గృహ హింస బాధితులకు రక్షణ నిచ్చే చట్టాలు
మన దేశంలో స్త్రీల పైన హింస రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా.. న్యాయ వ్యవస్థ బాధితులకు అండగా నిలబడుతున్నా.. హింసకు గురయ్యే వారి సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. చాలామందికి తమకు చట్టం సహాయం చేస్తుందన్న విషయం కూడా తెలీదు. అందుకే దాన్ని భరిస్తూ ఉండిపోతారు. ఇలాంటి వారిలో గృహ హింస బాధితులు ఎక్కువ మంది ఉంటారు. కొందరు కుటుంబ గౌరవం కోసం, మరికొందరు బయటకు వస్తే తమ పిల్లల పరిస్థితి ఏంటి అని ఇలా రకరకాల కారణాలతో వారు గృహ హింస ను భరిస్తుంటారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. హింసను భరించిన కొద్దీ అది పెరుగుతూ పోతుంది. ఒక రోజు మన జీవితాన్నే నాశనం చేస్తుంది. అందుకే మొదటిసారి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే చట్టాల సాయంతో మీ కుటుంబ సభ్యులను మార్చుకునే ప్రయత్నం చేయాలి. గృహ హింస బాధితులకు చట్టం ఎలాంటి సహకారం అందిస్తుందో తెలుసుకుందాం..!- (రుచిరా గోస్వామి)
మహిళలకు వ్యతిరేకంగా అన్ని రూపా ల్లో జరుగుతున్న హింసను నిర్మూలించడానికి ఏర్పడిన అంతర్జాతీయ దినోత్సవానికి (నవంబర్, 25) కొన్ని రోజుల ముందు ఒక యువతిని తన జీవిత భాగస్వామి అనాగరికంగా హత్య చేసి, అవయవ విహీనురాలిని చేశాడు. ఈ సంఘటన, ‘ఆప్తుడైన భాగస్వామి హింస’వైపు దృష్టిని మర ల్చింది.‘ప్రొటెక్షన్ ఆఫ్ విమన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయోలెన్స్ యాక్ట్ 2005’ (పీడబ్ల్యూడీవీఏ)చట్టం వర్తించే గృహ హింసగా కూడా దీనిని గుర్తించారు. ఆమె అతడ్ని ఎందుకు ఎంపిక చేసుకుంది? అతడ్ని ఎందుకు వదిలేయలేదు?లాంటి అనేకరకాల ప్రశ్న లు తలెత్తుతున్నాయి.భారతీయ చట్టాల నిబంధనల ప్రకారం గృహహింస శిక్షార్హమైననేరం.ఇది మానవ హక్కుల ఉల్లంఘన కూడా. అయిన ప్పటికీ,18-49 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న 32శాతం మంది వివాహిత మహిళలకు వ్యతిరేకంగా హింస కొనసాగుతున్న సమాజంలో మనం బతుకుతున్నా మని ఇటీవల జరిగిన ‘నేషనల్ ఫ్యామిలీహెల్త్ సర్వే-5’ నివేదిక తెలియజేస్తుంది. ఈ మహిళలు, వారి భర్తలు పాల్పడుతున్న భావోద్వేగపూరితమైన, భౌతిక,లైంగిక హింసలకు గురవుతున్నారు.ఈ గృహ హింసలను అనుభవిస్తున్న వారిలో పట్టణ ప్రాంత మహిళలకంటే గ్రామీణ ప్రాంత మహిళలే ఎక్కువ గా ఉన్నారు.ఈసర్వే ఇతర కుటుంబ సభ్యులు పాల్ప డే హింసపైదృష్టిని కేంద్రీకరించడంలేదు. పదిహేడు సంవత్సరాల క్రితం,ప్రగతిశీల చట్టమైన పీడబ్ల్యూ డీవీఏను ఆమోదించారు.భర్తల నుండి మాత్రమేకాక ఇతర కుటుంబ సభ్యుల హింసనుంచి కూడా మహి ళలకు మద్దతుగా,రక్షణగాఉండే విధంగా చర్యలు తీసుకుంటామని ఈచట్టం హామీ ఇచ్చిం ది. కానీ,ఈ చట్టం కాగితాలపై ఉన్నప్పటికీ, ఇప్పటికీ మహిళలు ఆచట్టం అమలుకు చేరువలో ఉండలేక పోతు న్నారు. దాని హామీలు,నిబంధనలు అసమానం గా అమలవుతూ,భారతీయ మహిళలకు అందు బాటులో లేకుండా పోతున్నాయి.అత్యంత నిరుత్సా హమైన వాస్తవమేమంటే,మూడిరట ఒకవంతు మహిళలు గృహహింస కారణంగా ఇబ్బంది పడు తున్నప్పటికీ, గృహహింసను అనుభవిస్తున్న వారిలో కేవలం 14శాతం మంది మాత్రమే సహాయాన్ని కోరుతున్నారు.ఈసంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా తక్కువగా ఉంటుందని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేనివేదిక తెలుపుతుంది.
గృహ హింస అంటే..
ఒక వ్యక్తి శారీరక, మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే లేదా గాయపరిచే ప్రమాదానికి గురి చేసే ఎలాంటి చర్య అయినా గృహహింస కిందకే వస్తుంది. అవతలి వ్యక్తి మిమ్మల్ని శారీరక, మానసిక,ఆర్థిక, లైంగిక దాడుల్లో దేనికి గురి చేసినా అది గృహహింస కిందకే వస్తుంది.ఇలాంటి హింసకు గురవుతున్న వారు ముఖ్యంగా మహిళలకు చట్టం చాలా రక్షణ కల్పిస్తుంది.
కేసు ఎలా ఫైల్ చేయాలంటే..
గృహహింసకి గురైన మహిళ స్థానిక మహిళా కోర్టు,మహిళా పోలీస్ స్టేషన్ లేదా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వద్ద తనపై జరిగిన హింస గురించి వివరిస్తూ కేసుఫైల్ చేయవచ్చు.నిందితులపై కేవలం క్రిమినల్ కేసులు మాత్రమే కాదు..సివిల్ కేసు పెట్టే అవకాశం కూడా ఉంటుంది.
ఇన్సిడెంట్ రిపోర్ట్ అంటే..
గృహ హింస బాధితులు కేసు ఫైల్ చేయగానే ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎంక్వైరీ ప్రారంభిస్తారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి దగ్గర సమాచారం సేకరించి..ఆ తర్వాత జరిగిన సంఘ టనల గురించి సాక్షులను ప్రశ్నించి రిపోర్ట్ తయారు చేస్తారు. ఈ రిపోర్ట్ నే ఇన్సిడెంట్ రిపోర్ట్ అంటారు.
గృహ హింస బాధితులకు సాయం చేసే చట్టాలు..
గృహ హింస బారిన పడిన మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం 2005లో గృహ హింస నిరోధక చట్టం తీసుకొచ్చింది.అంతేకాదు.. సెక్షన్ 498ఎ,406,323,354 ల ప్రకారం గృహ హింస కేసులో నిందితులకు శిక్ష పడుతుంది.ఈ నిందితుల్లో ఆడవారు ఉంటే వారిపై కూడా ఈ చట్టం ద్వారా శిక్ష అమలు చేసే వీలుంటుంది.
ఎవరికి రక్షణ ఉంటుంది?
కేవలం వివాహం అయిన మహిళలకే కాకుండా లివ్ ఇన్ రిలేషన్ షిప్లో ఉండేవారికి కూడా గృహహింసచట్టం రక్షణకల్పిస్తోంది. పెళ్ల యిన లేదా లివ్ ఇన్ రిలేషన్ షిప్లో ఉన్న స్త్రీని ఇల్లు వదిలి వెళ్లిపోవాలని హింసించడం కూడా గృహహింస కిందకే వస్తుంది.ఈచట్టం కింద ఎల్ జీబీటీ లకు కూడా రక్షణ ఉంటుంది.
ఎలాంటి సాక్ష్యాలు అవసరం..
గృహ హింస జరిగిందని నిర్ధారించేందుకు దాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి వాంగ్మూలం,డాక్యు మెం టరీ ప్రూఫ్,ఆడియో,వీడియోప్రూఫ్‌వంటివి సాక్ష్యా లుగా పనికొస్తాయి.
మగవారు గృహ హింసకి గురైతే ఏం చేయాలి?
మగవారిపై కూడా గృహ హింస జర గొచ్చు.ఇలాంటప్పుడు వారు వెంటనే ఈ విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి %ఖీIR% కాపీ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మెడికల్ డాక్యుమెంట్స్ వంటి ఆధారాలు కూడా సమర్పిం చాల్సి ఉంటుంది.
498ఎకి గృహహింస చట్టానికి మధ్య తేడా ఏంటి?
గృహహింసచట్టం అనేది కేవలం వరక ట్నం కోసమే కాకుండా ఎలాంటి సందర్భాల్లో అయినా..ఎందుకోసమైన ఒకవ్యక్తి తన కుటుంబం లోని మరోవ్యక్తి ముఖ్యంగా స్త్రీలను హింసిస్తే వారికి వర్తించే చట్టం.మానసికంగా,శారీరకంగా,ఆర్థికం గా, సామాజికంగా ఎలా హింసించినా అది గృహ హింస కిందకే వస్తుంది.ఒక స్త్రీవరకట్నం తీసుకురా వాలని డిమాండ్ చేస్తూ అది తీసుకురానప్పుడు హింసిస్తే దానికి 498ఎ కింద కేసు నమోదు చేస్తారు.
గృహహింస వెంటాడుతూనే వుంది…
పరిస్థితులు మారతాయి. ఆ పరిస్థితులు తమ భర్తల ప్రవర్తనను మార్చుతాయని మహిళలు ఆశించారు.ఇతరులకు, ముఖ్యంగా తమ కుటుం బాలకు ‘భారం’ కావడానికి మహిళలు ఇష్టపడలేదు. ‘మా అమ్మకుచాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆమె కంటూ స్వంతజీవితం ఉంటుంది.అందువల్ల ఆమె ఇబ్బందులకు నా ఇబ్బందులు తోడవడం నాకిష్టం లేదు’వంటి సమాధానాలు వారి నోటెంట వచ్చాయి. తామెదుర్కొన్న హింసనునిర్దిష్టంగా చెప్పడం ద్వారా, వారి కుటుంబాలకు ఒక ‘సమస్య’గా లేదా ‘మానసిక వ్యధ’కు కారణంగా మారకూడదని…వారి కుటుం బాలకు తలవంపులు, అగౌరవం తేకూడదని… గృహహింస నుండి బయటపడిన మహిళలు విద్యా స్థాయి,కులం,వర్గంతోనిమిత్తం లేకుండా భావిస్తు న్నారు.భారతీయ చట్టాలు, నిబంధనల ప్రకారం గృహహింస శిక్షార్హమైన నేరం.ఇది మానవ హక్కుల ఉల్లంఘన కూడా.అయినప్పటికీ,18-49 సంవత్స రాల మధ్య వయసులో ఉన్న 32శాతం మంది వివాహిత మహిళలపై హింస కొనసాగుతున్న సమాజంలో మనం బతుకుతున్నామని ఇటీవల జరిగిన‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5’ నివేదిక తెలియజేస్తుంది.
సహాయం కోరడానికి సంబంధించి ….
గృహహింసకు గురైన మహిళలు సహా యం కోరే విషయంలో రెండు రకాలుగా స్పందిస్తు న్నారు. మొదటిది,హింస జరిగిన ఆరు నెలల్లోపు చెప్పేవారు. రెండవది హింస జరిగిన ఐదు సంవ త్సరాలు లేదా ఆతర్వాత చెప్పేవారు.మొదటి సమూహానికి చెందిన మహిళలు సహాయం కోసం తమ తల్లిదండ్రుల దగ్గరకెటళ్ళారు. భర్తతో సర్దుకుని పోవడం ద్వారా కుటుంబాన్ని/సంసారాన్ని కాపాడా ల్సిందిగా తమ కుమార్తెలను ఒత్తిడి చేసిన కేసులు అనేకం.‘కుటుంబసంతోషం’కంటే కూతురు క్షేమానికే ప్రాధాన్యత ఇచ్చిన కేసులు తక్కువగా నమోద య్యాయి. అలాంటి కేసుల్లో మధ్యవర్తిత్వం వహించే చర్యలు చేపట్టడం లేదా తెగతెంపులు చేసుకోవడం జరిగాయి.సమస్య పరిష్కారానికి పోలీసులు, లాయ ర్లను కలవడంలాంటివి చాలాఅరుదుగా జరిగాయి.
గృహహింసకుగురై దాని నుండి బయట పడిన చాలా కాలానికి సహాయంకోరే వారి విష యానికి వస్తే…హింసకు సాక్షులుగా ఉన్న బంధు వులు, ఇరుగు పొరుగు వారి (పరిస్థితులను మార్చ డంలో) ప్రాధాన్యత చాలానే వుంది. బాధితురాలి పిల్లల సంరక్షణ, భర్త వివాహేతర సంబంధాన్ని గుర్తించడం,హింస తీవ్ర స్థాయిలో వున్నప్పుడు వైద్య సహాయం అందించడంలో వారి పాత్ర చాలా కీలకంగా వుంది. స్తి యాజమాన్యానికి సంబంధిం చిన పితృస్వామిక నిబంధనలు, ఆర్థిక అభద్రత కారణంగా తెగతెంపులు చేసుకునే విషయమై ఎదురైన మానసిక సంఘర్షణల కారణంగానే… బాధితురాలు సహాయం కోరడానికి అంతకాలం ఎదురుచూసి ఉంటుంది. స్త్రీపురుష అసమానతల విషయంలో సామాజిక నియమాలు ఎంత లోతుగా పాతుకుపోయాయంటే భార్యను కొట్టే విషయాన్ని పురుషుల కంటే మహిళలే ఎక్కువగా సమర్థిస్తారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 నివేదిక తెలియ జేస్తున్నది.‘మామీద పెట్టేషరతులు ఎలా వుంటా యంటే… మేము ఎలాంటి బాధను గురించైనా ఫిర్యాదు చెయ్యలేనంత కష్టంగా ఉంటాయ’ని ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మహిళ చెప్పింది. బాధిత మహిళలు తాము ఎదుర్కొన్న గృహహింస గురించి మిత్రులు, బంధువులకు చెప్పుకున్న తర్వాత ‘ఉపశమనం పొందినట్లు,భారమంతా తగ్గినట్లు, పరిస్థి తులు మారిపోతాయానే ఒకకొత్త ఆశకలిగిన భావన పొందినట్లు చెప్పారు. మహిళలుగృహహింస గురించి ఇతరులతో పంచుకోవాలని అనుకోవడమే వారు తీసుకునే అత్యంత ముఖ్యమైన నిర్ణయం. సాయం,మద్దతు పొందడంలో వారు అనిశ్చితి, భయం,నిరాశ,నిస్పృహలకు లోనుకావాల్సి వచ్చింది. భారతదేశంలో ఉన్న వాస్తవపరిస్థితి ఏమంటే అనేక మంది మహిళలు తమ గోడును వెళ్ళబోసుకోడానికి ఎటువంటి వేదిక లేదు. కేవలం ధనవంతులైన కొందరు మహిళలు, స్వచ్ఛంద సంస్థలతో సంబంధా లు కలిగి ఉన్న కొద్దిమంది మహిళలు మాత్రమే కోర్టుల ద్వారా న్యాయం కోసం ప్రయత్నం చేశారు. కొత్త నైపుణ్యాలను, జీవనాధార అవకాశాలను సాధించడం ద్వారా ఆర్థిక స్వావలంబన పొంద డంతో గృహహింస బాధితు లు కొంతవరకు తమ పరిస్థితులను మార్చుకోగలుగుతారు. పోలీసుల పాత్ర
తాము ఎదుర్కొన్న గృహహింస గురిం చి పోలీసులకు చెప్పినప్పుడు వారు స్పందించిన తీరు పట్ల మహిళలు పెదవివిరిచారు.ఏదో కొద్ది మంది అనుకూలమైన ఫలితాలు పొందినప్పటికీ…’ హింసకు పరిష్కారం చూపడం కంటే కూడా అసలు సమస్యలో పోలీసుల పాత్ర ఎక్కువైంద’ని మేము ఇంటర్వ్యూ చేసిన మెజారిటీ మహిళలు చెప్పారు. పోలీసులే బాధిత మహిళలను హింసకు పాల్పడిన వారితో రాజీ చేశారు. వారిని తిరిగి అదే ఇళ్లకు పంపించారు. అధికారికంగా ఫిర్యాదు నమోదు చెయ్యకుండా లేదా పిడబ్ల్యుడివిఎ మార్గదర్శకాల ప్రకారం సంరక్షణ అధికారులకు అప్పజెప్పకుండా హింసకు పాల్పడిన వారిపై హింసను ప్రయోగించి నట్లు మేము అనేక రాష్ట్రాల్లో విన్నాం.సిబ్బంది కొరత కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పితృస్వా మిక భావజాల ప్రయోజనాలనే ప్రభుత్వం నెరవేరు స్తుందన్న విషయం మహిళలకు తెలుసు. చట్టాలు వున్నప్పటికీ…బాధితలను తిరిగి గృహహింసకు కారణమైన కుటుంబాలకే అప్పజెప్తున్నారు. ఇది నేడు మహిళలపై జరుగుతున్న అతి పెద్ద నేరం.
భారత్‌లో 29శాతం మహిళలకు తప్పని హింస
భారత్‌లోస్త్రీలపై హింస రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఎన్ని చట్టాలు వస్తున్నా వారిపై దాడులు మాత్రం తగ్గడం లేదు. చాలా మందికి తమకు చట్టం సహాయం చేస్తుందని తెలియక ఆ హింసను భరిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మహిళలపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఓ నివేదికను వెల్లడిరచింది. ఆ నివేదిక ప్రకారం, భారతదేశంలో 29శాతం మహిళలు (18-49 ఏళ్ల మధ్య) గృహ హింసను ఎదుర్కొంటున్నారు. దీని ప్రకారం కర్ణాటకలో 44.4శాతం,బీహార్‌లో 40%, మణిపూర్‌లో39.6శాతం,తమిళనాడులో 38 శాతం,తెలంగాణలో36.9శాతంమంది మహిళలు గృహహింసను ఎదుర్కొంటున్నట్లు నివే దించింది.అయితే లక్షద్వీప్(1.3శాతం),గోవా (8.3శాతం), కేరళ(9.9శాతం),సిక్కిం (12శాతం) , మేఘాలయ (16శాతం) మహిళలపై అతితక్కువ గృహ హింస ను ఎదుర్కొంటున్నట్లు తేలింది.
పురుషులూ వేధింపులకు గురవుతారు…
గృహహింసకు సంబంధించిన కేసులో కొన్ని నెలల క్రితం మద్రాస్ హైకోర్టు పురుషులు కూడా గృహహింసకు గురవుతారా అనేప్రశ్న లేవ నెత్తింది. ఇటీవల,దీనికి ఒక ఉదాహరణ కూడా కనిపించింది. హర్యానాలోని హిసార్‌కు చెందిన ఒకవ్యక్తి తనభార్యను హింసించిన కారణంగా 21 కిలోల బరువు తగ్గాడు. దీనిఆధారంగా, అతను హైకోర్టు నుండి విడాకుల ఆమోదం పొందాడు. ఇలాంటి కేసులుఇటీవల పెరుగుతున్నాయి. పురు షులపై హింస జరుగుతుందని చాలామంది అను కోవడం కూడా నమ్మశక్యం కాదు.కారణం,పురు షులుఎప్పుడూ బలంగా,శక్తివంతంగా భావి స్తారు. కానీ,కుటుంబ వివాదాలను పరిష్కరించ డానికి అన్ని కౌన్సెలింగ్ కేంద్రాల గణాంకాలు పురుషులు కూడా మహిళలపై వేధింపులకు గురవుతున్నారన డానికి నిదర్శనం. గృహ హింసకు సంబంధించిన ఫిర్యాదులలో40శాతం పురుషుల నుండి వచ్చినవే. విడాకులు మాత్రమే మహిళలకు ఏకైక ఎంపిక అని కూడా తెరపైకి వచ్చింది. అయితే పురుషులు కౌన్సెలింగ్‌కి ప్రాధాన్యతనిస్తారు. అంటే, కౌన్సెలింగ్ ద్వారా లేదాఏవిధంగానైనా పురుషులు సంబం ధాన్ని కొనసాగించాలనుకుంటున్నారు.
గృహహింస చట్టం నుండి రక్షణ పురుషులకు ఉండదా?
నేషనల్ క్రైమ్‌రికార్డ్స్ బ్యూరో (చీజRదీ) నివేదిక ప్రకారం, మహిళల కంటే ఎక్కువ మంది పురుషులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణాలలో ఒకటి కుటుంబంలో కొనసాగు తున్న విభేదాలు, సంబంధాలవల్ల తలెత్తే డిప్రెషన్ కూడా. అదే సమయంలో, 2019 సంవత్సరంలో ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్’ పరిశోధన ప్రకారం, హర్యానా గ్రామీణ ప్రాంతాల్లో 21-49 సంవత్సరాల వయస్సు గల1000 మంది వివాహిత పురుషులలో,52.4 శాతం మంది లింగ ఆధారిత హింసను అనుభవించారు. ఈగణాంకాలను చూస్తే,లింగం, కులం,మతం ఆధారంగాఎలాంటి వివక్షను రాజ్యాం గం అంగీకరించనప్పుడు, గృహహింస నుండి రక్షణ చట్టం పురు షులకు ఎందుకు రక్షణ కల్పించదు? అభివృద్ధి చెందిన దేశాలలో లింగరహిత చట్టం మహిళల వంటి గృహ హింస నుండి పురుషులను రక్షించడమే కాకుండా,పురుషులు కూడా వేధిం పులకు గురవుతున్నారని గుర్తించిచట్టపరమైన రక్షణ కల్పిం చాయి. (‘ద హిందూ’ సౌజన్యంతో) (వ్యాసకర్తలు ‘సర్వైవింగ్ వయొలెన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్’లో సభ్యులు),ఫిలిప్పా విలియమ్స్,స్వర్ణ రాజగోపాలన్ గిరిజా గాడ్బోలే, .)