గ్రామీణ ఉపాధి హామీకి తూట్లు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రావటానికి కారణమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒకవిక్షణ స్వభావం ఉంది. కావాని అడిగిన తరువాత ఒకపక్షం రోజుల్లోఉపాధి అందించాని చట్టం చెబుతోంది. అలా ఉపాధి అందించలేనప్పుడు నిరుద్యోగ భృతి చెల్లించాని కూడా ఈచట్టం చెబుతోంది. ఈచట్టం గ్రామీణ ప్రాంతాకే పరిమితమైందనేది నిజం. అయితే ఇది ఉపాధిని హక్కుగా మార్చింది. బాగా చర్చించిన తరువాత పార్లమెంటు ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. భారత రాజ్యాంగం సామాజిక, రాజకీయ హక్కుకు మాత్రమే హామీ ఇచ్చి ఆర్థిక హక్కును విస్మరించిందనే లోపాన్ని… ఈ చట్టాన్ని రూపొందించి ఆచరణలో పార్లమెంట్‌ సరిదిద్దింది.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో ఒక నూతన పరిస్థితి ఏర్పడిరది. గతంలో కూడా పేదరికం నిర్మూనకు ఉద్దేశించిన పనికి ఆహారం వంటి పథకాున్నాయి. అయితే వాటిలో హామీు ఏమీ లేవు. వాటికి బడ్జెట్‌ కేటాయింపు ఉండేవి. అవి ప్రతి సంవత్సరం మారుతూ ఉండేవి. ఆకేటాయింపు ఒక్కోసారి పెరగటం, మరోసారి తరగటం జరిగేది. అయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వీటికి పూర్తిగా భిన్నమైంది. ఈచట్టం ఉపాధికి హామీని ఇచ్చింది. ఆ క్రమంలో ఆర్థిక హక్కును స ృష్టించటమే కాకుండా పౌరసత్వ భావనకు లోతైన అర్థాన్ని ఇచ్చింది. బిచ్చగాళ్ళతో సహా ప్రతి పౌరుడు తాను కొన్న సరుకుపై పరోక్ష పన్ను రూపంలో ప్రభుత్వానికి పన్ను కడతాడు. కానీగతంలో రాజ్యం అందుకు బదుగా ఆచరణలో పౌరుకు ఏమీ చేసేదికాదు. అది పౌరుకు ‘భద్రత’ను కల్పించిందని ఎవరైనా చెబితే అదిచాలా చిన్న విషయం అవుతుంది. ఎందుకంటే పేదకు ‘భద్రత’ కల్పించటం అర్థరహితం అవుతుంది. అందుకు భిన్నంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక నూతన శకానికి తెర లేపుతున్నానని వాగ్దానం చేసింది. ఈ పథకం ద్వారా రాజ్యం తన పౌరుకు కొంతవరకు ఆర్థిక భద్రతను కల్పించటానికి ముందుకు వచ్చింది. అంటే పేదకు అది ఎంతోకొంత మేు చేస్తుంది.
ఈపథకం కింద ఉపాధిని పొందుతున్నవారిలో 40శాతం దళిత, ఆదివాసీ కుటుంబాకు చెందినవారే. పాక వర్గాకుండే కు వివక్ష,వర్గవైషమ్యా కారణంగాను ఈవాగ్దానం అములో తీవ్రమైన ఒడిదుడుకు ఏర్పడ్డాయి. యుపిఏ-2 పానలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి చేయవసిన వాస్తవ బడ్జెట్‌ కేటాయింపులో కోతను విధించటం ద్వారా ఈ పథకానికి తూట్లు పొడవటం మొదయింది.
ఈ పథకం డిమాండ్‌ ను అనుసరించి అము చేసేది. కనక అవసరమైతే అదనపు కేటాయిం పు చేయటం జరుగుతుంది. బడ్జెట్‌లో చేసిన కేటాయింపునుబట్టి అభిప్రా యానికి రాకూ డదు’ అంటూ ఈపథక కేటాయింపుకు కోత పెట్టడాన్ని ఆయన సమర్థించుకున్నారు. అయితే అలాచేయటంవ్ల కేటాయింపుకు మించి డిమాండ్‌ ఏర్పడినప్పుడు వేతన బకాయిు పోగుపడ్డాయి. కేటాయింపు కంటే డిమాండ్‌ నిరంతరం పెరుగుతుం డగా ఒకవేళ కేటాయింపును పెంచకపోతే కాక్రమంలో వేతన బకాయిు పెరిగి పోతాయి. ప్రస్తుతం ఈవిషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. వేతన బకాయిు నిరంతరం పెరిగి పోతున్నాయి. అంటే సంవత్సరకాంలో అనేక మంది కార్మికుకు వేతనాు అందవు. అంతే కాకుండా వేతనాను అందుకోవటానికి పట్టే సగటు కాం కూడా నిరంతరం పెరుగుతూ ఉంటుంది. వేతనాు సకాంలో అందని స్థితిలో కార్మికు ఈపథకం నుంచి నిష్క్రమించటం మొదలెడ తారు. తత్ఫలితంగా ఈ పథకంకింద పనికి వుండే డిమాండ్‌ ఏదో ఒక స్థితిలో దెబ్బ తింటుంది. అదే సమయంలో చట్టప్రకారం నిరుద్యో గానికి చేయవసిన చెల్లింపు చెల్లించకుండా, కనీసం తగిన సమయంలో పేర్లు నమోదు చేసుకున్న వారికి కూడా పని ఇవ్వకుండా, దరఖాస్తు దారును రిజిస్టరు చేయకుండా డిమాండ్‌ను తగ్గించే ధోరణి కనపడుతోంది. ఒక ఆర్థిక హక్కుగా ఉండవసిన హక్కును నిర్వీర్యం చేయటం జరుగుతోంది. రాజ్యం దయాదాక్షిణ్యాతో పేదకు ఎంతోకొంత ఉపశమనం అందించే మరో పేదరిక వ్యతిరేక కార్యక్ర మంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్చటం జరిగింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేదరిక వ్యతిరేక కార్యక్రమంగా కూడా గణనీయమైన విస్త ృతి ఉంది. ఈకార్యక్రమం మొదయినప్పటి నుంచి దేశం లోని ప్రతి మూడు గ్రామీణ కుటుంబాలో ఒకదానికి ఎప్పుడో ఒకప్పుడు పని దొరికింది. 2017-18లోనే ఈ కార్య క్రమం కింద ఎనిమిది కోట్ల మంది ప్రజకు పనిదొరికింది. ఆసంవత్సరంలో ప్రతి కుటుం బానికి సగటున 46 రోజుపాటు పని దొరికింది. ప్రపంచంలోనే అత్యంత ఉద్యోగితను సృష్టించే పథకం ఇది. అయితే రానురాను ఈ కార్యక్రమానికి చేసే కేటాయింపు తగ్గుతూ వస్తున్నాయి. నిజానికి ఇది ఉపాధి హామీ పథకం అవటం అటుంచి ఉపాధిని సృష్టించే కార్యక్రమంగా కూడా దీని విస్తృతి కుచించుకు పోతున్నది. ఇంతకు ముందే చెప్పినట్టు ఒకవేళ ఈపథకానికి చేస్తున్న కేటాయింపు నికడగా ఉన్నట్టయితే లేక ప్రతిసంవత్సరం కావసిన దానికంటే కేటాయింపు తక్కువగా వుంటే కాక్రమంలో వేతన బకాయిు పెరుగుతాయి. అటువంటి పరిస్థితులో నికర కేటాయింపు, నికర వేతన బకాయిు తగ్గుతాయి. అయితే వాస్తవంలో జరుగుతున్న దేమంటే చేస్తున్న కేటాయింపు లో నికడ ఉండటం లేదు. నికర కేటాయింపు తగ్గటం వన నికర వేతన బకాయిు కూడా గణనీ యంగా తగ్గాయి. ఉదాహరణకు 2017-18 సంవత్సరంలో ద్రవ్య్బోణం సర్దుబాటు చేసిన తరువాత జరిగిన కేటాయింపు 2010-11సంవత్సరంలో జరిగిన కేటాయింపు కంటే తక్కువగా ఉంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2012-13లో కాయాపనతో జరిగిన వేతన చెల్లింపు 39 శాతం ఉండగా 2016-17లో కాయాపనతో జరిగిన వేతన చెల్లింపు 56 శాతంగా ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
వేతన బకాయిను కూడా లెక్క లోకి తీసుకోకుండా చేసే స్థూ కేటాయింపులో తగ్గుద స్థూ జాతీయోత్పత్తితో పోల్చి చూసిన ప్పుడు చాలా తీవ్రంగా ఉంది. ఈ కార్యక్రమం సరిjైున రీతిలో నడవాంటే స్థూ జాతీయోత్పత్తిలో 1.7శాతం కేటాయించాని ప్రపంచ బ్యాంకు కూడా అంచనా వేసింది. అందుకు భిన్నంగా 2017-18 సంవత్సరంలో జరిగిన కేటాయింపు (వాస్తవంలో చేసిన వ్యయం కాదు) కేవం 0.28 శాతం మాత్రమే. 2010-11సంవత్సరంలో 0.58 శాతంగాను, 2011-12 సంవత్స రంలో 0.34 శాతంగాను ఉన్న కేటాయింపు కంటే 2017-18 సంవత్సరంలో చేసిన కేటా యింపు తక్కువగా ఉంది. వాస్తవ వ్యయాను, అంతకు ముందటి సంవత్సరా నికర రుణాను చూసినప్పుడు స్థూ జాతీయోత్పత్తిలో అటువంటి నికర వ్యయం వాటా 2012-13వ సంవత్సరంలో 0.36 శాతంఉంటే 2016-17సంవత్సరం కల్లా అది 0.30 శాతం కంటే కిందకు దిగ జారింది. కాబట్టి మనం ఏవిధంగా చూసినప్పటికీ స్థూ జాతీయోత్పత్తిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం కేటాయిస్తున్న నిధు శాతం సాపేక్షంగా చూసినప్పుడు కాక్రమంలో తగ్గిపోతున్నది. అయితే వేతనా చెల్లింపు సకాంలో జరగటం లేదనే వాస్తవాన్ని ప్రభుత్వం అంగీకరించటం లేదు. నిజానికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసే వేతనా చెల్లింపులో 90శాతం15రోజులోపు జరుగుతున్నా యని ప్రభుత్వం అంటోంది. అయితే ఇది పూర్తిగా అబద్దం. 3500 గ్రామ పంచాయతీను ఒకశాంపిల్‌గా తీసుకుని ఒక పరిశోధకు బృందం సవివరంగా చేసిన అధ్య యనాన్ని జనవరి 4న కొత్త ఢల్లీిలో ఏర్పాటు చేసిన ఒకపత్రికా సమావేశంలో విడుద చేశారు. ఈఅధ్య యనం ప్రకారం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరిగిన పనికి చేయవసిన వేతన చెల్లింపు సగటున 50 రోజు ఆస్యంగా జరుగు తున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కార్మికుకు ఎదురవు తున్న ఇతర ప్రతిబంధకాకు అదనంగా సకాంలో అందవసిన వేతనాను ఆధార్‌తో లింకు చేయాని అంటున్నారు. తత్ఫలితంగా ఈ కార్యక్రమం కింద భిస్తున్న పనికిగ డిమాండ్‌ మందగిస్తుంది. వాస్తవంలో డిమాండ్‌ చేసిన పనిని కూడా ఇవ్వటంలేదు. అటువంటి పరిస్థితిలో చట్ట ప్రకారం చెల్లించవసిన నిరుద్యోగ భృతి కూడా చెల్లించటం లేదు. నిజానికి మహాత్మా గాంధీజాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒకడిమాండ్‌ ఆధారిత కార్యక్రమంగా పని చేయటం లేదనేది సుస్పష్టం. అందుకోసం అందుబాటులో ఉంచే వనరుపై దాని విస్తృతి ఆధారపడి ఉంటుంది. ఒకడిమాండ్‌ ఆధారిత కార్యక్రమానికి వనయి అందుబాటులో లేకపో వటమనే పరిస్థితిలో వైరుధ్యం ఉంది. అటువంటి కార్యక్రమానికి ముందుగా బడ్జెట్‌లో కేటాయింపు ఉండాలి. నిధు అందుబాటులోఉండటాన్ని బట్టి ప్రజ ఆర్థికహక్కును ప్రతిబింబించే అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించటం జరగ కూడదు. ఇటువంటి పథకానికి నిధును కేటాయించటం కోసం ప్రజ హక్కును ప్రతిబింబించని కార్యక్రమాపై ప్రభుత్వం చేసే వ్యయాన్ని తగ్గించుకోవాలి. అయితే ఆచరణలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని మనం గమనిస్తాం. అంటే ఇతర వ్యయాకు ప్రాధాన్యతను ఇచ్చిన తరువాత మిగిలిందే ఈ పథకానికి కేటాయింపు జరుగుతున్నాయి. పర్యవసానంగా పనికిగ డిమాండ్‌ ను అనుసరించి చేయవసిన వ్యయానికి సరిపడా నిధు అందుబాటు లో ఉండటం లేదు. పైన పేర్కొన్న అధ్యయనం ప్రకారం పని కోసం వస్తున్న డిమాండ్‌లో భాగంగా అధికారికంగా రిజిష్టర్‌ చేసుకున్న వారిలో కూడా 68శాతం కంటే ఎక్కువ మందికి వాస్తవంలో పని కల్పించటం లేదు. అధికారికంగా రిజిష్టర్‌ చేసుకున్న పని డిమాండ్‌లో వాస్తవంలో సగం మందికి కూడా అందుబాటులోకి రావటం లేదు. ఈనిష్పత్తి పెరుగుతూ ఉంది. ఆవిధంగా ప్రజ ఆర్థిక హక్కు రద్దవు తోంది. ఇది ఈచట్టాన్ని చేసిన పార్లమెంటుపై దాడితో సమానం అవుతుంది. ఈపథకాన్ని ఉద్యోగితను సృష్టించే సామాన్యమైన కార్యక్ర మంగా తీసుకున్నా దీని విస్తృతి కాక్రమంలో తగ్గిపోయింది. ఇదో విపరీత స్థితి. దేశంలో వేగంగా పెరుగుతున్న నిరుద్యోగితపై చాలా కాం తరువాత దృష్టిని కేంద్రీకరించారు. అటువంటి నిరుద్యోగంపై అన్ని ప్రభుత్వ వ్యయాకంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక బ్రహ్మాండమైన ఆయుధంగా పని చేయగదు. ఒకవేళ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించాని అనుకుంటే ఈపథకాన్ని నిర్వీర్యం చేయటానికి బదుగా దానిపై మరింతగా వ్యయం చేయాలి. అయితే ప్రస్తుత ధోరణి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేదిగానే ఉంది.
-సైమన్‌ గునపర్తి