే కాదు. అన్నింటిలో ఆమె సహ భాగస్వామి.భారత దేశంలో మహిళాఉద్యమ చరిత్రకు తాత్విక భూమికను ఏర్పరచిన క్రియాశీల శక్తి.ఆలోచన,ఆచరణ మనిషి మౌలిక లక్షణాలు అని ఆమె నమ్మింది.ఆమె ఆలోచనలు కవిత్వ రూపంలో ఆవిష్కృతమయ్యాయి.ఆచరణ ఆమె జీవితం.సావిత్రిబాయి జీవితం,కవిత్వం రెండూవర్తమానాన్నిఅర్ధం చేసుకొనటానికి, భవిష్యత్తును నిర్మించుకొనటానికి ఉత్ప్రేరకాలు. 1870లలో ఏస్త్రీవిద్యకోసం అయితే..ఆంధ్ర దేశంలో వీరేశలింగం పంతులు ఒక మహో ద్యమాన్ని నడిపాడో,కాలక్రమంలో బాలికా పాఠశాలలో బోధకులుగా స్త్రీలు ఉండాలని గుర్తించాడో,ఆ మేరకు వితంతు మహిళలు విద్యావంతులై,ఉద్యోగాలలోకి రావాలని ఆశిం చాడో దానికి మూడు దశాబ్దాలకు ముందే అంతకంటే ఉన్నత రూపంలో జ్యోతిరావ్ ఫూలే ఇంట ప్రారంభమైన ‘నిశ్శబ్ద విప్లవం’సావిత్రీ బాయి అనే శక్తిగా ఆవిష్కృతమైంది. మహారాష్ట్ర సంస్కరణోద్యమంలో ఆమెది కీలక పాత్ర. కుల లింగ వివక్షలకు వ్యతిరేకంగా పని చేసే పురుషులనే సహించని సంప్రదాయ సమాజం కుటుంబ పరిధిని దాటి సమాజాన్ని మరమ్మత్తు చేయటానికి బయటకు వచ్చే స్త్రీలను అసలే సహించలేదు.అనేక రంగాలలో స్త్రీల కృషిని నిరోధించటానికి,నియంత్రించటానికి వ్యతిరేక ప్రచారాలకు,భౌతిక దాడులకు,అత్యాచారాలకు పాల్పడుతున్న పితృస్వామిక అధికార వికృతి మనకు తెలిసిన వర్తమానమే.కొదురుపాక రాజవ్వ నుండి,భన్వారీ బాయి,సోనె సోరీ వరకు ఎందరో అందుకు ఉదాహరణలు. అలాంటప్పుడు నూటా యాభై సంవత్సరాల క్రితం ఆడపిల్లలకు చదువు చెప్పటానికి,అందులోనూ శూద్ర,అతి శూద్ర బాలి కలకు చదువు చెప్పటానికి బయటకు వచ్చిన సావిత్రీ బాయిని రాళ్లు రువ్వి,కుళ్ళిన కూర గాయలు,పేడ విసిరి వేధించారంటే ఆశ్ఛర్య పడవలసినది ఏమీ లేదు.వాటిని తన పనికి అభినందనగా విసరబడే పూలగా భావిస్తూ, వాళ్ళ చర్యలవల్ల పాడై పోయిన చీరను మార్చుకొన టానికి మరొక చీర కూడా వెంట తీసుకువెడుతూ ఆమె కనబరచిన,నిబద్ధత,సంసిద్ధత గొప్ప విలువలు.సంప్రదాయ సమాజ నియమాలను తిరగరా యాలని జ్యోతిరావ్ ఫూలే ప్రారంభించిన ఉద్యమం తండ్రికే భరించరానిదై ఇంట్లో స్థానంలేదని బెదిరిస్తే సావిత్రి బాయి ఫూలే భర్త మార్గమే తన మార్గమని అతని తో కలిసి అడుగు బయట పెట్టింది.అప్పటికి ఆమె వయసు పద్దెని మిది.అప్పటి నుండి1897లో 66ఏళ్ల వయసులో మరణించేవరకు సావిత్రీ బాయిది సమాజ జీవితమే.ఆడ పిల్లలకు,మహర్,మాంగ్ వంటి అతిశూద్ర పిల్లలకు మాత్రమే కాదు,వయోజను లకు పాఠశాలలు ఏర్పరచటం నుండి,వ్యవసాయ కార్మికులకు (1855)రాత్రిబడి నడపటం వరకు మహారాష్ట్రలో ఆధునిక విద్యావ్యాప్తికి ఆమె చేసిన కృషి గణనీయమైంది.బాలికల చదువుకు బడులు పెడితే సరిపోదని,ఆడపిల్లలను బడికి పంపటానికి ఇంటి నుండి బడికి ఉండే దూరం ఒకఅవరోధం అని గుర్తించి,దానిని అధిగమించటానికి ఇంట్లోనే ఒక వసతి ఏర్పాటు చేసి స్వయంగా వాళ్ళ ఆలనా పాలనా చూసుకొన్న వ్యక్తి సావిత్రి బాయి.దయ ,ప్రేమగల తల్లిగా ఆమె ఆ పిల్లల హృదయాలలో చోటు సంపాదించుకొన్నది.అంటరానివారిగా బహిష్కృతులు అయినవారి కోసం తన ఇంటి ఆవరణలో బావి తవ్వించినా(1868) కరువు పీడి తులకు ఉచిత భోజన శాలలు ఏర్పరచి (1877) ఆకలి తీర్చినా,ప్రాణాలనే బలిపెట్టి ప్లేగు వ్యాధి గ్రస్తుల స్వస్థతకు పాటు పడినా అన్నీ ఆ దయ, ప్రేమగల తల్లి లక్షణం వల్లనే. సావిత్రి బాయి ఫూలే శూద్ర అతిశూద్ర బాల బాలికల విద్యకు ఎంత పాటుపడిరదో,అంతగా నూ స్త్రీల సమస్యల పై పనిచేసింది. సర్వ మానవ హక్కులు అనుభవిస్తూ స్త్రీలు ఆత్మ గౌరవంతో జీవించటాన్ని గురించి కలకంటూ 1852లో మహిళా సేవా మండల్ స్థాపించింది. ఆనాడు సమాజంలో ఉన్న అతితీవ్ర సమస్య వితంతు స్త్రీల దుర్భర జీవితం. అదీ బ్రాహ్మణులలోనే ఎక్కువ. సావిత్రీ బాయి చేపట్టిన సంస్కరణోద్యమంలో తొలుత సంబోధించ బడిరది అదే. వింత తువులకు తల గొరిగించటం అమానుష ఆచారంగా ఆమె భావించింది.బాధిత స్త్రీలను దానికి వ్యతిరేకంగా సమీకరించటం తక్షణం జరిగే పని కాదు అని ఆమెకు తెలుసు. కానీ తమ శరీరం మీద స్త్రీల హక్కులను ఖబ్జా చేసిన సంప్రదాయం పట్ల అవసరమైన అసహనం ఆమెను నిలువ నీయలేదు. మంగలి వారిని ఏకం చేసి ‘వితంతు స్త్రీల తలలు గొరగము’అనే నినా దంతో సమ్మె కట్టించి తన నిరసనను ఆరకంగా ప్రకటించింది. ‘తలలు బోడులైన తలపులు బోడులౌనా’అని వేమన అన్నట్లుగా వితంతు స్త్రీల తల వెంట్రుకలు తీసేసినంత మాత్రాన వాళ్లలో వయో సహజ వాంఛలను అరికట్టడం ఎవరివల్లా సాధ్యం కాదు.అది వాళ్ళను చాటుమాటు లైంగిక సంబంధాలకు ప్రేరేపిస్తుంది.యవ్వనానికి వచ్చి పుట్టింటనో అత్తింటనో ఆశ్రయం పొందిన వితంతువులు ఇంట్లోని పురుషులో ,తరచు ఇంటికి వచ్చిపోయే బంధుమిత్ర పురుషులో పెట్టె ప్రలోభాలకు లోనై గర్భవతులు కూడా అవుతుం టారు.బిడ్డలను కనాలని ఉన్నా పరువు ప్రతిష్ఠ లకు లోబడి,లోక నిందకు వెరచి గర్భస్రావాలకు పాల్పడతారు. నాటు మందులతో అధిక రక్త స్రావంతో మంచాన పడి యాతన అనుభవి స్తుంటారు.గర్భస్రావ ప్రయత్నాలు ఫలించకపోతే నవమాసాలు మోసి కన్న బిడ్డలను అక్రమ సంతానంగా అవమానించే సామాజిక పరిస్థి తులలో పెంచి పోషించుకొనే స్థోమత లేక వదిలించుకొనటమో వధించటమో వాళ్లకు అనివార్యమవుతుంది.శిశుహత్య నేరం నిరూపితమై శిక్షించబడే స్త్రీలు కూడా ఉంటారు. 1881లో సూరత్‌లో ఉరిశిక్ష విధించబడిన విజయలక్ష్మి అనే బ్రాహ్మణ స్త్రీ అలాంటి స్త్రీలలో ఒకరు.ఆకోర్టు తీర్పును తప్పు పడుతూ స్త్రీకి ఒకరకంగా,పురుషు డికి ఒకరకంగా అమలవుతున్న నీతిని,న్యాయాన్ని తీవ్రంగా విమర్శిస్తూ 1882లో తారాబాయి షిండే ‘స్త్రీ పురుష తులన’ అనే వ్యాసం రాసింది.అది ఆనాడు గొప్ప సంచ లనం కలిగించిన విప్ల వాత్మక చారిత్రక పత్రం.అయితే అప్పటికి 19 ఏళ్లకు పూర్వమే ఈ సమస్య తీవ్రతను గుర్తించి సావిత్రిబాయి కార్యరంగంలోకి దిగటం గమనించదగినది.కాశీబాయి అనే బ్రాహ్మణ వితంతువు బిడ్డను కని లోకానికి భయపడి చంపి బావిలో వేసిన నేరానికి జీవిత ఖైదు శిక్ష విధించబడగా అందుకు కలవర పడిన జ్యోతిరావ్ ఫూలే దంపతులు అలాంటి ఒంటరి స్త్రీలకు ఆశ్రయం కల్పించి పురుళ్ళు పోసి నైతిక మద్దతు ఇయ్యటానికి 1863లోనే ‘బాలహత్యా ప్రబంధక్ గృప్‌ా’ ఏర్పాటు చేయటం విశేషం.‘అండమానులో జీవితఖైదు తప్పించుకొనటానికి మార్గం’ అంటూ ఆసంస్థను గురించి ప్రచారం చేసిన తీరులో స్త్రీల పట్ల వాళ్ళ ఆర్తి కనబ డుతుంది.ఈ ప్రసవాల యంలో వదిలి వేయ బడిన శిశువుల కోసమా అన్నట్లుగా ఆసంవత్సరమే అనాధ శరణాలయం కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు.జ్యోతిబా ఫూలే సాహచర్యం లోనూ,ఆయన మరణానం తరం కూడా అలుపెరుగని,ఆడంబరం లేని కార్య నిర్వహణా దక్షురాలుగా సావిత్రి బాయి సార్ధక జీవితం గడిపింది.నిజమైన అర్ధంలో ఆమె ‘జాతిమాత’ఆత్మగౌరవ చేతన సావిత్రిబాయి జీవిత చోదక శక్తి.కుల అస్తిత్వ చేతన స్త్రీ అస్తిత్వ చేతన రెండూ ఆమెలో సంపూర్ణ వికాసనం పొందాయి. శూద్రుల పరావలంబనం ఆమెకు ఖేద హేతువు. ‘శూద్రులు ,అతి శూద్రులు అజ్ఞానంచేత వెనుక బడ్డారు’ పుట్టుకకు కారణం తల రాత అనుకొన టం ఫలాన్ని ఆశించ కుండ చాకిరీచేస్తే స్వర్గంలో పుణ్యం లభిస్తుందన్న బోధనలను నమ్మటం ఆ అజ్ఞానానికి కారణం అని ఆమెకు తెలుసు. అజ్ఞానంలో మగ్గి పోతున్న వాళ్ళ పట్ల ఆర్తి ‘శూద్రుల పరావలంబనం’ కవితలో కనిపిస్తుంది. ‘శూద్రులంటే’ అన్న కవిత శూద్రుల ఆత్మభిమాన ప్రకటన. – డాక్టర్.ప్రియాంక గంగరాపు