గ్రోత్ హాబ్‌గా మహావిశాఖనగరం
కణితి మార్కెట్ రోడ్లో జరిగిన దీపం -2 పథకం ప్రారంభోత్సవంలో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
గాజువాక ప్రాంతంలో ఇళ్ల క్రమబద్దీకరణ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ
విశాఖపట్టణం(గాజువాక) ః ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకా రంతో విశాఖ మహా నగరాన్ని గ్రోత్ హబ్ గా తీర్చిదిద్దుతామని, ప్రజల ఆకాంక్షలకు, ఆశయాలకు అద్దం పడుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. నీతి ఆయోగ్ సహాయంతో ఇప్పటికే సమగ్ర ప్రణాళికలు రూపొందించామని గుర్తు చేశారు.కేంద్ర, రాష్ట్ర డబుల్ ఇంజన్ సర్కారులో ప్రజలకు సత్వర సేవలను అందించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని, ప్రజా సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుం టున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దీపం-2 పథకం ఉచిత గ్యాస్ సిలిం డర్ల పంపణీ జిల్లాస్థాయి కార్యక్రమం గాజు వాక పరిధిలోని కణితి మార్కెట్ రోడ్లో అట్ట హాసంగా జరిగింది. ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివా సరావులతో కలిసి జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్,జాయింట్ కలెక్టర్ కె.మ యూర్ అశోక్ భాగస్వామ్యమయ్యారు.ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దీపం పథకం ద్వారా పేదల ఇళ్లల్లో కొత్త వెలుగులు వస్తా యని,శ్వాసకోస సంబంధిత వ్యాధులు దూరమ వుతాయని, మహిళలకు సాంత్వన చేకూరు తుందని అన్నారు.జిల్లాలో టీబీ కారణంగా ఎంతో మంది చనిపోయారని,దానికి ప్రధాన కారణం కట్టెల పొయ్యిల వినియోగమే అని గుర్తు చేశారు.డబుల్ ఇంజన్ సర్కారులో ప్రజ లకు సత్వరమే సేవలు అందుతున్నాయని, సంక్షేమం,అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నా యన్నారు.దానిలో భాగంగా టీసీఎస్ విశాఖ పట్టణానికి వస్తోందని,మెగా డీఎస్సీ కూడా వస్తోందని పేర్కొన్నారు.ప్రభుత్వ విధానాల ఫలి తంగా జిల్లాకు పరిశ్రమలు కూడా వస్తున్నా యని గుర్తు చేశారు.స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రస్తావించిన ఇళ్ల స్థలాల క్రమ బద్దీకరణ,స్టీల్ ప్లాంటు విషయంలో అనుసరిం చే విధానాలపై కలెక్టర్ ఈ సంద ర్భంగా స్పందించారు.జీవో నెం.301విషయంలో సానుకూల నిర్ణయం తీసు కుంటామని, దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు.అలాగే స్టీల్ ప్లాంట్ విషయంలో సానుకూలంగా ఉన్నామని దానిలో భాగంగా నే రెండో బ్లాస్ట్ ఫర్నేస్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలి పారు.అందరి సహకా రంతో అందరికీ న్యాయం చేస్తామని, మంచి సేవలు అంది స్తామని,జిల్లా అభివృద్ధికి అవిరళ కృషి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఇదిలా ఉం డగా జిల్లాలోని అన్ని నియోజక వర్గాల పరిధిలో ప్రస్తుతం 3,76,924గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని వాటిలో అర్హులైన అందరికీ దీపం పథకంలో ఉచిత సిలిండర్ల పంపిణీ చేస్తామని జిల్లా సివిల్ సప్లై అధి కారి తెలిపారు.కార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్సీ,ఎమ్మెల్యే, కలెక్టర్,జాయింట్ కలెక్టర్,డీఎస్వో తదిత రుల చేతుల మీదుగా ఉచిత సిలిండర్లను పంపిణీ చేశారు.కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారి భాస్కరరావు,స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు, అధిక సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.-జి.ఎన్.వి.సతీష్