గోరపిట్ట

ప్రముఖ పరిశోధక రచయిత, విశ్లేషకుడు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు థింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్న ఈ నెల సంచికలో కథా విశ్లేషణ తెలుగు సాహితీలోకానికి సుపరిచితులైన తెలుగు కథా ప్రియుల పాలిట ‘సువర్ణముఖి’గా సుపరిచితుడైన ‘రౌతు బంగా రు నాయుడు’’ కథారచన ‘ గోరపిట్ట ’ కథా చదవండి..! – సంపాదకులు

సువర్ణముఖి కథల్లో వైవిధ్యం కనిపిస్తుంది… ఒకేకథలో భిన్నమనుషులు,భిన్న ప్రాంతా లు కనిపిస్తాయి.కథ అంతా ఓనాటకంలా నడిచి పోతుంది. పాఠకుడు ప్రతిక్షణాన్ని,అక్షరాన్ని పరిశీల నాత్మకంగా పట్టుతప్పకుండా కథాసారాంశం. ‘సువర్ణ ముఖి’లోని కథా శైలికి పసిడికి పూత లాంటిది. ఇక గోరపిట్ట కథ విషయాని కొస్తే ఇది కూడా ఒక భిన్నమైన గిరిజనపోరాటకథ. దీని రచనా కాలం1999.
మనిషి జీవితమే నిత్య పోరాటాల మయం..కొన్ని కనిపించేవి మరికొన్ని కనిపించనివి.. ఈమానవ జాతికి మూలవాసులుగా చెప్పబడే అడవిబిడ్డలకు…పోరాటాలకు విడదీయరాని నిత్య సంబంధాలు సదా కనిపిస్తూనే ఉంటాయి. కాలాలు మారిన పోరాటాలు మారలేదు అవి చేసే మను షులు,విధానాల్లో మార్పులు ఉండవచ్చు గాక కానీ వాటి అంతిమలక్ష్యం ఒకటే!! ఆర్థికలేమి, అమా యకత్వాలు,సొంతం గిరిబిడ్డలుచేసే పోరాటాల్లో వాళ్ళంతా సేవకులే తప్ప,నాయకులుగా ఉండక పోవడం దురదృష్టం,వారిలోని శారీరక శక్తిని పెట్టు బడి పెట్టుకుని కొందరు మానసిక శక్తిగల వారు, వారి స్వార్ధ పోరాటాల్లో ‘గిరిపుత్రులశ్రమను’ విని యోగించుకున్న వినియోగించుకుంటున్న సంద ర్భాలు అనేకం.
అలాంటి అరణ్యవాసుల శ్రమతో సాగిన పోరాటాలను చేరువనుంచి పరిశీలించిన సామా జిక చైతన్య కలం యోధుడు, తెలుగు కథా ప్రియుల పాలిట‘సువర్ణముఖి’గాసుపరిచితుడైన‘రౌతు బంగా రు నాయుడు’’ విజయనగరం జిల్లా పార్వతీపురం వద్ద దరి పెదమేరంగి గ్రామనివాసి. ఆయన కథల కలంకన్ను నిత్యం గిరిజనజీవితాల పోరాటాలను చూస్తూ స్పందిస్తూ ఉంటుంది. ఆయన రాసిన కథ లన్నీ అడవిబిడ్డల జీవన పోరాటాలు,సంస్కృతి సాంప్రదాయాలకు దర్పణంపడుతుంటాయి. ఇక సువర్ణముఖి రాసిన అనేక గిరిజనకథల్లో ఒకటి ‘‘గోరపిట్ట’’సాధారణంగా ‘మైనా’ పిట్టగా పిలవబడే మాటలు నేర్చే ఈపక్షిని ఉత్తరాంధ్ర గిరిజనులు, సవరలు,గోరపిట్టగా పిలుచుకుంటారు. ప్రాంతీయ అభిమానంతో స్థానికనేపథ్యాలు,విషయాలను కథ ల్లో నమోదు చేసే ఉత్తమ రచయిత లక్షణాలు జాలువారిన తనకలం ద్వారా సొంతం చేసుకు న్నారు. ఇక సువర్ణముఖి కథల్లో వైవిధ్యం కనిపి స్తుంది. ఒకేకథలో భిన్నమనుషులు,భిన్న ప్రాంతా లు కనిపిస్తాయి.కథ అంతా ఓనాటకంలా నడిచి పోతుంది. పాఠకుడు ప్రతిక్షణాన్ని,అక్షరాన్ని పరిశీల నాత్మకంగా పట్టుతప్పకుండా పఠించాల్సిందే!!
పాత్రోచితమైన సంభాషణలు,పాత్రోచితమైన వ్యక్తులను,తీసుకుని కథకు నిండుదనాన్ని హుందా తనాన్ని నింపడంలో ఈకథకుడు బహునేర్పరి. కథ లోని వాస్తవ సంఘటనలు రచయిత అనుభవాలే తప్ప ఎక్కడా అభూతకల్పనలకు చోటు లేదు. అది రచయిత రచనలోని ప్రామాణికతకు మూలా ధారం.ఈరచయిత ఎన్ని సంఘటనలు, ప్రాంతాలు, తీసుకున్న వాటన్నిటినీ జాగ్రత్తగా తాను ఎంచుకున్న అంత సూత్రం ఆధారంగా నడిపించడం ‘సువర్ణ ముఖి’లోని కథా శైలికి పసిడికి పూత లాంటిది. ఇక గోరపిట్ట కథ విషయానికొస్తే ఇది కూడా ఒక భిన్నమైన గిరిజనపోరాటకథ. దీని రచనా కాలం 1999.సోములు-బంతెమ్మ అనే సవర గిరిజన దంపతులకు మనెమ్మ,శిరిమెల,జ్యోతి,అనే ముగ్గురు ఆడబిడ్డలు,ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి కార్యక్రమం కూడా దీనిలో ఒక భాగం చేయబడిరది. కథ మొత్తం ప్రారంభం ఎత్తుగడ ముగింపువంటి ప్రాథమిక విషయాల మీదగాక పాత్రల జ్ఞాపకాల తలపోతలు వివిధ ప్రాంతాలు,సంఘటనలు,మేళవింపుతో రచయిత తనదైన శైలిలో సుదీర్ఘంగా కొనసాగుతుంది. మల్లు, భార్య శిరిమెలలు తమకు అడవిలోదొరికే గుమ్మడి కాయ,ఇతర అటవీఉత్పత్తులు,తీసుకుని పట్టణం లోని మనెమ్మను కలవడానికి బస్సెక్కి పోవడానికి సిద్ధమైవస్తూ మార్గమధ్యలో జన్మభూమి కార్యక్రమం కు సంబంధించిన అధికారులు ప్రజా ప్రతినిధులు తార సపడటం వారి మాటల సందడి వీరువిన డండంతో కథ ప్రారంభమవుతుంది.గ్రామాల్లో జరిగే కాంట్రాక్టులు అప్పగించడంలో నీతిపరుల కన్నా….అవినీతిపరులకే ఎందుకు అప్పగించాల్సి వస్తుందో….స్థానిక ఎమ్మెల్యేకి ఓరాజకీయ నాయ కుడికి మధ్య జరిగిన సంభాషణ సాయంగా రచ యిత ఇందులో ఎరుక పరుస్తారు.అంతలోనే పట్ట ణం పోతున్నమల్లు,శిరిమెలను చూసిన ఎమ్మెల్యే వారి వద్ద గల కుందేలు పిల్ల మీద మనసు పడటం, వారి నుంచి అందుకునే లోపు అది తప్పించు కోవడం,గోరపిట్ట,అంతకుముందే ఎగిరి పోవడం, తప్పించుకు పోయిన వాటిని వెతకడంలో విఫల మైన మల్లు,గీదరయ్యల,స్థితి చెబుతూనే అడవి జంతువులపై పట్టణవాసులు ఎలాఆశపడి అనుభవి స్తున్నారు.అడవిబిడ్డలను కూడా అదేతీరుగా దోచు కుంటున్నారు అనే ‘అక్షరదృశ్యము’ రచయిత ఈ సంఘటన ద్వారా చూపిస్తూ బావు ఎక్కడికెళ్లి పో తుంది బావు! మనుషులు అయినా జంతువులైన, పిట్టయినా,ఒడుపు దొరికితే పారిపోతాయి, కుదరక పోతే అమిరిపోతాయి.పోయినప్రతిదీ మన సంపద ఐతే,మనకు దొరక్కుండా ఎక్కడికెలిపోతది!? అంటూ ఎమ్మెల్యే గారితో మైదాన ప్రాంత నాయకు లనడంలోని మాటల ద్వారా అడవిబిడ్డల అభద్రత ఎలా ఉందో రచయిత స్పష్టం చేస్తారు.అదే సభలో ‘కందికొత్తపండుగ’కు రమ్మని గీదరయ్య, ఎమ్మెల్యేని ఆహ్వానించిన అందుకు సుముఖత చూపని అతనికి గిరిజనుల ఓట్లుమాత్రం ముఖ్యంగాని,వారి పండు గలు, సంప్రదాయాలు, అవసరం లేదనే విషయం వ్యంగ్యంగా చెప్పబడిరది. అంతేగాక జన్మభూమి మీటింగ్‌ అంటే ప్రజల కోసం పొద్దస్తమానం కొనసా గదని, కేవలం నాయకుల కోసమే అలా మొదలై ఇలా ముగిసిపోతుందని మాటలు నేర్చినగోరపిట్ట ప్రజనాయకుల కళ్లుకప్పి దూరం నుంచి ఎదురు వచ్చి తన భుజంమీద వాలగ,దాంతో మల్లు అన్న మాటల్లో రచయితకు జన్మభూమి కార్యక్రమంపై గల అభిప్రాయం అర్థమవుతుంది. మరోమారు జన్మభూమి కార్యక్రమంలో అధికారులు, పాల్గొని గ్రామస్తుల నుంచి దరఖాస్తులు తీసుకోవడం ప్రజల కోరికలు తీర్చడంలో వాళ్ళుచూపిన అనాసక్తి, నిర్ల క్ష్యం కూడా రచయిత అక్షరీక రించారు.గ్రామ రచ్చబండ వద్దకు వచ్చిన శిరిమెల పెంపుడు గోర పిట్ట మీద ఒకఅధికారి కన్నుపడటం,చేసేది లేక శిరిమెమలకు నచ్చచెప్పి ఆపిట్టను అధి కారికి అప్పజెప్పడం,గోరపిట్ట అధికారి చేతుల్లోగిల గిల కొట్టుకోవడం,దానికోసం శిరిమెల హృదయ విదా రకంగా ఏడవడం గురించి రచయిత కరుణ రసా త్మకంగా వివరించడం విశేషం. అంతేకాదు అడవి బిడ్డల్లోని ప్రేమ,ఆప్యాయతలు,అనుబంధాలు, కేవ లం మనుషులపట్ల మాత్రమేగాక పశుపక్షా దులు, పట్ల కూడా ఎలాఉంటాయో వివరిస్తారు. గోర పిట్టను ఇప్పుడు అధికారి తీసుకెళ్లినట్టు ఇరవై ఏళ్లక్రి తం శిరిమెల అక్క మనెమ్మను మరో అధికారి పట్టణం తీసుకుపోయిన వైనం, గీదరయ్య జ్ఞాపకాల ద్వారా రచయిత పాఠకులకు పరిచయం చేస్తాడు, పెద్ద బిడ్డను బలవంతంగా కోల్పోయిన బాధ వర్ణనా తీతం.ఒకపక్కఉద్యమంలో అమరుడైన భర్త సోము లు జ్ఞాపకాలు..మరోపక్క తమ ఆచారం ప్రకారం చేరదీస్తానని ముందుకు వచ్చిన మరిది. ఆత్మాభి మానంతో ..ఏడ్చి,ఎడ్చి,చివరికి జ్యోతి,శిరిమెలలను వదిలేసి భర్తదగ్గరకు చనిపోతుంది.భర్తచని పోయిన స్త్రీని ఆమెమరిది వివాహం చేసుకునే ఆచా రాన్ని చెప్పడంఇక్కడ మరొక ప్రధాన విషయంగా గమనిం చాలి. అలాగే పట్టణంలో గిరిజనేతరుని వివాహం చేసుకున్న మనెమ్మ తిరిగి తనభర్త సూర్య రావుతో విడాకులు తీసుకోవడంలో ఎదు ర్కొన్న చట్టపరమైన చిత్రమైన ఇబ్బందులు కూడా ఇందులో చూపించ బడతాయి., ఆదివాసి వివాహం హిందూ వివాహ చట్టం పరిధిలోకి రాదని కోర్టు తీర్పు ఇవ్వడం ఇందులో గమనించదగ్గ విషయం.అందుకే గిరిజను లు తమ తగువు లను కుటుంబ పంచాయితీలు ద్వారా తీర్చుకుం టారు అనిపిస్తుంది. ఇక కథ చివరి అంకంలో మారుమను వు చేసుకున్న సిరిమెల మల్లుల పెళ్లి విషయంరచయిత గుర్తుచేస్తూ గిరిజను ల్లో వుండే ‘ఓలి విధానంపెళ్లి’ విషయం చెబుతూ అలా ఓలిరూపంలో ఖర్చుచేసి కట్టుకున్న గిరిజనస్త్రీ తనకు ఆభర్త ఇష్టం లేకపోతే తనకు నచ్చిన వ్యక్తిని మారుమనువు చేసుకునే స్వేచ్ఛ ఉంటుందని, అయితే మొదటి పెళ్లి సమయంలో గిరిజనస్త్రీ తండ్రికి ధనం పశువులు,ధాన్యం,రూపంలోముట్టచెప్పినఓలిని మొదటిభర్తకు ప్రస్తుతం చేసుకున్న భర్త అప్ప చెప్పాల్సిన పద్ధతి, ఆచారంగురించి శిరిమెల-మల్లు ల మారుమనువు సంఘటనద్వారా రచయిత వివరి స్తారు.అలాగే ఈముగ్గురు అక్కచెల్లెళ్ళల్లో చివరిదైన జ్యోతి, అడ్డయ్యను పెళ్లి చేసుకోవడం అతడు క్రైస్తవ మతం లోకి వెళ్లి ‘జేమ్స్‌’గా…జీవనం సాగించడం, ఒక రోజు ఊహించని పరిణామంగా, జ్యోతి తన భర్త జేమ్స్‌తో రాత్రిసినిమాచూసి వస్తుండగా పోలీసులు అడ్డగించి‘నక్సలైటుజ్యోతక్క’గా… భావిం చి జ్యోతిని అన్యాయంగా పోలీస్‌ స్టేషన్‌కు తీసుకు పోవడం,అనంతరం ఆచుట్టుపక్కల గ్రామాలన్నీ గతంలోచేసిన పోరుబాటపట్టి జరిగిన అన్యా యాన్ని ఎదిరించడంకోసం గుంపులు గుంపులుగా మణెమ్మ సారధ్యంలో తరలిరావడం,చివరికి జరిగిన పొర పాటును గుర్తించిన పోలీసులు జ్యోతిని విడుదల చేయడం,ఇంతటి జనాదరణగల మణమ్మను రాజకీ యాల్లోకి ఆహ్వానించాలని, ప్రస్తుత ఎమ్మెల్యే ఆశిం చడం,కథలో ముక్తాయింపుగా చెప్పబడిరది.గూడెం చేరినమణెమ్మ,శిరిమెల,జ్యోతిలు వారి కుటుంబ సభ్యులతో పాల్గొనడం దారిలోనే తమ పాత కాలపు సంఘం సభ్యులు తిరిగిరావడం.అంతేకాక, మనెమ్మ తండ్రిలాగే పోరుబాటకు తనవారితో కలిసి సిద్ధం కావడం,శిరిమెల ప్రాణప్రదంగా పెంచుకున్న ‘‘గోర పిట్ట’’బలవంతంగా పట్టణం పంపబడ్డ, తిరిగి తన గూటికే మరలివచ్చి ‘‘పరాయి చేయి తగిలి మాడి పోయిన అడవి’’లూజ్‌ చనిపోవడంతో ఈకథ సాం కతిక సందేశంతో ముగుస్తుంది. కథ ఆద్యంతం ఆదివాసీపోరాట నేపథ్యంలో సాగిన..అంతర్గ తంగా,అంతర్లీనంగా,వారి సంస్కృతి సంప్రదా యాలు జీవన విధా నాలు కలుపుకుని నడుస్తుంది అడవిబిడ్డల జీవన చిత్రాన్ని నూతనకోణంలో ఆవిష్కరించిన కథ ఈ గోరపిట్ట. (వచ్చే మాసం… మీకోసం కె. సీతారాములు కథ ‘‘తెలంగాణ గట్టు మీద పోలవరం)